Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Friday, 19 October 2018

Dasara Navaratrulu -దసరా పండుగ ప్రాముఖ్యత తెలుసుకుందాం-దసరా పూజలు - భారత దేశం ,ఆంధ్రప్రదేశ్ లోని నగరాలు ప్రాంతాలలో దసరా ఉత్సవాలు జరుగు విధము...

దసరా పండుగ ప్రాముఖ్యత తెలుసుకుందాం...

నవరాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రాలు అని ధార్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి. అంటే తొమ్మిది పగళ్ళు, తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యక విధానం ఉంది. ఆశ్వయుజ శుక్ల పక్ష పాడ్యమి తిథి నుండి పూర్ణ

నవరాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రాలు అని ధార్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి. అంటే తొమ్మిది పగళ్ళు, తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యక విధానం ఉంది. ఆశ్వయుజ శుక్ల పక్ష పాడ్యమి తిథి నుండి పూర్ణిమ వరకు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అమ్మవారిని పూజించడం ప్రశస్తంగా చెప్పబడింది. దీనినే 'శరన్నవరాత్రులు' లేదా 'దేవి నవరాత్రులు అంటారు.

నవ రాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం. అందుచేత సృష్టికి కారణమైన మహా మాయ తీవ్రవేగం కలిగి ఉంటుంది. పూజాదుల చేత ఆమెను ఆహ్వానించటం సులభ సాధ్యం. తొమ్మిది రోజులు నవ దుర్గలను నిష్ఠగా ఉపాసించే ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుంది. నవ రాత్రులలో రాహుకాల వేళ రాహుకాల దీపం వెలిగించాలి. రాహు ప్రతికూల ప్రభావం తగ్గి, దోష నివారణ జరుగుతుంది. దేవి అర్చనలో లలితా సహస్రనామాలు, దుర్గాసప్తశతి పారాయణ చేసే భక్తుల కోరికలు నెరవేరుతాయి. రోగ పీడలతో బాధపడే వారు, జాతకంలో అపమృత్యు దోషం ఉన్నవారు ఈ తొమ్మిది రోజులు నియమం తప్పకుండా దేవి ఆరాధన చేయడం శుభకరం.
సాధారణంగా విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది. అందుకే ఈ రోజు ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకొనేవారు ఈ రోజు ప్రారంభిస్తే విశేషంగా లాభిస్తుంది. శమీ చెట్టు యొక్క పూజ ఈ రోజు విశేషంగా లాభిస్తుంది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, ధన స్థానంలో నగదు పెట్టెల్లో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుంది.

పరమ శివునికి జగన్మాత దుర్గాదేవికి, సిద్ది ప్రదాత గణపతికి శమీ పత్రి సమర్పించే ఆచారం అనాదిగా వస్తోంది. పూర్వం జమ్మి చెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే యజ్ఞ యాగాదుల క్రతువులు నిర్వహించేవారు. ఇవాల్టికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో శమీ వృక్షంలో అగ్ని ఉంటుందనే విశ్వాసం దృడపడింది. అగ్ని వీర్యమే సువర్ణం కనుక జమ్మి బంగారం కురిపించే చెట్టుగా పూజార్హత పొందింది. ఈ రోజే శ్రీ రాముడు రావణునిపై విజయం సాధించాడు. విజయదశమి రోజునే శమీ పూజ కుడా నిర్వహిస్తారు.

శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించారని చెబుతారు. శమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపజేసేది. పంచ పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్ళే ముందు తమ ఆయుధాలని శమీ చెట్టుపై పెట్టడం జరిగింది. సామాన్యులే గాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. ఆలయాలలో అమ్మవారికి విశేష అలంకరణలు, బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఈ తొమ్మిది రోజులు ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేసి, పూజిస్తారు. అమ్మవారు లోక కళ్యాణం కోసం ఒక్కోరోజు ఒక్కో అవతారం ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు.

