చైనా మహా కుడ్యము (Great Wall of China) చైనాలో ఉన్న ఒక పెద్ద కుడ్యము
(గోడ)., దీని పొడవు 6,508 కి.మీ. లేదా 4,000 మైళ్ళు.[1] క్రీ.పూ. 5, 6 శతాబ్దాల కాలంలో నిర్మింపబడి, క్రీ.శ. 16 శతాబ్దం వరకూ పునర్నిర్మాణాలకు లోనై, నేటికీ నిలిచి ఉంది. ఈ గోడ అనేక గోడల సమూహము. దీనిలోని
ప్రసిద్ధమైన గోడ చైనా చక్రవర్తి "ఖిన్ షీ హువాంగ్" చే క్రీ.పూ. 200 -
220 కాలంలో నిర్మింపబడింది. దీని నిర్మాణ కారణం, చైనా ఉత్తర సరిహద్దులను కాపాడుట. నవీన కాలంలో కనిపించే గోడ 'మింగ్ వంశ' కాలంలో నిర్మింపబడింది
క్రీ.పూ. 7వ శతాబ్దకాలంలో చైనీయులకు ఈ కుడ్యనిర్మాణ
సాంకేతికాలన్నీ తెలుసు. చైనాలో అంతర్-రాష్ట్ర యుద్ధకాలమైన 5వ
శతాబ్దం నుండి క్రీ.పూ. 221 వరకు, "ఖీ", "యాన్", మరియు
"ఝావో" రాష్ట్రాలమధ్య, వారి వారి సరిహద్దులను
కాపాడుకోవడానికి అనేక మార్గాలు వెదికారు. కోటలకు గోడవలె, రాష్ట్రభూములకూ
పటిష్ఠమైన శత్రు దుర్భేద్యమైన కుడ్యాలను నిర్మింపతలపెట్టారు. "ఖిన్ షీ
హువాంగ్" క్రీ.పూ. 221 లో తన శత్రురాష్ట్రాలను జయించి చైనా ఏకీకరణ చేసి, 'ఖిన్ సామ్రాజ్యాన్ని' స్థాపించాడు. ఈ ఏకీకరణ తరువాత, రాష్ట్రాల మధ్య గల
గోడలు, తన సామ్రాజ్యానికి అడ్డుగోడలుగా తయారయ్యాయి, వీటిని తొలగించాలని ఆజ్ఞాపించాడు. తన సామ్రాజ్య ఉత్తరభాగాన, మహాకుడ్యాల నిర్మాణానికి ఆజ్ఞలు జారీ చేశాడు. వీటి నిర్మాణానికి
కొండప్రాంతాల కుడ్యాలకు కొండలనుండే రాళ్ళను తరలించారు. మైదాన ప్రాంతాలలో రాళ్ళనూ
మట్టినీ ఉపయోగించారు. ఈ ప్రాచీన గోడలు చాలావరకు శిథిలావస్థకు చేరుకొన్నాయి,
కాని అందులో కొన్ని నేటికినీ నిలిచి ఉన్నాయి.[3] తదనంతరం, 'హాన్', 'సాంగ్' మరియు 'జిన్' వంశపు రాజులు, మరమ్మత్తులు, పునర్నిర్మాణాలు
మరియు విశాలీకరణలు చేశారు. ఈ నిర్మాణాలతో ఉత్తరాది ఆక్రమణల నుండి రక్షణకు ఇవి
ఉపయోగపడ్డాయి.
1907 లో మహాకుడ్య ఛాయాచిత్రం.
'ఖిన్' రాజుల
కోటల నిర్మాణాలకంటే 'మింగ్' rajulu నిర్మాణాలు
చాలా బలీయంగా వుండేవి. దీనికి కారణం వీరు 'ఇటుక'లను ఉపయోగించడమే. మంగోలుల దండయాత్రలు
సంవత్సరాల తరబడీ కొనసాగడంవల్ల మింగ్ వంశస్థులు ఈ కుడ్యాల నిర్మాణాలను, మరమ్మత్తులను కొనసాగిస్తూనేవచ్చారు. బీజింగ్ నగర సమీపాన ఈ కుడ్య భాగాలు
ఇంకనూ బలిష్ఠంగా నిర్మింపబడ్డవి.[4]
క్రీ.శ. 1600 లో, 'షున్'
వంశ కాలంలో, మంచూ ల దండయాత్రలనుండి తమ
రాజ్యాలను కాపాడుకోవడంలో ఈ కుడ్యాలు మహత్తరమైన పాత్రను పోషించాయి. 'యువాన్ చోంగువాన్' సేనాధిపత్యంలో, మంచూలు చైనాలో ప్రవేశించలేకపోయారు.
