Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Friday, 18 January 2019

Maharana Pratap ( క్రీ.శ.1540 మే 9 - క్రీ.శ.1597 జనవరి 19 ) Biography- Life History, Achievements-మహా రాణాప్రతాప్‌-దేశం, ధర్మం, సంస్కృతి, స్వాతంత్య్రం కోసం పోరాడి భావితరాలకు స్ఫూర్తి- 25 సంవత్సరాల పాటు అక్బర్ తో యుద్ధం - 206 KG ల బరువు గల ఆయుదాలు ధరించేవాడు - మహారణా ప్రతాప్ సింహ్ చనిపోయాక అక్బర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడట-ఇష్టమైన గుర్ర్రం చేతక్ - హల్దీఘాటీ పోరాటానికి ప్రపంచ యుద్ధ వ్యూహాలలో ప్రత్యేక స్థానం-వియత్నాం యుద్ధం లో అమెరికాను ఈ మహా వీరుని స్పూర్తితో ఓడించింది అని అక్కడి వారు చెప్పుకుని మేవర్ నుంచి పిడికెడు మట్టి తీసుకెళ్లి న వైనం....ఎందరో విదేశీయులకు కూడా స్ఫూర్తి అయిన రాణా ప్రతాప్ జీవితం.... -యూ ట్యూబ్ వీడియో - పూర్తీ వివరాలు

Maharana Pratap ( క్రీ.శ.1540 మే 9 - క్రీ.శ.1597 జనవరి 19 ) Biography- Life History, Achievements - మహా రాణాప్రతాప్‌-దేశం, ధర్మం, సంస్కృతి, స్వాతంత్య్రం కోసం పోరాడి భావితరాలకు స్ఫూర్తి- 25 సంవత్సరాల పాటు అక్బర్ తో యుద్ధం - 206 KG ల బరువు గల ఆయుదాలు ధరించేవాడు - మహారణా ప్రతాప్ సింహ్ చనిపోయాక అక్బర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడట-ఇష్టమైన గుర్ర్రం చేతక్ - హల్దీఘాటీ పోరాటానికి ప్రపంచ యుద్ధ వ్యూహాలలో ప్రత్యేక స్థానం -యూ ట్యూబ్ వీడియో - పూర్తీ వివరాలు

మహా రాణాప్రతాప్‌

(శివాజీ చేసిన హిందూ స్వరాజ్య స్థాపనకు పాటించిన వ్యూహాలకు స్ఫూర్తి అయిన మహారాణాప్రతాప్ జీవితం గురించి క్లుప్తంగా)
Maharana Pratap ( క్రీ.శ.1540 మే 9 - క్రీ.శ.1597 జనవరి 17 ) Biography- Life History, Achievements - మహా రాణాప్రతాప్‌-దేశం, ధర్మం, సంస్కృతి, స్వాతంత్య్రం కోసం పోరాడి భావితరాలకు స్ఫూర్తి- 25 సంవత్సరాల పాటు అక్బర్ తో యుద్ధం - 206 KG ల బరువు గల ఆయుదాలు ధరించేవాడు - మహారణా ప్రతాప్ సింహ్ చనిపోయాక అక్బర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడట-ఇష్టమైన గుర్ర్రం చేతక్ - హల్దీఘాటీ పోరాటానికి ప్రపంచ యుద్ధ వ్యూహాలలో ప్రత్యేక స్థానం -యూ ట్యూబ్ వీడియో - పూర్తీ వివరాలు
మహారాణా ప్రతాప్ సింహ చిత్రం - రాజా రవివర్మ చే గీయబడింది


