Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Sunday, 21 July 2019

Hima Das returns to 400m run, grabs 5th gold of month.- ఆటస్థలమే ఆమె ప్రాంతం.. ఆటే ఆమె ప్రాణం.. ఆమె హిమదాస్....నెల రోజుల వ్యవధిలో ఐదో స్వర్ణం...లేడిపిల్లలా తన పరుగులతో దేశాన్నే కాకుండా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ లేడి ఎవరు..? ఎక్కడనుంచి వచ్చింది. ఇంతకీ హిమదాస్ నేపధ్యం ఏంటీ..?

Hima Das returns to 400m run, grabs 5th gold of month.
 Hima Das returns to 400m run, grabs 5th gold of month.- ఆటస్థలమే ఆమె ప్రాంతం.. ఆటే ఆమె ప్రాణం.. ఆమె హిమదాస్....నెల రోజుల వ్యవధిలో ఐదో స్వర్ణం...లేడిపిల్లలా తన పరుగులతో దేశాన్నే కాకుండా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ లేడి ఎవరు..? ఎక్కడనుంచి వచ్చింది. ఇంతకీ హిమదాస్ నేపధ్యం ఏంటీ..?

NOVE MESTO (CZECH REPUBLIC): Indian sprinter Hima Das extended her sensational run by claiming her fifth gold of the month as she returned to her pet 400m competition with a season-best time of 52.09s on Saturday.

In her first competitive 200m race of the year, she clocked 23.65 seconds on her way to gold at the Poznan Athletics Grand Prix in Poland on July 2.
After that, she won her second 200m gold at the Kutno Athletics Meet, also in Poland, on July 7 with a time of 23.97 seconds.
On July 13, she won her third 200m gold at the Kladno Athletics Meet in Czech Republic with a time of 23.43 while her fourth gold came at the Tabor Athletics Meet in the same country on Wednesday.
It was first competition in 400m for the 19-year-old from Assam, fondly called the 'Dhing Express', in the 400m event since she struggled to finish the Asian Athletics Championship in April this year because of a back issue.

ఆటస్థలమే ఆమె ప్రాంతం.. ఆటే ఆమె ప్రాణం.. ఆమె హిమదాస్....నెల రోజుల వ్యవధిలో ఐదో స్వర్ణం...హిమదాస్.. ఇప్పుడు ఈ పేరు దేశం మొత్తం మారుమ్రోగుతున్న పేరు. ఆమె వయసు కేవలం 18 ఏళ్ళు మాత్రమే. కానీ హిమదాస్ భారతదేశానికి ఇప్పుడు ఓ ఐకాన్. ఇంతకీ ఎవరీ హిమదాస్.. లేడిపిల్లలా తన పరుగులతో దేశాన్నే కాకుండా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ లేడి ఎవరు..? ఎక్కడనుంచి వచ్చింది. ఇంతకీ హిమదాస్ నేపధ్యం ఏంటీ..?

