Search This Blog

MORE TO VIEW

Sunday, 5 January 2020

Nobel Prize( Dec 10) - నోబెల్‌ బహుమతుల ఏర్పాటుకు కారణం ఇదే...వివరాలు..


ఇది ప్రపంచ ప్రఖ్యాతమైన నోబెల్‌ బహుతుల ప్రకటన నెల. నేడు (అక్టోబరు 21) ఆ బహుమతులను ప్రవేశపెట్టిన ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పుట్టిన రోజు. ఆయన మరణించి 125 సంవత్సరాలైనా, తన పేరిట ఆయన నెలకొల్పిన 'నోబెల్‌ బహుమతుల ప్రకటన ప్రతి సంవత్సరం ఈ నెలలోను, ఆయన వర్ధంతి నెల అయిన డిసెంబరులో ఆ బహుమతుల ప్రదానం జరుగుతుంది కాబట్టి, అప్పుడు ఆయన పేరు ప్రపంచ మానవాళి నోటిలో నలుగుతూ వ్ఞంటుంది.
అజరామరుడు ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌
అట్టివారు మరణించినా, వారు అజరామరులే! ఆల్‌ఫ్రెడ్‌ జీవితం ఎన్నో చిత్రవిచిత్రాలతో కూడినట్టిది. ఆయన స్వీడన్‌ దేశానికి చెందిన రసాయనశాస్త్రవేత్త. బహుముఖ ప్రజ్ఞావంతుడు- ఇంజినీర్‌, నూతన విషయాల అన్వేషకుడు, ఆయుధాల తయారీదారు.
భారతదేశంలో రాజీవ్‌గాంధీ హయాంలో మార్మోగిపోయిన 'బోఫోర్స్‌ శతఘ్నలను ఆయన ఏనాడో కనిపెట్టాడు. ఆయన 350 విభిన్న పరిశోధనా ఫలితాలకు పేటెంట్‌ హక్కులను పొందాడు. వాటిలో అన్నింటికంటె ప్రమాదకరమైనది- 'డైనమైట్‌! దానితో కొండలను కూడా పేల్చవచ్చు.
ఆయన తండ్రి ఇమాన్సుయేల్‌ కూడా ఆధునిక ఫ్లైవ్ఞడ్‌ను కనుగొన్న పరిశోధకుడు. ఆల్‌ఫ్రెడ్‌ దురదృష్టవంతుడు. ఆయన ముగ్గురిని ప్రేమించినా ఎవ్వరితోను వివాహం కాలేదు. ఏదీ కొనసాగలేదు. అందువల్ల ఆయన అవివాహితుడుగానే ఉండిపోయాడు.
అయితే, ఆస్ట్రియాకు చెందిన 'బెర్తా అనే ఆమె ఆయనకు కొంత కాలం కార్యదర్శిగా పనిచేసిన తరువాత తన పూర్వప్రేమికున్ని వివాహం చేసుకోడానికి వెళ్లిపోయింది. అయితే 'నోబెల్‌ శాంతి బహుమతి ఏర్పాటుకు ఆమె చొరవ కారణమంటారు!
బహుభాషావేత్త
ఆల్‌ఫ్రెడ్‌ విజ్ఞానశాస్త్రవేత్త మాత్రమే కాదు-బహుభాషావేత్త కూడా. స్వీడిష్‌, ఫ్రెంచి, రష్యన్‌, ఇంగ్లీషు, జర్మన్‌, ఇటాలియన్‌ -ఆరుభాషలలో ఆయన ప్రవీణుడు. ఇంగ్లీషులో ఆయన కవితలు కూడా రచించాడు.
నోబెల్‌ బహుమతుల ఏర్పాటుకు విచిత్ర కారణం
1888లో ఒక సంఘటనే ఆయన నోబెల్‌ బహుమతుల ఏర్పాటుకు కారణమైంది! ఆల్‌ఫ్రెడ్‌ కేన్స్‌లో వ్ఞండగా, ఆయన సోదరుడు లుడ్విగ్‌ మరణించాడు. అప్పుడు ఒక ఫ్రెంచి వార్తా పత్రిక వింత కథనాన్ని ప్రచురించింది. చనిపోయింది ఆల్‌ఫ్రెడ్‌ అనుకుని ఆయన మృతివార్తలో 'డైనమైట్‌ కనిపెట్టిన 'మృత్యు వ్యాపారి 'మరణం అని శీర్షిక పెట్టి ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ డైనమైట్‌ను కనిపెట్టి, అనేక మంది మృతికి కారకుడై, తుదకు తానే మృత్యువ్ఞపాలైనాడు అంటూ రాసింది! ఇది చదివిన ఆల్‌ఫ్రెడ్‌ నిరాశానిస్పృహలకు లోనైనాడు. 'నేను కనిపెట్టిన 'డైనమైట్‌ అంత మానవ విధ్వంసకమా? అని వాపోయాడు.
నోబెల్‌ బహుమతుల ప్రాదుర్భావం
వెంటనే ఒక ఫ్రెంచి క్లబ్‌లో పాత్రికేయులను సమావేశపరచి, తన పేరిట శాశ్వతంగా ప్రతి సంవత్సరం నోబెల్‌ బహుమతులను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించి, వాటి నిర్వహణకు 25 కోట్ల అమెరికన్‌ డాలర్లను ఒక శాశ్వత నిధిగా ఏర్పరుస్తున్నట్టు ప్రకటించాడు. మొత్తం బహుమతులలో భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యశాస్త్రం, దేహధర్మశాస్త్రం, సాహిత్యం, శాంతిబహుమతులను ప్రకటించాడు.
మరి, ఆర్థిక నోబెల్‌ ఎలా వచ్చింది?
మరి, భారతీయులు, అందులోను బెంగాలీలైన డాక్టర్‌ అమర్త్యసేన్‌, మొన్న అభిజిత్‌ బెనర్జీ దంపతులకు 'ఆర్థిక నోబెల్‌ బహుమతి ఎలా వచ్చింది? 1969లో స్వీడన్‌ ప్రభుత్వం ఈ ఆర్థిక బహుమతిని నోబెల్‌ పేరిట ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఆర్థికశాస్త్రంలో కూడా నోబెల్‌ బహుమతినిస్తున్నారు. యావత్ప్రపంచంలోనే అత్యంత గౌరవదాయకమైన ఈ ఏడు బహుమతులను ఆల్‌ఫ్రెడ్‌నోబెల్‌ వర్ధంతి రోజైన డిసెంబరు 10వ తేదీన విజేతలకు బహుకరిస్తారు. ఆల్‌ఫ్రెడ్‌ మృతిచెంది 125 సంవత్సరాలు.

డాక్టర్‌ తుర్లపాటి కుటుంబ రావు,("పద్మశ్రీ అవార్డు గ్రహీత)

0 comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top