Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Monday, 15 October 2018

The Mind-blowing - Mass suicides of birds in Jatinga Valley (Assam)- జతింగా అనే ఈ ప్రదేశంలో పక్షులు ఆత్మా హత్యలు చేసుకుంటాయి.అది ఒక్కసారి జరిగి ఆగిపోలేదు. మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంది.


The Mind - blowing Mass suicides of birds in Jatinga Valley (Assam)- జతింగా అనే ఈ ప్రదేశంలో పక్షులు ఆత్మా హత్యలు చేసుకుంటాయి.అది ఒక్కసారి జరిగి ఆగిపోలేదు. మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంది.


Jatinga is a small village located in Assam, a state in northeastern India. The village is lush green and scenic, surrounded by serene mountains. But that’s not what it’s famous for. In fact, Jatinga is well-known for an entirely different reason – its Bird Mystery.


The Bird Mystery is a unique phenomenon that occurs at Jatinga between September and November each year. During these late monsoon months, several migratory and local birds commit mass suicide at the village. Just after sunset, between 7 and 10 pm, hundreds of birds descend from the sky, plummeting to their deaths by crashing into buildings and trees. Since birds aren’t known to be suicidal, the phenomenon has baffled villagers, visitors and scientists alike. For many years, locals believed that evil spirits living in the skies were responsible for bringing down the birds .

Of course, this isn’t true. After several scientific studies and experiments, it has been concluded that the birds are generally disoriented by the monsoon fog. So they are attracted by the village lights and fly towards them, sometimes hitting walls and trees during the descent. Some of the birds die, while others are grievously injured, becoming easy prey for the villagers to capture. These birds are often dazed and disheveled, and do not put up any resistance when villagers attack them with catapults or bamboo sticks.
Studies also show that the birds come in only from the North and land only on a well-defined strip in the village – that’s 1.5 km long and 200 meters wide. Lights placed along the southern side of the village have failed to attract any birds.

The victim birds aren’t long-distance migrators. 44 species have been identified as ‘suicidal’ and most of them come from nearby valleys and hill slopes. These include Kingfishers, Black Bitterns, Tiger Bitterns and Pond Herons, among others.

A few more interesting discoveries were made by scientists and bird watchers. It seems most of the suicidal birds lose their natural habitats due to flooding during the monsoon season. So they appear to be migrating to other places, and Jatinga is in their migratory path. But it isn’t clear why the birds fly at night, or why they get voluntarily trapped at the same place every year.
“It is not suicide, to be precise,” said Anwaruddin Choudhury, a well-known ornithologist in Assam. “But the fact remains that birds are attracted by light and fly towards any object with a light source. This phenomenon still puzzles bird specialists.”

India’s most celebrated ornithologist, the late Salim Ali, was also baffled. “The most puzzling thing to me about this phenomenon is that so many species of diurnal resident birds should be on the move when, by definition, they should be fast asleep. The problem deserves a deeper scientific study from various angles,” he wrote.

The phenomenon of ‘avian harakiri’, as the locals call it, was first observed by the Zeme Nagas, the inhabitant tribe of the region in the early 1900s. It frightened them so badly that they sold their land to Jaintias and left the place in 1905. The new inhabitants also observed the phenomenon, but interpreted it as a gift from God.
The Jaintias aren’t entirely wrong. After all, the phenomenon has captured the interest of wildlife circles and tourists, making the village of Jatinga world famous. The birds alone are responsible for a boost in tourism during the monsoon months. And they’re quite delicious; locals relish these exotic delicacies. The villagers deliberately switch on lights and lanterns to attract the birds and capture them every year.

To promote tourism, district authorities have created a festival around the bird suicide, called the Jatinga Festival. The first edition was held in 2010. If you’re interested in viewing the rare phenomenon in person, the nearest airport at the city of Guwahati is 350km away from the village. You will have to wait until next year, though!
The Mind-Boggling - Mass suicides of birds in Jatinga Valley (Assam)- జతింగా అనే ఈ ప్రదేశంలో పక్షులు ఆత్మా హత్యలు చేసుకుంటాయి.అది ఒక్కసారి జరిగి ఆగిపోలేదు. మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంది.జతింగా అనే ఈ ప్రదేశంలో పక్షులు ఆత్మా హత్యలు చేసుకుంటాయి. ఖచ్చితంగా జరుగుతోంది. అదెలా ? చూడండి. అసోం రాజధాని గౌహతికి దక్షిణాన... మూడు వందల ముప్ఫై కిలోమీటర్ల దూరంలో... హాఫ్లాంగ్ నగరానికి తొమ్మిది కిలోమీటర్ల చేరువలో ఉంది జతింగా. వర్ష రుతువులు వచ్చాయంటే చాలు ఈ పక్షులు రాత్రులలో పొగ మంచు వేళలలో ఎగురుకుంటూ వచ్చేస్తాయి. చెట్ల పై కూర్చుని వున్నా పక్షులు అత్యధిక వెలుగు ప్రసరించే లైట్ ల వేలుగులలోకి ఎగిరి అంతు చిక్కని రీతిలో కిందపడి మరణిస్తాయి. స్థానికులు వీటిని ఆపటానికి ప్రయత్నించారు. కాని ఫలితం సున్నా ! ఏమిటీ విచిత్రం జతింగా గురించి విన్నవాళ్లెవరైనా కూడా అలానే ఆలోచిస్తారు. అక్కడికి వెళ్లాలనే ఆరాటపడతారు. అక్కడి మిస్టరీ ఏమిటో తెలుసుకోవాలని ఉవ్విళ్లూరుతారు. అసలింతకీ అక్కడ ఏం జరుగుతోంది? పక్షుల ఆత్మహత్య అన్నమాటలో వాస్తవం ఎంత???

