Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Monday, 26 November 2018

Battle of Bobbili -(24 January,1757) బొబ్బిలి యుద్ధం - యుద్ధానికి దారితీసిన సంఘటనలు - బొబ్బిలి యుద్ధం -కోటలో బీభత్సం- తాండ్రపాపారాయుడు శపధం

బొబ్బిలి ఒకప్పటి చారిత్మ్రాతక సంస్థానం. ఫ్రెంచి పాలనలో ఒక సంస్థానంగా వెలుగొందిన బొబ్బిలికి పొరుగు రాజ్యం విజయనగరంతో నిత్య శత్రుత్వం ఉండేది. ఈ శత్రుత్వం ముదిరి బొబ్బిలికీ, ఫ్రెంచి, విజయనగర సంయుక్త సైన్యానికీ మధ్య మహా యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధంలో జరిగిన మారణకాండ, బొబ్బిలి వీరుల వీరమరణాలు, బొబ్బిలి స్త్రీల ఆత్మాహుతి.. చరిత్రలో ఆ సంస్థానానికి గొప్ప వీరోచిత స్థానాన్నీ కల్పించాయి.
బొబ్బిలి కోట

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి ఈశాన్యంగా 120 కిలోమీటర్ల దూరంలో విజయనగరం జిల్లాలోని ఒక పట్టణమే బొబ్బిలి. ఒకప్పటి ఈ సంస్థానాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం అప్పట్లో కవిటి, బొబ్బిలి, రాజాం, సీతానగరం అనే నాలుగు ఠాణాలుగా విభజించారు. ఒక్కొక్క ఠాణా ఒక్కొక్క అమీను అధికారం కింద పర్యవేక్షణలో ఉండేది. 2002 గ్రామాలు (జిరాయితీ), 70 అగ్రహారాలు, 6 మొఖాసా గ్రామాలు ఈ సంస్థానంలో భాగంగా ఉండేవి. బొబ్బిలి సంస్థానాధీశులైన రావు వారు రాచకొండ పాలకులు. వీరిది రేచర్ల గోత్రం. ఇనుగంటి, చింతపట్ల, చెలికాని, తాండ్ర, దామెర ఇంటిపేర్లుగా కలిగిన వెలమ దొరలు ఈ బొబ్బిలి పాలక కుటుంబంతో నెయ్యం, వియ్యం కలిగి ఉన్నారు. వేంకటగిరి వారికి, బొబ్బిలి వారికి మూలపురుషులు ఒక్కరే.పద్మానాయకులలో పదిహేనో తరానికి చెందిన నిర్వాణ రాయప్పనాయుడు (నిర్వాణప్పనాయుడు) నేటి కర్నూలులోని వెలుగోడు రాజ్యాన్ని స్థాపించినాడు. ఈయనకే పెద్దరాయుడు అనే పేరు కూడా ఉంది. కొందరు బొబ్బిలికి మూలపురుషుడు రాజాధర్మారావు అని రాశారు. పెద్దరాయుడు మూలపురుషుడని కార్మికేలు, హంటరు మొదలైన వారు అంగీకరించినట్లు.. ఈ విషయం బొబ్బిలి వారి వంశావళిలోనూ ఉన్నట్లు ఆంధ్ర సంస్థానములు ః సాహిత్యపోషణము అనే గ్రంథంలో డా. తూమాటి దొణప్ప రాశారు. దీనిని బట్టి, పెద్దరాయుడు అనే నామాంతరం గల నిర్వాణప్పనాయుడే బొబ్బిలి వంశానికి మూలపురుషుడు అని తెలుస్తున్నది. ఇతడు వేంకటగిరి సంస్థానంలో విఖ్యాతుడైన యాచశూరు (యాచమనాయుడు)ని ఎనిమిది మంది కొడుకుల్లో పెద్దవాడు. క్రీ.శ. 1652లో మొఘల్ బాద్‌షా సేనానిగా కళింగ దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు షేర్ మహమ్మద్ ఖాన్ వచ్చాడు. ఇతడు ఆనాటి చికాకోలు నవాబు. ఈ షేర్‌ఖాన్ కళింగ సీమపై దాడి చేసినప్పుడు ఇతనికి పెదరాయుడప్ప సహాయం చేశాడు. ఇందుకు సంతోషించిన మొఘల్ బాద్‌షా షేర్‌ఖాన్ ద్వారా రాయుడప్పకు రాజాం ఎస్టేటును ప్రసాదించాడు. రాయుడప్ప ఈ ఎస్టేటులో కోట కట్టి దానికి తన ప్రభువు షేర్ ఖాన్ పేరు పెట్టుకున్నాడు. షేర్ అంటే బెబ్బులి.. అదే రానురాను బొబ్బిలి అయింది. రాయుడప్పనాయని కుమారుడు లింగప్పనాయుడు. బొబ్బిలి కోట నిర్మాత ఇతడేనని కొందరు చరిత్రకారులు చెబుతారు. తన తండ్రి కాలంలోనే లింగప్పకు ఢంకా నగారా, నౌబత్ శ్వేతచ్ఛత్రం, రాజా బిరుదం.. వంటి రాజలాంఛనాలు ఉన్నాయి.

