ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 9వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కనీసం 10 నుంచి 12 రోజుల పాటు సమావేశాలు జరగవచ్చు.ఈ నెల 27న జరిగే కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు. అసెంబ్లీ పనిదినాల గురించి బీఏసీ సమావేశంలో చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ పథకాలు,ఇసుక కొరత,పోలవరం,రాజధాని నిర్మాణం,మద్యపాన నిషేధం,ఇంగ్లీష్ మీడియం బోధనపై చర్చించనున్నారు.
0 comments:
Post a Comment