Search This Blog

Tuesday, 28 March 2023

Longest Phone Call: ప్రపంచంలోనే సుదీర్ఘమైన ఫోన్ కాల్ ఇదే... ఎన్ని గంటలు మాట్లాడారో తెలుసా?

 Longest Phone Call: ప్రపంచంలోనే సుదీర్ఘమైన ఫోన్ కాల్ ఇదే... ఎన్ని గంటలు మాట్లాడారో తెలుసా?

ప్రస్తుతం అందరి జీవితంలో మొబైల్ ఫోన్ ముఖ్యమైన భాగం అయిపోయింది.
గతంలో ఒకరికొకరు కమ్యూనికేట్ చేయాలనుకుంటే ఉత్తరాలే ఉండేవి. ఆ తర్వాత ల్యాండ్‌లైన్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. తర్వాత ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్ వరకు టెక్నాలజీ విప్లవాన్ని చూస్తున్నాం. ఎవరికైనా ఏదైనా పనిమీద ఫోన్ కాల్ (Phone call) చేస్తే రెండుమూడు నిమిషాలు మాట్లాడతాం. ముఖ్యమైన టాపిక్ అయితే ఓ పావుగంటో, అరగంటో మాట్లాడతాం. ఇక చాలారోజుల తర్వాత ఆత్మీయులకు ఫోన్ చేస్తే ఓ గంటసేపు మాట్లాడినా సరిపోదు. అసలు ఇప్పటివరకు ఒకే ఫోన్ కాల్‌లో ఎక్కువ సేపు మాట్లాడింది ఎవరు? అన్న సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? ప్రపంచంలోనే సుదీర్ఘమైన ఫోన్ కాల్ (Longest Phone Call) ఏది అని మీరు ఎప్పుడైనా తెలుసుకోవడానికి ప్రయత్నించారా? ఆ రికార్డ్ గురించి తెలుసుకోండి. 

ఇప్పుడు మనం 2023లో ఉన్నాం. గత పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడే స్మార్ట్‌ఫోన్ వినియోగం ఎక్కువగా ఉంది. అయితే ప్రపంచంలోనే సుదీర్ఘమైన ఫోన్ కాల్ మాట్లాడింది 2012లో. అవును. సుదీర్ఘమైన ఫోన్ కాల్ అంటే రెండుమూడు గంటలో, ఐదారు గంటలో అనుకుంటే పొరపాటే. ఏకంగా 46 గంటలపాటు ఈ ఫోన్ కాల్ కొనసాగడం విశేషం. 
ఇంత సుదీర్ఘమైన ఫోన్ కాల్ ఎవరిమధ్య నడిచిందో తెలుసా? హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఎరిక్ ఆర్ బ్రూస్టర్, అవెరీ ఏ.లియోనార్డ్ మధ్య ఈ ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. వీరిద్దరూ 46 గంటల 12 నిమిషాల 52 సెకండ్ల 228 మిల్లీ సెకండ్లు మాట్లాడుకున్నారు. మధ్యలో ఒక్కసారి కూడా కాల్ కట్ చేయలేదు. ఈ ఫోన్ కాల్‌లో పెద్ద ట్విస్ట్ ఏంటంటే. కాల్ కొనసాగుతున్న సమయంలో వీరిద్దరు 10 సెకండ్ల కన్నా ఎక్కువ సేపు మౌనంగా ఉండకూడదని షరతు కూడా పెట్టారట. అంటే నాన్ స్టాప్‌గా మాట్లాడుతూ ఉండాలని కండీషన్ పెట్టారు. 