లింగప్పనాయుడు మహా విక్రముడు. ఇతడు మొఘల్ బాద్‌షాకు, చికాకోలు నవాబుకు తలలో నాలుకలా మెలిగేవాడట. షేర్‌ఖాన్ కుమారుడు వేటకు వెళ్లిన సందర్భంలో తిరుగుబాటుదారులు ఎవరో అతణ్ని ఎత్తుకుని పోయి బంధించారు. నవాబు ఆదేశానుసారం లింగప్పనాయుడు పలాసా నుంచి శ్రీకాకుళం వరకు గల మన్యం ప్రాంతాన్నంతటినీ గాలించి రంగవాక వద్ద నవాబు కొడుకు ఆచూకీ కనిపెట్టాడు. ఇక్కడ లింగప్పనాయుడు తిరుగుబాటుదారులతో యుద్ధం చేసి వారిని చెరబట్టాడు. ఈ యుద్ధాన్నే రంగవాక యుద్ధం అంటారు. కొడుకును బంధీ నుంచి విడిపించినందుకు ప్రతిఫలంగా నవాబు షేర్‌ఖాన్ లింగప్పనాయునికి పన్నెండు గ్రామాలను బహుమతిగా ఇచ్చాడట. ఈ రంగవాక యుద్ధ విజయం గురించి, అందులో లింగప్పనాయుడు చూపిన పరాక్రమం గురించీ నవాబు బాద్‌షాకు లేఖ రాశాడు. ఇందుకు బాద్‌షా మెచ్చి నౌబత్, పల్లకీ, దివిటీలతోపాటు రంగరావు అనే బిరుదు, రాజా బహదూర్ అనే లాంఛనాలతో ఫర్మానా జారీ చేశాడట. ఇక అప్పటి నుంచే బొబ్బిలి రావు వారు.. రంగరావులై చిరకీర్తి పొందారు. లింగప్ప.. లింగప్ప రంగరాయలయ్యారు.
లింగప్ప రంగరావుకు సంతానం లేకపోవడం వల్ల వేంకటగిరి సంస్థానం వారైన మాధవరాయుని మూడో కుమారుడైన వెంగళరావుని దత్తత తీసుకున్నారు. బొబ్బిలి పాలకులలో ఈ వెంగళరావు మూడోతరం వారు. వెంగళరావు చిన్న వయసులో ఉన్నప్పుడే తనను దత్తత తీసుకున్న తండ్రి మరణించారు. దీంతో కొంతకాలం తన కన్నతండ్రి మాధవరావు, ఇంకొంత కాలం పెద్దన్న పద్మారావు, మరికొంత కాలం రెండో అన్న నారప్పరావు.. బొబ్బిలి సంస్థాన వ్యవహారాలను చక్కదిద్దారు. వెంగళరావుకు రంగపతి రంగారావు, పెద జనార్దనరావు అనే ఇద్దరు కుమారులున్నారు. జనార్దనరావు లక్కవరపు కోటను సంపాదించి పాలించారు. రంగపతి రంగారావు కుమారులు రాజా రాయుడప్ప రంగారావు. ఈయన తన తండ్రి మరణించే నాటికి చాలా చిన్నవాడు. దీంతో తన అన్న రాజా వెంకటపతి రంగారావు (లక్కవరపు కోట పాలకుడు, బాబాయి అయిన రాజా పెద జనార్దన రంగారావు కుమారుడు) కొంత కాలం ఎస్టేటు వ్యవహారాలను పర్యవేక్షించారు. అటు తర్వాత రాయుడప్ప రంగారావే రాజ్య పాలన చేశారు. వీరికి సంతానం లేకపోవడం వల్ల రాజా గోపాలకృష్ణ రంగారావు బహద్దూర్‌ని దత్తత తీసుకున్నారు. వీరు బొబ్బిలి వారి పూర్వపు దాయాదులు, పాల్తేరు వాస్తవ్యులు అయిన రావు గోపాలరావు పెద్ద కుమారుడు. గోపాలకృష్ణ రంగారావు భార్య మల్లమ దేవి. ఈమె కసింకోట వాస్తవ్యులు చెలికాని వెంకయాంబ, రామరాయల పుత్రిక. ఈమె చెల్లెలు జగ్గమాంబ. ఈవిడ పిఠాపురం పాలకులైన రావు నీలాద్రిరావు (క్రీ.శ. 1730-1776) సతీమణి.

