Search This Blog

  • 🖨️ Inter Hall tickets NEW...
  • MORE TO VIEW

Saturday, 8 February 2020

Badde Naik - మనసున్న మా రాజు...ఆ మాష్టారు.....ఆపదలో ఉన్న వారికి ఆపద్బాంధవుడిగా బద్దేనాయక్..

నేను నా కుటుంబం బాగుంటే చాలు అనుకునే ఈ రోజులలో ఓ మాస్టర్ మంచి మనసుతో సమాజ సేవలో తరిస్తున్నారు.
చిన్న వయసులోనే పెద్ద మనసు తో ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నారు. పాఠశాలలు , పేద విద్యార్థులకు విద్యా సామగ్రి అందిస్తూ నేటి యువతకు ఆదర్శం గా నిలుస్తున్నారు.
ఆయనే అనంతపురం జిల్లా, కంబదూరు మండలం తాళ్లూరు వెంకటపల్లి తండా కి చెందిన లక్ష్మీబాయి , వెంకటానాయక్ దంపతుల మూడో కుమారుడు బద్దే నాయక్.
శెట్టూరు మండలం కైరేవు ప్రాధమికొన్నత  పాఠశాల లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఆయన ఇటీవలే కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ అందుకున్నారు.

సేవకార్యక్రమాలలో కొన్ని....

1.పి.వెంకటపల్లి తండాలో శుద్ధజల కేంద్రం , LED దీపాల ఏర్పాటు.
2.చౌలూరు ప్రధమిక పాఠశాలలో చిన్న R.O ప్లాంట్ ఏర్పాటు చేశారు.
3. కైరేవు పాఠశాల LED TV, జారుడు బల్ల ,ప్రధాన గేట్ ,Name board ఏర్పాటు చేశారు.
4.కైరేవు పాఠశాల లో తరగతి గదులు , మరుగు దొడ్ల శుభ్రత కోసం నెలకు 1500/-  ఇస్తున్నారు.
5.RDT వారి స్పందించు ,సాయమందించు పధకం కిందప్రతి నెల ఆర్ధిక సాయం అందచేస్తున్నారు.
6.రైలు ప్రమాదం లో రెండు కాళ్ళు పోగొట్టుకున్న కల్యాణ దుర్గానికి చెందిన కావ్య కు 5 వేల ఆర్ధిక సాయం అందించాడు.
7.కైరేవు కి చెందిన శిల్ప అనే విద్యార్థిని గుండె శస్త్ర చికిత్స కి 5 వేలు అందించారు.
8 . వర్షం తో ఇళ్లు కోల్పోయిన కల్యాణ దుర్గం జయనగర్ కి చెందిన నూర్ బాషా కుటుంబానికి 10 వేలు సాయం అందించాడు.
9.కైరేవు ,గొల్లల దొడ్డి ,తిప్పన పల్లి, మంగం పల్లి పాఠశాలల విద్యార్థులకు పలకలు ,పుస్తకాలు పంపిణీ చేశారు.
10.ZPHS ,తిప్పనపల్లి ,MPUP తిప్పన పల్లి ,గొల్లల దొడ్డి ,MNహళ్లి, MPPSపర్లచేడు, MPPS బచ్చే హళ్లి , అంబేద్కర్ నగర్ పాఠశాలలకు హాండ్ మైక్ లు అందించారు.
11.ZPHS కుందుర్పి , ZPHS చెర్లోపల్లి  లలో జోనల్ గ్రిక్స్ పోటీలకు 20 వేలు సాయం అందించారు.
12.అనంతపురం లోని చిన్నారికి గుండె ఆపరేషన్ కి తోటి ఉపాధ్యాయుల తో కలసి 10 వేల నగదు అందించాడు.
13.శెట్టూరు లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు 10 వేల రూపాయలు ఇచ్చాడు.
14.పాలవాయి లో దుర్గమ్మ విగ్రహ ప్రతిష్ఠ కు బాబు అను యువకునితో కలిసి అన్నదాన కార్యక్రమము చేశారు.

మదర్ థెరిస్సా ఆదర్శం

ఆ నలుగురు సినిమా చూసినప్పటి నుంచి ఆపదలో ఉన్న వారికి సాయం అందచేస్తున్నా. వేతనం లో 45 శాతం ఇతరుల కోసం వెచ్చిస్తున్నా. ఆపదలో ఉన్న వారిని అదుకుంటేనే మానవ జన్మ కు సార్ధకత అని బద్దెనాయక్ తెలిపారు.

📢
ఫ్రెండ్స్....మీ స్కూల్స్ లో జరుగు వినూత్న కార్యక్రమాలు....సక్సెస్ స్టోరీస్ మన్నం వెబ్ 9030804050 కి వాట్సప్ చేయండి....
ఇలాంటి కధనాలు మన మన్నం వెబ్ లో  ప్రచురించుట సంతోషకరం....
💐
MannamWeb
Joy Of Sharing...
🏌‍♂
చిత్రమాలిక.....చివరివరకు చూడండి.....
కేరళ వరద బాధితులకు ఒక నెల జీతం విరాళం అప్పటి R.D.Oగారి చెక్కును అందజేస్తూ
కైరేవు పాఠశాలకు గేటు
బచ్చేహళ్ళి ప్రాథమిక పాఠశాలకు Hand mike వితరణ
వర్షాలకు ఇల్లు కోల్పోయిన నూర్ కుటుంబానికి 10వేల ఆర్థిక సహాయం

అంబేద్కర్ నగర్ పాఠశాలకు Hand mike వితరణ

కైరేవు పాఠశాల విద్యార్థులకు పలకలు, నోటుపుస్తకాల పంపిణీ



మాకొడికి గ్రామంలోని ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలో దాదాపుగా 182 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ రెండు పాఠశాలలకు ఒక సింటెక్స్ ఉండేది అది పగిలిపోయి నీరు వృథా అవుతోంది. విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో నీటి కోసం పాఠశాలకు దగ్గరగా ఉన్న ఇళ్ళ దగ్గరకు వెళ్ళి నీరు తెచ్చుకునేవారు. ఇదే పాఠశాలలో పని చేస్తున్న *ఉపాధ్యాయుడు బద్దేనాయక్* ఇది గమనించి  కళ్యాణదుర్గానికి చెందిన ఓ వ్యక్తిని (పేరు చెప్పడానికి ఇష్టపడలేదు) ఈ విషయం తెలియజేయగా వారు వెంటనే సింటెక్స్ మాకొడికి పాఠశాలకు అందజేశారు. ఈరోజు నుండి రెండు పాఠశాలలకు నీటి సమస్య తీరినట్లైంది. బద్దేనాయక్ గారు ఎప్పుడు సొంతగా చేసేవారు.ఈసారి పాఠశాలకు  ఇతరులతో విరాళం చేయించి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.
    ఉన్నత పాఠశాల  మరియు ప్రథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరిక్రిష్ణ గారు, ఈశ్వరమ్మ గారు మరియు రెండు పాఠశాలల ఉపాధ్యాయ సిబ్బంది మరియు *మధ్యాహ్న భోజన ఏజెన్సి వారు* బద్దేనాయక్ గారిని మరియు దాతకు అభినందించారు.



చేసిన సేవలకు గుర్తుగా ఉపాధ్యాయ సంఘాల వారు మెమెంటోతోఋసత్కారం

0 comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top