⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Friday, 22 November 2019

Amma odi latest -అమ్మ ఒడి తాజా మార్గదర్శకాలు ,Rc.242,Dt.22/11/2019


అమ్మఒడి--- మీ పాఠశాలకు సంబంధించి మార్పుచేర్పుల అనంతరం నమోదైన విద్యార్థుల, తల్లితండ్రుల వివరములను HM Login ద్వారా Reports నందు సరిచూసుకోగలరు.
జిల్లాల వారీగా అమ్మఒడి వెబ్ లింక్స్ అందుబాటులో....

FLASH... FLASH...
Student mother detailes and student mother address
details editing option inserted just now in MEO LOGINS under services tab
Mother/Guardian details and Bank details EDIT option is now available in MEO Login.

అమ్మ వడి పై తాజా సూచనలు:
అమ్మఒడి పథకం దరఖాస్తుల్లో మార్పు, చేర్పులుంటే ఈనెల 11 నుంచి 13 వరకు ఆయా పాఠశాలల్లో చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం.
అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఈనెల 15 నుంచి 18 వరకు ముసాయిదా జాబితా.
గ్రామ సభలో ప్రదర్శించి ఆమోదం పొందాలి.
ఆమోదం పొందిన జాబితాలను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ నెల 23లోగా మండల విద్యాశాఖాధికాకారుల ద్వారా డీఈవో కార్యాలయానికి పంపాలి.
ZPHS మినిస్టీరియల్ గ్రూపు
ప్రొఫార్మా-1 పై తల్లిదండ్రులు, సంరక్షకులు సంతకం అవసరం లేదు.
రేషన్ కార్డు లేని వారి వివరాలను ప్రత్యేకంగా ప్రొఫార్మా-2లో నమోదు చేయాలి.
ఆదార్ కార్డు లేకపోతే పొపార్మా-3లో నమోదు చేసి కమిషనరేట్ కు పంపించాలి.

ఫాం 2 వివరాలు నమోదు కు సంబంధించి సూచనలు

ముందుగా  కుడి వైపు టాప్ కార్నర్ లో కుటుంబం తల్లిదండ్రుల యొక్క నివాస సమాచారం అనగా అడ్రస్ వ్రాయాలి.ప్రస్తుతం నివాస సమాచారం సమాచారం నమోదు చేయవలెను.
ఆ తర్వాత హెచ్ మొబైల్ లోనే ఉంటుంది .దాని తర్వాత గ్యాప్ లో తల్లి లేదా తండ్రి మొబైల్ నెంబర్ కూడా నమోదు చేయవలెను.
 ఆ తర్వాత తల్లిదండ్రులకు సంబంధించి సమాచారం ఉంటుంది.  దాంట్లో చైల్డ్ ఇన్ఫో లో తల్లిదండ్రుల పేర్లు ఉంటాయి . కానీ  అక్కడ  తల్లి లేదా తండ్రి లేదా గార్డెన్ లలో ఎవరి రేషన్ కార్డ్ ఉండి ఆవివరాలు ఇస్తే వారి బ్యాంకు వివరాలు ఇస్తారు. వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ పోస్ట్ చేయవలెను.
బ్యాంక్ అకౌంట్ వివరాలు పొందుపరచడం ఆధార్ నెంబరు వారి యొక్క బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ వివరాలు పూర్తి చేయాలి.
 దీంతోపాటు గమనించవలసింది ఏమిటంటే ఫాం 2 లో  ఎవరికైనా వైట్  రేషన్ కార్డు గనుక ఉన్నట్లయితే ప్రస్తుతం రేషన్ కార్డు నెంబర్ కూడా వేయాలి . తర్వాత వాళ్ళ సంతకం చేయవలసి ఉంటుంది.
ఒకవేళ వైట్ రేషన్ కార్డు లేకపోయినట్లయితే . అలాంటి సందర్భంలో పేరెంట్స్ ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉదా  అంగన్వాడి / టీచర్స్ / ఇతర  వివరాలను నమోదు చేయాలి .
ఎవరి జీతమైనా 2.5 లక్షల రూపాయల కన్నా  తక్కువ ఉన్న వారికి అమ్మవొడి వర్తిస్తుంది.
జీతం డీటెయిల్స్ నమోదు చేయాలి . ఆ తర్వాత  ఆ సమాచారం ఒప్పుకున్నారా అంటే  agree అని లేకుంటే disagree  అని నమోదు చేయాలి.
 ఒకవేళ వెహికల్ ఫోర్ వీలర్ ఉంటే ఆ ఫోర్ వీలర్ సంబంధించిన కింద సమాచారం పూర్తి చేయవలసి ఉంటుంది .
అలాగే ల్యాండ్ సంబంధించి సమాచారం కూడా కావాలని అడిగి వివరాలు తీసుకుని పూర్తి చేయవలసి ఉంటుంది.
అందుబాటులో తల్లిదండ్రులూ సమాచారం ఇస్తున్న సమాచారం తో నమోదు  చేసి సంతకం చేయించాలి.
పరిశీలించాల్సినవి :
ఎవరి అకౌంట్ లో నగదు జమకావాలో వారికి  రేషన్ కార్డ్  (ఉంటే )--- నమోదు చేయాలి.
ఎవరి అకౌంట్ లో నగదు జమకావాలో వారి ఆధార్ , బాంక్ అకౌంట్ వివరాలు. నమోదు చేయాలి.
వైట్ రేషన్ కార్డు  లేనివారికి ఫామ్ 2 లో మిగిలిన వివరాలు నమోదు చేయాలి.
సేకరించాల్సినవి :
 తల్లి/తండ్రుల/ గార్డియన్ మొబైల్ నంబర్లు.
 ప్రస్తుత అడ్రెస్.(వారు ఇచ్చేది ) అడ్రెస్ లో డోర్ నంబరు, లైన్, వారు నివశిస్తున్న పేట, వార్డ్ నంబరు.