18వ శతాబ్ది మధ్యకాలంలో బొబ్బిలి సంస్థానాధీశునిగా ఉన్న రాజా గోపాలకృష్ణ రంగారావుకు, విజయనగర రాజు పూసపాటి పెద విజయరామరాజుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉండేది. కాకతీయ సామ్రాజ్యానంతరం పద్మనాయకుల ప్రాబల్యం తెలుగునాట అంతకంతకూ పెరుగసాగింది. దీన్ని అంతకు ముందు రాజబంధువులుగా, సామంతులుగా ఉన్న కొందరు సోమ వంశ క్షత్రియులు జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో విజయవాడ దుర్గాధీశుడైన పూసపాటి మాధవవర్మ నాయకత్వంలో జల్లిపల్లి మహా సంగ్రామం జరిగింది. ఈ రణరంగంలో పరాజితులైన పూసపాటి వారు అనంతరం కళింగ సామ్రాజ్యాన్ని ఆశ్రయించారు. వారి సామంతులుగా తమ రాజధానిని విజయవాడ నుంచి విజయనగరానికి మార్చుకున్నారు. జల్లిపల్లి యుద్ధంలో వంశపు పగలు పొగలు కక్కుతూ ఐదు వందల ఏండ్ల వరకూ అగ్నిజ్వాలలను రగిల్చాయి. రావు వారు బొబ్బిలి సంస్థానాన్ని స్థాపించినా.. పూసపాటి వారు విజయనగరాన్ని ఏలుతున్నా.. పూర్వపు వైషమ్యాలను మాత్రం వీడలేదు. బొబ్బిలి వారిని ఎదుర్కొనడం విజయనగర రాజుల తరం కాలేదు. అంత బలం, బలగం వారికి లేకుండా పోయాయి. కానీ, ఎప్పటికైనా తమ పక్కలో బల్లెంలా ఉన్న బొబ్బిలి వారిని వెళ్లగొట్టి ఆ సంస్థానాన్ని ఆక్రమించుకోవాలని విజయనగరం వారికి ఆశగా ఉండేది. కానీ ఆ ఆశ వారికి ఆడియాశగానే మిగిలిపోసాగింది. ఈ నేపథ్యంలో వారెప్పుడూ అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉండేవారు. 18వ శతాబ్దంలో విజయరామరాజు కాలంలో వారికొక అవకాశం వచ్చింది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఫ్రెంచి కమాండర్ ఇన్ చీఫ్ బుస్సీ చెంత చేరాడు విజయరామారావు. బొబ్బిలి వారిని ఒంటరిగా ఎదుర్కొలేక వారిపై లేనిపోని చాడీలు చెప్పి బుస్సీని బొబ్బిలి వారిపైకి ఉసిగొల్పాడు. ఈ పర్యవసానాలే బొబ్బిలి యుద్ధానికి దారి తీశాయి. భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ ఎరుగని సంఘటనలను ఆవిష్కరించిన తీవ్ర యుద్ధం అది. అనేక జానపద గాథలకు ప్రాణం పోసిన బీభత్స కాండ ఈ యుద్ధంలో జరిగింది.
బొబ్బిలి రాజులు - విజయనగరం రాజుల మధ్య 1757 జనవరి 23న బొబ్బిలి వద్ద యుద్ధం జరిగింది. అంతకుముందు నుంచీ కూడా ఈ రెండు సంస్థానాల మధ్య వైరం ఉండేది. 1757కి కొద్దికాలం ముందు నుంచి ఉత్తరాంధ్ర సంస్థానాధీశులంతా ఫ్రెంచివారికి శిస్తు చెల్లించడం మానేశారు. ఒక్క విజయనగరం రాజులు మాత్రమే చెల్లిస్తుండేవారు. 