ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ యూజర్లను ఆకర్షిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. సోషల్ మీడియా నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుంటూ దూసుకుపోతోంది ఈ యాప్. ఇప్పటి వరకు వాట్సాప్‌ను ఒకే మొబైల్‌లో వాడుకునే వీలుంది. డెస్క్‌టాప్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసే వ్యవస్థతో అందుబాటులోకి వచ్చింది. అయితే, వాట్సాప్ ఉన్న మొబైల్ ఇంటర్నెట్ కలిగి, డెస్క్‌టాప్‌తో అనుసంధానమై ఉండాల్సిందే. వేరే మొబైల్‌లో వాట్సాప్ వాడుకోవాలంటే.. అంతకుముందు ఉన్న మొబైల్ నుంచి వాట్సాప్ నంబరు అకౌంట్‌ను తొలగించాల్సిన పరిస్థితి. అయితే, ఒకే అకౌంట్‌ను ఒకటి కంటే ఎక్కువ డివైస్‌లలో వాడుకోవడానికి అవకాశం కల్పించనుంది. ఇదంతా రూమర్ అని వార్తలు చక్కర్లు కొట్టగా.. ఆ వార్త రూమర్ కాదని, త్వరలోనే వాట్సాప్‌ను ఎక్కువ డివైస్‌లలో వాడుకునే అవకాశాన్ని కల్పించబోతున్నట్లు డబ్ల్యూఏబీటాఇన్ఫో స్పష్టం చేసింది.
ఐఫోన్, ఆండ్రాయిడ్, ఐప్యాడ్, వాట్సాప్ ఫర్ విండోస్.. ఇలా అన్ని పరికరాల్లో వాట్సాప్ వాడుకునేలా చేస్తున్నట్లు తెలిపింది. మెయిన్ అకౌంట్‌ను తొలగించకుండానే, వేరే డివైస్‌లలో వాడుకోవచ్చని వివరించింది. ప్రస్తుతం ఆ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందని, త్వరలోనే బీటా వెర్షన్ వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. త్వరలోనే ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లను విడుదల చేస్తామని పేర్కొంది.
0 Comments:
Post a Comment