Search This Blog

  • 🖨️ Inter Hall tickets NEW...
  • MORE TO VIEW

Friday, 14 February 2020

School Assembly -Dt.15/2/2020

*🙏పాఠశాల అసెంబ్లీ కోసం🙏*

*---15.02.2020--*

*GSRAO GK GROUPS*

 *🔍నేటి ముఖ్యమైన వార్తలు🔎*

*1.తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కొవిద్‌-19(కరోనా వైరస్‌) కేసు నిర్ధారణ కాలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అధికారికంగా తెలిపారు.*

*2.ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు పంజాబ్‌లోని దేశ్‌ భగత్‌ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.*

*3.ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రతిపాదించిన పరిశ్రమలు, ఇండస్ట్రియల్ కారిడార్ల నిర్మాణం పనిని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య, భారీ పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్‌కు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు.*

*4.జమ్మూ-కశ్మీర్‌లో 370 అధికరణాన్ని రద్దు చేయడం దేశ అంతర్గత అంశమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.*

*5.కొవిడ్‌-19 బారిన పడి చైనాలో మరణించిన వారి సంఖ్య తాజాగా 1,483కు చేరింది.*

*6.అంటార్కిటికా ఖండంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక్కడ తొలిసారి రికార్డు స్థాయిలో 20.75 డిగ్రీల సెల్సియస్‌ నమోదు అయినట్టు వారు వెల్లడించారు.*

*7.భారత హాకీ జట్టు సారథి మన్‌ప్రీత్‌ సింగ్‌ చరిత్ర సృష్టించాడు. 2019కి గాను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ‘ఈ ఏటి మేటి ఆటగాడి’గా ఎంపికయ్యాడు.*

*👉నేటి సూక్తి.*

*జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే.*

*---స్వామి వివేకానంద*

*🔆మంచి పద్యం🔆*

*మేలెంచని మాలిన్యుని*
*మాలను నగసాలివాని మంగలి హితుగా*
*నేలిన నరపతి రాజ్యము*
*నేలఁగలసిపోవుగాని నెగడదు సుమతీ!*

*👉తాత్పర్యం: ఉపకారాన్ని గుర్తుంచుకోని దుర్మార్గుడ్ని, పంచముని, కంసాలివానిని, మంగలిని హితలుగా చేసుకొని పాలించే రాజు రాజ్యము మట్టిలో కలిసి నాశనం అవుతుంది కానీ కీర్తిని పొందదు.*

*♦నేటి ప్రశ్న♦*

*Q. భారత జాతీయ పతాకాన్ని రాజ్యాంగ పరిషత్తు ఎప్పుడు ఆమోదించింది?*

*A: 1947, జులై 22*

*Q. దేశంలో తొలి విపత్తు రేడియోను ఎక్కడ ఏర్పాటు చేశారు?*

*A: కడలూర్*

*✅తెలుసు కుందాం✅*


*🔴ఎత్తుగా ఉండే పర్వతాలపై చెట్లు ఎందుకు పెరగవు?*

✳ఎత్తుగా ఉండే పర్వతాలపై చెట్లు అంతగా పెరగక పోవడానికి కారణం అక్కడ ఉండే తీవ్రమైన వాతావరణ పరిస్థితులే. అక్కడ బలమైన అతి చల్లని గాలులు వీచడం, జీవానికి అవసరమైన నీరు తగినంత లభించకపోవడం. మామూలుగా చెట్లు తమలో ఉండే నీటిని ఆకుల ద్వారా భాష్పీభవనం చెంది కోల్పోతూ ఉంటాయి. దాంతో వాటికి కావలసిన నీరు భూమి నుంచి అందకపోతే, ఆ పరిస్థితుల్లో అవి ఎండి పోతాయి. పర్వతాలపై భూగర్భజలం చాలావరకు గడ్డకట్టుకుపోవడంతో, అక్కడి చెట్ల వేర్లకు నీరు అందవు. తగినంత నీరు లభించకపోవడంతో చెట్ల లోపలి భాగాల్లో పీడనం తగ్గి, నీరు ప్రవహించే మార్గాల్లో పగుళ్లు ఏర్పడి హాని కలిగించే గాలి బుడగలు ఏర్పడుతాయి. పరిసరాల్లోని ఉష్ణోగ్రత బాగా తగ్గినప్పుడు కూడా చెట్లలో ఉండే నీరు ఘనీభవించే ప్రమాదం ఉంది. చెట్ల లోని నీరంతా భాష్పీభవనం చెందినా తట్టుకోగల శక్తి ఉండే సరివి, అశోకా చెట్ల లాంటివి పర్వతాలపై పెరుగుతాయి.

🌏చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 13🌏

🔎సంఘటనలు🔍

☀1931 : న్యూఢిల్లీ భారతదేశ రాజధానిగా నిర్ణయంచబడింది.

*❣జననాలు❣*

🌟1879: సరోజినీ నాయుడు, భారత కోకిల. (మ.1949)1880: గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి, సుప్రసిద్ధ పండితులు. (మ.1997)

🌟1911 : ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ జననం (మ.1984).

🌟1913 : పండితుడు గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి జననం (మ.1997).

🌟1914: మాదాల నారాయణస్వామి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (మ.2013)

🌟1930: నూతి శంకరరావు, ఆర్యసమాజ్ కు చెందిన ప్రముఖ నాయకుడు. నిజాం వ్యతిరేక ఉద్యమం వహించాడు.

🌟1972: నూనె శ్రీనివాసరావు, సామాజిక శాస్త్రవేత్త.

🌟1974 : బ్రిటీష్ గాయకుడు-గేయరచయిత రాబీ విలియమ్స్ జననం.

💐మరణాలు💐

🏵1971 : మొట్టమొదటి తెలుగు సినిమా కథానాయకి సురభి కమలాబాయి మరణం (జ.1907).

🏵2014: బాలు మహేంద్ర, దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు మరియు దర్శకుడు. (జ.1939)

🏵2015: పి. కేశవ రెడ్డి, ప్రముఖ తెలుగు నవలా రచయిత. (జ.1946)

🏵2015: ఎస్.మునిసుందరం కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు. (జ.1937)

0 comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top