అమ్మ ఒడి -సామాజిక తనిఖీ కార్యక్రమ నిర్వహణ - తేదీలు /నిర్వహణ అంశం / ఎవరెవరు ఏమి చేయాలి...

అమ్మ ఒడి లేటెస్ట్ గైడ్లైన్స్....Rc.252,Dt.2/12/2019అమ్మఒడి వెబ్ సైట్ లో MEO గారి LOGIN లో S2 NEW STUDENT REGISTRATION FORM ENABLE అయ్యింది, ఏ విధంగా CHILD INFO లో లేని విద్యార్థుల వివరాలను అమ్మఒడి వెబ్ సైట్ లో నమోదు చేయాలో, S2 Form లో ఏమేమి DETAILS అడుగుతుందో తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి

అమ్మఒడి కి సంభందించి ఎడిట్ ఆప్షన్ రేపు ఇచ్చే అవకాశం ఉంది కావున విద్యార్థుల యొక్క వివరాలను ఏ విధంగా వెరిఫై చేసుకోవాలో కూడా ఈ వీడియో లో తెలియజేయబడింది


జిల్లాల వారీగా అమ్మఒడి ని ఆన్లైన్ చేయుటకు లింక్స్ అందుబాటులో....


Latest instructions

అమ్మ ఒడి 100% పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులు మీ యొక్క HM LOGIN ద్వారా రిపోర్టు ప్రింటు  తీసుకుని అన్ని వివరాలు వెరిఫై చెయ్యండి.
➡రేషన్ కార్డు లేదని "NO" అని పెట్టిన వారి వివరాలు HM REJECTED LIST లో ఉంటాయి. వారికి ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్ జరుగుతుంది.
➡ఆన్లైన్ చేసిన వాటిలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని రాసి ఉంచుకోండి. ప్రస్తుతం MEO LOGIN లో ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదు.
➡AMMAVODI: All the DEO's in the State are requested to submit the consolidated list of Banks which are not available on the Ammavodi Website,  in the EXCEL sheet immediately .
➡1) S.NO 2) NAME OF THE DISTRICT  3) NAME OF THE MANDAL  4) IFSC CODE  5) NAME OF THE BANK
Thanks & Regards,
 IT CELL
Commissioner of School Education
Andhra Pradesh


అమ్మఒడి ప్రశ్నలు-జవాబులు
ప్ర):  వెబ్సైట్ నందు HM LOGIN నందు వివరాలు తప్పుగా ఎంటర్ చేసి సబ్మిట్ అయిపోయింది. ఏమ్ చేయాలి ?

జ):  MEO LOGIN లో verification  దశ లో reject చేయించుకోవాలి...అప్పుడు అది మరల స్కూల్ లాగిన్ కి వస్తుంది...అప్పుడు సరిగా ఎంటర్ చేసుకోవాలి.

ప్ర):  వెబ్సైట్ నందు HM LOGIN password మర్చిపోయినా లేక contact administrator లేక account locked అని వస్తే ఏమి చేయాలి ?

జ):  MEO LOGIN లో services section నందు HM PASSWORD RESET ఆప్షన్ ను పొందుపరచారు. MIS/DATA ENTRY OPERATOR కి తెలియపరచితే వారు రీసెట్ చేస్తారు.