క్రీ.శ.6వ శతాబ్దం వరకు భారతదేశం విదేశీ దురాక్రమణదారులతో పోరాడి, గెలిచి తన అస్థిత్వాన్ని చాటుకుంది. క్రీ.శ.6వ శతాబ్దంలో దేశంలో అత్యధిక ప్రాంతాలను తన పాలనలోకి తీసుకువచ్చి సుపరిపాలన అందించిన చిట్టచివరి చక్రవర్తి శ్రీహర్షుడు. శ్రీ హర్షుని మరణానంతరం హిందూ రాజులలో అనైక్యత వ్యాపించింది. అహంకారంతో పరస్పరం కలహించుకుంటూ ఎవరికివారే స్వతంత్రంగా వ్యవహరించసాగారు.
అదే సమయంలో విదేశీ ఆక్రమణకారుల దృష్టి భారత్‌పై పడింది. ముస్లిం సేనానులు మహ్మద్‌ గజని, మహ్మద్‌ ఘోరీ వంటివారు భారత భూభాగంపై వరుసగా దాడులు కొనసాగించారు. విదేశీ ఆక్రమణకారులతో సమైక్యంగా పోరాడాల్సిన హిందూరాజులు నిష్క్రియులయ్యారు. దేశంలోని రాజుల మధ్య నెలకొన్న విభేదాలు, అనైక్యత ముస్లిం రాజులకు వరంగా మారాయి. క్రమంగా ముస్లిం సేనానులు దేశంలో ఒక్కో రాజును జయిస్తూ తమ రాజ్యాన్ని విస్తరించసాగారు.
ఈ దురాక్రమణ చరిత్ర సుమారు 700 సంవత్సరాల పాటు కొనసాగి మొగలాయిల పాలనకు నాంది పలికింది. మొగలాయి పాదుషా అక్బర్‌ కాలం నాటికి భారతదేశంలోని 50 శాతం భూభాగం ముస్లింల ఆధీనంలోకి వచ్చింది. ఈ 700 సంవత్సరాల కాలంలో విదేశీ ఆక్రమణకారులను స్వదేశీ పాలకులు ఎదిరించినా సమైక్యంగా పోరాటం చేయని కారణంగా విఫలమైంది. అదే భారతదేశానికి శాపం అయింది.
మొగలు పాదుషా అక్బర్‌ అమలు చేసిన కుటిలనీతి కారణంగా అనేకమంది రాజపుత్ర రాజులు అతని అధికారానికి తలవంచి, అతని ఆశ్రయం పొందారు. వారంతా ప్రాణసమానమైన స్వాతంత్య్రాన్ని పోగొట్టుకొని అక్బర్‌కు సామంతులయ్యారు. మరికొంతమంది అక్బర్‌ సైన్యంలో సేనానులుగా చేరారు. మహా పరాక్రమశాలి అయిన రాజా మాన్‌సింగ్‌ అక్బర్‌ సైన్యానికి సర్వ సేనాధిపతిగా మొగలాయీల రాజ్య విస్తరణకు కృషి చేశాడు. నిత్యం శివపూజ చేయనిదే పచ్చి మంచినీరు కూడా ముట్టని రాజామాన్‌సింగ్‌ విదేశీ పాలకుల వద్ద గులాంగిరీ చేయటం హిందూ రాజుల ఆత్మవిస్మృతికి నిదర్శనం.

మహా రాణాప్రతాప్‌ జననం

మహారాణాప్రతాప్‌ సుమారు 475 సంవత్సరాల క్రితం రాజస్తాన్‌లోని చిత్తోడ్‌లో క్రీ.శ.1540 మే 9వ తేదీన జన్మించాడు. సూర్య వంశానికి (సిసోడియా వంశానికి ) చెందిన మహారాణా ఉదయ్‌సింగ్‌ రాణాప్రతాపుని తండ్రి. తల్లి రాణి జయవంత్‌బాయి. ఉదయ్‌సింగ్‌కుమారుల అందరిలోకి పెద్దవాడు రాణాప్రతాప్‌. ఉదయ్‌సింగ్‌ మరణానంతరం మేవారు రాజ్యంలోని మంత్రులంతా చర్చించుకొని పరాక్రమవంతుడైన రాణా ప్రతాప్‌సింగ్‌ను మేవారు రాజుగా అభిషేకించారు.

