Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Saturday, 28 July 2018

APGLI పాలసీదారులకు మరియు DDO లకు సంచాలకులు సూచనలు

APGLI పాలసీదారులకు మరియు DDO లకు సంచాలకులు సూచనలు

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బీమా నిర్దేశాలయము, అమరావతి, ఇబ్రహీంపట్నం*
*👉 పాలసీదారులకు మరియు డి.డి.ఓ.లకు ముఖ్య సూచనలు* ⤵
〰〰〰〰〰〰〰〰
➤ Submission of the Proposal form is mandatory.
➤ No Proposal - No Insurance Risk.
➤ DDO is solely responsible for the above items.
〰〰〰〰〰〰〰〰
         ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా శాఖ రాష్ట్ర ప్రభుత్వ, పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం తరపున జీవిత బీమా సేవలను అందిస్తున్నది. పాలసీదారులకు మరింత చేరువ కావడానికి క్రింది సమాచారము తెలియచేయడమైనది.
*పాలసీలు పొందడం:*
       (21) నుంచి (55) సంచత్సరముల వయస్సు కలిగిన ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగం పొంది మొదటి నెల జీతం డ్రా చేయు వారితో సహా ఈ శాఖ జారీ చేయు పాలసీలు పొందుటకు అర్హులు. అందుకు వారు ప్రభుత్వ ఉత్తర్యుల సంఖ్య 
36, ఆర్థిక (Admn.DI&IF) శాఖ, తేదీ: 05-03-2016 ప్రకారం దిగువ చూపినవిధముగా మూలవేతనాలకు లోబడి తప్పనిసరిగా నెలసరి ప్రీమియం జీతాల నుంచి తగ్గింపు చేసి, అట్టి తగ్గింపు చేసిన ప్రీమియం వివరాలతో కూడిన ప్రతిపాదనను డి.డి.ఓ. గారితో ధృవీకరింపచేసి సంబంధిత జిల్లా బీమా కార్యాలయములకు బాండు జారీ నిమిత్తము పంపవలెను.
*👉 2015, ఆర్.పి.యస్. ప్రకారం Pay Slabs -- నెలసరి ప్రీమియం*
➤ రూ. 12000 నుంచి రూ. 16400 వరకు -- రూ. 500/
➤ రూ. 16401 నుంచి రూ. 21230 వరకు -- రూ. 650/
➤ రూ. 21231 నుంచి రూ. 28940 వరకు -- రూ. 850/
➤ రూ. 28541 నుంచి రూ. 351200 వరకు -- రూ. 1150/
➤ రూ. 35121 నుంచి రూ. 49870 వరకు -- రూ. 1400/
➤ రూ. 43671 నుంచి ఆ పైన   -- రూ. 2000/
ప్రభుత్వ ఉత్తర్చుల సంఖ్య 26, ఆర్థిక మరియు ప్రణాళిక (అ.వి.II) శాఖ, తేది : 22-02-1995 ప్రకారం ఉద్యోగి తన అభీష్టం ప్రకారం వారి ఆరోగ్య చరిత్రకు లోబడి Pay లో 20% వరకు ప్రీమియం చెల్లించవచ్చు. ప్రీమియం పెంపుదల చేసి ప్రతిపాదన సమర్పించనిచో చురణించినపుడు INSURANCE RISK కవర్ చేయబడదు. *ప్రస్తుతం పాలసీలు ఉండి ప్రీమియం పెంచినపుడు కూడా పెంచిన మొత్తానికి అనుగుణంగా ప్రతిపాదనలు నిర్బంధంగా సమర్పించాలి.*  ఆవిధముగా జరగనపుడు బీమా అనేది ప్రతిపాదకునికి ఈ శాఖకు మధ్య జరిగే కాంట్రాక్టు కనుక మెచ్యూరిటీ / మరణము సంభవించినపుడు బీమా ప్రయోజనములు నష్టపోవలసి వస్తుంది.