శమీ వృక్ష విశేషం

శ్లో|| శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ | అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ || దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈ విజయ దశమి రోజే అని తెలియచేయబడింది . 'శ్రవణా' నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి "విజయ"అనే సంకేతమున్నది .అందుకనే దీనికి 'విజయ దశమి' అను పేరు వచ్చినది. ఏ పనైనా తిధి ,వారము తారా బలము , గ్రహాబలము ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము .'చతుర్వర్గ చింతామణి 'అనే ఉద్గ్రందము ఆశ్వయుజ శుక్లదశమి నాటినక్షత్రోదయ వేలనే 'విజయం ' అని తెలిపి యున్నది . ఈ పవిత్ర సమయము సకలవాంచితార్ద సాధకమైనదని గురు వాక్యము . 'శమీ పూజ' చేసుకునే ఈ రోజు మరింత ముఖ్యమైనది . శమీ వృక్షమంటే 'జమ్మి చెట్టు'. అజ్ఞాతవాసమందున్నపాండవులు వారి వారి ఆయుధములను , వస్త్రములను శమీవృక్షముపై దాచి ఉంచారు . అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుదములను ,వస్త్రములను పొంది , శమీవృక్ష రూపమున ఉన్న 'అపరాజిత'దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు . "శ్రీ రాముడు" ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి రావణుని సంహరించి, విజయము పొందినాడు . అదేంటంటే, శ్రీరాముడు రావణాసురుని పది తలలనూ చూసి భీతిల్లి, నిద్రించిన శక్తిని (దేవిని) పూజించగా, ఆమె మేల్కొని శ్రీరాముని పూజలందుకొని, శ్రీరామునికి విజయాన్ని కల్గజేసింది. శ్రీరాముడు శక్తిని మేల్కొల్పిన సమయము ఆశ్వయుజ శుక్లపాడ్యమి. నాటినుంచి పదోరోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పకమెక్కి అయోధ్యకు బయలుదేరాడు. అలా బయల్దేరేముందు శమీ వృక్షాన్ని పూజించాడు. అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి, విజయదశమినాడు అందరూ శమీపూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మి చెట్టు) వద్ద గల అపరాజితా దేవిని పూజించి , పై శ్లోకం పఠిస్తూచెట్టుకు ప్రదక్షణలు చేయాలి . పై శ్లోకము వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలించాలి . ఇలా చేయుట వల్ల అమ్మవారి కృపతోపాటు , శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి . ‘‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ, అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ. శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా, ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ. కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా, తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే.'' పైన చెప్పిన మంత్రార్థం ఏమిటో చూద్దాం. శమీ వృక్షము అనేది పాపాన్ని శమింపచేసేది. శత్రువులను నాశనం చేస్తుందిది. ఇది నాడు అర్జునుని ధనువును కల్గి ఉండింది. శ్రీరాముడికి ప్రియాన్ని కల్గించింది. యాత్రార్థులకు సౌఖ్యాన్నిస్తుంది. పనులన్నిటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది. తెలంగాణాలో ఈ పూజ అనంతంరం పాలపిట్ట దర్శనం కోసం వేచివుంటారు. దానిని చూసిన తరువాతే ఇండ్లకు తిరిగి వస్తారు. వచ్చేటప్పుడు తమ వెంట జమ్మి ఆకును తెస్తారు. చిన్న వాళ్లు పెద్దల చేతులలో జమ్మి ఆకును ‘బంగారం' అని చెప్పి పెట్టి, వారి దీవెనలందుకోవడం ఆచారంగా పాటిస్తారు. బంగారం లక్ష్మిదేవికి ప్రతీక. హైదరాబాద్ నగరంలో జమ్మికొమ్మ, ఆరె కొమ్మలకు ఉన్న ఆకులను బంగారు, వెండిగా పంచుతూ, శుభాకాంక్షలను తెలుపుకుంటారు. దీనినే ‘సోనా దేనా' కార్యక్షికమంగా పిలుస్తారు. ప్రధానంగా జమ్మి, ఆరె ఆకులను పరస్పరం పంచుకొని, కౌగిలించుకోవడం ఒక ఆత్మీయ స్పర్షగా ఈ పండగ సందర్భంగా కొనసాగుతున్న ఆచారం. దీనిని జాతి, కుల, మత, లింగ వివక్షలకు అతీతంగా మనసుల్ని, హృదయాల్ని కలిపే సామాజికఐక్యతారాగానికిసామాజిక ఐక్య తారాగానికి ప్రతీకగా భావిస్తారు.
ఆయుధ పూజనాడు అందరూ ఆయుధాలకు పూజలు చేస్తారు.అమ్మవారి చేతిలో ఉండే ఆయుధాలు ఏ గుణాలకు సంకేతమో తెలుసా? వాటిని పూజించడం వల్ల ఏ దుర్గుణాలను రూపుమాపుకోవచ్చో తెలుసా? మనలోని సద్గుణమే ఆయుధం. ఆ సద్గుణానికి పదును పెట్టుకోవలసిన తరుణమే దసరా.అమ్మవారికి చేసే పూజల్లో ఆయుధపూజని కూడా చేయడం సంప్రదాయం. ఆయుధమనగానే ఎవరినో వధించడానికో లేక మనని రక్షించుకోవడానికో సిద్ధంగా ఉంచుకున్న ఓ పరికరం అని మనసులో ఆలోచన వస్తుంది. కాని అమ్మ ధరించిన ఆయుధాల ఉద్దేశ్యం వేరు. వారి అంతరార్థం వేరు. అమ్మవారి చేతిలో కనిపించే ప్రతి ఆయుధానికీ మనం చేయాల్సిన పూజే ఆయుధపూజ. క్రమంగా చూద్దాం.