అయితే అంతసేపు ఆపకుండా ఫోన్ కాల్ మాట్లాడితే మానసిక ఒత్తిడికి గురవుతారని ప్రతీ గంటకు 5 నిమిషాల విరామం ఇచ్చారట. వారు తిరిగి శక్తిని పొంది సంభాషణ కొనసాగించడానికి గంటకు 5 నిమిషాల చొప్పున బ్రేక్ ఇచ్చారు. వీరిద్దరూ ఓ చిట్ చాట్ షోలో ఇలా 46 గంటలపైనే మాట్లాడారు. ఇక 2009లో మరో రికార్డ్ కూడా ఉంది. సునీల్ ప్రభాకర్ అనే వ్యక్తి 51 గంటల పాటు నాన్ స్టాప్‌గా ఫోన్ కాల్స్ మాట్లాడాడు.అయితే అతను ఒకరితోనే అన్ని గంటలు మాట్లాడలేదు. వేర్వేరు వ్యక్తులకు కాల్ చేసి 51 గంటల సేపు ఫోన్ కాల్ మాట్లాడాడు. 
సునీల్ ప్రభాకర్ మొదట కార్డియాలజిస్ట్ కేకే అగర్వాల్‌కు ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత వేర్వేరు వ్యక్తులకు ఈ కాల్ కొనసాగింది. ఇలా వేర్వేరు వ్యక్తులతో ఇన్ని గంటలు మాట్లాడిన రికార్డులు కొన్ని ఉన్నాయి. కానీ ప్రపంచంలోనే సుదీర్ఘమైన ఫోన్ కాల్ రికార్డ్ మాత్రం హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఎరిక్ ఆర్ బ్రూస్టర్, అవెరీ ఏ.లియోనార్డ్ పేర్లపై ఉంది.


Wheat Rava Upma : గోధుమ రవ్వ ఉప్మా.. చింతపండుతో చేస్తే అదిరిపోతుంది

 Wheat Rava Upma : గోధుమ రవ్వ ఉప్మా.. చింతపండుతో చేస్తే అదిరిపోతుంది

గోధుమ రవ్వ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంతో చేసే వంటకాలు టేస్టీగా కూడా ఉంటాయి. సులభంగా తయారు చేసుకోవచ్చు. అయితే ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి గోధమ రవ్వ ఉప్మాను చేసుకోండి.
ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అయితే రోజూ చేసేలాగా కాకుండా.. కాస్త చింతపండు రసం వేసి.. ఈ ఉప్మాను తయారు చేయండి. మరింత రుచిగా ఉంటుంది. దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

గోధుమ రవ్వ ఉప్మాకు ఏమేం కావాలంటే..

నెయ్యి-ఒక టీ స్పూన్, గోధుమరవ్వ-ఒక కప్పు, నూనె-రెండు టేబుల్ స్పూన్స్, ఆవాలు-ఒక టీ స్పూన్, శనగపప్పు-ఒక టీ స్పూన్, మినపప్పు-ఒక టీ స్పూన్, ఎండుమిర్చి-మూడు, జీలకర్ర-ఒక టీ స్పూన్, కరివేపాకు కొంచెం, తరిగిన పచ్చిమిర్చి-2, కాస్త ఇంగువ, ఉల్లిపాయ ఒకటి తరిగినది, బఠాణీ-పావు కప్పు, నానబెట్టిన చింతపండు కొంచెం, నీళ్లు-3 కప్పులు, ఉప్పు తగినంత, బెల్లం తురుము-ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర తరిగినది.

ఎలా తయారు చేయాలంటే..
చింతపండులో 3 కప్పుల నీళ్లు పోసి రసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కళాయిలో నెయ్యి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడి అయిన తర్వాత.. గోధుమ రవ్వను వేసి వేయించుకోవాలి. గోధుమ రవ్వ చక్కగా వేగిన తర్వాత.. ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత.. ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ వేసి వేయించాలి. అనంతరం ఉల్లిపాయ ముక్కలు, పచ్చి బఠాణీ వేసి కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టి ఉంచాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత.. ఉప్పు, చింతపండు రసం వేసి కలపాలి.

