Search This Blog

  • 🖨️ Inter Hall tickets NEW...
  • MORE TO VIEW

Monday, 10 February 2020

School Assembly Dt.11/2/2020

*🙏పాఠశాల అసెంబ్లీ కోసం🙏*

*---11.02.2020--*

*GSRAO GK GROUPS*

 *🔍నేటి ముఖ్యమైన వార్తలు🔎*

*1.పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు గడువును 2021 డిసెంబరు వరకు పొగిడించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.*

*2.తెలంగాణ సమాచార హక్కుచట్టం కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఐదుగురు సమాచార కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.రాష్ట్రంలో ప్రస్తుతం సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్‌గా రాజాసదారాం, సభ్యునిగా బుద్ధా మురళి కొనసాగుతున్నారు.*

*3.‘కరోనా’పై అపోహలు వద్దనీ, రాష్ట్రంలో వైరస్‌ జాడ లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు.*

*4.ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ రాష్ట్రంలోని టీచర్లకు విదేశాల్లో బోధించేందుకు వీలుగా విదేశీ భాషలు నేర్పించాలని సూచించారు.*

*5.ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలు రాష్ర్టాల అభీష్టమని, కోటాకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.*

*6.కరోనా పరీక్షల కోసం నిలిపివేసిన జపాన్‌ నౌక ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’లో భారత్‌కు చెందిన ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారని అక్కడి భారత రాయబార కార్యాలయం తెలిపింది.*

*7.సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక అకాడమీ అవార్డు ‘ఆస్కార్‌’ ప్రదానోత్సవం లాస్‌ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరిగింది.*

*8.భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ రోజు (మంగళవారం) చివరిదైన మూడో వన్డే జరగనుంది.*

*👉నేటి సూక్తి.*

*వాడని ఇనుము తుప్పు పడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్దకం మెదడును నిస్తేజం చేస్తుంది.*

*🔆మంచి పద్యం🔆*

*అతి బాల్యములోనైనను,*
*బ్రతికూలపు మార్గములఁబ్రవర్తింపక స*
*ద్గతిమీఱ మెలఁగ నేర్చిన*
*నతనికి లోకమున సౌఖ్యమగును కుమారా!*

*👉తాత్పర్యం: ఓ కుమారా! ఎవడు లోకమునందు చిన్నవాడుగా నుండి ఉన్నప్పటిని, విరుద్ధముగా నడవక మంచిమార్గమున నడుచుచుండునో వాడు లోకమున సుఖముగా జీవింపగలడు.*

*♦నేటి ప్రశ్న♦*

*Q. భారతదేశంలో బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని మొదటిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టారు?*

*A: 1929*

*Q. రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వీ కాలం*

*A: 5 సంవ‌త్స‌రాలు*

*GSRAO GK GROUPS జి సైదేశ్వర రావు*

🔳చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 11

1847 : ప్రసిద్ధ శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ జననం.

1865 : ప్రముఖ హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, పానుగంటి లక్ష్మీ నరసింహారావు జననం.

1917 : ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు తరిమెల నాగిరెడ్డి జననం.

1922 : సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేయాలని బార్డోలీ లో జరిగిన కాంగ్రెసు సమావేశం నిర్ణయించింది.

1942 : పారిశ్రామికవేత్త జమ్నాలాల్ బజాజ్ మరణం.

1968 : రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ మాజీ అధ్యక్షుడు, భాజపా హైందవ రాష్ట్రం సిద్దాంతకర్త దీనదయాళ్ ఉపాధ్యాయ మరణం.

1969 : అమెరికన్ నటీమణి జెన్నిఫర్ అనిస్టన్ జననం.

1974 : సుప్రసిద్ధ గాయకుడు, సంగీత దర్శకుడు, ఘంటసాల వెంకటేశ్వరరావు మరణం.

1977 : భారత మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ మరణం.

0 comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top