మట్టి నుంచి మాణిక్యాలు- ఆరావళి పర్వత ప్రాంతాల్లో నివసించే భిల్లు యువకులు

అటువంటి విపత్కర పరిస్థితుల్లో క్రీ.శ.1572లో మేవారు రాజుగా అభిషిక్తుడైన మహారాణా ప్రతాప్‌సింగ్‌ మాతృభూమి రక్షణకై నడుంబిగించాడు. అక్బర్‌ పాదుషాను ఎదిరించడానికి శక్తివంతమైన సైన్యాన్ని తీర్చిదిద్దాడు. ఆరావళి పర్వత ప్రాంతాల్లో నివసించే భిల్లు యువకులను సమీకరించి వారిలో స్వాతంత్య్ర పిపాస రగిలించి ధైర్య సాహసాలుగల సైనికులుగా తీర్చిదిద్దాడు. మాతృభూమి కోసం ప్రాణాలు సైతం అర్పించే అరవీర భయంకరులైన సైనికులు మహా రాణాప్రతాప్‌ సైన్యంలో ఉండేవారు.
ఆదివాసీలు వారి యొక్క అభేద్యమైన బాణాలతో మొఘలులతో పోరాడారు .వాళ్ళు మహారణాను వారి పుత్రుడిగా భావించేవారు.మహారణా కూడా వారిపట్ల భేదభావం చూపించేవారు కాదు. మేవాడ్ రాజచిహ్నంలో ఒకపక్క రాజపూత్ మరొక పక్క భీల్ ఉంటారు
మహా రాణాప్రతాప్‌ మేవారు సింహాసనాన్ని అధిష్ఠించేనాటికి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. నలువైపులా శత్రువులు పొంచి ఉన్నారు. శత్రువు వద్ద అపార ధనం, ఇతర సాధనాలు ఉన్నాయి. లక్షల సంఖ్యలో సైన్యం ఉంది. ఆ సమయంలో ఛిత్తోడ్‌ను స్వతంత్రం చేసేవరకు ‘బంగారు పళ్ళెంలో భోజనం చేయనని, మెత్తని పరుపులపై నిద్రించనని, రాజప్రాసాదంలో నిద్రించనని’ మహా రాణాప్రతాప్‌ భీషణ ప్రతిజ్ఞ చేశాడు. సుమారు 25 సంవత్సరాల పాటు అక్బర్‌తో పోరాటం చేసిన మహా రాణాప్రతాప్‌ ఒక సామాన్య సైనికునివలె జీవించాడు. ఒక దశలో తినడానికి తిండి కూడా సరిగాలేని సమయంలో గడ్డి రొట్టెలను తినేవాడని చిత్తోఢ్‌గఢ్‌లో నేటికీ అనేక కథలు ప్రచలితంలో ఉన్నాయి.

రాణాకే ప్రాధాన్యం ఇస్తాను అన్న మహా రాణాప్రతాప్‌ జీవనశైలి, పరాక్రమాన్ని స్వయంగా తిలకించిన శీతల్‌ అనే కవి

మహా రాణాప్రతాప్‌ జీవనశైలి, పరాక్రమాన్ని స్వయంగా తిలకించిన శీతల్‌ అనే కవి రాణాపై ఓ ప్రేరణ దాయకమైన గేయకవిత్వం రచించాడు. రాణాప్రతాప్‌ తన తలపాగాను శీతల్‌కు తొడిగి సన్మానించాడు. శీతల్‌ కవి గ్రామాల్లో పర్యటిస్తూ మేవారు రాజు శౌర్యగాథలను గానం చేసేవాడు.

