హైకోర్టు పరిశీలనలో ఎయిడెడ్ పోస్టుల భర్తీ
రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో పోస్టుల భర్తీ వ్యవహారం హైకోర్టు పరిశీలనలో ఉందని విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారువ్యవమండలిలోపాఠశాలలు, కళాశాలల్లో పోస్టుల భర్తీపై సభ్యుడు పి.రఘువర్మ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. రాష్ట్రంలో 2,275 ఎయిడెడ్ పాఠశాలలు, 124 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలున్నాయని, ఎయిడెడ్ పాఠశాలలకు 16,776 పోస్టులు మంజూరు చేశామని, అందులో 9,296 ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో 3,547 పోస్టులు మంజూరు చేయగా.. అందులో 2,373 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు.
ఎయిడెడ్ పాఠశాలల్లో పోస్టుల భర్తీపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుందని వివరిం చారు. డబ్ల్యూపీ నంబరు-9503 బ్యాచ్ కింద వర్తించే అన్ని యాజమాన్యాలకు, ఎయిడెడ్ పోస్టుల్లోని ఖాళీలను భర్తీ చేయడానికి 2005లో ప్రభుత్వం అనుమతి చ్చిందన్నారు. డీఎస్సీ తరహాలో రాష్ట్రస్థాయి పరీక్షతో నేరుగా నియామకాలు జరపాలని ప్రభుత్వం కొత్త నియమావళిని జారీ చేసిందని, దీన్ని సవాల్ చేస్తూ కొన్ని ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయని తెలిపారు.
బ్యాక్‌లాగ్ ఖాళీల మినహా ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో ఖాళీ పదవుల భర్తీపై నిషేధం కారణంగా నియామకాలను చేపట్టలేదన్నారు. ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రతిపాదన ఏదీ లేదని మంత్రి స్పష్టం చేశారు.
0 Comments:
Post a Comment