అతివలకు అండగా మహిళా మిత్ర
మహిళలపై నేరాల నియంత్రణే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ‘మహిళా మిత్ర’కు ఏపీ పోలీసు శాఖ శ్రీకారం చుట్టింది. ప్రతీ పోలీసుస్టేషన్ పరిధిలోని గ్రామాలు, వార్డుల్లో మహిళామిత్ర కమిటీలు ఏర్పాటుకానున్నాయి. స్వచ్ఛంద సేవాసంస్థలు, బోధన రంగంలో అనుభవమున్నవారు, మహిళలు, బాలల సమస్యలపై అవగాహన ఉన్నవారితో వీటిని పోలీసుశాఖ ఏర్పాటు చేయనుంది. పోలీసుస్టేషన్ స్థాయిలో కానిస్టేబుళ్లు, జిల్లా స్థాయిలో డీఎస్పీ స్థాయి అధికారిణి, రాష్ట్ర స్థాయిలో మహిళా రక్షణ అదనపు ఎస్పీ వీరిని సమన్వయపరుస్తారు. డీజీపీ గౌతమ్‌సవాంగ్ ఆలోచనల నుంచి ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. విజయవాడలో ప్రయోగాత్మకంగా అమలైన దీన్ని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనిట్లలో అమలు చేయనున్నారు. మహిళలపై నేరాలు, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన తీరుపై మహిళామిత్రలు అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. ఎంపిక ఇలా..
* మహిళలకు అండగా నిలిచేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారిని మహిళామిత్రలుగా ఎంపిక చేస్తారు.
* ఆయా పోలీసుస్టేషన్ల పరిధిలోని ప్రతి గ్రామానికి, వార్డుకు ఒక మహిళామిత్ర కమిటీ ఉండేలా చూస్తారు.
* మహిళలకు ఉద్దేశించిన చట్టాలు, వారిపై నేరాలకు పాల్పడితే శిక్షలు, మోసాలబారిన పడితే ఫిర్యాదు చేయటమెలా తదితర అంశాలపై శిక్షణనిస్తారువీరేం చేస్తారంటే?
* మహిళలు, బాలల సమస్యలను గుర్తించి భద్రతను పర్యవేక్షిస్తారు.
* సమస్యలను ప్రాథమిక దశలోనే తెలుసుకుని వివరాలను ఎప్పటికప్పుడు పోలీసుస్టేషన్‌కు చేరవేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. లింగ సమానత్వంపై చైతన్యపరుస్తారు.
* మహిళలు సమస్యలు ఎదుర్కొంటే డయల్ 100, 112, 191, 1100 తదితర ఫోన్‌నెంబర్లకు కాల్ చేసి వాటి సేవలు వినియోగించుకునేలా చూస్తారు.
* బాల్యవివాహాలు, వెట్టిచాకిరీ, గొలుసు దుకాణాలు, జూదం, వీధుల్లో మహిళలను వేధించటం తదితర అంశాలను గుర్తిస్తారు. మహిళల భద్రతకు ఇబ్బందికరంగా ఉన్న ప్రాంతాల వివరాలను పోలీసులకు తెలియజేస్తారు.

0 comments:
Post a Comment