1757లో ఫ్రెంచి జనరల్ బుస్సీ ఉత్తరాంధ్రకు వచ్చి రాజకీయం నడిపాడు. తమకు శిస్తు చెల్లించనివారిలో బలమైన రాజులైన బొబ్బిలి రాజులను ఇక్కట్లకు గురిచేయాలనుకున్నాడు. అందుకు బొబ్బిలి - విజయనగర రాజుల వైరాన్ని అవకాశంగా తీసుకున్నాడు. అప్పటి విజయనగరం రాజు విజయరామరాజు అండతో ఫ్రెంచి సైన్యాన్ని బొబ్బిలి కోటపైకి నడిపించాడు. వీరికి నిజాం సైన్యం - పెద్దాపురం రాజులు కూడా తోడయ్యారు. ఆ సమయానికి బొబ్బిలి రాజు గోపాలకృష్ణ రంగారావు బావమరిది - సైన్యాధ్యక్షుడైన తాండ్ర పాపారాయుడు రాజాం వద్ద ఉంటాడు. దీంతో బొబ్బిలిరాజా రంగారావే స్వయంగా యుద్ధంలో పాల్గొంటాడు. రాణీ మల్లమ్మదేవి వెంటనే తన సోదరుడు తాండ్ర పాపారాయుడికి కబురు పంపిస్తుంది.. కానీ ఆ వేగులను విజయనగరం రాజు సైన్యం హతమార్చడంతో పాపారాయుడికి విషయం చేరదు. ఇంతలో విజయనగరం రాజులు - ఫ్రెంచి సైన్యం - మిగతావారు కలిసి మూకుమ్మడిగా దండయాత్ర చేయడంతో బొబ్బిలి రాజు వారిని ఎదిరించలేకపోతాడు.
బొబ్బిలి యుద్ధం 1757 జనవరి 24 న తెల్లవారుతూండగానే మొదలై సాయంత్రానికి ముగిసింది.
ఫ్రెంచి ఫిరంగులు బొబ్బిలి కోటను బీటలు వార్చడానికి పెద్దగా సమయం పట్టలేదు. అయితే బొబ్బిలి వీరుల ప్రతిఘటన కారణంగా ఫ్రెంచి వారు కోటలోపలికి ప్రవేశించలేకపోయారు. 9 గంటల ప్రాంతంలో యుద్ధానికి కొంత విరామం ప్రకటించి, ఫిరంగులను ప్రయోగించాక, మళ్ళీ కొనసాగించారు. 2 గంటలకు మరో విరామం ప్రకటించేవరకూ కూడా ఫ్రెంచి సైన్యం కోటలోకి ప్రవేశించలేకపోయింది.
కోటలో బీభత్సం
ఆ సమయంలో రంగారావు తన ముఖ్య సేనానులను, అనుచరులను సమావేశపరచి, ఓటమి అనివార్యమని చెప్పి, తదుపరి కర్తవ్యం గురించి వారికి చెప్పాడు, అందరూ రంగారావు చెప్పినదానికి అంగీకరించారు. ఓటమి తరవాత, తామ స్త్రీలు, పిల్లలు శత్రువు చేతికి చిక్కి అవమానాల పాలు కాకూడదని భావించిన బొబ్బిలి వీరులు, కోటలోపల ఉన్న తమ నివాసాలకు నిప్పు పెట్టారు. మంటలకు తాళలేక బయటకు వచ్చే వారిని కత్తులతో పొడిచి చంపారు. ఆలా కోటలో ఏ ఒక్క స్త్రీ, గానీ, పిల్లవాడు గానీ బ్రతకలేదు, ఒక్క రంగారావు కుమారుడు తప్ప. కుమారుని చంపమని అతడి గురువుకు రంగారావు ఇచ్చిన ఆదేశాలను అమలు చెయ్యలేక అతడిని రక్షించాడు, ఆ బాలుడి గురువు యుద్ధంలో చిట్టచివరి బొబ్బిలి వీరుడు కూడా నేలకొరిగాక మాత్రమే ఫ్రెంచి సైన్యం కోటలోనికి ప్రవేశించగలిగింది. లోపలికి వెళ్ళిన వారు అక్కడ మంటల్లో స్త్రీలు, పిల్లలు చనిపోయిన దృశ్యం చూసి దిగ్భ్రాంతులయ్యారు. శవాల మధ్య నుండి నడుచుకుంటూ, ఆ గురువు రంగారాయుని కుమారుణ్ణి తీసుకుని వచ్చి బుస్సీ మనుష్యులకు అప్పగించారు.  వాళ్ళు ఆ కుర్రవాడిని బుస్సీ వద్దకు తీసుకువెళ్ళారు , బుస్సీ ఆ పిల్లవాడైన చిన్న రంగారావుని   బొబ్బిలి వారసునిగా గుర్తించి, తాను రంగారావుకు బొబ్బిలి స్థానంలో ప్రతిపాదించిన కొత్త ప్రాంతానికి రాజుగా ఆ కుర్రవాణ్ణి గుర్తించాడు. అనంతర కాలంలో బొబ్బిలి రాజవుతాడు. విజయనగరం సింహాసనం కూడా వారసులకు చెల్లుతుంది. కానీ... అప్పటి నుంచి రెండు రాజవంశాల మధ్య పూర్తి వైరం ఉంది.
 

