స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డబ్బు డిపాజిట్ చేస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వడ్డీ రేట్ల కోత ఆగస్ట్ 1 నుంచి అమలులోకి వస్తుందని బ్యాంక్ తెలిపింది
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా తన ఖాతాదారులకు షాకిచ్చింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లను సవరించింది. 45 రోజుల నుంచి 10 ఏళ్ల కాల పరిమితిలో ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేట్లను 5.75 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది.
46 రోజుల నుంచి 179 రోజుల వరకు డిపాజిట్లపై వడ్డీ రేటు 5.75 శాతానికి తగ్గించింది. ఇది వరకు ఈ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.25 శాతంగా ఉంది. 180 రోజుల నుంచి 210 రోజుల డిపాజిట్లపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఇప్పుడు వీటిపై వడ్డీ రేటు 6.25 శాతంగా ఉంది.
ఎస్‌బీఐ అలాగే 211 రోజుల నుంచి ఏడాదిలోపు డిపాజిట్లపై వడ్డీ రేటును 6.4 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించింది. సవరించిన వడ్డీ రేట్లు ఆగస్ట్ 1 నుంచి అమలులోకి వస్తాయి. ఇక ఏడాది నుంచి రెండేళ్ల డిపాజిట్లపై బ్యాంక్ వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఇప్పుడు ఈ డిపాజిట్లపై 6.8 శాతం వడ్డీ పొందొచ్చు.
స్టేట్ బ్యాంక్ అలాగే దీర్ఘకాల డిపాజిట్లపై కూడా వడ్డీ రేటును తగ్గించింది. రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు డిపాజిట్లపై వడ్డీ రేటు 5 బేసిస్ పాయింట్ల మేర తగ్గింది. ఇప్పుడు ఈ ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6.7 శాతంగా ఉంది. ఇక 3 ఏళ్ల నుంచి ఐదేళ్లలోపు డిపాజిట్లపై వడ్డీ రేటు 6.7 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గింది. ఐదేళ్ల నుంచి పదేళ్లలోపు ఎఫ్‌డీలపై 6.6 శాతం నుంచి 6.5 శాతానికి దిగొచ్చింది.
0 Comments:
Post a Comment