10వ తరగతి ప్రశ్నపత్రం ఎలా ఉంటుందో?
రూపకల్పనలో జాప్యం చేస్తున్న విద్యాశాఖ
ఆరు లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉత్కంఠ
ఈనాడు, అమరావతి: పదో తరగతి పరీక్షల్లో అంతర్గత మార్కులను తొలగించిన పాఠశాల విద్యాశాఖ నూతన ప్రశ్నపత్రాన్ని రూపొందించడంలో జాప్యం చేస్తోంది. ఎలా ఉంటుందనే దానిపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో ఎన్ని మార్కులకు ప్రశ్నలు ఉంటాయి? ఎన్ని మార్కులకు బిట్లు, వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి? అనేది తెలియక విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రశ్నపత్రం నమూనా ఎలా ఉంటుందో తెలియకుండా విద్యార్థులను పరీక్షలకు ఎలా సన్నద్ధం చేయాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
వేసవి సెలవుల్లోనే పూర్తిచేయాల్సి ఉన్నా..
గతంలో పదోతరగతి పరీక్షల్లో 20% అంతర్గత మార్కులు ఉండేవి. వీటిని ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా వేసుకుంటున్నాయని, దీంతో ఎక్కువ మందికి 10/10గ్రేడ్‌పాయింట్లు వస్తున్నాయనే ఉద్దేశంతో ఈ విధానాన్ని తొలగించారు. ఈ తొలగించిన 20మార్కులను చేర్చుతూ కొత్తగా ప్రశ్నపత్రం నమూనాను రూపొందించాల్సి ఉంటుంది. వేసవి సెలవుల్లోనే పూర్తి చేయాల్సిన ఈ ప్రక్రియను పాఠశాలలు తెరిచి 40రోజులకు పైగా గడిచినా ఇంతవరకు పూర్తి చేయలేదు. పాఠశాల విద్య స్థాయిలో విద్యార్థులు రాసే మొదటి కామన్ పరీక్ష పదోతరగతి. విద్యార్థి భవిష్యత్తును మలుపుతిప్పే స్థాయి ఇది. తల్లిదండ్రులు ఈ స్థాయిలో విద్యార్థులపై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. ఇంత ప్రాధాన్యం ఉన్న 10వ తరగతికి సంబంధించి పశ్నపత్రం ఎలా ఉంటుందనే దానిపై పాఠశాల విద్యాశాఖ స్పష్టత ఇవ్వడం లేదు. ఏటా దాదాపు 6లక్షల మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరవుతారు.
ఇతర రాష్ట్రాల్లో అమలుపై అధ్యయనం
పదోతరగతి నమూనా ప్రశ్నాపత్రాన్ని ఇటీవల రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్టీ) రూపొందించి ఉన్నతాధికారులకు సమర్పించింది. దీన్ని పరిశీలించిన అధికారి పదోతరగతి పరీక్షలు ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారో తెలుసుకోవాలని ఆదేశించారు. దీంతో అధికారులు ఇప్పుడు అధ్యయనం చేపట్టారు.

0 Comments:
Post a Comment