ఆర్థికంగా వెనకబడిన వర్గాలకే 10 శాతం
ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిబంధనల అమలు
ఉత్తర్వులు జారీచేసిన బీసీ సంక్షేమశాఖ
కాపులకు ప్రత్యేక కోటా లేదు
2019-20 విద్యా సంవత్సరంలో.. విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఆర్థికంగా వెనకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు చెందిన వారికి 10 శాతం రిజర్వేషన్ అమలుపై స్పష్టత ఇస్తూ బీసీ సంక్షేమశాఖ శనివారం ఉత్తర్వులను జారీచేసింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకొని ఉన్నత విద్యా సంస్థల్లో సూపర్ న్యూమరరీ సీట్ల భర్తీ విషయంలో రాజ్యాంగ సవరణ చట్టం 103, కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 19న ఇచ్చిన మార్గదర్శకాలకు లోబడి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ప్రకారం సీట్లు భర్తీ చేసేందుకు నిర్ణయించినట్లు పేర్కొంది. బీసీ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాలవలవన్ శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. పోస్టుల నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరి రిజర్వేషన్ అమలుపై ఉత్తర్వులు ప్రత్యేకంగా ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. తాజా ఉత్తర్వుల కారణంగా గత ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి 5 శాతం, కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆమోదం పొందిన చట్టం అమలు కాని పరిస్థితి నెలకొంది. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు గత ప్రభుత్వంలో ఐదు శాతం దక్కిన రిజర్వేషన్లు తాజా ఉత్తర్వులతో 10 శాతానికి చేరనున్నాయి. కాపులకు కేటాయించిన 5 శాతం రిజర్వేషన్ అమలు గురించి ఈ ఉత్తర్వుల్లో ప్రస్తావించలేదు. దీంతో ఉన్నత విద్యా సంస్థల్లో కాపులకు 5శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించదు.
జీవోలో ఏముందంటే..
‘కేంద్ర]ప్రభుత్వం రాజ్యాంగ సవరణ-103 చేస్తూ 2019లో చట్టం చేసింది. దీంతో ఎస్సీ,ఎస్టీ, బీసీలు మినహా ఇతర ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్) విద్యా ప్రవేశాలు, నియామకాల్లో 10శాతం రిజర్వేషన్లు దక్కాయి. 103 సవరణ చట్టం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 10శాతం రిజర్వేషన్లను వర్గీకరించి ఈ ఏడాది ఫిబ్రవరి 20న రెండు చట్టాల్ని తెచ్చింది. ఒక చట్టం ప్రకారం 5శాతం రిజర్వేషన్లు కేవలం కాపులకు, మిగిలిన 5శాతం కాపులు కాకుండా ఇతర ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు కేటాయించారు. ఆ రెండు చట్టాలు ఈ ఏడాది మార్చి 8నుంచి అమల్లోకి వచ్చే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆ రెండు చట్టాల మేరకు రిజర్వేషన్లు అమలు చేసే నిమిత్తం ముసాయిదా రూపొందించేందుకు ఈ ఏడాది మే 6న ప్రభుత్వం ఓ జీవో జారీచేసింది. మరోవైపు 103 రాజ్యాంగ సవరణ చట్టాన్ని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన రెండు చట్టాల్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన రెండు చట్టాల ప్రకారం రిజర్వేషన్లు కల్పించేందుకు నిబంధనలను రూపొందించేలా ఆదేశించాలని అభ్యర్థిస్తూ రాష్ట్ర హైకోర్టులో రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన రెండు చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని, వాటిని రద్దు చేయాలని అభ్యర్థనతో రాష్ట్ర హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలైంది. కేంద్రం చేసిన 103 సవరణ చట్టం ప్రకారం వైద్య, ఇంజనీరింగ్ కోర్సుల్లో సూపర్‌న్యూమరరీ సీట్లను భర్తీచేసేలా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. ఆర్థికంగా వెనకబాటు ఆధారంగా కాపు సామాజిక వర్గానికి విద్యా సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడం తగదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంలో హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. కేంద్రం చేసిన 103 సవరణ చట్టం ప్రకారం రిజర్వేషన్లను అనుసరిస్తూ పిటిషనర్లకు ప్రవేశాలు కల్పించాలని హైకోర్టు ఎన్టీఆర్ వైద్య వర్సిటీని రాష్ట్ర ఉన్నత విద్య కౌన్సిల్‌ని ఆదేశించింది. ఈ వ్యవహారంలో తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని ఈ మధ్యంతర ఉత్తర్వులతో పిటిషనర్లు విజయం సాధించినట్లు కాదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యా సంస్థల్లో సూపర్‌న్యూమరరీ సీట్లను 103 సవరణ చట్టాన్ని అనుసరించి ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అని జీవోలో పేర్కొన్నారు.

0 Comments:
Post a Comment