జతింగా గురించి విన్నవాళ్లెవరైనా కూడా అలానే ఆలోచిస్తారు. అక్కడికి వెళ్లాలనే ఆరాటపడతారు. అక్కడి మిస్టరీ ఏమిటో తెలుసుకోవాలని ఉవ్విళ్లూరుతారు. అసలింతకీ అక్కడ ఏం జరుగుతోంది? పక్షుల ఆత్మహత్య అన్నమాటలో వాస్తవం ఎంత???
 అసోం రాజధాని గౌహతికి దక్షిణాన... మూడు వందల ముప్ఫై కిలోమీటర్ల దూరంలో... హాఫ్లాంగ్ నగరానికి తొమ్మిది కిలోమీటర్ల చేరువలో ఉంది జతింగా. ఇక్కడి ప్రకృతి అందాలు చూపరులను మంత్ర ముగ్ధులను చేస్తాయి. పచ్చని చెట్లు, నదీజలాలు, ఎత్తయిన పర్వతాలు... ఎటు చూసినా అందమే. అయితే అన్నిటి కంటే ఎక్కువ ఆకర్షించేది మాత్రం... ఇక్కడి పక్షులు. రకరకాల పక్షి జాతులకు ఆలవాలం జతింగా. స్థానికంగా ఉండే పక్షులే కాకుండా... ఎక్కడెక్కడి నుంచో వందలాది పక్షులు వలస వచ్చి ఇక్కడ వాలతాయి. దాంతో జతింగా... పక్షుల సందర్శనా కేంద్రంగా మారింది. అయితే అలాంటి జతింగాలో కొద్ది సంవత్సరాల క్రితం ఓ దారుణం జరిగింది. అది ఒక్కసారి జరిగి ఆగిపోలేదు. మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంది.
        ఆ యేడు... అప్పుడప్పుడే అసోంను చలి దుప్పటి కప్పుతోంది. జతింగా కూడా చిన్నగా చలికి వణుకుతోంది. ఆ సాయంత్రం పూట కొందరు సరదాగా చలి మంట వేసుకున్నారు. అందరూ దాని చుట్టూ కూర్చుని చలి కాచుకుంటున్నారు. ఉన్నట్టుండి ఏదో రొద. పక్షులన్నీ కీచు కీచుమంటూ అరుస్తున్నాయి. ఆ అరుపులు అంతకంతకూ ఎక్కువవుతున్నాయి. ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు. అందరూ ఆకాశం వైపు దృష్టి సారించారు.
 వందలాది పక్షులు ఆకాశంలో ఎగురు తున్నాయి. ఓ పద్ధతిలో కాదు. ఎలా పడితే అలా. ఎటు పడితే అటు. ఇష్టం వచ్చినట్టు ఎగురుతున్నాయి. ఉన్నట్టుండి ఒక్కో పక్షీ నేలవైపు దూసుకు రావడం మొదలైంది. పక్షులు కిందికి వస్తున్నాయి. కొన్ని నిర్జీవంగా నేలమీద పడిపోతున్నాయి. కొన్ని అడ్డదిడ్డంగా ఎగురుతూ ఇళ్లకు, చెట్లకు, స్తంభాలకు గుద్దుకుంటున్నాయి. గాయాలపాలై నేలరాలి మరణిస్తున్నాయి. అందరూ అవాక్కయిపోయారు. ఏం జరుగుతోందో వారికి అర్థం కాలేదు. ఉన్నట్టుండి ఈ పక్షులకు ఏమయ్యింది? ఎందుకిలా చనిపోతున్నాయి? ఏమీ తెలియలేదు. అలా ఆ అమావాస్య రాత్రి కొన్ని వందల పక్షులు ప్రాణాలు కోల్పోయాయి. ఉదయం లేచి చూస్తే ఊరి నిండా పక్షుల మృతదేహాలే. వాటన్నిటినీ గోతులు తీసి పూడ్చి పెట్టారు.
ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఆర్నిథాలజీ విభాగానికి తెలిసింది. వెంటనే శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. పక్షుల మరణానికి కారణం ఏమిటో అన్వేషించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లకు ఏమీ అర్థం కాలేదు. దాంతో విసుగుచెంది తమ ప్రయత్నాలను విరమించుకున్నారు. అక్కడితో అంతా అయిపోయిందిలే అనుకున్నారు జతింగా గ్రామస్థులు. కానీ అయిపోలేదు. అప్పుడే మొదలైంది. మరుసటి సంవత్సరం... మళ్లీ చలికాలం... ఓ అమావాస్య రాత్రి... మరోసారి అదే ఘోరం. అదే దారుణం. పక్షులన్నీ పిచ్చి పట్టినట్టు అరిచాయి. ఇష్టం వచ్చినట్టు వాటినీ వీటినీ గుద్దుకున్నాయి. క్షణాల్లో ప్రాణాలు వదిలేశాయి. మళ్లీ అందరి మనసుల్లో వంద సందేహాలను రేకెత్తించాయి.
