Search This Blog

MORE TO VIEW

Wednesday, 11 December 2019

నిద్రకు ముందు నిమ్మ, తేనె టీ !


నిద్రకు ముందు నిమ్మ, తేనె టీ !

వంటింటి దినుసుల్లో ఒకటైన జీలకర్ర కేవలం వంటలో మాత్రమే కాదు, ఇది అనేక ఔషధ లక్షణాలను కలిగి ఉన్నందున ఆయుర్వేదంలో ప్రధాన పదార్థంగా ఉపయోగించబడింది. జీలకర్ర ఆహారాలకు మంచి వాసనను ఇవ్వడమే కాదు, ఇది శరీరంలో అనేక అద్భుతాలను చేస్తుంది. అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఒకవేళ వంటలో జీలకర్ర మాత్రమే కాకుండా, ఆ జీలకర్రతో టీ తయారు చేసుకుంటే, శరీరంలోని అనేక సమస్యలను వదిలించుకోవచ్చు.

అందుకు చేయాల్సిందల్లా జీలకర్రను నీటిలో వేసి మరిగించాలి. రెగ్యులర్‌గా ఈ వాటర్‌ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందని మన అందరికి తెలుసు. కానీ నిమ్మరసం, తేనెతో జీలకర్ర కలిపి చేసిన టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.
జీలకర్ర అతి చిన్న పరిమాణంలో ఉన్నా పోషకాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి.
ఇందులో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, భాస్వరం, విటమిన్‌ సి, విటమిన్‌ ఎ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ప్రతి ఒక్కటి ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. రోజు ఈ టీ తాగితే శరీరం బరువు తగ్గుతుంది. ఈ టీలోని జీలకర్ర, నిమ్మకాయ శరీరంలో జీవక్రియను ప్రోత్సహిస్తాయి. కొవ్వుల స్తబ్దతను తగ్గిస్తాయి. వేగంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. కాబట్టి ఊబకాయంతో బాధపడుతున్న వారు, ప్రతిరాత్రి పడుకునే ముందు రెగ్యులర్‌గా ఈ టీ తాగాలి. ఉత్తమ ప్రభావానికి పొందడానికి, ఖాళీ కడుపుతో సాధారణ

టీ తాగాలి. ప్రతి రాత్రి రెగ్యులర్‌గా ఈ టీ తాగడం వల్ల శరీరం నుండి అదనపు టాక్సిన్స్‌ తొలగించి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవచ్చు. శరీరం లోపల టాక్సిన్‌ లేకపోతే, అవయవాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ టీ రక్తాన్ని కూడా శుభ్రపరుస్తుంది. మలబద్ధకంతో బాధపడుతున్నారా? అలా అయితే రాత్రి పూట భోజనం చేయడానికి ముందు ఒక గ్లాసులో ఒక టీ స్పూన్‌ జీలకర్ర పొడి వేసి తాగాలి. ఇది మలబద్ధకం సమస్యను వెంటనే పరిష్కరిస్తుంది.
నిజానికి ఈ పానీయం ఉదయం అలారంలాగా మేల్కొనేలా చేస్తుంది. జీలకర్రలోని ఇనుము రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి ఐరన్‌ సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
సంక్రమణ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జీలకర్ర టీ సహజంగా రక్తహీనత సమస్యను నయం చేస్తుంది. ఐరన్‌ లోపం వల్ల రక్తహీనత వస్తుంది. కాబట్టి రోజు ఒక గ్లాసు టీ స్పూన్‌ టీ తాగితే శరీరంలో ఐరన్‌ శాతం పెరుగుతుంది. రక్తహీనత సమస్యను తొలగిస్తుంది. జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లయితే ఛాతీ ప్రాంతంలో శ్లేషం పెరగడాన్ని నిరోధిస్తుంది.
నిరంతరం దగ్గు నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. జీలకర్ర శరీరం నుండి విషాన్ని తొలగించడానికి ఉత్తమమైన పానీయం. ఈ రెగ్యులర్‌ టీని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల పిత్త ఉత్పత్తికి, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

More Health tips... మరింత ఆరోగ్య సమాచారం కోసం...New

0 comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top