⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Sunday, 10 November 2019

TN SESHAN -ఎన్నికల సంస్కర్త టి.ఎన్‌.శేషన్‌ కన్నుమూత...ప్రత్యేక కథనం....



ఎన్నికల సంస్కర్త టి.ఎన్‌.శేషన్‌ కన్నుమూత
నిబంధనల అమలులో  చండశాసనుడిగా పేరొందిన  మాజీ సీఈసీ
ఈసీకి ప్రత్యేక గుర్తింపు  తెచ్చిన అధికారి

చెన్నై: ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) టి.నారాయణ శేషన్‌ (87) కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నై అడయారులోని తన నివాసంలో ఆదివారం రాత్రి 9.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా ఆయన అస్వస్థులుగా ఉన్నారు. ఎన్నికల  సంస్కరణలు, నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయడం ద్వారా దేశ ప్రజల మన్ననలు అందుకున్న ఆయన నిష్కర్ష అధికారిగా చరిత్రలో నిలిచిపోయారు. ఆయన మృతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ తదితర ప్రముఖులు నివాళుర్పించారు. ‘‘అత్యంత నిబద్ధత, నిజాయతీతో దేశానికి సేవలు అందించిన అద్భుత అధికారిగా శేషన్‌ నిలిచిపోయారు. ఎన్నికల సంస్కరణలకు ఆయన చేసిన సేవలు మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశాయి’’ అని ప్రధాని కొనియాడారు. శేషన్‌ 1932లో కేరళలోని పాలక్కడ్‌ జిల్లాలోని తిరునెల్లైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు నారాయణయ్యర్‌, సీతాలక్ష్మి. పాలక్కడ్‌లో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన శేషన్‌ చెన్నైలోని క్రిస్టియన్‌ కళాశాలలో బీఎస్సీ (ఆనర్స్‌) చేశారు. అనంతరం ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. 1955 ఐఏఎస్‌ బ్యాచ్‌కి చెందిన ఆయన తమిళనాడులో వివిధ హోదాల్లో పనిచేశారు. 1989లో భారత కేబినెట్‌ కార్యదర్శి స్థాయికి చేరుకున్నారు. ఆ హోదాలో 8 నెలలు మాత్రమే ఉన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత తక్కువ కాలం ఆ పదవిలో ఉన్న అధికారిగా ఆయన నిలిచిపోయారు. 1990 డిసెంబర్‌ 12 నుంచి 1996 డిసెంబర్‌ 11 వరకూ ఎన్నికల కమిషన్‌ ప్రధాన కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. శేషన్‌ 1997లో రాష్ట్రపతి పదవికి కూడా పోటీ చేశారు. ఆయన చేసిన సేవలకు రామన్‌ మెగసెసె పురస్కారం లభించింది.
చండ‘శేషన్‌’డు
విధి నిర్వహణలో చండశాసనుడిగా టి.ఎన్‌.శేషన్‌కు పేరుంది. భారతావనిలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా ఆయన అత్యంత కట్టుదిట్టంగా వ్యవహరించారు. రాజకీయ ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ్గలేదు. ఓటర్లలో అభద్రతా భావాన్ని తొలగించారు. ఎన్నికల ప్రక్రియలో చట్టాలను కఠినంగా అమలు చేశారు. నియమావళిని తుంగలో తొక్కాలని చూసే రాజకీయ పార్టీల అభ్యర్థుల పాలిట సింహస్వప్నంగా నిలిచారు.
ధైర్యంగా ఓటేసేలా..