చివరకు ఆగ్రాలోని అక్బరు పాదుషా కొలువులో కూడా శీతల్‌ కవి రాణాప్రతాపుని శౌర్యాన్ని గానం చేశాడు.అక్కడొక ఒళ్ళు గగుర్పొడిచే సంఘటన ఒకటి జరిగింది. సాధారణంగా అక్బర్‌ అస్థానంలోకి ప్రవేశించగానే ఎవరైనా తల వంచి, కుడి చేత్తో చక్రవర్తి అక్బర్‌కు సలామ్‌ చేయాలి. శీతల్‌ కవి అక్బర్‌ ఆస్థానంలోకి ప్రవేశించగానే రాణాప్రతాప్‌ తన శిరస్సున తొడిగిన తలపాగాను తీసి కుడి చేత్తో పట్టుకొని, తల వంచి, ఎడమ చేత్తో సలామ్‌ చేశాడు. ఎడమ చేతి సలామ్‌ చక్రవర్తికి ఆగ్రహం తెప్పించింది. ఒక్క క్షణం తన కోపాన్ని అణచిపెట్టుకుని ఎందుకు అలా చేశావని అడిగాడు శీతల్‌ కవిని. అప్పుడు శీతల్‌ కవి ఇలా చెప్పాడు..
‘పాదుషా జి.. ఎడమ చేత్తో మీకు సలామ్‌ చేసిన నా తప్పును మన్నించండి. దానికి బలమైన కారణమే ఉంది. నెత్తిన ఉన్న ఈ తలపాగాను నాకు మహా వీరుడైన రాణా ప్రతాప్‌ సింగ్‌ బహూకరించి, స్వయంగా తన చేతులతో నా శిరస్సుకు తొడిగారు. కాబట్టి ఆ తలపాగా ఉన్న నా శిరస్సును మీ ముందు వంచటం అంటే ఇంతవరకు మీకు లొంగని ఆ వీరుని అవమానించటమే అవుతుంది. అందుకని ఆ తలపాగాను తీసి చేత్తో పట్టుకుని మీ ముందు తల వంచాను. అంతటి మహావీరుని తలపాగాను ఎడమ చేత్తో పట్టుకోవటమంటే కూడా అతనిని అవమానించటమే అవుతుంది. అందుకే తలపాగా కుడిచేత్తో పట్టుకుని మిగిలిన చేత్తో మీకు సలామ్‌ చేశాను. మీకు భయపడటం కన్నా మహా రాణాప్రతాప్‌ వీరత్వాన్ని చాటడానికే నేను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను’ అన్నాడు శీతల్‌ కవి ధైర్యంతోనూ, ఆత్మవిశ్వాసంతోనూ. శీతల్‌ ఆత్మస్థైర్యాన్ని చూసి అక్బర్‌ పాదుషా నిశ్చేష్ఠుడయ్యాడు.

హల్దీఘాటీ పోరాటం

హల్దీఘాటీ పోరాటానికి ప్రపంచ యుద్ధ వ్యూహాలలో ప్రత్యేక స్థానం ఉంది. రాణా ప్రతాప్‌ను తన అధికార పరిధిలోకి తీసుకురావడానికి అక్బర్‌ పాదుషా చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. రాయబారం విఫలం కావడంతో యుద్ధం అనివార్యమైంది. అక్బర్‌కు రాణాప్రతాప్‌ ఒక సమస్యగా తయారయ్యాడు. రాణాప్రతాప్‌తో యుద్ధం చేయడానికే అక్బర్‌ నిశ్చయించాడు. రాణాప్రతాప్‌పై పోరాటానికి అక్బర్‌ రెండు లక్షల సైనికులతో పెద్ద సైన్యాన్ని సిద్ధంచేసి దానికి రాజా మాన్‌సింగ్‌ను సేనాధిపతిని చేశాడు. ఒక హిందూ రాజుపై విదేశీయ పాలకుని తరపున మరో హిందూ రాజు పోరాటం చేయడానికి రంగం సిద్ధమైంది. రాజా మాన్‌సింగ్‌కు సహాయకులుగా యువరాజు సలీం, మొఘలులతో కలిసి పోరాడిన రాణాప్రతాప్‌ కు వరసకు తమ్ముడు అయిన శక్తిసింహుడిని నియమించాడు. ఈ సైన్యం మేవారు దిశగా కదిలింది.
అక్కడ రాణాప్రతాప్‌ పరిస్థితిని అంచనా వేసాడు. రాజధానిని దుర్గమమైన కొండల నుంచి కుంభావ్‌గఢ్‌కు మార్చాడు. మేవారు స్వాతంత్య్రాన్ని పరిరక్షించుకోడానికి రాజపుత్ర సర్దారులంతా ఏకం కావాలని పిలుపునిచ్చాడు. సుశిక్షితులైన సైన్యాన్ని తీసుకొని కీలకమైన హల్దీఘాటీ ప్రాంతానికి చేరుకున్నాడు. ఈ హల్దీఘాటీ ఎత్తైన కొండలమధ్య ఉంది. రాణాప్రతాప్‌ వద్ద 3 వేల మందితో అశ్విక దళం, 400 ఏనుగులతో సహా 22 వేల మంది సైన్యం మాత్రమే ఉంది. ఈ సైన్యం రెండు లక్షలమంది ఉన్న అక్బర్‌ సైన్యంతో పోరాడటం అత్యంత సాహసమే అవుతుంది.

