⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Monday, 4 November 2019

ఏపీ సీస్ ఆకస్మిక బదిలీ ఎందుకంటే..?- సీస్ బదిలీ పై భిన్న వాదనలు...


ఏపీ సీఎస్‌ ఆకస్మిక బదిలీ
ప్రాధాన్యం లేని హెచ్‌ఆర్డీ సంస్థకు డైరెక్టర్‌గా ఎల్వీ సుబ్రమణ్యం
అనూహ్యంగా బదిలీపై భిన్న వాదనలు
సీఎంవోతో భేదాభిప్రాయాలే కారణమంటున్న ఒక వర్గం
దేవాలయాల్లో అన్యమతస్తుల తొలగింపు ఉత్తర్వులపై సీఎం అసంతృప్తి
తన అనుమతి లేకుండా ప్రవీణ్‌ ప్రకాశ్‌కు షోకాజ్‌పై సీఎం ఆగ్రహం
ఆయనతోనే సీఎస్‌కు బదిలీ ఉత్తర్వుల జారీ

ఏపీ సీఎస్‌ ఆకస్మిక బదిలీ

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అధికార యంత్రాంగంలో అత్యున్నత పదవిలో ఉన్న ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యాన్ని అనూహ్యంగా బదిలీ చేసింది. ఆయన్ను బాపట్లలోని ఆంధ్రప్రదేశ్‌ మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) సంస్థకు డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సీఎస్‌ను ఆకస్మికంగా బదిలీ చేయడం, ప్రాధాన్యం లేని హెచ్‌ఆర్‌డీ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌గా నియమించడం అధికార, రాజకీయ వర్గాల్లో పెను సంచలనమైంది. ఎల్వీ సుబ్రమణ్యం తక్షణం చీఫ్‌ సెక్రటరీ పోస్టు నుంచి వైదొలగి, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌కు బాధ్యతలు అప్పగించాలంటూ సాధారణ  పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి (రాజకీయ) ప్రవీణ్‌ ప్రకాశ్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రివర్గ అజెండాలో పొందుపరిచే అంశాలపై  ప్రవీణ్‌ ప్రకాశ్‌ పరిపాలనా నియమావళిని ఉల్లంఘించారంటూ సీఎస్‌ శుక్రవారం ఆయనకు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. దానికి సమాధానం ఇవ్వకుండానే ప్రవీణ్‌ ప్రకాశ్‌.. ఎల్వీ సుబ్రమణ్యానికి సోమవారం బదిలీ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఏప్రిల్‌ 6న సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సుబ్రమణ్యం సోమవారం వరకూ ఏడు నెలలు ఆ పదవిలో కొనసాగారు.

భిన్నవాదనలు
ఎల్వీ సుబ్రమణ్యం బదిలీకి కారణాలపై సీఎంవో, సచివాలయ వర్గాల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆయనకు, ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంవో) మధ్య ఇటీవల కొన్ని అంశాల్లో తలెత్తిన భేదాభిప్రాయాలే ఆకస్మిక బదిలీకి కారణం కావచ్చునని అధికార వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది.