 ➽ రేషన్ కార్డు లేకుండా  ఉన్న వారు ను  అమ్మ ఒడిలో  నమోదు చేసిన వారి వివరాలు REPORT లో కనిపించవు. ఆ వివరాలు  గ్రామ వాలంటీర్ లేదా సచివాలయం కార్యదర్శి LOGIN మాత్రమే కనిపిస్తాయి గమనించగలరు.

అమ్మ ఒడి నమోదులో  కీలకాంశాలు

➽ రేషన్ కార్డులో తల్లి/సంరక్షకుల పేర్లు వుండి విద్యార్థి పేరు లేకున్ననూ YES అనే నమోదు చేయాలి.

➽ తల్లి లేదా సంరక్షకుల ప్రస్తుత నివాస చిరునామా, ఆధార్/రేషన్ కార్డులలో లేకపోయినా నివాస చిరునామానే నమోదు చేయాలి. లేని పక్షంలో వెరిఫికేషన్ జరగక తల్లికి నష్టం కలుగును.

➽ మదర్ డిటైల్స్ ఎంట్రీ చేసే టప్పుడు ముందుగా తల్లి వార్డు, మండలం, జిల్లా ఎంపిక చేసి, తదుపరి ఆధార్, బ్యాంకు డిటైల్స్ కొడితే త్వరగా సబ్మిట్ అవుతుంది.
అమ్మఒడి అలెర్ట్:-
ఏదైనా విద్యార్థి యొక్క వివరాలపై సందేహం ఉన్నా ఎంఈఓ గారి లాగిన్ లో కాన్సల్ చేసి మరల ఎంటర్ చేసే సదుపాయం కలదు, కావున కలత చెందాల్సిన అవసరం లేదు.

అమ్మ ఒడి వెబ్ సైట్ ఇంకొక లింక్ అందుబాటులో కలదు...దీని ద్వారా కూడా డీటెయిల్స్ ఇవ్వగలరు..How to apply AMMA VODI

ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా ఈ వీడియో చూడగలరు. ఈ వీడియోలొ అమ్మ వోడి విద్యార్థుల వివరాలు ఎలా అప్లోడ్ చేయాలి అనేది క్లియర్ గా, స్టెప్ బై స్టెప్ వివరించారు

వీడియో....చూడండి....
All the DEOs, MEOs and HMs are informed that, site is  enabled for entry the all details.

Username:  udise code
 password : ammavodi19

 step 1
అమ్మ అఫీషియల్ వెబ్ సైట్ నందు విద్యార్థుల తల్లుల యొక్క ఆధార్ నంబర్లు అకౌంట్ నెంబర్లు నమోదు చేయుటకు jaganannaammavodi.ap.gov.in వెబ్సైట్ నందు యూజర్ ఐడి గా మీ పాఠశాల యొక్క u-dise కోడు, పాస్వర్డ్ గా ammavodi19 ఎంటర్ చేసి, తదుపరి పాస్వర్డ్ను మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది.
మీకు నచ్చిన పాస్ వర్డ్ ను సెట్ చేసుకోండి.
పాస్వర్డ్ మార్చుకున్న తర్వాత లాగ్ అవుట్ అయ్యి, u-dise code మరియు కొత్త పాస్వర్డ్ లతో లాగిన్ కావలెను. ఆ విధంగా లాగిన్ అయిన తర్వాత home, user,  services, reports, లాగ్ అవుట్ మెనూలు కనిపించును.
Step 2:

in the services menu, you should select Student Mother/Guardian Details Entry option, then you will get students class wise selection page, If you select one class, all the students in that class details will be populated. Next, you have to select your desired student and enter the required details.
మెనూల యందు సర్వీస్ మెనూ ఎన్నుకొని అందులో సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ అనగానే ఆ తరగతి లో గల విద్యార్థులందరి పేరు కనిపించును. అందులో అవసరమైన విద్యార్థిని ఎన్నుకొని వారి యొక్క వివరాలను నమోదు చేయవలెను.

we have to enter following details of the selected student
Bank account number,
BRANCH NAME.
IFSC Code,
Aadhar number.
Ration card number.
MOTHERS PRESENT RESIDING DISTRICT, MANDAL, PANCHAYATI name.
Student attendance percentage
we have to follow the above process for all students in our school. This is the complete process to follow in jaganannaammavodi-ap-gov-in official website student Mother/Guardian details

జగనన్న అమ్మ ఒడి ....వెబ్ సైట్ లింక్.  


Know your school  Habitation code 

Download..... Rc.252 ,Guidelines and profarmas on Amma odi.