పి.టీ. ఉష,అశ్వని నాచప్ప లకి సాధ్యం కాని వరల్డ్ అండర్‌-20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల ఈవెంట్‌లో రికార్డ్ టైమింగ్‌తో హిమదాస్  స్వర్ణ పతకం గెలిచిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మన జాతీయగీతం వినిపించేలా చేసిన హిమదాస్ జీవితం ఓ కుగ్రామంలో మొదలైంది. హిమా దాస్‌ స్వస్థలం అసోంలోని నగోన్ జిల్లా ధింగ్‌ గ్రామం. తండ్రిపేరు రంజిత్ దాస్.. తల్లి  జొనాలి దాస్.. వీరికి నలుగురు సంతానమైతే.. చివరి సంతానమే హిమదాస్. తండ్రి ఓ సాధరణ రైతు.  తండ్రిపడే కష్టం చూడలక తండ్రితో పాటు పోలానికెళ్ళి పని చేస్తుండేది హిమదాస్. జనవరి తొమ్మిది 2000వేల సంవత్సరంలో జన్మించిన హిమదాస్ ప్రభుత్వ పాఠశాల నుండి తన ప్రస్థానం మొదలుపెట్టింది. మొదట్లో ఆమె ఫుట్ బాల్ ఆడేందుకు చాలా ఇష్టపడేది. ఆ క్రమంలో చాలా కాలం ఫుట్ బాల్ క్రీడ పై దృష్టి సారించింది కూడా. అయితే అప్పటి స్కూల్ కోచ్.. సాంసుల్ హోక్వ్.. హిమదాస్ ను ఫుట్ బాల్ నుండి రన్నింగ్ పైకి దృష్టి మార్చాడు. మొదటి నుండి ఆటలను ఎంతగానో ఇష్టపడే హిమదాస్ ను చూసి ఉపాద్యాయులు బాగా ప్రోత్సహించేవారు. సాంసుల్ హోక్వ్ హిమదాస్ ను నాగోన్ స్పోర్ట్స్ అసోసియేసకు చెందిన శంకర్ రోయ్ కు పరిచయం చేశాడు .అప్పుడే రన్నంగ్ లో తన ప్రతిభ చూపేందుకు ప్రయత్నం మొదలు పెట్టింది హిమదాస్.. చెప్పులు లేకుండా రాళ్ళ బాటలో సైతం అవలీలగా పరుగులు పెడుతుండేది. ఏ ఆట ఎంచుకున్న గుండెల నిండా ఆత్మ స్థైర్యం నింపుకన్న హిమదాస్ కు రన్నింగ్ లో పట్టు సాధించడం పెద్ద సమయం ఏమి పట్టలేదు. కానీ ఎక్కువ కష్టం మాత్రం పడుతుండేది. చాలీచాలని తిండి ఉండే పేద కుటుంబంలో జన్మించిన ఈమె.. క్రీడల్లో ఎవరితో పోటి అయినా వెనుకంజ వేసేది కాదు. నిజానికి ఆమెకు అమ్మాయిలతో పోటి పడటం కంటే అబ్బాయిలతో పోటి పడి గెలవడం అలవాటుగా మార్చుకుంది. గతంలోనూ అనేక పోటిల్లో ఆమె పాలుపంచుకుంది. అందులో భాగంగానే.. 100 మీటర్లు రన్నింగ్ రేస్.. 200 మీటర్ల రేస్ లోనూ... జిల్లా స్థాయిలో బంగారు పథకాలు సాధించింది. ఇక అక్కడ నుండి బంగారు పథకాలు సాధించే బంగారు తల్లిగా మారిపోయింది. డైరెక్తరేట్ అఫ్ స్పొర్ట్స్ అండ్ యూత్ వెల్ఫెర్ కు చెందిన అథ్లెటిక్ కోచ్  నిపోన్ దాస్ అనే మరో కోచ్ కళ్లల్లో పడింది..హిమదాస్. ఆమె తల్లిదండ్రులను ఒప్పించి అస్సోం రాజధాని గౌహతికి తీసుకెళ్ళాడు. అక్కడ  అద్దె ఇంట్లో ఉండి కొన్నాళ్ళు.. హస్టల్ లో ఉండి కొన్ని రోజులు ప్రాక్టిస్ చేస్తు ఉండేది.  కేవలం నాసిరకం షూస్.. దుస్తులతో ఇంత విజయాన్ని సాధించిన దాస్ ను మరింతగా ప్రోత్సహించి.. 200 మీటర్ల నుండి 400కేటగిరిలకు మార్చాడు కోచ్. ప్రతిరోజు క్రమం తప్పకుండా కసి పట్టుదలతో తన ప్రాక్టీసును కొనసాగించింది. కామన్ వెల్త్ పోటిల్లోనూ తన సత్తా చాటి.. పతకం పొందలేకపోయినా ఆరో స్థానంలో నిలిచింది. ఈ ఏడాదే.. గౌహతిలో జరిగిన అంతరాష్ట్ర చాంపియన్ షిప్ లోనూ 400మీటర్ల దూరాన్ని 51.13 సెకన్లలో చేరింది.
అది..2018 జూలై..12 గురువారం.. ఫిన్ ల్యాండ్ టంపెరే లో వరల్డ్ అండర్‌-20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటిలు జరుగుతున్నాయి అనేక దేశాల నుండి ఎందరో క్రీడాకారిణులు రన్నింగ్ రేసులో పాల్గోనేందుకు వచ్చారు.  లక్ష్యం నాలుగువందల మీటర్లు... ప్రపంచం మొత్తం వారి పోటిలు చూస్తోంది. పరుగు పందెం మొదలైంది... పోటిలో పాల్లోన్న వారంతా లేడిపిల్లలా.. చిరుత పులుల్లా పరుగులు పెడుతున్నారు... ఒకరినిమించి మరోకరు.. ఎవరికి ఎవరు తీసిపోరు. వాళ్ళు ట్రాక్ మీద పరుగెడతుంటే మన గుండె దద్దరిల్లేంతగా పరుగులు పెడుతున్నారు. ఈ పోటిలు చూస్తున్నవారంతా... ఊపిరి బిగబట్టి.. కళ్ళప్పగించి చూస్తున్నారు. పరుగుపెడుతున్న వారిలో ఒకరు హిమదాస్.. భయం భయంగా పరుగులు మొదలు పెట్టిన హిమదాస్... 300మీటర్లకు వచ్చేసరికి ఆమె నాలగవ స్థానంలో ఉంది. గెలుపు కష్టమనుకున్నారంతా.. అనుహ్యంగా రెప్పపాటులో అతి వేగంగా.. లక్ష్యానికి చేరువగా గెలుపుకి దగ్గరగా వచ్చేసరికి స్టేడియం అంతా బిగ్గరగా అరుపులు.. టీవీలో చూస్తున్న వారంతా ఒక్క క్షణం ఉలిక్కిపడ్డారు.  హిమదాస్ సాధించింది.. ఆమె స్వర్ణపతకమే కాదు.. దేశ గౌరవం కూడా. కోట్లాదిమంది భారతీయులు మదిలో చిరస్థాయిగా నిలచిపోతుంది ఈ హిమదాస్.

2 comments:

 1. Congrats himadas.scooty yojana is a new scheme.that help the girl or woman to no more waiting to get into there hopes .And they will get more confidence and to get more good ideas about there future

  ReplyDelete
 2. Heartly congratulations to himadas

  ReplyDelete

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top