     మరియు పై ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 36లోని 9వ పేరా ప్రకారం Pay Slab లను అనుసరించి ఉద్యోగుల వేతనాల నుంచి ప్రీమియము రికవరీ చెయ్యడం, ప్రతిపాదనలు ధృవీకరించి వెంటనే జిల్లా బీమా కార్యాలయాలకు పంపడం సంబంధిత డి.డి.ఓ.ల ప్రాధమిక బాధ్యత. అటుల చేయని యెడల సదరు ప్రీమియంలను అనధీకృత మొత్తములుగా పరిగణిస్తూ రిస్క్  గాని, బీమా మొత్తం గాని, వడ్డీ గాని, బోనస్ గాని చెల్లించబడదు.
*☸ ఋణములు :*
       పాలసీ సరెండర్ విలువలో 90% మరియు ప్రకటిత బోనస్ మేరకు ఋణాలు మంజూరు చేయబడతాయి. ఈ ఋణాలను అసలు + వడ్డీతో సులభ వాయిదాలతో (12 నుండి 48 నెలలు) వేతనాల నుంచి చెల్లింపు చేయవచ్చు.
*✳ క్లెయిములు:*
     పాలసీ మెచ్యూరిటీ అయిన పిదప పాలసీ బాండ్లు జతచేస్తూ క్లెయిము దరఖాస్తు  పూర్తి చేసి , డి.డి.ఓ.  గారి ధృవీకరణతో జిల్లా బీమా కార్యాలయానికి పంపిన అనంతరం హామీ ఇచ్చిన బీమా మొత్తం ప్రకటిత బోనస్ తో కలిపి 
పాలసీ దారునికి చెల్లించబడును. పాలసీదారుడు మరణించినట్లైతే, పాలసీ బాండ్లు జతచేస్తూ నామినీ నిర్ణీత దరఖాస్తు ఫారం పూర్తి చేసి సంబంధిత డి.డి.ఓ. గారితో ధృవీకరింపచేసి మరణ ధృవపత్రము Legal Heir Certificate, Department Information Letter సంబంధిత జిల్లా కార్యాలయములో సమర్పించవలెను.
        మంజూరైన ఋణములు మరియు క్లెయిము మొత్తములు Online Payment ద్వారా నేరుగా సంబంధిత బ్యాంకు ఖాతాకు జమ చేయబడును. అందు నిమిత్తం బ్యాంకు ఖాతా వివరములు గల Passbook మొదటి పేజీ జిరాక్సు ప్రతిని దరఖాస్తుతో  తప్పనిసరిగా జతచేయవలెను.
*👉 పాలసీదారులు / DDO లు తప్పనిసరిగా పాటించవలసిన సూచనలు :*
1. ఎ.పి.జి.యల్.ఐ. నెలసరి షెడ్యూలు నందు సరైన పాలసీ సంఖ్యను నమోదు చేయవలెను.
2, ఉద్యోగి సర్వీసు పుస్తకంలో మొదటి పేజీ నందు పాలసీ సంఖ్య విధిగా నమోదు చేయవలెను.
3. ప్రీమియం పెంచిన ప్రతిసారి ప్రతిపాదన పత్రము నింపి డి.డి.ఓ.తో ధృవీకరింపచేసి సంబంధిత జిల్లా బీమాకార్యాలయములో సమర్పించి బాండులను పొందవలెను.
4. www.apgli.ap.gov.in నందు Annual Slip ను తరచుగా పరిశీలిస్తూ Missing 
Credits ఉన్నట్లయితే సంబంధిత జిల్లా బీమా కార్యాలయాన్ని సంప్రదించి సరిచేయించుకోవచ్చు.
5. ప్రతిపాదన పత్రములోని 12, 13 మరియు 14 ప్రశ్నలలో వాస్తవాలు మాత్రమే తెలియచేయాలి.