ఇక చింతపండు రసం కొంచెం మరిగాక.. వేయించిన గోధుమ రవ్వ వేసి కలుపుకోవాలి. తర్వాత దీనిపై మూత పెట్టి రవ్వను ఉడికించుకోవాల్సి ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇలా 15 నిమిషాలపాటు ఉడికించుకోవాలి. ఇక రవ్వ ఉడికిన తర్వాత.. కొత్తిమీర చల్లుకోవాలి. ఆ తర్వాత స్టౌవ్ ఆఫ్ చేయాలి. ఇలా చేస్తే.. టేస్టీ టేస్టీ గోధుమ రవ్వ ఉప్మా తయారు అయినట్టే. ఉదయం అలాహారంగా తీసుకోండి.


Hair Colouring: హెయిర్ కలరింగ్ చేయించుకుంటున్నారా..? అయితే ఈ విషయాలు అసలు మరచిపోకండి..

 Hair Colouring: హెయిర్ కలరింగ్ చేయించుకుంటున్నారా..? అయితే ఈ విషయాలు అసలు మరచిపోకండి..

ఈ మధ్య కాలంలో హెయిర్ కలరింగ్ ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. వాతావరణంలోని మార్పుల కారణంగా జుట్టు తెల్లగా మారడం, గ్రే కలర్‌లోకి మారడం ఒక కారణం అయితే, నచ్చిన కలర్‌లో హెయిర్‌ని మార్చుకోవడం మరో కారణం.
అయితే ఈ పని చేసే ముందు హెయిర్‌స్టైలిస్ట్ సలహాలను తప్పకుండా తీసుకోవాలి. మీ జుట్టు రకం, ఆకృతిని బట్టి రంగు ఎంచుకోవాలి. లేకపోతే జుట్టు సమస్యలు ఎదురై మొత్తం పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు జుట్టు కలరింగ్ చేసుకుంటున్నట్లయితే పాటించవలసిన అనేక విషయాలు ఉన్నాయి. ఒక్కసారి అవేంటో తెలుసుకుందాం.

స్టైలింగ్ టూల్స్: మీరు జుట్టును తరచుగా స్టైలింగ్ చేయడం మానుకోవాలి. ముఖ్యంగా స్టైలిష్ టూల్స్ అధికంగా ఉపయోగించడం జుట్టుకు హానికరం.

హెయిర్‌స్టైలిస్ట్ సహాయం: మీ జుట్టుకు కలర్ వేయాలునుకుంటే ఎప్పుడూ కూడా హెయిర్‌స్టైలిస్ట్ వద్ద వేయించుకోండి. వారు ఈ పనిలో నిపుణులు. జుట్టుకు హాని జరగకుండా ఎంత రసాయనాలు వాడాలో వారికి తెలుసు.
షాంపుల వాడకం: మీరు హెయిర్ కలర్‌ని వాడుతుంటే.. షాంపూలను, కండిషనర్‌లను ఎక్కువగా వాడవద్దు. హెయిర్ కలర్‌లోని రసాయనాలు, షాంపూ లేదా కండిషనర్‌లోని రసాయనాలు కలిస్తే మీ జుట్టుకు హని కలుగుతుంది.

జుట్టును కడగడం: మీరు జుట్టుకు రంగు వేసినట్లయితే కనీసం 3 రోజులు దానిని కడగవద్దు. ఈ సమయంలో మీరు వేసుకున్న రంగు మీ జుట్టుకు బాగా సెట్ అవుతుంది. అలాగే రంగు వేసుకున్నవారు ఎల్లప్పుడూ చల్లటి నీటితోనే జుట్టును కడగాలి. వేడి లేదా గోరువెచ్చని నీటితో కడగకూడదు.


Vehicle Parking Rules: వాహనదారులకు అలర్ట్‌..! ఈ రూల్స్ పాటిస్తే.. రూ. 500 బహుమతి..!

 Vehicle Parking Rules: వాహనదారులకు అలర్ట్‌..! ఈ రూల్స్ పాటిస్తే.. రూ. 500 బహుమతి..!