శేషన్‌ ఎన్నికల కమిషన్‌ సారథ్య బాధ్యతలు చేపట్టే నాటికి ఎన్నికల్లో హింస అధికంగా చోటుచేసుకుంటుండేది. కొన్ని వర్గాల ప్రజలు ఓటింగ్‌కు దూరంగా ఉండేవారు. దీంతో శేషన్‌ పోలింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తును భారీగా పెంచారు. రిగ్గింగ్‌కు పూర్తిగా అడ్డుకట్ట వేశారు. ఓటర్లను ఎవరూ భయభ్రాంతులకు గురిచేయకుండా చర్యలు తీసుకున్నారు. 1991లో మత ఘర్షణలతో పరిస్థితులు వేడెక్కిన సమయంలో జరిగిన ఎన్నికల్లోనూ ఓటింగ్‌ శాతం అధికంగానే నమోదయిందంటే అందుకు కారణం శేషన్‌ ప్రభావమే. పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్ఠంగా ఉండటంతో జనం నిర్భయంగా వచ్చి ఓటేశారు.
ఉల్లంఘిస్తే ఉక్కుపాదమే
ప్రవర్తన నియమావళిని తొలిసారిగా తుచ తప్పకుండా అమలు చేయించిన ఘనత శేషన్‌దే. అప్పట్లో గవర్నర్‌ ఒకరు.. కుమారుడి తరఫున ప్రచారం చేయడంతో మధ్యప్రదేశ్‌లోని ఓ నియోజకవర్గంలో ఎన్నికలను వాయిదా వేశారు. ఆ పరిణామం చివరకు గవర్నర్‌ రాజీనామాకు దారితీసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రచార సమయం ముగిసిన తరవాత కూడా వేదికపై ప్రసంగిస్తున్న ఒక మంత్రిని శేషన్‌ బలవంతంగా కిందకి దించేశారు.  ఎన్నికల్లో అంగ, ధన బలానికి శేషన్‌ కళ్లెం వేశారు. నిబంధనలను పాటించని అభ్యర్థులను అరెస్టు చేయించడం, పార్టీలకు అంటకాగిన అధికారులను సస్పెండ్‌ చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియను సమర్థంగా నిర్వహించారు. అభ్యర్థులు పెట్టే ఖర్చులపై ఆయన మొదటిసారిగా ఆంక్షలు అమలుచేశారు. ధనిక రాజకీయ నాయకులు.. పేదరికంలో కూరుకుపోయిన గ్రామాలకు హెలికాప్టర్లలో వచ్చి మద్యం, డబ్బు పంచే పరిస్థితిని కట్టడి చేశారు. ప్రచారాల్లో మత, కుల విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలపై ఉక్కుపాదం మోపారు.  ఓటర్లకు ఫొటో గుర్తింపు కార్డులను తెచ్చారు. మతపరమైన ప్రదేశాల్లో ప్రచారాన్ని నిషేధించారు.
కేంద్ర మంత్రులను తొలగించాలంటూ పట్టు
ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ 1994లో ఇద్దరు కేంద్ర మంత్రులు సీతారాం కేసరి, కల్పనాథ్‌ రాయ్‌లను మంత్రివర్గం నుంచి తొలగించాలని నాటి ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావుకు సూచించి శేషన్‌ సంచలనం సృష్టించారు. అధికార పరిధిని దాటుతున్నారంటూ విమర్శలు వ్యక్తమైనప్పటికీ ఆయన మాత్రం దృఢ వైఖరిని మార్చుకోలేదు.
ఈసీకి కొత్త నడక
శేషన్‌ ఎన్నికల నిర్వహణ తీరు నేటికీ ఆదర్శప్రాయమని మరో మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ హెచ్‌.ఎస్‌.బ్రహ్మ ఒకానొక సందర్భంలో పేర్కొన్నారు. దాని నుంచి తాము చాలా పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పారు. ‘‘1960ల నుంచి 80ల వరకూ ఈసీ పనితీరు అగమ్యగోచరంగా ఉండేది.  ఆయనకు ముందు ఆ పదవిలో ఉన్నవారంతా ఎన్నికల ఫలితాలను ప్రకటించడానికే పరిమితమయ్యేవారు’’ అని బ్రహ్మ తెలిపారు. శేషన్‌ వచ్చిన తర్వాతే ఎన్నికల కమిషన్‌కు జవసత్వాలు సమకూరాయి.
ప్రజాభిమానం
విధి నిర్వహణలో తన నిబద్ధతతో శేషన్‌ విశేష ప్రజాదరణ పొందారు. 1994లో ఓ సంస్థ నగరాల్లోని 1,620 మంది, గ్రామాలకు చెందిన 620 మందిపై సర్వే నిర్వహించగా.. మూడింట రెండొంతుల మంది శేషన్‌ గురించి తమకు చాలా తెలుసని చెప్పారు. ఆయన నిబద్ధతను కొనియాడారు.

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top