6. ప్రతిపాదన సకాలంలో సేకరించి ఈ శాఖకు  సమర్పించి పాలసీ పట్టా పొందనిచో అట్టి సందర్భములలో ఏమైనా న్యాయపరమైన చిక్కులు భవిష్యత్తులో ఏర్పడినట్లైతే సదరు డి.డి.ఓ. వారే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది.మరియు అట్లాంటి సందర్భములలో ఈ బీమా శాఖ ఎలాంటి ఆర్ధిక భారం వహించదు.
7. పాలసీదారులు తమ పాలసీ సంఖ్యను ఎ.పి.జి.యల్.ఐ. పేరుతో తమ ఫోన్ బుక్ నందు Save చేసుకున్నట్లయితే, వారి రిఫరెన్సు నిమిత్తం అనుకూలంగా ఉంటుంది. ఉత్తర ప్రత్యుత్తర సమయములో పాలసీదారుని పేరు, పాలసీ
నెం., పుట్టిన తేది తప్పనిసరిగా పేర్కొనవలెను.
*👉 పాలసీదారులకు కల్పిస్తున్న సౌకర్యాలు :*
1. ఎండోమెంట్ పాలసీలలో ఆసియాలోనే అత్యధికంగా ప్రతి రూ. 1000/-కి రూ. 100/- వార్షిక బోనస్.
2. చెల్లించిన ప్రీమియం పైన, మెచ్యూరిటీ మొత్తం పైన ఆదాయపు పన్ను చట్టం 80 (సి) మినహాయింపు కలదు.
3. ఈ బీమా పాలసీలు తాకట్టు పెట్టడానికి వీలుపడదు. డిక్రీల నుంచి మినహాయింపు కలదు.
4. పాలసీలు పొందడానికి వైద్య పరీక్షలు అవసరం లేదు. పాలసీదారులు నిర్భంద ప్రీమియం కంటే అధికంగా వారి అభీష్టం మేర 20% వరకు ప్రీమియం చెల్లించుచున్న సందర్భాలలో మాత్రం వైద్య ధృవపత్రాలు అవసరం,
5. పాలసీలపై తక్కువ వడ్డీతో, సులభ వాయిదాలలో ఋణ సదుపాయం కలదు.
6, ఏ.పి.జి.యల్.ఐ. ఫండ్ రూల్సు రూల్ 31 ప్రకారం నామినేషన్ సదుపాయం కలదు.
7. పాలసీదారుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన www.apgli.ap.gov.in వెబ్ సైట్ నందు ప్రతిపాదన పత్రము ఋణ / క్లెయిము దరఖాస్తులు, నామినేషన్ ఫారం వంటి తదితర శాఖీయ పత్రాలు పాలసీ బాండ్లతో సహా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పాలసీల సంఖ్య వాటి వివరములు, సమర్పించిన దరఖాస్తుల ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవచ్చు. పాలసీ సంఖ్య మరచిపోయినటైతే పుట్టిన తేదీ, తండ్రి పేరు వివరాలతో పాలసీ సంఖ్యను తెలుసుకోవచ్చు.
*🤝 హెల్ప్ డెస్క్ :*
      పాలసీదారులు / డి.డి.ఓ.లు సలహాలు, సందేహాల నివారణకు సంబంధిత జిల్లా బీమాధికారి వారిని నేరుగా / ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. జిల్లా బీమాధికారుల ఫోన్ వివరములు ఈ శాఖ వెబ్ సైట్ నుంచి పొందవచ్చును.
               *_పై సూచనలు తూ.చ. తప్పక పాటిస్తూ, మరింత మెరుగైన సేవలు అందించుటకు సహకరించవలసినదిగా పాలసీదారులను / డి.డి.ఓ. లను కోరడమైనది._*
సం//
బి. కన్నారావు, ఎం.ఏ.
 సంచాలకులు,
బీమా నిర్దేశాలయము,

ఆంధ్రప్రదేశ్, అమరావతి.  

0 comments:

Post a comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top