హల్దీఘాటీకి ఇరుకైన కొండ మార్గాల వెంట వచ్చే మొగలు సైన్యంపై రాళ్ళ వర్షం కురిసింది. భిల్లుల విల్లుల నుంచి దూసుకొచ్చే పదునైన బాణాల తాకిడికి మొఘలాయి సైన్యం కకావికలమైంది. అయితే చివరకు మొఘలాయీ సైన్యానిదే పైచేయి అయింది. మొగలుల తరపున పోరాడుతున్నప్పటికీ దేశధర్మ రక్షణకు పోరాడుతున్న రాణాప్రతాప్ పై మాన్ సింగ్ కి అచెంచల గౌరవం ఉంది.అందుకే మొగల్ సైన్యం పైచేయి సాధింస్తున్న పరిస్థితిని గమనించిన మాన్‌సింగ్‌ మొఘలు సైన్యాన్ని నిలువరించే ప్రయత్నం చేశాడు. అతని సూచనతో రాణా ప్రతాప్‌ యుద్ధభూమిని విడనాడి సురక్షిత ప్రాంతానికి పయనమయ్యాడు. వాయువేగంతో పయనించే తన గుర్రం చేతక్‌ను మరోవైపు దౌడు తీయించాడు. వేలాదిమంది రాజపుత్ర వీరులు మాతృభూమి రక్షణలో అమరులయ్యారు. రాణా ప్రతాప్‌ను ఇద్దరు ముస్లిం సర్దారులు వెంబడించారు. వారి వెంటే వున్న శక్తి సింహునిలో పశ్చాత్తాపం మొదలైంది. మేవారు సింహాసనాన్ని రక్షించడానికి పోరాడుతున్న అన్న రాణాప్రతాప్‌కు సహకరించదలుచుకున్నాడు. వెంటనే తన కరవాలంతో ఇద్దరు ముస్లిం సర్దారుల తలలు నరికేసాడు. అన్న రాణాప్రతాప్‌ కాళ్ళపైబడి శరణువేడాడు. రాణాప్రతాప్‌ శక్తిసింగ్‌ను హృదయానికి హత్తుకొని ఓదార్చాడు. క్రీ.శ.1576 జూలైలో జరిగిన హల్దీఘాటీ పోరాటం రాజపుత్రుల శౌర్య ప్రతాపాలకు సాక్షిగా నిలిచింది.
హల్దీఘాటీ పోరాటం తరువాత కూడా రాణాప్రతాప్‌ అక్బర్‌ సైన్యంతో అనేక యుద్ధాలు చేశాడు. సుమారు 25 సంవత్సరాలపాటు రాణాప్రతాప్‌ మొగలు సైన్యంతో పోరాడాడు. కుటుంబంతో సురక్షితమైన సింధూఘాటికి బయలుదేరాడు. దారిలో గతంలో మేవారు మంత్రిగా పనిచేసిన భామాషా ఎదురై తన సర్వసంపదను రాణాప్రతాప్‌ పరంచేసి తిరిగి సైన్యాన్ని పునర్నిర్మించమని కోరాడు. కొత్త ఉత్సాహంతో రాణాప్రతాప్‌ తిరిగి అనేక కోటలను స్వాధీనం చేసుకున్నాడు. అయితే చిత్తోఢ్‌ను గెలవకుండానే క్రీ.శ.1597వ సంవత్సరం జనవరి 19 న అస్తమించాడు.మహారణా చనిపోవడానికి ముందు తాను కోల్పోయిన వాటిలో 85% తిరిగి గెల్చుకున్నాడు.మహారణా ప్రతాప్ సింహ్ చనిపోయాక అక్బర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడట.
ప్రాతఃస్మరణీయుడైన మహారాణాప్రతాపసింహుడు దేశం, ధర్మం, సంస్కృతి, స్వాతంత్య్రం కోసం పోరాడి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచాడు. నిజమైన హైందవ వీరునిగా వీరస్వర్గమలంకరించాడు. తరువాతి కాలంలో ఛత్రపతి శివాజీ మహారాజుకు రాణాప్రతాప్‌సింహుడి యుద్ధ వ్యూహమే స్ఫూర్తి అయింది.