అమ్మ ఒడి PPT by CSEAP.. డౌన్లోడ్

అమ్మ ఒడి - HM ధ్రువీకరణ పత్రం...

Proforma -1 Application

Proforma-2 Application

Proforma -3 Application


అమ్మ ఒడి తాజా మార్గదర్శకాలు ,Rc.242,Dt.22/11/2019

1.24-11-2019 న హెడ్మాస్టర్ కు యూజర్ ఐ డీ , పాస్ వర్డ్ పంపబడుతాయి.
అందరు ప్రధానోపాధ్యాయులు పిల్లల హాజర్ శాతాన్ని గణణ చేసి పెట్టుకోవాలి. హాజరును బడి రీ ఓపన్ అయిన నాటినుండి తీసుకోవాలి. పిల్లవాడు ఇటీవల కొత్తగా చేరినట్లయిన చేరిన తేదీ నుండి శాతాన్ని లెక్క గట్టాలి.
2.ప్రధానోపాధ్యాయులు విద్యార్థి తల్లి / సం రక్షకులయొక్క ఆధార్ నంబరు, నివాస గ్రామము , బ్యాంక్ అకౌంట్ నంబరు, ఐఎఫ్ సీ కోడ్ సేకరించాలి.
3.100 లోపు పిల్లలున్న పాఠశాలలు తమకు ఇవ్వబడిన లాగ్ ఇన్ లో ఆన్ లైన్లో వివరాల నమోదును 25-11-2019 తేదీ నాడు ఒక్కరోజులోనే పూర్తి చేయాలి
4.100 to 300 పిల్లలు ఉన్న పాఠశాలలు 25-11-2016 & 26-11-2019 తేదీలలో పూర్తి చేయాలి.
5.300 అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న పాఠశాలలు 25-11-2019, 26-11-2019 & 27-11-2019 తేదీలలో పూర్తి చేయాలి.
4. ఫ్రధానోపాధ్యాయులు తల్లి / సం రక్షకుల వివరాలు , హాజరు వివరాలు ఎంటర్ చేయడం పూర్తి అయిన తరువాత ఆన్ లైన్ ద్వారా ఎం ఈ వో కు పంపడం జరుగును
5. ఎం ఈ వో లు ప్రధానోపాధ్యాయుల ద్వారా వచ్చిన సమాచారమును ప్రింట్ చేసి CRP , MIS, DTPs , IERT, DLMT, PRT ల ద్వారా  గ్రామ సచివాలయానికి పంపవలెను.
6. పేరెంట్ కమిటీలను ఈ కార్యక్రమములో భాగస్వాములను చేయాలి.
7. ప్రధానోపాధ్యాయులు నమోదు చేయవలసినవి
8. Bank account number
9. IFC Code
10. Aadhar number
11. Ration card number
12. Village name of mother
13. Student attendance percentage
14. పిల్లలు అనాధలు అయితే వారి చేతనే వ్యక్తిగత అకౌంట్స్ ఓపన్ చేయించాలి.
మిగిలిన వివరాలను ప్రొసీడింగ్ నందు క్షుణ్ణంగా చదువుకొనగలరు.

ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019 తేది : 22.11.2019
విషయం:పాఠశాల విద్యాశాఖ-నవరత్నాలు-జగనన్న అమ్మఒడి కార్యక్రమం-1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొందిన సంరక్షకులకు రూ.15,000/- వార్షిక ఆర్థిక సహాయం అందించుట- 2019-20 విద్యాసంవత్సరం నుండి అమలు పరచుట విషయమై తదుపరి సూచనలు. 

