⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Saturday, 9 November 2019

World on wheels -Digital literacy -వరల్డ్ ఆన్ వీల్స్ -'గ్రామీణులకు డిజిటల్‌ అక్షరాస్యత

'గ్రామీణులకు డిజిటల్‌ అక్షరాస్యత'

🔹గ్రామీణ ప్రాంతాల్లో... విద్యార్థులు, నిరుద్యోగ యువత, మహిళలకు డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అడుగులు వేస్తుంది. వరల్డ్ ఆన్ వీల్స్ అనే నినాదంతో నైపుణ్యరథం ద్వారా గ్రామీణులకు అవగాహన కల్పించనుంది. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతలో ఆరు జిల్లాల్లో ఏడాదిపాటు యువత, మహిళలకు శిక్షణ అందించనుంది..
🔸ఇప్పటివరకు ఇంజినీరింగ్, డిగ్రీ, వృత్తి విద్యా కోర్సులకు మాత్రమే పరిమితమైన నైపుణ్యాభివృద్ధిని గ్రామీణ ప్రాంతాలకు పరిచయం చేసేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సిద్ధమైంది.గ్రామీణులను శక్తిమంతులుగా తీర్చే ఉద్దేశంతో హెచ్​పీ సంస్థ... వరల్డ్ ఆన్ వీల్స్ అనే భావనతో ముందుకొచ్చింది. నైపుణ్యరథం పేరుతో ఓ బస్సుని తయారుచేసి.... 20 కంప్యూటర్లు, ప్రింటింగ్ సౌకర్యం, ఈ-లెర్నింగ్ టూల్స్ అందుబాటులో ఉంచింది. తొలివిడతలో ఆరు జిల్లాల్లో ఈ రథం సేవలు అందించనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కర్నూలులో వీటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి జిల్లాలో కనీసం 5 గ్రామాల్లో.... వెయ్యి మందికి నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో శిక్షణ ఇచ్చేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
🍁3 విభాగాలుగా సేవలు
🔹నైపుణ్యరథం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నైపుణ్యాభివృద్ధి సంస్థ....3 విభాగాలుగా సేవలు అందించనుంది. ఆరు నుంచి పదోతరగతి వరకు చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, నిరుద్యోగ యువత, స్వయం సహాయక సంఘాలకు... వేరువేరుగా శిక్షణ అందించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కల్పిస్తారు. నీరు, పరిశుభ్రత, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌తో పాటు మహిళలు, పిల్లలఆరోగ్యం, పోషకాహారం అంశాలపై అవగాహన కల్పించనున్నారు.
🍁ఒక్కో బ్యాచ్ కి గంట చొప్పున శిక్షణ
🔸ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ.. ఒక్కో బ్యాచ్‌కి గంట చొప్పున.... 20 రోజుల పాటు మొత్తం 120 మంది శిక్షణ ఇస్తారు. స్వయం సహాయక బృందాలకు విండోస్, ఇంటర్నెట్ అప్లికేషన్ సహా ఆర్థిక అంశాలపై అవగాహన కల్పించనున్నారు.

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top