ఉదయ్ పూర్ లోని రాణా ప్రతాప్ మెమోరియల్ 

మహారణా ప్రతాప్  - ఆయుధాలు 


శ్రీ మహారణా ప్రతాప్ యొక్క బరువు 110 కిలోలు మరియు అతని పొడవు 7’5’’. మహారణా ప్రతాప సింహ్ యొక్క ఈటె 80 కిలోలు ఉంటుంది.చేతి కవచం, శరీర కవచం కలిసి మరొక 80 కిలోలు ఉంటాయి. అతని చేతిలోని కత్తితో కలిపి మొత్తం 207 కిలోలు ఉంటాయి. ఇప్పటికీ ఇవన్నీ ఉదయ్ పూర్ రాజవంశస్తుల సంగ్రహణాలయంలో ఉన్నాయి.హల్ది ఘాట్ యుద్ధం జరిగి 300 సంవత్సరాల తరువాత కూడా అక్కడి నెలలో కత్తులు లభించాయి. చివరి సారిగా 1985 లో ఒక ఆయుధం దొరికింది.

అత్యంత ఇష్టమైన గుర్రం- చేతక్


శ్రీ మహారణా ప్రతాప్ దగ్గర అత్యంత ఇష్టమైన గుర్రం ఉండేది. దాని పేరు “చేతక్”
రాణా గుర్రం అయిన చేతక్ మహారణాను 26 అడుగుల కందకాన్ని దుమికి అది దాటిన తరువాత చనిపోయింది. అంతకంటే ముందే దానికి ముందరి ఒక కాలు విరిగి ఉన్నప్పటికి ఆ కందకాన్ని దుమికింది.అది ఎక్కడైయతే చనిపోయిందో అక్కడే ఒక చింత చెట్టు పెరిగింది.అదే ప్రదేశంలో దాని గౌరవార్దం చేతక్ మందిరం కట్టారు.
చేతక్ - సమాధి


చేతక్ ఎంత బలమైనదంటే ఎదుట ఏనుగుమీద ఉన్న సైనికుణ్ణి అందుకోవటానికి అది కూడా మహారణాతో పాటుగా అంత ఎత్తులో గాలిలో ఎగిరేది
మహారణా ప్రతాప్ కి ఒక ఏనుగు కూడా ఉండేది.దాని పేరు రాంప్రసాద్.

రాణా ప్రతాప్ సింగ్ రాథోడ్ తో పాటుగా యుద్ధంలో పోరాడిన బంజరు క్రాంతి వీరుడు శ్రీ శ్రీ శ్రీ భూక్యా బంజరు భాణ నాయక్ ఈయన వంశం వారు అనంతపురం రూపా నాయక్ తండ లో కలరు
భాణ నాయక్ గారు యుద్ధానికి వాడిన కత్తులు, ఖడ్గం, శారీర రక్షక కవచము ఇప్పటికీ కాపాడుకుంటూ పూజలు నిర్వహిస్తూ, భాను నాయక్ పోరాట కథలను బంజార ఇతిహాసం పాటల్లో సాహిత్యంతో పాటుగా అనేక మంది వీర గాథలో కలవు