వాహనాల పార్కింగ్‌కు సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్యమైన ప్రకటన చేశారు. రోడ్లపై తప్పుగా పార్కింగ్ చేసిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు..
అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసే వాహనాల వల్ల ఏర్పడే ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడేందుకు గడ్కరీ కొత్త ప్రకటన చేశారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి మాటలు విని అందరూ అవాక్కయ్యారు . రోడ్డుపై తప్పుగా పార్క్ చేసిన వాహనం ఫొటో పంపితే 500 రూపాయల బహుమతి ఇస్తామని కేంద్ర మంత్రి ఓ కార్యక్రమంలో ప్రకటించారు. కేంద్ర మంత్రి ఈ ప్రకటన విని కారు, బైక్, ఇతర వాహన చోదకులతోపాటు సామాన్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. త్వరలోనే ఈ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు.

ఈ నిబంధన విని డ్రైవర్లు ఆశ్చర్యపోతున్నారని నితిన్ గడ్కరీ అన్నారు. అయితే ఇది అమలులోకి వచ్చిన తర్వాత నగరాల్లో ట్రాఫిక్ జామ్‌ల నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు.. వాహనాన్ని తప్పుగా పార్క్ చేస్తే 1000 రూపాయల జరిమానా విధిస్తామని తెలిపారు. అలాంటి వాహనాల ఫోటో పంపినందుకు 500 రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించారు.
తప్పుడు పార్కింగ్‌ను అరికట్టడమే ఈ చట్టం తీసుకురావడం ఉద్దేశమని గడ్కరీ ఓ కార్యక్రమంలో అన్నారు. పార్కింగ్‌కు సంబంధించి కొత్త చట్టం తీసుకురాబోతున్నామని, దీని ప్రకారం రోడ్డు పక్కన వాహనాలను పార్క్ చేసే వారికి రూ.1000 జరిమానా విధిస్తారు. అంతేకాకుండా, తప్పుగా పార్క్ చేసిన వాహనం ఫోటో తీసిన పంపిన వ్యక్తికి రూ.500 రివార్డు ఇవ్వబడుతుందని ఆయన చెప్పారు.


Brinjal Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు వంకాయ అస్సలు తినొద్దు.. ప్రాణాలే పోయే ఛాన్స్..

 Brinjal Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు వంకాయ అస్సలు తినొద్దు.. ప్రాణాలే పోయే ఛాన్స్..

కొంత మంది వంకాయలను తినడానికి ఇష్టపడతారు. మరికొందరు వాటిని చూస్తేనే బెంబేలెత్తిపోతారు. ఎక్కువ మంది అయితే, వంకాయతో చేసే వంటకాలను ఇష్టంగా తినేస్తారు.
వంకాయలో రకాలు కూడా ఉంటాయి. నాటు వంకాయలు, హైబ్రిడ్ వంకాయలు ఉంటాయి. వీటిల్లోనూ ఊదా రంగుతో పాటు ఆకుపచ్చ, తెలుపు రంగుల్లోనూ వంకాయలు ఉంటాయి. ఎంతో రుచికరమైన ఈ వంకాయలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అయితే, అదే సమయంలో కొందరికి వంకాయ ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారు వంకాయను తినడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారని చెబుతున్నారు. మరి ఎవరు వంకాయను తినకూడదు? తింటే ఏం జరుగుతుంది? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ వ్యక్తులు బెండకాయ తినొద్దు..

1. కిడ్నీ స్టోన్‌తో బాధపడేవారు.

కిడ్నీ స్టోన్ ఉన్నవారు బెండకాయ తినకూడదు. కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడేవారు వంకాయ తినడం వల్ల.. అందులోని గింజలు కిడ్నీలో రాళ్లు తయారయ్యేందుకు కారణం అవుతాయి. తద్వారా కిడ్నీ దెబ్బ తింటుంది.

2. ఎముకలకు మంచిది కాదు..

వంకాయలో ఆక్సలేట్ అనే మూలకం ఉంటుంది. దీని కారణంగా కాల్షియం శోషణ తగ్గుతుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిగణించబడుతుంది. ఎముకలు బలహీనంగా ఉన్న వ్యక్తులు బెండకాయ తినకుడదు.