 అలా ప్రతి యేటా చలికాలంలో... సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఏదో ఒక అమావాస్య రాత్రి పక్షులన్నీ ప్రాణాలు విడుస్తూనే ఉన్నాయి. మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నాయి. అలా ఎందుకు జరుగుతోందో ఇప్పటికీ తెలియడం లేదు. ఎంతోమంది పక్షి శాస్త్రవేత్తలు దీనికి కారణాన్ని వెతకడంలో మునిగిపోయారు. స్వర్గీయ ఇ.పి.గీ (ప్రముఖ పర్యావరణవేత్త), ప్రముఖ ఆర్నిథాలజిస్టు సలీమ్ అలీ వంటి వారు కూడా ఈ విషయంపై పరిశోధనలు జరిపారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ ఈ మిస్టరీని ఛేదించ డానికి సుధీర్ సేన్ గుప్తా అనే శాస్త్రవేత్తను ప్రత్యేకంగా నియమించింది. వీరంతా పరిశోధనలు జరిపి, పక్షుల మరణాలకు కొన్ని కారణాలను వెల్లడించారు.
 అసోంలో వరదలు ఎప్పుడు పడితే అప్పుడు వస్తూనే ఉంటాయి. దానివల్ల పక్షులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా వలస వచ్చిన పక్షులు మరింత ఇబ్బంది పడతాయి. అవి తిరిగి వెళ్లే ప్రయత్నంలో వాతావరణంలోని అలజడిని తట్టుకోలేక అలసిపోయి, నీరసించి మరణిస్తున్నాయన్నది ఓ కారణం. చలికాలపు రాత్రుల్లో చిక్కటి చీకటి అలముకుంటుంది. దాంతో జతింగా, ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు చలి మంటలు వేస్తూ ఉంటారు.
అవి రాత్రంతా వెలుగుతూనే ఉంటాయి. ఆ వెలుతురుకు ఆకర్షితమై పక్షులు కిందికి దిగే ప్రయత్నం చేస్తున్నాయని, ఆ ప్రయత్నంలోనే వాటినీ వీటినీ గుద్దుకుని మరణిస్తున్నాయనీ మరో వాదన వినిపించారు నిపుణులు. కానీ ఇది ఏమాత్రం నమ్మశక్యంగా లేదని అందరూ అన్నారు. ఇంకా వాతావరణంలో మార్పులు, గాలి విషపూరితం కావడం అంటూ పలు రకాల వాదనలు బయటకు వచ్చాయి కానీ ఏవీ నిజమని నమ్మే ఆధారాలు దొరకలేదు.
 అయితే జతింగా వాసులు మాత్రం ఈ పక్షుల మరణాలకు కారణం కొన్ని దుష్టశక్తులు అంటున్నారు. కొన్ని రకాల దుష్టశక్తులు ఆకాశంలో సంచరిస్తూ ఉంటాయని, అవే పక్షులను ఇలా పొట్టన పెట్టుకుంటున్నాయని అంటున్నారు. దుష్టశక్తులను చల్లబరచడానికి కొన్ని రకాల పూజలు, హోమాలు కూడా చేయించారు. శాంతి కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఏం చేసినా ఫలితం లేకపోయింది. పక్షుల ఆత్మహత్యలకు ఫుల్‌స్టాప్ పెట్టడం ఎవరి వల్లా కాక పోయింది. దాంతో ఈ విషయం ఇప్పటికీ ఓ పెద్ద మిస్టరీగానే మిగిలి పోయింది.
        ఇలా పక్షులు విచిత్రంగా ప్రవర్తించడం, మూకుమ్మడిగా చనిపోవడం అన్నది కేవలం జతింగాలోనే కాదు, మరికొన్ని చోట్ల కూడా జరిగిందని అంటున్నారు శాస్త్రవేత్తలు. స్విట్జర్లాండ్, ఫిలిప్పైన్‌‌స, మలేషియా దేశాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయనడానికి ఆధారాలు చూపిస్తున్నారు. అయితే అలా జరిగితే జరిగి ఉండొచ్చు కానీ అక్కడ ఒక్కసారితో ఆగిపోయింది. కానీ జతింగాలో అలా కాదు కదా! యేటా ఇలా జరుగుతూనే ఉంది. మరణించే పక్షుల సంఖ్యలో తేడా ఉంటోంది తప్ప మరణాలు ఆగట్లేదు!

0 comments:

Post a comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top