Search This Blog

  • 🖨️ Inter Hall tickets NEW...
  • MORE TO VIEW

Saturday, 8 February 2020

Job charts -సచివాలయ ఉద్యోగులకు రోజూ క్షేత్రస్థాయి పర్యటనలు జాబ్‌ చార్ట్‌లు సిద్ధం చేసిన ప్రభుత్వం

సచివాలయ ఉద్యోగులకు రోజూ క్షేత్రస్థాయి పర్యటనలు
జాబ్‌ చార్ట్‌లు సిద్ధం చేసిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ప్రతి రోజూ ఉదయమే క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అందుతున్న పౌర సేవలను స్వయంగా పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వీరు కార్యాలయ పనివేళలకు ముందుగానే తెల్లవారుజామున 5.30 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు తమ పరిధిలో పర్యటించి ప్రజలను కలుసుకోవాల్సి ఉంటుంది. నవరత్నాలతో పాటు ఇతర సేవలన్నీ వలంటీర్ల ద్వారా ప్రజల ముంగిటకే అందించే లక్ష్యంలో భాగంగా సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం జాబ్‌ చార్ట్‌లను కూడా రూపొందించింది.

జాబ్‌ చార్ట్‌ ఇలా... 

- క్షేత్రస్థాయి పర్యటనలో ప్రధానంగా పారిశుధ్య పనులు, పారిశుధ్య కార్మికుల హాజరు, పనితీరును పరిశీలించాలి. 
- మంచినీటి సరఫరా, వీధిలైట్ల పనితీరు, స్పందనలో అందిన వినతులు, ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. 
- క్షేత్రస్థాయి పర్యటనలో గుర్తించిన సమస్యలపై మధ్యాహ్నం నుంచి చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. 
- ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణ వివరాలతో పాటు వలంటీర్ల పనితీరు గురించి తెలుసుకోవాలి. 
- ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు ఉద్యోగులు సచివాలయ కార్యాలయాల్లో తప్పనిసరిగా ఉండాలి. 
- ఉద్యోగులు రోజువారీ డైరీని నిర్వహించాలి.
- ఉద్యోగులంతా పంచాయతీ సమావేశాలు, గ్రామ సభలకు హాజరవ్వాలి. అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో భాగస్వాములు కావాలి. 
- నవరత్నాలతోపాటు ఇతర సేవలను ప్రజల ముంగిటకు సమర్థంగా, సకాలంలో చేర్చడంపై గ్రామ సచివాలయం దృష్టి సారించాలి.
- నవరత్నాలకు సంబంధించి ప్రజలకు ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. 
- ప్రతి రోజూ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు అభ్యర్థనలను నిర్దిష్ట సమయంలోగా పరిష్కరించాలి. 
- ప్రభుత్వ, గ్రామ పంచాయతీ ఆస్తులను పరిరక్షించాలి. 
- 1956 కల్తీ ఆహార నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. 
- తూనికలు, కొలతల్లో అక్రమాలను నిరోధించడం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన,  బాల్య వివాహాల నివారణ, దశలవారీగా మద్యనిషేధం, గృహ హింస చట్టం అమలుకు కృషి చేయాలి.
- వివిధ పథకాల లబ్ధిదారుల గుర్తింపు, పంపిణీపై సమీక్షించాలి. 
- లే అవుట్లు, తాగునీటి కనెక్షన్లు, వ్యాపార లైసెన్సుల కోసం అందిన దరఖాస్తులను తనిఖీ చేయాలి

0 comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top