Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Saturday, 8 June 2019

AP Village volunteers Notification - Recruitment details - AP లో 4 లక్షల గ్రామ వాలంటీర్స్ కు నోటిఫికేషన్

AP లో 4 లక్షల గ్రామ వాలంటీర్స్ కు నోటిఫికేషన్
4 లక్షల గ్రామ వాలంటీర్స్:
AP Village volunteers Notification - Recruitment details - AP లో 4 లక్షల గ్రామ వాలంటీర్స్ కు నోటిఫికేషన్అప్లై చేయుటకు గవర్నమెంట్ వారి వెబ్ పేజీ...

Apply Grma Volunteer Online....


గ్రామ వాలంటీర్ల అప్లికేషన్ మొదలు అయినది:

అప్లై చేసుకొనే పద్దతి:

http://gramavolunteer.ap.gov.in/VVAPP/YUWeb/VVARegistration


STEP 1: ముందుగా పైన ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మేకు అర్హత ఉందొ లేదో తెలుసుకోండి.

STEP 2: అర్హత ఉంటే మీ ఆదార్ నెంబర్ ఎంటర్ చేయండి.OTP వస్తుంది. OTP ఎంటర్ చేసాక VERIFY పై క్లిక్ చేయండి.

STEP 3:తరువాత పేజి లో ఫోటో మరియు రెసిడెన్స్ ప్రూఫ్ ( RATION CARD/ VOTER CARD/ RESIDENCE CERTIFICATE/ BANK PASS BOOK ఏదో ఒకటి) అప్లోడ్ చేయాలి.

STEP 4: తరువాత మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీ అర్హత ని బట్టి పదవ, ఇంటర్ , డిగ్రీ డీటెయిల్స్ తో పాటుగా వీటిని అప్లోడ్ కూడా  చేయాలి.

STEP 5: తరువాత మీ యొక్క కులము ఎంటర్ చేయాలి. OC తప్ప మిగతా కులాల వాళ్ళు కుల దృవీకరణ పత్రములో నెంబర్ ఎంటర్ చేసి VERIFY చేసుకొని కుల దృవీకరణ పత్రాన్ని అప్లోడ్ చేయాలి.

చివరగా APPLY పై క్లిక్ చేయండి. మీకు ఒక నెంబర్ DISPLAY అవుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రామ వార్డు వలంటీర్ల నియామకానికి సంబంధించి ఇవాళ(22 జూన్ 2019) నుంచి దరఖాస్తులు స్వీకరించబోతుంది. వాలంటీర్ల ఎంపికకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేస్తోంది. నోటిఫికేషన్‌ వెలువడిన వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరిస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే డోర్‌ డెలివరీ ఇవ్వడం లక్ష్యంగా గ్రామాలు, పట్టణాల్లో వాలంటీర్లను నియమిస్తున్నట్లు సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారు.

ఈ క్రమంలో వాలింటర్ల ఎంపికకు సంబంధించి విధివిధానాల ఫైలుపై ముఖ్యమంత్రి శుక్రవారం సంతకం చేశారు. దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేస్తోంది

అందులోని నిర్ణీత ఫార్మాట్‌లో ఆన్‌లైన్‌లోనే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్‌ వివరాలను ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్‌లో వెల్లడించనుంది. జూలై 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 50 శాతం మహిళలకు ఇందులో రిజర్వేషన్ ఇవ్వనున్నారు.

అర్హతలు:
-18నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు
-కనీస విద్యార్హత పట్టణ ప్రాంతాల్లో డిగ్రీ, గ్రామాల్లో ఇంటర్, గిరిజన ప్రాంతాల్లో 10వ తరగతి.
-గ్రామంలో, పట్టణ వార్డులో వాలంటీర్ల నియామకానికి అక్కడి స్థానికులే అర్హులు.
-ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉండడం.. సామాజిక సేవ, స్వచ్ఛంద సంస్థలలో పని చేసిన వారిని అదనపు అర్హతగా పరిగణిస్తారు.
-50 కుటుంబాలను ఒక గ్రూపుగా ఏర్పాటు చేస్తారు. మండల స్థాయిలో ఎంపీడీపీ, తహసీల్దార్, ఈవోపీఆర్‌డీల కమిటీనే గ్రామాల వారీగా 50 ఇళ్ల గ్రూపులుగా వర్గీకరణ చేస్తుంటారు.
-పట్టణాల్లో 50 ఇళ్ల గ్రూపులను మున్సిపల్‌ కమిషనర్, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి, మరొక సీనియర్‌ అధికారితో కూడిన కమిటీ వర్గీకరిస్తుంది.
-గ్రూపుల వర్గీకరణ తర్వాత గ్రామ, వార్డు స్థాయిలో 50 ఇళ్లకన్నా తక్కువ సంఖ్యలో కుటుంబాలు మిగిలిపోతే వారిని ఆ గ్రామం, వార్డులోని గ్రూపులలో సర్ధుబాటు చేస్తారు.
ఎంపిక చేసే విధానం:

వాలంటీర్ల నియామకానికి గ్రామం, మున్సిపల్‌ వార్డును ఒక యూనిట్‌గా తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాలలో మండలంను యూనిట్‌గా ఆ మండల పరిధిలో నియమించే వాలంటీర్ల సంఖ్యను లెక్కించి తీసుకొని, ఆ సంఖ్యకు అనుగుణంగా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్స్‌ పాటిస్తారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ కేటగిరీల ఎంపిక ఉంటుంది. అన్ని విభాగాల్లో దాదాపు సగం మంది మహిళలను నియమిస్తారు.
-ఆన్‌లైన్‌ ద్వారా అందిన దరఖాస్తుల స్క్రూటినీ పట్టణ స్థాయిలో మున్సిపల్‌ కమిషనర్, మండల స్థాయిలో ఎంపీడీవో ఆధ్వర్యంలో జరుగుతుంది.
-అర్హులైన అభ్యర్థులందరినీ మండల స్థాయిలో ఇంటర్వ్యూల కోసం పిలుస్తారు.
 • -వాలంటీర్ల నియామకం కోసం పట్టణాలు, మండల స్థాయిలో ముగ్గురు అధికారులతో కమిటీలు నియమిస్తారు. పట్టణాల్లో మున్సిపల్‌ కమిషనర్‌ లేదా డిప్యూటీ కమిషనర్‌ చైర్మన్‌గా, తహసీల్దార్, జిల్లా కలెక్టరు నియమించే మరో అధికారి కమిటీ సభ్యులుగా ఉంటారు. మండల స్థాయి కమిటీలో ఎంపీడీవో చైర్మన్‌గా, తహసీల్దార్, ఈవోపీఆర్‌డీ కమిటీ సభ్యులుగా ఉంటారు.
మండల, పట్టణ స్థాయిలో ఏర్పాటయ్యే ముగ్గురు సభ్యుల కమిటీ అభ్యర్థులకు ఇంటర్వూ్యలు నిర్వహిస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అభ్యర్థికి ఉన్న అవగాహన, సామాజిక పరిస్థితులపై అతనికి ఉన్న తెలివితేటలు.. అతని నడవడిక, సామాజిక స్పృహ అన్నవి ఇంటర్వ్యూలో ప్రాధానంగా చూస్తారు.
-వాలంటీర్లగా ఎంపికైన వారికి ప్రభుత్వం ప్రతి నెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తుంది.
- ఎంపికైన వారిని విధుల్లో చేర్చుకునే ముందు వారికి ఆరు రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఆగస్టు 5వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో శిక్షణ ఉంటుంది. ఆగస్ట్ 15వ తేదీ నుంచి విధుల్లోకి గ్రామ వాలంటీర్లు రావలసి ఉంటుంది.

 • వాలంటీర్లు చేయవలసిన పనులు:

-50 కుటుంబాల పరిధిలో కులం, మతం, రాజకీయంతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడం.
-వాలంటీర్లుగా నియమితులయ్యే వారు తమ పరిధిలో ఉండే కుటుంబాల నుంచి అందే వినతులు, వారి సమస్యలపై ఎప్పటికప్పుడు గ్రామ, వార్డు సచివాలయంతో పాటు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి పని చేయాలి. అర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేయడంలో, సంబంధిత సమస్య పరిష్కారంలో కీలకంగా వ్యవహరించాలి. వివిధ శాఖలకు అందే వినతుల పరిష్కారంలో ఆయా శాఖలకు సహాయకారిగా పనిచేయాలి.
-తమ పరిధిలోని లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయాన్ని వారి ఇంటి వద్దకే వెళ్లి అందజేయాలి. 50 కుటుంబాల పరిధిలో సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హత ఉండి, వారికి ఆ పథకం అందనప్పుడు దానిపై వారికి అవగాహన కలిగించి, లబ్ధిదారునిగా ఎంపిక చేయించాలి.
- గ్రామ, వార్డు సచివాలయం ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు హాజరవుతూ.. తనకు కేటాయించిన 50 ఇళ్ల వారి సమస్యలపై ఎప్పటికప్పుడు నోట్‌ను తయారు చేసి అధికారులకు అందజేయాలి.

​​​​​​​- ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలు, ఇతరత్రా సహాయం పొందిన కుటుంబాల జాబితాను తన వద్ద రికార్డు రూపంలో భద్రపరుచుకోవాలి.
​​​​​​​- తన పరిధిలోని 50 కుటుంబాల భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా.. విద్య, ఆరోగ్య పరంగా ఎప్పటికప్పుడు వారికి చైతన్యం కలిగించాలి.
​​​​​​​- తన పరిధిలోని ఇళ్లకు సంబంధించి రోడ్లు, వీధి దీపాలు, మురుగునీటి కాల్వల పరిశుభ్రత, మంచినీటి అవసరాల పరిష్కారం కోసం కృషి చేయాలి

జిల్లాల వారీగా గ్రామాల జాబితా:


అనంతపురం - 1066

చిత్తూరు - 1627

తూర్పు గోదావరి - 1117

గుంటూరు - 927

కృష్ణ - 1206

కర్నూలు - 1421

ప్రకాశం - 1100

ఎస్ పి ఎస్ నెల్లూరు - 1414

శ్రీకాకుళం - 2300

విశాఖపట్నం - 4198

విజయనగరం - 2160

పశ్చిమ గోదావరి - 751

Y.S.R. - కడప1021

Download.... Notification


అప్లై చేయుటకు గవర్నమెంట్ వారి వెబ్ పేజీ...

Apply Grma Volunteer Online....

3 comments:

 1. Leaders should not ignore the persons who have work hard for election to make win the party..if not the party will effect badly

  ReplyDelete
 2. G.O.MS.No. ???? for Outsoucing with permanment of job goverment have chagne for disable

  ReplyDelete

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top