పాశ పూజ

‘ధృతపాశాంకుశ పుష్ప బాణ చాపామ్‌’ అని కనిపిస్తుంది అమ్మవారి స్తోత్రంలో. ఓ చేతిలో పాశాన్ని, మరో చేతిలో అంకుశాన్ని, ఇంకొక చేతిలో పుష్పాలు ఐదింటినీ కలిపి బాణంగా చేసుకుని, మరో చేతిలో వింటిని ధరించి ఉంటుందని దీని భావం. ముందుగా పాశానికి అర్థాన్ని చెప్పుకుందాం. పాశం అంటే తాడు అని అర్థం. తాడుతో కట్టబడేది పశువు. నాలోని పశుత్వాన్ని తొలగించు లేదా నాలో పశుత్వం అసలు ప్రవేశించకుండా రక్షిస్తూ ఉండు అని ప్రార్థించడమే పాశానికి పూజ చేయడంలోని అంతరార్థం.ఉదాహరణకి ఓ అరటిగెల ఎక్కడైనా బాగా కనిపిస్తూంటే మనమైతే ఆ అంగడికి వెళ్తాం. కొంటాం. అదే మరి పశువైతే వెళ్తూనే నోటితో ఆ గెలని పట్టుకుంటుంది. ఆ యజమాని కర్రదెబ్బల్ని తిని వెనక్కి వెళ్లిపోతుంది. అభిమానం లేకుండా ప్రవర్తించడమే పశుత్వం. జరిగిన అవమానాన్ని మళ్లీ జరిగేలా బుద్ధిహీనతతో చేసుకోవడమే పశుత్వం. ఒక్క తప్పుని చేసి అవమానాన్ని పొంది, మళ్లీ అదే తప్పుని చేసి మరో అవమానానికి సిద్ధపడే ఎందరినో చూస్తుంటాం. అదే పశుత్వం. కొన్ని తెలిసిన పశుత్వాలూ, కొన్ని మనకి తెలియకుండా చేసే పశుత్వాలూ మనలో దాగుంటాయి. అందుకని ఆ పశుత్వాన్ని నా నుండి తొలగించవలసిందని ప్రార్థిస్తూ చేసే పాశానికి సంబంధించిన పూజ పాశ ఆయుధపూజ. అమ్మ పాశంతో మనని కట్టేసి తన వాళ్లలో ఒకరినిగా మనని చేసుకుంటుంది కాబట్టి పాశమనేది మన రక్షణకి ఉపయోగించే రక్షక వస్తువే. శ్రీకృష్ణుణ్ణి యశోద రోటికి కట్టేస్తే, ఆ రోటిని రెండు చెట్ల మధ్యగా ఈడ్చుకు వెళ్లిన బాలకృష్ణుడు ఇద్దరు రాక్షసులకి రాక్షసత్వం నుండి విముక్తి కలిగించాడు కదా! ఆ పాశం ఈ ఇద్దరి రక్షక వస్తువు కాలేదూ! అదే మరి దుర్యోధనుడేం చేశాడు? తమ దగ్గరికి కృష్ణుడు రాయబారిగా వచ్చి విశ్వరూపాన్ని చూపిస్తే, ఆ రూపం ఎంత ఎత్తుందో అంత తాటితో అతణ్ణి కట్టేద్దామని భావించి తాళ్లని తెప్పించాడు కదా! ఎంతటి పశుత్వం దుర్యోధనునిది! అన్ని తాళ్ల సమూహాన్ని తెచ్చినా కట్టుబడని శ్రీకృష్ణుడు యశోదమ్మ మూరెడు తాటికి బంధిపబడ్డాడా? లేదా? కాబట్టి ‘అమ్మా! నీ అనురాగ పాశంతో నన్ను కట్టేసి నీ ఆయుధాన్ని నా రక్షణకి ఉపయోగించవలసింద’ని ప్రార్థిస్తూ పాశానికి చేసే పూజ పాశ ఆయుధపూజ.

అంకుశ పూజ

అంకుశమంటే చివర కూసుగా వంకీ తిరగబడి ఉండే ఒక పరికరం. ఆ అంకుశం ఎప్పుడూ ఏ మృగాన్ని, జంతువుని చంపదు – చంపలేదు. అయితే బాగా మందమైన చర్మం కలదీ, మరింత గట్టిగా  ఉండేదీ అయిన ఏనుగు కుంభస్థలం మీద గుచ్చి, దాన్ని అదుపు చేసేందుకు వాడబడే వస్తువు ఇది. లౌకికంగా ఇది దీనర్థం. అంతరార్థం అది కాదు. ఏనుగు నల్లగా ఉంటుంది. అది తమోగుణానికి (గర్వం, దర్పం, అహంకారం, మదం... అన్నీ కలిపిన గుణం) సంకేతం. వ్యక్తుల్లో అలాంటి లక్షణాలున్న ఎవరైనా ఏనుగుతో సమానం. ‘అమ్మా! నాలో ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే నా ఏనుగుని (నా లోపలి తమోగుణాన్ని) నీ చేతితో అంకుశంతో ఒక్కసారి గట్టిగా పొడిచి నన్ను సరైన తోవలో, సరైన బుద్ధితో నడిచేలా రక్షించవలసిందని ఆ అంకుశానికి చేయాల్సిన పూజ అంకుశ పూజ. రావణుడు తమోగుణానికి ప్రతీక. సీతమ్మ ఎదురుగా నిలబడి ‘మమ శయాన మారోహా’ (నా పక్కమీదికి రా) అని అన్నంతటి అహంకార స్థితి నిండిన శరీరం రావణుడిది. అమ్మ అంది– నీకు బుద్ధి లేదా? లేక నీకు మంచిచెడుల తేడాని చెప్పేవారూ చెప్పగలవారూ లంకలో లేరా? – అని. అదిగో అవే మాటల్ని మనమూ మననం చేసుకుంటూ – అమ్మా! నాలో ఏదైనా వినని లక్షణముంటే వినిపించుకునేతనాన్ని కలిగించవలసిందని పూజ చేయడమే అంకుశపూజలోని పరమార్థం. అలా చేస్తే ఆ అంకుశమే మనకి రక్షక వస్తువుగా మన పాలిట నిలిచి ఉంటుంది ఎప్పటికీ.