ఏ అధికారిని ఏ పోస్టులో నియమించాలో ముఖ్యమంత్రే స్వయంగా చెప్పినా తనకు నచ్చడం లేదన్న కారణంతో ఆ నియామకాల్ని సీఎస్‌ పెండింగ్‌లో పెట్టడం ముఖ్యమంత్రిలో అసంతృప్తికి కారణమైందని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. పరిపాలనా నియమావళిని ఉల్లంఘించారంటూ ప్రవీణ్‌ ప్రకాశ్‌కి సీఎస్‌ జారీ చేసిన షోకాజ్‌ నోటీసులో ప్రస్తావించిన రెండు అంశాలు కూడా.. ముఖ్యమంత్రి సమక్షంలో సీఎస్‌, ఇతర అధికారులు ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలేనని వెల్లడించాయి. వైఎస్సార్‌ జీవనసాఫల్య పురస్కారాల ప్రతిపాదనను నేరుగా జగనే సీఎస్‌కు చెప్పారని, మర్నాడు జరిగే మంత్రివర్గ సమావేశం అజెండాలో దాన్ని పెడదామని కూడా ఆయనే అన్నారని తెలిపాయి. ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆ దస్త్రాన్ని సిద్ధం చేశాక ఆర్థికశాఖ అనుమతి లేదని సీఎస్‌ కొర్రీ పెట్టడం సీఎం ఆగ్రహానికి కారణమైందని చెబుతున్నాయి. గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు సంబంధించి సీఎస్‌ పంపించిన దస్త్రాన్ని కూడా.. మరింత లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పడం వల్లే ప్రవీణ్‌ ప్రకాశ్‌ నిలిపివేశారని తెలిపాయి. పై వ్యవహారమంతా సీఎం, సీఎస్‌ల సమక్షంలోనే జరిగినా ఆ ఫైలు ఎందుకు పంపడం లేదంటూ సుబ్రమణ్యం పట్టుబట్టడం, తన కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారికి షోకాజ్‌ నోటీసివ్వడం సీఎం ఆగ్రహానికి కారణమైనట్లు సీఎంవో వర్గాలు వివరిస్తున్నాయి.

సచివాలయ వర్గాల వాదన ఇదీ
సచివాలయ వర్గాల నుంచి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. తప్పంతా ప్రవీణ్‌ ప్రకాశ్‌వైపే ఉందని, సీఎస్‌ ఉత్తర్వుల్ని బేఖాతరు చేసి ఆయన బిజినెస్‌ రూల్స్‌ని ఉల్లంఘించారని చెబుతున్నాయి. హిందూ దేవాలయాల్లో పని చేస్తున్న అన్యమతస్తుల విషయంలో సీఎస్‌ జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించి కూడా ముఖ్యమంత్రికి ఆయనకు మధ్య అంతరం పెరిగినట్లు సచివాలయ అధికార వర్గాల సమాచారం. తిరుపతిలో ఆర్టీసీ బస్సు టిక్కెట్ల వెనుక జెరూసలెం యాత్రకు వెళ్లేవారికి ప్రభుత్వం కల్పించే సౌకర్యాల గురించిన శాఖాపరమైన సమాచారం ముద్రించడం కొన్నాళ్ల కిందట పెద్ద వివాదమైంది. దీనిపై తితిదే అధికారులతో తిరుమలలో సీఎస్‌ సమావేశమై దేవాలయాల్లో అన్యమతస్తులు ఉండరాదని విస్పష్టంగా చెప్పారు. తర్వాత దేవాదాయశాఖ పరిధిలోని దేవాలయాలు, ధార్మిక సంస్థల్లో సిబ్బంది తాము హిందువులమేనని ధ్రువీకరిస్తూ ప్రమాణపత్రాలు అందజేయాలంటూ ప్రభుత్వం సర్క్యులర్‌ జారీ చేసింది. ఈ దస్త్రాన్ని సీఎంవోకి పంపించి అనుమతి తీసుకున్నాకే, ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తుది ఉత్తర్వులిచ్చే ముందు వాటిని తమకు చూపించకపోవడంపై సీఎంవో సీఎస్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. ఒక ప్రతిపాదన లేదా విధాన నిర్ణయానికి సంబంధించిన దస్త్రానికి సీఎంవో అంగీకారం చెప్పాక కింది స్థాయిలో ఉత్తర్వులిచ్చేస్తామని సుబ్రమణ్యం జవాబిచ్చారని.. దీంతో జగన్‌ సంతృప్తి చెందకపోవడంతో అప్పటి నుంచీ ఇద్దరి మధ్య అంతరం కొనసాగుతోందని వినికిడి. తనకు ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న ప్రవీణ్‌ ప్రకాశ్‌కి, తన అనుమతి లేకుండానే సీఎస్‌ షోకాజ్‌ నోటీసివ్వడం కూడా జగన్‌ ఆగ్రహానికి కారణమైనట్లు అధికార వర్గాల సమాచారం.

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top