ఆఖరుకు, షున్ వంశపాలనతో విసిగిపోయిన ప్రజలు, 'వూ సాంగుయీ' నాయకత్వంలో షన్ హైగువాన్ వద్ద ద్వారలను
తెరచి మంచూలకు ప్రవేశం కల్పించారు. మంచూలు బీజింగ్ నగరాన్ని స్వాధీనపరచుకొని
"ఖింగ్" సామ్రాజ్యా"న్ని స్థాపించారు. వీరి కాలంలో ఈ కుడ్యాల
మరమ్మత్తులు, పునర్నిర్మాణాలు ఆగిపోయాయి. చైనా దక్షిణాన గల బార్బేరియన్ల నుండి
చైనాను రక్షించుకొనుటకు చైనాకు దక్షిణాన కుడ్యముల నిర్మాణం ప్రారంభింపబడినది
ప్రముఖంగా
పేర్కొనదగిన భాగాలు
జిన్ షాంగ్లిన్ వద్ద మహాకుడ్యభాగ ప్రాంతం
బీజింగ్ నగరపాలికలో గల ఈ మూడు
ప్రాంతాలు, పునర్నిర్మాణాలకు నోచుకొని, యాత్రికులకు విశేషంగా
ఆకర్షిస్తున్నాయి.
·
జుయోంగుఆన్ కనుమలకు చెందిన "ఉత్తర కనుమ" "North Pass" దీనినే 'బడాలింగ్' అనికూడాపేరు. ఇది రాళ్ళతోనూ ఇటుకలతోనూ
నిర్మింపబడింది. దీని ఎత్తు 7.8 మీటర్లు (25.6 అడుగులు) మరియు వెడల్పు 5 మీటర్లు (16.4 అడుగులు).
·
మింగ్ మహాకుడ్యము లోతైన ప్రాంతాలు కలిగివున్నది. దీని పొడవు
11 కి.మీ. (7
మైళ్ళు), ఎత్తు 5 నుండి 8
మీటర్లు, (16–26 ft), మరియు వెడల్పు 6 మీటర్లు
(19.7 అడుగులు)
పాదభాగంలోనూ, శిరస్సుభాగంలో దాదాపు 5 మీటర్లు (16.4 అడుగులు). వాంగ్జింగ్లో, జిన్ షాంగ్లింగ్ యొక్క 67
'కుడ్య బురుజుల'లో ఒకటి. ఇది సముద్ర
ఉపరితలానికి 980 మీటర్లు (3,215 అడుగులు) ఎత్తున గలదు.
·
జిన్ షాంగ్లింగ్ కు ఆగ్నేయాన, ముతియాను కుడ్యము ఆగ్నేయం
నుండి వాయువ్యంవైపుకు అనేక ఒంపు సొంపులతో 2.25 కి.మీ.
పొడవును కలిగివున్నది.
·
1805
మ్యాపులో మహాకుడ్యము
·
ఇటుకలు ఉపయోగించకముందు, వీటి నిర్మాణంలో 'తైపా
మట్టి', రాళ్ళు మరియు కలపను ఉపయోగించారు. మింగ్ వంశస్థుల
కాలంలో వీటి నిర్మాణానికి ఇటుకలను విరివిగా ఉపయోగించారు. ఇటుకలు, టైల్స్, సున్నము మరియు రాళ్ళు ఉపయోగించారు. ఇటుకల
ఉపయోగం నిర్మాణంలో వేగాన్ని పెంచింది. రాళ్ళ స్థానంలో ఇటుకల ఉపయోగం చాలా
సులువైంది. మట్టి కంటే ఇటుకలు ఎక్కువ బరువును మోస్తాయి, ఇటుకల
కంటే రాళ్ళ నిర్మాణం ఎక్కువ ధృడత్వాన్ని కలిగివుంటుంది. కాని రాళ్ళ ఉపయోగం అంత
సుళువైనది కాదు. అందుకే ఇటుకలను ఎక్కువగా ఉపయోగించారు. రాళ్ళను పునాదుల కొరకునూ
మరియు ఇటుకలను గోడల నిర్మాణానికి ఉపయోగించారు.