తాండ్ర పాపారాయుడు రాజాం సంస్థానాధీశుడు. బొబ్బిలి వెలమ రాజు గోపాలకృష్ణ రంగారావు భార్య సుప్రసిద్ధ రాణీ మల్లమ్మ ఈయన సోదరి. విజయనగర రాజు పూసపాటి విజయరామరాజు ఫ్రెంచి జనరల్ బుస్సీతో వారితో చేతులు కలిపి బొబ్బిలి సామ్రాజ్యాన్ని ఆక్రమించేందుకు వచ్చినపుడుఆ సమయానికి బొబ్బిలి రాజు గోపాలకృష్ణ రంగారావు బావమరిది - సైన్యాధ్యక్షుడైన తాండ్ర పాపారాయుడు రాజాం వద్ద ఉంటాడు. దీంతో బొబ్బిలిరాజా రంగారావే స్వయంగా యుద్ధంలో పాల్గొంటాడు. రాణీ మల్లమ్మదేవి వెంటనే తన సోదరుడు తాండ్ర పాపారాయుడికి కబురు పంపిస్తుంది.. కానీ ఆ వేగులను విజయనగరం రాజు సైన్యం హతమార్చడంతో పాపారాయుడికి విషయం చేరదు.బొబ్బిలి కోట ఫ్రెంచి వశమైన సంగతి తెలిసిన అతడు ఆ వినాశనానికి కారణమైన వాడిపై పగతీర్చుకుంటాను అని శపథం చేసాడు..
యుద్ధం ముగిసిన తరువాత మూడవ రాత్రి, విజయరామరాజు తన శిబిరంలో నిద్రిస్తూండగా ఇద్దరు సాయుధులు అతడి శిబిరంలోకి ప్రవేశించారు. నిద్రిస్తున్న విజయరామరాజును ఒక్కసారే తమ వద్ద ఉన్న బాకులతో పొడిచి చంపారు. మొదటి పోట్ల తరువాత విజయరామరాజు అరచిన అరుపులకు అతడి అనుచరులు వచ్చి ఆ ఇద్దరిపై కాల్పులు జరిపారు. అప్పటికే వారిద్దరూ రాజును 32 పోట్లు పొడిచి చంపారు. అనుచరులు లోపలికి రాగానే వాళ్ళిద్దరూ లేచి నిలబడి "ఇదిగో చూడండి, మా పగ తీరింది అని తాండ్ర పాపారాయుడు ప్రాణాలు వదులుతాడు.
శ్రీకాకుళం జిల్లాలోని బొబ్బిలి వీరుడు తాండ్ర పాపారాయుడు నివసించిన ఇల్లు శిధిలావస్థకు చేరుకుంది.
శ్రీకాకుళం జిల్లాలోని బొబ్బిలి వీరుడు తాండ్ర పాపారాయుడు నివసించిన ఇల్లు శిధిలావస్థకు చేరుకుంది.