పుష్పబాణాలు

అమ్మ చేతిలో ఉండే 5 బాణాలూ ‘పృథివి అప్‌ తేజస్‌ వాయు ఆకాశాల’కి సంకేతం. ‘అమ్మా! పృథివి ద్వారా వచ్చే భూకంపానికి నేనూ నా కుటుంబం లోను కాకుండా, అప్‌ (నీరు) ద్వారా వచ్చే వరదలూ తద్వారా కలిగే నిరాశ్రయ విధానానికి నేనూ నా కుటుంబమూ గురికాకుండా ఉండేలా, ఉష్ణ రోగాలు రాకుండా తేజస్సు ద్వారా, వాతరోగాలు తాకకుండా ఉండేలా వాయువు ద్వారా, ఏ పిడుగులూ రాహు కేతు గ్రహాల అననుకూల పరివర్తనల ద్వారా కష్టం కలగకుండా ఆకాశం ద్వారా మమ్మల్ని రక్షిస్తూనే ఉండవలసిందని ప్రార్థించడం పంచ పుష్పబాణ పూజలోని అంతరార్థం. ఈ పుష్పబాణ పూజ మరోవిధంగా మన శరీరంలో ఉండే ఆరు దుర్గుణాలూ అయిన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని తొలగించవలసిందని కూడా ప్రార్థించడానికి సరిపోతుంది.

చాపం

చాపమంటే విల్లు. అమ్మ చేతిలోని వింటికి పూజ చేయడం మరింత గొప్ప ఆయుధపూజ. నమక మంత్రంలోని మొదటి మంత్రం శంకరుణ్ని స్తుతిస్తూ – ‘శంకరా! నీ కోపానికి నమస్కారం (రుద్ర మన్యవే) – ఆ కోపంతో అమ్ములపొదిలో నుండి తీసిన బాణానికి నమస్కారం (ఉతోత ఇషవే నమః) – ఆ బాణాన్ని వింటిలో పెట్టి బాణాన్ని విడవడానికి సిద్ధంగా ఉన్నావే! ఆ వింటికి నమస్కారం (నమస్తే అస్తు ధన్వనే) – ఆ వింటినీ దానిలో ఎక్కుపెట్టిన నారినీ ఆ వింటినారిలో బిగించేలా చేసిన నీ రెండు బాహువులనీ ప్రార్థిస్తూ నాకు ఏ తీరు అపకారాన్ని సకుటుంబంగా కలిగించకుండా ఉండవలసింది (బాహుభ్యాముత తే నమః)’ – అంటూ చేసే ఈ నమస్కారాలన్నీ ఆయుధ పూజే. అలా అమ్మని ప్రార్థిస్తే అమ్మ తన చేతిలోని వింటితో మన శత్రువులని భయపెడుతూ తప్పక రక్షనిస్తుంది.

చక్రం

శ్రీమహావిష్ణువు చేతిలో ఉండే సుదర్శన చక్రాన్ని అమ్మ తన దుర్గారూపంలో ధరిస్తుంది. చక్రమనగానే అందరి తలలనీ నరికేసేదే అని మన అభిప్రాయం. ఏ శిశుపాలుడు వంటివాళ్లని సంహరించవలసి వచ్చినా ముందుగా హెచ్చరించి మాత్రమే చంపాడు శ్రీహరి. చక్రం అకస్మాత్తుగా వధించలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. శ్రీహరి తన చేతి చక్రాన్ని – నిత్య భక్తుడైన  అంబరీషునికి ఇస్తూ ఏ కష్టం వచ్చినా ఇది నీకు రక్షక చక్రంగా ఉపయోగపడుతుందని ఇచ్చాడు. (ప్రదత్తో నిత్య రక్షయామ్‌). అదుగో ఆ చక్రాన్ని గనుక మనం పూజిస్తే అది మనని వధించదు సరికదా మన మనసుకి గాయం చేయబోయేవారిని  తన అంచుల కాంతులతో హెచ్చరిస్తుంది – జాగ్రత్త అని. ఇదే తీరుగా అమ్మ రాక్షస వధ చేయడానికి విఘ్నేశ్వరుని నుండి అంకుశాన్నీ, కుమారస్వామి నుండి భల్లాన్నీ (బల్లెం), శంకరుని నుండి త్రిశూలాన్నీ, శ్రీహరి నుండి చక్రాన్నీ... ఇలా ఎవరెవరు తమ తపశ్శక్తిని ఏయే ఆయుధాల్లో దాచి ఉంచారో ఆయా తపశ్శక్తి దాగిన ఆయుధాలన్నింటినీ తన చేతుల్లో ఉంచుకుని మరీ – సిద్ధపడింది తప్ప, తనకున్న ఆయుధాలు సరిపోతాయని భావించనే లేదు. అలా తీసుకోవడం ఆమె అసమర్థతకి నిదర్శనం కాదు.శత్రువనేవాడు లేకుండా ప్రవర్తించడం – తన ప్రవర్తనని సరిదిద్దుకోవడం ఉత్తమం. మనం అలా ప్రవర్తించినా, నిష్కారణంగా వశిష్ఠుని మీదికి దండెత్తిన విశ్వామిత్రునిలా కొందరు మన మీద శత్రుత్వంలో ఉండి తీరుతారు కాబట్టి వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండడం అత్యవసరం. అందుకని అమ్మ అంటుంది గదా – శత్రుత్వంరాకుండా చూసుకో! ఒకవేళ శత్రువు మనతో పోరాడేంత స్థాయిలో గనుక వస్తే – తగిన జవాబు చెప్పడానికి ఇందరి సహకారంతో పోరాడి గెలుపొందడం అత్యుత్తమం అని.
అందుకని ఇన్ని ఆయుధాలకీ రక్షణని కోరుతూ ప్రార్థించడమే ఆయుధపూజలోని అంతరార్థం. తన్నోదేవీ ప్రచోదయాత్‌.
శత్రువనేవాడు లేకుండా ప్రవర్తించడం – తన ప్రవర్తనని సరిదిద్దుకోవడం ఉత్తమం. మనం అలా ప్రవర్తించినా, నిష్కారణంగా వశిష్ఠుని మీదికి దండెత్తిన విశ్వామిత్రునిలా కొందరు మన మీద శత్రుత్వంలో ఉండి తీరతారు కాబట్టి వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండడం అత్యవసరం. అందుకని అమ్మ అంటుంది గదా – శత్రుత్వం రాకుండా చూసుకో! ఒకవేళ శత్రువు మనతో పోరాడేంత స్థాయిలో వస్తే – తగిన జవాబు చెప్పడానికి ఇందరి సహకారంతో పోరాడి గెలుపొందడం అత్యుత్తమం అని.

దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటుంది.

దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణాలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుంది.

దసరా ఉత్సవాలను దేశమంతా వివిధ రూపాలలో జరపుకుంటారు. మైసూరు, కలకత్తా, ఒడిషా, తెలంగాణా, విజయవాడ, ఖానాపూర్లలో ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఇవే కాక ఊరి ఊరికీ కొన్ని ప్రత్యేక ఉత్సవాలు జరుపుకుంటారు. ఖానాపూర్ మరియు ఒంగోలులో కళారాలు రూపంలో అమ్మవారిని ఆరాధించి చివరి రోజున ఉత్సవంగా అమ్మవారు వెళ్ళి రాక్షససంహారం చేసే ఘట్టాన్ని ప్రదర్శిస్తారు.

మైసూరు దసరా ఉత్సవాలలో ఏనుగుల ఊరేగింపు

మైసూరు మహారాజు పాలన కాలం నుండి వైభవంగా దసరా ఉత్సవాలను జరపటం ఆనవాయితీ. మహారాజు వారి కులదైవం అయిన చాముండేశ్వరీ దేవిని ఆరాధించి ఏనుగులపై ఊరేగింపుగా రావడం అలవాటు. ఆ సమయంలో వీధులలో కోలాహలంగా చేసే అనేక కళా ప్రదర్శనలు చూడటానికి దేశం నలుమూలల నుండి ప్రజలు వస్తుంటారు. ఆసమయంలో రాజభవనం ప్రత్యేకంగా అలంకరించ బడుతుంది. ఆ సమయంలో ఫ్లోటింగ్ కారు ఉత్సవాలు ప్రాధాన్యత సంతరించుకున్నవే. ఏనుగుల అలంకరణా ప్రత్యేకమే. రాజుగారి ఆయుధ పూజ వైభవంగా జరుగుతుంది.

కలకత్తా

దసరాను దుర్గాపూజ పర్వదినంగా బెంగాలీయులు జరుపుకుంటారు. సప్తమి, అష్టమి, నవమి తిధులలో దుర్గామాతకు పూజ చేసి తొమ్మిదవ రోజున కాళికామాతను దర్శిస్తారు. ఆ రోజు కాళీమాతను లక్షలమందిని దర్శించడం విశేషం. తొమ్మిది రోజులూ రాష్ట్రమంతా హరికథలు, పురాణ శ్రవణం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజున దుర్గామాతను హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు. ఆరోజున నదీతీరంలో కుమారీ పూజలు చేయడం బెంగాలీల ప్రత్యేకత.

ఒడిశా

ఒడిషా పౌరులు దసరా సమయంలో దుర్గామాతను ఆరాధిస్తారు. కటక్ కళాకారులు రూపొందించిన దుర్గామాత విగ్రహాలను వీధివీధిలో ప్రతిష్ఠిస్తారు. స్త్రీలు మానికలో వడ్లు నింపి లక్ష్మీ దేవిగా భావించి పూజలు నిర్వహిస్తారు.మార్గశిర మాసంలో కూడా ఈ చిహ్నంతో వారు లక్ష్మీదేవి ఆరాధించడం అలవాటు. దీనిని వారు మాన బాన అంటారు. ఒడిషా ప్రజలు విజయదశమి నాడు విజయదుర్గను ఆరాధిస్తే అన్నిటా విజయం సిద్ధిస్తుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. చివరి రోజున 15 అడుగుల రావణ విగ్రహాన్ని బాణసంచాతో తయారు చేసి మదానంలో కాలుస్తారు. ఈ రావణ కాశ్హ్టం చూడటానికి ప్రజల తండోప తండాలుగా వస్తారు.