·
ఈ కుడ్యానికి చెందిన బీజింగ్ ఉత్తర ప్రాంతం, మరమ్మత్తులు పునర్నిర్మాణాలకు
నోచుకొని, పర్యాటకుల కేంద్రంగా విరాజిల్లుతున్నది. దీని ఇతర
ప్రాంతాలు కుడ్యశిథిలాలతో, గ్రామ ఆటస్థలములుగానూ వీటి ఇటుకలు
రాళ్ళు పల్లెవాసుల ఇండ్ల కట్టడాలకు దురుపయోగమౌతున్నవి.[6] ఈ
కుడ్యం అనేక భాగాలు దురుపయోగం పాలౌతున్నవి. ఈ కుడ్యముల గూర్చి సరైన సర్వేలు
చేపట్టక పోవడం విచారకరం. మరీ ముఖ్యంగా లోపలి ప్రాంతాలలో దీనిపై సరైన నిఘాలేకపోవడం
దురదృష్ట్రం.
·
రాబోవు 20 సంవత్సరాలలో 'గాన్సూ' రాష్ట్రంలోని ఈ కుడ్యభాగం 60 కి.మీ. కంటే ఎక్కువ
భాగం అంతరించిపోయే ప్రమాదముంది. దీనికి కారణాలు దుమ్ము తుఫానులు మరియు ఇసుక
తుఫానులు. ఈ ప్రాంతాలలో దీని ఎత్తు 5 మీటర్ల నుండి 2 మీటర్లకు కుదించుకుపోయింది. ఈ కుడ్యాల ఆకృతులూ తమ ఆకర్షణను
కోల్పోతున్నాయి.[7]
·
కుడ్యం బురుజులు మరియు టవర్లు
·
బురుజులు
·
సైన్యపు అవసరాలైన తపాలా మరియు వార్తాసంకేతాల కొరకు ఈ
కుడ్యాల వెంబడీ గల సైన్యానికి ఈ బురుజులు చాలా ఉపయోగపడ్డాయి. శత్రువుల కదలికలను
గుర్తించడానికి మరియు సైగలద్వారా సందేశాలను పంపడానికి ఈ బురుజులు మరియు టవర్లు
చాలా ముఖ్యమైనవని నిరూపింపబడ్డాయి
చంద్రుడి నుండి[మార్చు]
మే 1932 లో రిప్లీ వేసిన 'నమ్ము
నమ్మక పో' అనే కార్టూన్ లో ఈ కుడ్యంగురించి ఇలా చెప్పబడింది:
చంద్రుడిపైనుండి వీక్షించగలిగే మానవుని ఘనమైన పని ఇది.
1938 లో 'అత్భుతాల రెండవ పుస్తకం'
లో కూడా దీని గురించి ఇలాంటి ప్రస్తావనే జరిగింది. కానీ ఇది నిజం కాదు.
ఈ మహాకుడ్యము అత్యధికంగా 30 అడుగుల వెడల్పును
కలిగివున్నది. మరియు తన చుట్టుప్రక్కన గల రంగునూ కలిగివున్నది. కటకాల దృశ్యబలం
ఆధారంగా సుదూరాలనుండి వీక్షిస్తే ఈ గోడ అస్సలు కనబడదు. భూమి నుండి చంద్రుని దూరం
రమారమి 238,857 మైళ్ళు (384,393 కి.మీ.).
ఈ మహాకుడ్యము ఓ 'పళ్ళెం' గాదు, ఓ 'దారం' లాంటిది. నూరు గజాల
దూరంనుండి 15 సె.మీ. మందంగల త్రాడు కనబడదు. చంద్రునిపైనుండి
ఈ కుడ్యము ఎలా కనబడగలదు?
దగ్గరి భూకక్ష్య నుండి[మార్చు]
ఇంకో ప్రశ్న ఉదయించింది, దగ్గరి భూకక్ష్య నుండి ఈ
కుడ్యము కనబడగలదా? అని, అనగా భూమి
నుండి 100 మైళ్ళ దూరాన గల భూకక్ష్య నుండి ఈ కుడ్యము కనబడగలదా?
ఏకగ్రీవ అంగీకారమేమంటే కనబడుతుంది అని.[8]
వ్యోమగామి విలియమ్ పోగ్, స్కైలాబ్ నుండి
చూడడానికి ప్రయత్నించాడు. ఇతనికి చైనా కాలువ కనబడింది గాని ఈ చైనా మహాకుడ్యము కనబడలేదు.
ఏలాంటి పరికరాన్ని ఉపయోగించకుండా దీనిని చూడడం సాధ్యము గాదని చెప్పాడు. అయితే బైనాక్యులర్తో చూడగలిగాడు.
నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ అపోలో 11 నుండి వీక్షిస్తూ ఇలా చెప్పాడు : "భూమిపై గల మానవనిర్మిత వస్తువులను
నేను వీక్షించలేక పోతున్నాను, చైనా మహాకుడ్యాన్నీ
చూడలేకపోతున్నాను, కారణం అది ఇక్కడనుండి కనబడుట లేదు"
0 Comments:
Post a Comment