3. పైల్స్ బాధితులు..

పైల్స్ బాధితులు కూడా వంకాయకు దూరంగా ఉండటం ఉత్తమం. రక్తహీనత, పైల్స్ సమస్యతో బాధపడేవారు వంకాయ తినొద్దు. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.

4. ఆర్థరైటిస్ పేషెంట్లు వంకాయ తినకూడదు..
కీళ్లనొప్పుల సమస్యతో బాధపడేవారు వంకాయ తినకూడదు. దీని వల్ల కీళ్లనొప్పుల సమస్య మరింత తీవ్రమవుతుంది.

5. ఈ సమస్యలు కూడా రావచ్చు..

వంకాయలు ఎక్కువగా తినడం కూడా హానికరం. దీని కారణంగా.. కడుపు నొప్పి, వాంతులు, తలనొప్పి, దురద వంటి సమస్యలు వస్తాయి.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం వైద్యులు, ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. వీటిని అనుసరించే ముందు వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.


Vastu Tips : నిమ్మకాయతో ఇలా చేస్తే అప్పుల బాధ తీరిపోయి, లక్ష్మీదేవి నట్టింట్లో తిష్ట వేయడం ఖాయం..

 Vastu Tips : నిమ్మకాయతో ఇలా చేస్తే అప్పుల బాధ తీరిపోయి, లక్ష్మీదేవి నట్టింట్లో తిష్ట వేయడం ఖాయం..

భారతీయ వంటకాలలో లభించే అనేక పదార్ధాలను జ్యోతిషశాస్త్ర (Vastu Tips) నివారణలలో కూడా ఉపయోగిస్తారు. ఈ నిమ్మకాయలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఉన్నాయి.
అంతేకాదు పూజలోనూ నిమ్మకాయలను ఉపయోగిస్తారు. అయితే జ్యోతిష్యం ప్రకారం ఈ నిమ్మకాయ మీ సంపదను పెంచుతుందని మీకు తెలుసా.

– జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కుటుంబ పెద్దపై నరద్రుష్టి ఉన్నట్లయితే నిమ్మకాయను తల నుండి కాలి వరకు ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలి, ఆ తర్వాత ఈ నిమ్మకాయను 4 ముక్కలుగా చేసి, ఎవరూ చూడని చోట విసిరేయాలి. నిమ్మకాయ ముక్కలను విసిరేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకండి.

– ఎంత ప్రయత్నించినా విజయం లభించకపోతే నిమ్మకాయ, 4 లవంగాలతో హనుమాన్ గుడికి వెళ్లండి. నిమ్మకాయలో లవంగాలు వేసి హనుమాన్ చాలీసా చదవండి. వ్యాపారం సరిగ్గా జరగకపోతే ఐదు నిమ్మకాయలు కోసి ఆదివారం మధ్యాహ్నం ఆఫీసులో పెట్టండి.
– ఒక పిడికెడు ఎండుమిర్చి, కొన్ని పసుపు ఆవాలు తీసుకోండి. నిమ్మకాయతో పాటు ఈ వస్తువులన్నీ మరుసటి రోజు ఉదయం సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

-ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు నిమ్మకాయలను తీసుకుని సగానికి కోసుకోవాలి. ఒక భాగాన్ని వెనుకకు, మరొక వైపు విసిరేయండి. ఇలా చేస్తే చేసే పనిలో విజయం సాధిస్తారు.

-జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నిమ్మకాయపై నాలుగు లవంగాలు ఉంచి, ఆదివారం నాడు ‘ఓం శ్రీ హనుమంతే నమః’ అని 108 సార్లు జపిస్తే మీకు పనిలో విజయం చేకూరుతుంది. పెరట్లో నిమ్మచెట్టు నాటడం వల్ల సంతోషం, ఐశ్వర్యం పెరుగుతుంది.