బొబ్బిలి యుద్ధ చిహ్నంగా జిల్లాలోని భైరవసాగరం వద్ద స్మారక స్తంభాన్ని ఏర్పాటు చేశారు.


 బొబ్బిలి కోటలోని మ్యూజియంలో యుద్ధంలో వాడిన కత్తులు, బల్లాలు, కవచాలు, తుపాకులు, పల్లకీ, సింహాసనాలు భద్రపరిచారు. ఆ రోజుల్లో దర్బార్లు నిర్వహించడం కోసం ప్రత్యేక మందిరాన్ని కూడా నిర్మించారు. ఈ దర్బార్‌మహాల్‌ కోటకు ఆకర్షణగా ఉంది. బొబ్బిలి రాజులకు చెందిన గెస్ట్‌ హౌస్‌కు గొప్ప ప్రాచుర్యం ఉంది. ఇప్పటికీ సందర్శకులు గెస్ట్‌ హౌస్‌ను చూసేందుకు వెళుతుంటారు. ఇక్కడ సినిమా షూటింగ్‌లు కూడా జరుగుతూ ఉంటాయి.
గెస్ట్‌ హౌస్‌

తరాలు మారాయి.... రాజకీయంగా బొబ్బిలి రాజులు - విజయనగరం రాజులు కూడా స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి కీలకంగా ఉన్నారు. మద్రాసు ప్రెసిడెన్సీలోనూ కీలక పాత్ర పోషించారు. రెండు వంశాల వారూ తిరుగులేని ప్రజాభిమానం పొందారు. బొబ్బిలి రాజు రావు శ్వేతాచలపతి సర్ వెంకట కృష్ణ రంగారావు మూడుసార్లు మద్రాసు ముఖ్యమంత్రిగా పనిచేశారు. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి కానిస్టున్సీ అసెంబ్లీ సభ్యుడిగా ఆ తరువాత ఏపీ అసెంబ్లీకి కూడా బొబ్బిలి రాజులు ఎన్నికయ్యారు. విజయనగరం  రాజులు కూడా రాష్ట్రం - జాతీయ స్థాయిలో ప్రజాప్రతినిధులుగా సేవలందించారు. రెండు వంశాలవారికీ బ్రిటిష్ ప్రబుత్వం నుంచి సర్ వంటి అరుదైన గౌరవాలున్నాయి. రెండువంశాలవారు చేతికి ఎముకలేని దాతలుగా ప్రజల మన్ననలు పొందారు. విదేశాల్లో చదువుకుని విద్యావంతులయ్యారు. ప్రజాప్రతినిధులు - మంత్రులుగా సేవలందిస్తున్నారు

0 comments:

Post a comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top