తెలంగాణా బతుకమ్మ

తెలంగాణా ప్రజలు దసరాసమయంలో బతుకమ్మ ఉత్సవాలు చేస్తారు. బతుకమ్మ పండుగ' తెలంగాణా రాష్ట్రములో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. నవరాత్రి మొదట రోజున బతుకమ్మను పూలతో అలంకరించి తొమ్మిది రోజులు ఒక చోట స్త్రీలంతా చేరి ఆటపాటలు పాడి ఆనందిస్తారు. చివరి రోజున బతుకమ్మను నిమజ్జనం చేసిన తరువాత పండుగ చేసుకుంటారు. ఇది తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుంటారు. ఈ వారం రోజులలో వీరు రోజూ చిన్న బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం దాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు.

అయితే చివరి రోజు అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోనికి పోయి తంగేడి, గునుక పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ తరువాత ఇంటిళ్ళపాదీ కూర్చుని ఆ గునగ పూలు, తంగేడు, కలువ, మరియు ఇతర రకాల పూలతో బతుకమ్మని తయారు చేస్తారు. ఇందులో గునగ పూలు మరియు తంగెడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి. ఈ పూలని జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెం (తాంబలం) లో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగేడు ఆకులు, పూలు పళ్లెంలో లేదా తాంబోలంలో పేర్చుతారు, ఆపై తంగేడు పూలతో కట్టలుగా కట్టిన కట్టలను చివరలు కోసి రంగులతో అద్దిన వాటిని పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరి మాతను పెట్టి చుట్టు దీపాలతో అలంకరిస్తారు. దీనిని గృహంలో దైవ స్థానంలో అమర్చి పూజిస్తారు. ఇలా తయారు చేసిన బతకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ ఆడవారు పాడుతారు. ఆడవారు వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను దరించి కొత్త బట్టలు కట్టుకుంటారు. ఇలా చాలా సేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఆపై ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం మరియు సత్తుపిండి ( మొక్కజొన్నలు, లేదా వేరుశనగ లేదా పెసర విత్తనాలను దోరగ వేయించి వాటిని పిండి చేసి వాటితో చక్కెర పిండి లేదా బెల్లం మరియు నెయ్యి తగినంత కలిపి తయారు చేస్తారు) లను ఇచ్చి పుచ్చుకొని తింటారు

కరీంనగర్

దసరా సమయంలో కరీం నగర వాసులు అకాడా గా నిర్వహిస్తారు.ఇక్కడ గనిలో పనిచేసే కార్మీకులు ఈ పండుగను గ్రామీణవాతావరణం ఉట్టిపడేలా చేసుకుంటారు. క్షత్రియుల ఆయుధ విన్యాసాలు పోలిన విన్యాసాలను ప్రదర్శించడం ఇక్కడి అలవాటు. ఇక్కడి నెహ్రూ స్టేడియంలో నరకాసుర వధ ఘట్టాన్ని ప్రదర్శించడంతో పండుగ మొదలౌతుంది. హనుమాన్ అకాడా, దుర్గా అకాడా' ల లాంటి దేవతల రూపాలతో ఇనుప బెల్టు, త్రిశూలం మొదలైన ఆయుధాలను పట్టుకొని విన్యాసాలు చేస్తూ ఊరంతా తిరుగుతూ ప్రజలను ఆనందింప చేస్తారు. కర్రసాము ఈ ప్రదర్శనలో భాగమే. జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పుకుంటారు.కనుల విందుగ దుర్గమాత (వమస్థలిపురము) ]]

గుజరాత్

దసరా సమయంలో గుజరాతీయులు పార్వతిదేవి ఆరాధన చేస్తారు. ఇంటింటా శక్తి పూజ చేయడం గుజరాతీయుల ఆచారం.ఇంటి గోడల మీద శ్రీ చక్రాన్ని, త్రిశూలాన్ని, శక్తి ఆయుధాన్ని పసుపుతో చిత్రించి పూజిస్తారు.ఆ గుర్తుల సమీపంలో పొలం నుండి తీసుకు వచ్చిన మట్టితో వేదిక తయారు చేసి దానిపై బార్లీ, గోధుమ విత్తనాలను చల్లి దానిపై మట్టి ఉండ పెట్టి దానిని నీటితో నింపి పోకచెక్క వెండి లేక రాగి నాణెం వేస్తారు. ఆ మట్టికుండను వారు దేవిగా భావిస్తారు. దానిని వారు కుంభీ ప్రతిష్ట అంటారు. అష్టమి రోజున యజ్ఞం నిర్వహించి దశమి రోజున నిమజ్జనం చేస్తారు. అమ్మవారి వద్ద పెట్టిన ప్రమిదను గుడిలో సమర్పిసారు. తరువాత పౌర్ణమి వరకూ జరిగే గర్భా అనే ఉత్సవాలలో స్త్రీలు ఉత్సాహంగా పాల్గొటారు.