Sri Rama Navami: రాములోరి కల్యాణంలో ప్రసాదంగా పానకం, వడపప్పు.. దీని వెనుక ఆరోగ్య రహస్యం.. తయారీ విధానం మీకోసం

 Sri Rama Navami: రాములోరి కల్యాణంలో ప్రసాదంగా పానకం, వడపప్పు.. దీని వెనుక ఆరోగ్య రహస్యం.. తయారీ విధానం మీకోసం..

శ్రీరామనవమి వచ్చిందంటే చాలు దేశంలోని గల్లీ గల్లీలో కూడా సందడి మొదలవుతుంది. ఈ ఏడాది రామ నవమి మార్చి 30వ తేదీన వచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న రామాలయాలు అందంగా ముస్తాబవుతున్నాయి.
పిన్నలు, పెద్దలు సీతారాముల కళ్యాణం జరపడానికి మేము సైతం అంటారు. అయితే సీతారాముల కళ్యాణం అనంతరం బెల్లం పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి.. అనంతరం వాటిని భక్తులకు పంచిపెడతారు. అయితే ఈ ప్రసాదం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధగుణాలున్నాయని ఆయుర్వేదం చెబుతుంది.

శ్రీరామ నవమి వేడుకలు చైత్రమాసం నవమి రోజున జరుగుతాయి. ఈ సమయంలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. వసంత ఋతువులో గొంతు సంబంధిత వ్యాధులు విజృంభిస్తాయి. దీంతో నవమికి ప్రసాదంగా అందించే పానకం, వడపప్పుమంచి ఆరోగ్యాన్నిస్తుందని చెబుతున్నారు. బెల్లం పానకంలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాల వల్ల కొన్ని రకాల వ్యాధులు నయమవుతాయి. పానకంలో వేసే మిరియాల్లో ఔషదగుణాలు ఉంటాయి. కఫాన్ని తగ్గించి జలుబు రాకుండా చేస్తాయి. దాహాన్ని తగ్గించే గుణం వీటికి ఉంది. మిరియాలు, ఏలకులు గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని ఇస్తే.. పెసర పప్పు తో తయారు చేసిన వడపప్పు ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైనదని కూడా చెబుతారు. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. ‘వడ’పప్పు జ్ఞానానికి ప్రతీక అని అంటారు. పెసరపప్పును ‘వడ’పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో ‘వడ’ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసర్లలో ఐరన్‌ పుష్కలం. రక్తహీనతను తగ్గించడానికి తోడ్పడతాయి. వడపప్పులో వాడే కొబ్బరిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే కొబ్బరి తినేవారిలో వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి బాగా పెరుగుతుంది.

పానకం తయారీకి కావాల్సిన పదార్ధాలు: 
బెల్లం

మిరియాల పొడి

యాలకుల పొడి

నీరు

తయారీ విధానం: బెల్లం పానకం తయారీ కోసం ముందుగా లీటర్ నీరు తీసుకోవాలి. ఇందులో రెండు కప్పుల బెల్లం పొడి వేసి.. కలపాలి. అనంతరం యాలకుల పొడి, మిరియాల పొడి వేసుకుని కొంత కలపాలి. అంతే బెల్లం పానకం రెడీ.

వడపప్పు తయారీకి కావాల్సిన పదార్ధాలు 

పెసర పప్పు – ఒక కప్పు

కొబ్బరి తురుము
కొంచెం పచ్చి మిర్చి

క్యారెట్ తురుము

నిమ్మరసం

ఉప్పు

తయారీ విధానం: ముందుగా పెసర పప్పుని నానబెట్టుకోవాలి. అనంతరం పప్పుని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, పచ్చి మిర్చి , నిమ్మరసం, ఉప్పు వేసుకుని బాగా కలపాలి. సుమారు అరగంట సేపు ఇలా ఉంచేసి.. తర్వాత తింటే వడపప్పు మంచి టేస్టీగా ఉంటుంది.

ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలున్న పానకం, వడపప్పులను ఒక్క శ్రీ రామనవమి రోజు నే కాకుండా ఈ వేసవి లో తరచుగా తీసుకోవడం మంచిది


Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top