రాణాప్రతాప్‌సింహుడి దేశభక్తి ,వీరత్వానికి అభిమానులు

వియత్నాం అద్యక్షుడికి 

ప్రపంచంలోని చిన్న దేశాలలో వియత్నాం ఒకటి. ప్రపంచంలో అత్యంత బలశాలి అయిన అమెరికా తలని వంచింది. కనీసం 20 సంవత్సరాలు సాగిన యుద్ధంలో ఆకరికి అమెరికాని ఓడించింది. అమెరికా మీద విజయం తరువాత వియత్నాం అద్యక్షుడికి ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు.
విలేకరి: ఇప్పటికీ అర్ధాంకాని విషయమేమిటంటే, అమెరికాని ఓడించి యుద్ధంలో ఎలా గెలిచారు.
ఆ విలేకరి అడిగిన ప్రశ్నకి సమాధానం విని మీరు చాలా గర్వంగ ఫీల్ అవుతారు.
అన్నీ దేశాలలోకెల్ల శక్తిశాలి అయిన అమెరికాని ఓడించడానికి నేను మహామహుడు, శ్రేష్టమైన దేశభక్తిగల భారతీయ రాజు చరిత్రను చదివాను.అతని జీవనంనుండి ప్రేరణపొంది యుద్దనీతి, ఇతరత్రా ప్రయోగాలతో మేము యుద్ధంలో గెలిచాము.
విలేకరి అడిగాడు: ఎవరా భారతీయ మహారాజు?
వియత్నాం అద్యక్షుడు నిలబడి గర్వంతో ఇలా సమాధానం చెప్పాడు. ”అతడే రాజస్తాన్లోని మేవాడ్ మహారాజు రాణా ప్రతాప్ సింహ్”
మహారణా ప్రతాప్ సింహ్ పేరు చెప్పెటప్పుడు అతని కళ్ళలో వీరత్వం నిండి వెలుగు ఉంది.
అలాగే ఇలా అన్నాడు
“ఒకవేళ అలాంటి రాజు మా దేశంలో జన్మించి ఉంటే మేము ఈ ప్రపంచాన్నే జయించేవారం.”
కొన్ని రోజుల తరువాత వియత్నాం అధ్యక్షుడు చనిపోయాడు అయితే అతని సమాధి మీద ఇలా రాశి ఉంది “ఇది మహారణా ప్రతాప్ యొక్క శిష్యుడిది” అని రాసి పెట్టారు.

 వియత్నాం విదేశాంగమంత్రి 

 వియత్నాం విదేశాంగమంత్రి భారత పర్యటనకి వచ్చాడు.మహామహుల శ్రద్ధాంజలి గటించడానికి మొదట గాంధీ సమాధి అతనికి చూపించారు ఆ తరువాత ఎర్రకోట, ఇంకా, ఇంకా ఇలా చూపించారు. ఇవన్నీ చూపించేటప్పుడు ఆ విదేశాంగమంత్రి ఇలా అన్నాడు “ మహారణా ప్రతాప్ సమాధి ఎక్కడ?”.
ఇవన్నీ చూపిస్తున్న భారత అధికారి అతని ప్రశ్నకి ఆశ్చర్యపోయి ఉదయపూర్లో ఉన్నదని చెప్పాడు. విదేశాంగమంత్రి అక్కడనుండి ఉదయ్ పూర్ వెళ్ళి సమాధిని దర్శించి అక్కడనుండి పిడికడు మట్టిని తీసుకొని అతని బ్యాగ్ లో పెట్టుకున్నాడు.ఇది చూసిన భారత అధికారి మట్టిని బ్యాగ్ లో పెట్టుకోవడానికి కారణం అడిగాడు....”ఇదే మట్టి దేశభక్తులైన వీరపుత్రులను కన్నది, ఈ మట్టిని తీసుకెళ్లి మాదేశం మట్టిలో కలుపుతా. మా దేశంలో కూడా ఇలాంటి రాజు ప్రేరణతో దేశభక్తులు జన్మిస్తారు. మహారణా ఈ దేశమే కాదు ప్రపంచమే గర్వించదగ్గా రాజు” అని అన్నాడు

అబ్రాహిం లింకన్

అబ్రాహిం లింకన్ భారతపర్యటన నిమిత్తం భారత్ కి వచ్చేది ఉండే అప్పుడు తన తల్లి భారత్ నుండి ఏమి తీసుకొనిరావాలి అని అన్నాడట. దానికి అతని తల్లి “రాజస్థాన్లోని మేవాడ్ నుండి పిడికెడు మట్టి తీసుకొనిరా , అక్కడి రాజు ఎంత విశ్వశాపాత్రుడగా ఉండేవాడు అంటే సగం భారత్ ను ఇస్తా అని ప్రలోభపెట్టిన తన రాజ్య సుఖ శాంతి ప్రయోజనాలనే కోరుకొని తన మాతృభూమినే కోరుకున్నాడు” అని చెప్పిందాట.కానీ కొన్ని కారణాల రీత్యా అతని పర్యటన రద్దు అయ్యింది. ఈ విషయాలు “బుక్ ఆఫ్ ప్రెసిడెంట్ యు ఎస్ ఏ” చదువొచ్చు.


0 comments:

Post a comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top