విజయవాడ భేతాళ నృత్యం

విజయవాడలోని ప్రధాన ఆలయాలలో బెజవాడ కనక దుర్గమ్మ ఒకటి. ఇది ఆంధ్ర రాష్ట్రం అంతటా ప్రాముఖ్యం ఉన్న ఆలయం. నవరాత్రి తొమ్మిది రోజులు వైభవంగా ఉత్సవాలు నిర్వహించి విజయదశమి నాటికి కృష్ణా నదిలో తెప్పోత్సవం చేస్తారు. ఈ ఉత్సవంలో అమ్మవారు తెప్పపై మూడు సార్లు ఊరేగి భక్తులకు దర్శనమిస్తుంది. తర్వాత విజయవాడ నగర పోలీసులు అమ్మవారిని పాతబస్తిలో ఉరేగిస్తారు. 1వ టవున్ పోలీసు స్టేషను వద్దకు రావడముతో ఉరేగింపు ముగిస్తుంది. దసరా సందర్భంలో చివరి రోజు ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. ఈ ప్రభలలో భేతాళ నృత్యం ప్రదర్శిస్తారు. ఈ భేతాళ నృత్య ప్రదర్శన విజయవాడ ప్రత్యేకత.

వీరవాసరం ఏనుగుల సంరంభం

పశ్చిమ గోదావరి జిల్లా వీర వాసరంలో దసరా సమయంలో సుమారు వంద సంవత్సరాల నుండి ఏనుగు సంబరాలు జపడం అలవాటు. దసరా మొదటి రోజున ఏనుగుగుడి లో భేతాళుడిని నిలబెడతారు. భేతాళుడంటే వయసైన బ్రహ్మచారి. తొమ్మిది రోజులు భేతాళుడు అమ్మవారి పూజలు నిర్వహిస్తాడు. ఈ తొమ్మిది రోజులు భేతాళుడు నియమ నిష్టలను ఆచరిస్తాడు. మొదటి రోజునుండి నూరు సంవత్సరాల క్రితం వెదురు కర్రలు గడ్డి కొబ్బరిపీచుతో చేసిన ఏనుగును నూతనంగా అంబారీతో అలంకరిస్తారు. తెల్లని వస్త్రానికి రంగుల లతలు, కాగితంపూలు, తగరంతో అలంకరణలు చేసి అంబారీ చేస్తారు. అలాగే నూతనంగా చిన్న ఏనుగును తయారు చేసి అలంకరించి చివరి రోజున బోయీలచే ఊరేగింపుగా తీసుకు వెళతారు.ఈ ఊరేగింపులో పిల్లలను ఏనుగు కింద నుండి దాటిస్తారు. అలాదాటిస్తే పిల్లలు రోగ విముక్తులై ఆరోగ్యంగా ఉంటారని విశ్వసిస్తారు. రాత్రి ఆరు గంటలకు ప్రారంభించి తెల్లవారి ఆరుగంటలవరకూ సాగి తూపు చెరువు కట్టకు చేరుకొని ఈ ఉత్సవాన్ని ముగిస్తారు.

విజయనగరం సిరిమాను

విజయనగరంలో దసరా సమయంలో గజపతుల ఆడపడుచైన పైడి తల్లి'కి పూజలు చేస్తారు'. ఈ దేవికి దసరా వెళ్ళిన తరువాత మొదటి మంగళవారం నాడు జాతర జరుపుతారు. ఈ ఉత్సవంలో భాగంగా పూజారిని సిరిమాను ఎక్కించి అమ్మవారి గుడి ఉన్న మూడు లాంతర్ల సెంటర్ నుండి కోట వరకు మూడు సార్లు ఊరేగిస్తారు. ఈ ఉత్సవం చూసేందుకు చుట్టు పక్కల పల్లేలనుండి ప్రజలు ఎడ్లబండిలో మూడురోజుల ముందుగా వచ్చి రోడ్డు ప్రక్కన గుడారాలు వేసుకుని ఉత్సవం చూసి ఆనందిస్తారు. అడవిలో నుండి ఒక నిటారైన చెట్టును నరికి తీసుకు వచ్చీ మొదలు భాగాన్ని లాగుడు బండికి కట్టి చివరి భాగంలో ఊయలకట్టి అందులో పూజారిని కూర్చో పెట్టి ఊరేగింపుగా కోటకు తీసుకు వస్తారు . అక్కడ గజపతులు అమ్మవారికి లాంఛనాలు ఇచ్చి పూజిస్తారు.

వీపన గండ్లలో రాళ్ళయుద్దం

కర్నూలు జిల్లాలోని వీపనగండ్లలో దసరాసమయంలో రాళ్ళయుద్ధం చేసుకుంటారు. దసరా రోజున సాయం వేళలో ప్రజలు కాలువ ఒడ్డున కాలువకు అటూఇటూ చేర కంకర రాళ్ళను గుట్టగా పోసుకుని ఒకవైపు రామసేన ఒకవైపు రావణ సేనగా ఊహించి రాళ్ళను విసురుతూ యుద్ధం చేసుకుంటారు. ఇది అధర్మంపై ధర్మం యుద్దంచే వుజయం చేసినట్లు భావిస్తారు. దీనిని వాళ్ళు వాళ్ళు రామ రావణ యుద్ధంగా అభివర్ణిస్తారు. ఎంత ఎక్కువగా దెబ్బలు జరిగితే అంత ఎక్కుగా ఉత్సవం జరిగినట్లు విశ్వశిస్తారు. ఇదే సమయంలో ఇదే జిల్లాలోని దేవరగట్టు గ్రామంలో కూడా బన్ని ఉత్సవం జరుగుతుంది. మాలమల్లేశ్వరస్వామి విగ్రహాన్ని తమ గ్రామానికి తీసుకువెళ్లేందుకు దాదాపు 18 గ్రామాల ప్రజలు, దేవరగట్టు నెలవై ఉన్న రెండుగ్రామాల పరిధిలోని ప్రజలతో కొట్లాడతారు. స్వామిని తీసుకువెళ్లేందుకు ఓ వర్గం, తమ గ్రామంలోనే ఉండేలా చూసుకునేందుకు మరో వర్గం ఎదురుపడి ఇనుప తొడుగులు తొడిగిన వెదురుకర్రలతో విపరీతంగా కొట్టుకుంటారు. ఎంత గాయాలైనా పట్టించుకోరు. అనాదిగా జరుగుతున్న ఈ రక్తపాతానికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు, ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా సఫలం కాలేకపోతున్నారు.

