మొబైల్ వాలెట్లతో ఐటీ చెల్లింపు
దిల్లీ: ఎలక్ట్రానిక్ విధానంలో ఆదాయపు పన్ను (ఐ.టి.) చెల్లించేందుకు మార్గాలను మరింత విస్తృతం చేయాలని సంబంధిత శాఖ ప్రతిపాదిస్తోంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ), క్రెడిట్ కార్డులు, పేటీఎం వంటి మొబైల్ వాలెట్ల ద్వారా పన్ను చెల్లింపులు జరిపేందుకు త్వరలో అనుమతించనున్నారు. ప్రస్తుతం ఎస్బీఐ, ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండియన్ బ్యాంకు... ఈ ఆరు బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డులు/ నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే ఆదాయపు పన్ను చెల్లింపులకు వీలవుతోంది. దీనికి అదనంగా మొదట యూపీఐ ద్వారా చెల్లింపులను, ఆ తర్వాత క్రెడిట్ కార్డులు/ ఇ-వాలెట్లను అనుమతించనున్నారు.

0 comments:
Post a Comment