Search This Blog

  • 🖨️ Inter Hall tickets NEW...
  • MORE TO VIEW

Thursday, 13 February 2020

Tips to get 10 /10 GPA in 10th class



✍ పదిలో 10 కి 10 🏌


         ✍ డక్కిలి.సుబ్రహ్మణ్యం
M.Sc.(psychology), M.Ed.,

✍✍✍✍✍✍✍✍
===============
తల్లిదండ్రుల పాత్ర :- 
===============

🍛 పిల్లలకు సంతులిత/ పౌష్టికాహారం అందించాలి.

🌞పిల్లలు చదువుకునే గదిలో తగినంత  వెలుతురు, గాలి అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

👉పిల్లలు కూర్చోవడానికి అనువైన కుర్చీలు/తదితరాలు ఏర్పాట్లు చేయాలి.(వీలైతేనే)

🌹మీ పిల్లలను ఇతరులతో పోల్చుతూ ఒత్తిడికి మరియు నిరుత్సాహానికి గురి చేయకండి.

🌹మీ పిల్లలలోని బలాలను గుర్తు చేస్తూ.. వారిలోని  బలహీనతలను ఎలా అధిగమించాలో తెలుపుతూ.. వారిని ప్రోత్సహించండి.

🌹ప్రతి రోజూ వారు ఎదుర్కొనే సంఘటనలలోని సంతోషాలను, బాధలను ఓపిగ్గా వినండి. వారు ఇతర విషయాలపై ఎక్కువగా ఆలోచన చేస్తున్నట్లు అయితే.. చదువు మీద ఆసక్తి కలిగేలా మాట్లాడండి.

🌹మీ పిల్లలు చదువుతున్నంత సేపు T V 📺  ఆఫ్ చేయండి.

🌹పిల్లలకు మార్కులు, గ్రేడ్లపై టార్గెట్ ఇవ్వకండి.

🌹పిల్లలు రాత్రివేళల్లో సమయం(⌚) చూసుకోవద్దని చెప్పండి.
వేసుకున్న ప్రణాలిక ప్రకారం చదవాలని మనసులో బలంగా ఉన్న విద్యార్థికి వాచ్ అవసరం లేదని చెప్పండి.

🌹నిద్రకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పండి.
నిద్ర వచ్చేవరకు చదవాలి/ఆరోజుకి వేసుకున్న ప్రణాళిక పూర్తయ్యే వరకు చదవాలి. అని పిల్లలను ప్రోత్సాహించండి.


=================
ఉపాద్యాయులకు విన్నపం :-
=================

🌹విద్యార్థులకు వారానికి ఒకసారి కౌన్సెలింగ్/మోటివేషన్ క్లాస్ ఇవ్వండి.

🌹 Smart Reading & Smart Learning ఎలానో తెలపండి.

🌹మోటివేషన్ చేయడానికి విద్యార్థులకు సక్సెస్ స్టోరీస్ ని చెప్పండి.( టైం ఎక్కువ తీసుకోకూడదు)

🌹విద్యార్థులను ఒక్కొక్క సబ్జెక్టుకి..  ఒక్కొక్క రోజు ఒక్కొక్క పద్ధతిలో ఆసక్తికరంగా బోధించడానికి, ప్రాక్టీస్ చేయించడానికి, చదివించడానికి ప్రయత్నించాలి.

🌹మారుతున్న కాలానికి అనుగుణంగా రోజు రోజూ విద్యార్థులకు  సరికొత్తగా అనిపించే పద్దతులతో , విద్యార్థులకు ఆసక్తిగొలిపేలా బోధనాభ్యసన ప్రక్రియను నిత్యనూతనంగా కొనసాగించాలి.

🌹 సబ్జెక్టు సమాచారాన్నంతటినీ విద్యార్థులకు సమగ్రంగా, సింపుల్ గా అర్థమయ్యే రీతిలో సొంతంగా రూపొందించడం ఉపాద్యాయుల నైపుణ్యంగా ఎవరికి వారు భావించాలి.

🌹  మారుతున్న ఇప్పటి కాలానికి అనుగుణంగా  విద్యార్థులను తయారు చేయాలంటే..
ఉపాద్యాయులు కనీసం పది , ఇరవై సంవత్సరాలు తర్వాత రాబోయే  కాలాన్ని, అవసరాలను అంచనా వేయగలగాలి. తదనుగుణంగా బోధనాభ్యసన మెళకువలు  అప్డేట్ కావాల్సి ఉంటుంది.

🌹బోధనాభ్యసన కార్యక్రమంలో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని, వాటిని సత్వరమే పరిష్కరించాలి.

🌹 ఉపాద్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా, మార్గదర్శిగా.. తోటి ఉపాద్యాయులకు ఇన్సిపిరేషన్ గా ఉండాలి.

🌹ఉపాద్యాయులు క్రమశిక్షణ అమలు విషయంలో కఠినంగానూ..
బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థులతో చనువుగానూ మెలగాలి.

💪విద్యార్థులలోని బలాలను గుర్తు చేస్తూ.. వారి బలహీనతలను ఎలా అధిగమించాలో తెలుపుతూ.. వారిని ప్రోత్సహించండి.

🌹చదవడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థిని గమనించి, కారణాలు తెలుసుకొని పరిష్కార మార్గాలు తెలపండి.

🌹చదువుపై ఆసక్తి కనబరచని విద్యార్థుల కేస్టడీ నిర్వహించండి.

🌹 Exam Management తెలపండి

🌹విద్యార్థులు చదవకపోవడానికి కారణాలు..
👉 కుటుంబ సమస్యలు
👉 కుటుంబ/పాఠశాల పరిసరాల ప్రభావం
👉 మిత్రులు
👉బోధనాభ్యసన అర్థం కాకపోవడం
👉తనను తాను తక్కువగా అంచనా వేసుకోవడం
👉తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన
👉 ఆరోగ్య సమస్యలు
👉బేసిక్స్ రాకపోవడం
👉 పరీక్షలకు తయారీ విధానం తెలీయక పోవడం

::::::::::::::::::::::::::::::::::::
ప్రధానోపాధ్యాయులు విధి
::::::::::::::::::::::::::::::::::::

🌱 ఉపాద్యాయులు నూతన బోధనాభ్యసన మెళకువలు రూపొందించుకునేలా ప్రోత్సహించాలి.

🌹ఉపాద్యాయులలో బోధనాభ్యసన మెళకువలు మెరుగుపరచడానికి(అప్డేట్), నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో బోధనాభ్యసన ప్రక్రియను అనుసంధానం చేయు పరిజ్ఞానాన్ని పొందడానికి ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి.

 🌱🌱🌱🌱🌱🌱🌱

0 comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top