సంగారెడ్డిలో రావణ దహనం

మెదక్ జిల్లా సంగారెడ్డిలో దసరా సందర్భంలో తొమ్మిది రోజులు దేవిని ఆరాధించి చివరి రోజున రావణ కుంభకర్ణ బొమ్మలను దగ్ధం చేస్తారు. ఈ బొమ్మలను వారు బాణసంచాతో తయారు చేసి అగ్ని బాణాలతో దగ్ధం చేస్తారు.రామ లక్ష్మణ వేషదారులు బాణాలను సంధిస్తారు. ఈ ఉత్సవం మునిసిపల్ గ్రవుండులో నిర్వహిస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుండి వేలకొలది భకులు హాజరై ఉత్సవానికి వన్నె తీసుకు వస్తారు.

బందరు శక్తి పటాలు

కృష్ణా జిల్లాలో ఉన్న రేవుపట్టణం బందరులో దసరా సందర్భంలో శక్తి పటాల ఊరేగింపు నిర్వహిస్తారు. దాదాపు నూరు సంవత్సరాల క్రితం కలకత్తా నుండి బొందిలీలకు చెందిన సైనికుడు మచిలీపట్నం ఈడేపల్లిలో కాళీమాత ప్రతిష్ట చేసాడు.అప్పటి నుండి దసరా సమయంలో శక్తి ఆలయం నుండి శక్తి పటాన్ని పట్టుకుని పురవీధులలో ఊరేగింపుగా తీకుసుకు రావడం ప్రారంభం అయింది.ఊరేగింపు సమయంలో పట్టాన్ని విపుకు కట్టుకుని ముఖానికి అమ్మవారి భయంకర ముఖాకృతిని తగిలించుకుని నాట్యమాడుతూ వీధులలో తిరుగుతారు. తొమ్మిది రోజులు ప్రభలలో ఇలా ఆన్ని వీధులలోని ఇంటింటికీ తిరుగుతారు. వారి వారి ఇంటికి వచ్చినపుడు వారి మొక్కుబడులు తీర్చుకుంటారు. పటం ధరించిన వారు డప్పు శబ్ధానికి అనుగుణంగా వీరనృత్యం చేస్తూ భయంకరాకృతిలో ఉన్న రాక్షసుని సంహరిస్తున్నట్లు అభినయిస్తారు. చివరిరోజున మచిలీ పట్నం కోనేరు సెంటరుకు తీసుకు వచ్చి జమ్మి కొట్టడంతో ఉత్సవం ముగుస్తుంది.

ఒంగోలు కళారాలు

దసరా సమయంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉత్సవాలలో భాగంగా కళారాలను ఊరేగిస్తారు.ఈ కళారాలను దసరా సమయానికి చక్కగా అలంకరించి సిద్ధం చేస్తారు. కళారాలంటే బృహత్తర ముఖాకృతి. ఇక్కడ కాళికాదేవికి, మహిషాసుర మర్ధినికి, నరసింహ స్వామికి కళారాలున్నాయి. వీటికి ఈ తొమ్మిది రోజులు విశేషంగా పూజలు చేసి తొమ్మిది పది రోజులలో ఒక్కోరోజు కొన్ని కళారాలకు ఊరేగింపు చేస్తారు.కళారాన్ని బండి మీద ఎక్కించి ఆటూఇటూ పట్టుకోవడానికి అనివిగా కొయ్యలను అమర్చి వాటి సాయంతో కళారాన్ని అటూ ఇటూ ఊపుతూ డప్పుల మోతలతో ఊరేగింపు నిర్వహిస్తారు. కళారం వెనుక భాగంలో ఒకరు అమ్మవారి ప్రతి రూపంగా చీదను ధరించి వీరనృత్యం చేస్తూ కళారాన్ని ఊగ్రంగా ఊపుతూ ఉంటాడు. ఉగ్రరూపంలో ఉన్న కళారం భీతిని కలిగిస్తుందని గర్భిణీ స్త్రీలకు ఈ ఉత్సవ దర్శనం మంచిది కాదని పెద్దలు సూచిస్తారు. ఇలా కళారాన్ని ఊరి నడిమధ్యకు తీసుకు వచ్చి అక్కడ రాక్షస సంహారం ఘట్టాన్ని ప్రదర్శిస్తారు

0 comments:

Post a comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top