నిర్దేశములు :
    1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ (ప్రోగ్రాం-II) వారి ఉత్తర్వులు నెం. 79, తేది : 4.11.2019
    2. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది:16.11.2019 ఆదేశములు.
జగనన్న అమ్మ ఒడి' కార్యక్రమం అమలులో భాగంగా అర్హులైన తల్లుల/ సంరక్షకుల జాబితాను సిద్ధం చేసేందుకు పై సూచిక 2లో ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
పరిపాలన సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకుని, పై సూచిక 2 లోని ఆదేశములకు కొనసాగింపుగా ఈ దిగువ సూచనలను ఇవ్వడమైనది.
పై సూచిక 1లోని ఆదేశాలను అనుసరించి ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు 17.11.2019 నుండి 21.11.2019 మధ్య కాలంలో తమ తమ పాఠశాలలోని విద్యార్థుల వివరములను చైల్డ్ ఇన్ఫోనందు నమోదు/ నవీకరణ చేయడమైనది.ఆ విధంగా చైల్డ్ఇన్ఫోలోనివిద్యార్థుల వివరములు 21.11.2019న ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారికి అందించడమైనది.
ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారి ద్వారా తల్లుల లేదా సంరక్షకుల వివరాలను జతపరచటం
 1. ఎపి ఆన్ లైన్ ద్వారా తమకు అందిన చైల్డ్ ఇన్ఫోను ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారు రేషన్ కార్డుల జాబితాతో మరియు ప్రజాసాధికార సర్వే సమాచారంతో సరిపోల్చి తెల్ల రేషన్ కార్డులో ఉన్న తల్లుల లేదా సంరక్షకుల వివరాలను సేకరించి ఆ మొత్తం సమాచారాన్ని ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారు విద్యార్థి వారీగా అనుసంధానం చేస్తారు.
2.ఈ కార్యక్రమం 23.11.2019 నాటికి పూర్తి చేసి ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారు ప్రతి ప్రధానోపాధ్యాయుడికి 'లాగ్ ఇన్ ఐడి' మరియు 'పాస్ వర్డ్ ద్వారా 24.11.2019న అందచేస్తారు.
3.ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారు ప్రధానోపాధ్యాయుడికి అందచేసే ఈ సమాచారం పాఠశాలలోని తరగతి విద్యార్థుల వారీగా ఉంటుంది.
4.పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎపిసిఎఫ్ఎస్ఎస్ ద్వారా అందిన వివరాలను సరిపోల్చుకొనుట, నమోదు చేయుట మరియు ధృవీకరించుకొనుటకు విద్యార్థుల, తల్లి/ సంరక్షకుల పేరు, ఆధార్ నంబరు మరియు బ్యాంకు ఆ 'హార్డ్ కాపీ'లను సంబంధిత విద్యా, సంక్షేమ సహాయకుడు/ క్లస్టర్ రిసోర్సు పర్సన్ తమ మండల విద్యాశాఖాధికారికి నేరుగా అందచేయాలి. ఖాతా వివరములను 24.11.2019 లోపు సేకరించి, ఆన్ లైన్ లో నమోదు చేయుటకు సిద్ధంగా ఉండవలెను.
ఎపిసిఎఫ్ఎస్ఎస్ ద్వారా అందిన వివరాలను సరిపోల్చుకొనుట, నమోదు చేయుట మరియు ధృవీకరించుకొనుట
5.పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎపిసిఎఫ్ఎస్ఎస్ ద్వారా తమకు అందిన సమాచారాన్ని ప్రధానోపాధ్యాయుడు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. తరగతి వారీగా విద్యార్థుల వివరములు సరిపోల్చుకుంటూ వారి తల్లి/ సంరక్షకుడు వివరములను (తల్లి/ సంరక్షకుని పేరు, ఆధార్ నంబరు, బ్యాంకు ఖాతా వివరములు) నమోదు చేయాలి. ఒకవేళ ఆ వివరములన్నీ ఎపిసిఎఫ్ఎస్ఎస్ ద్వారా తమకు అందిన సమాచారంలో ముందుగానే పొందుపరచి ఉంటే వాటిని ధృవీకరించుకోవాలి. ఏవైనా లోపాలు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దుకోవాలి. (వాడుక సూచికను జతపరచడమైనది) ఆ విధంగా వివరములు నమోదు పరిచిన తరువాత విద్యార్థుల స్వగ్రామాల మరియు మండలాల వారీగా సంబంధిత విద్యార్థుల మరియు తల్లులు/ సంరక్షకుల జాబితాను సదరు మండల విద్యాశాఖాధికారికి పంపవలసి ఉంటుంది.
6.  100 లోపు విద్యార్థులు గల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈ సమాచారాన్ని  25.11.2019 లోగా విద్యార్థుల స్వగ్రామాలకు సంబంధించిన మండల విద్యాశాఖాధికారి వారికి పంపాలి. 101 నుండి 300 లోపు విద్యార్థులు గల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈ సమాచారాన్ని 26.11.2019 లోగా విద్యార్థుల స్వగ్రామాలకు సంబంధించిన మండల విద్యాశాఖాధికారి వారికి పంపాలి. 300 లకు పైగా విద్యార్థులు గల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈ సమాచారాన్ని 27.11.2019 లోగా విద్యార్థులస్వగ్రామాలకుసంబంధించిన మండల విద్యాశాఖాధికారి వారికి పంపాలి ప్రధానోపాధ్యాయుడు ధృవీకరించిన సమాచారం వారివారి స్వగ్రామానికి సంబంధించిన మండల విద్యాశాఖాధికారికి స్వయంచాలకంగా (ఆటోమేటిగ్గా) చేరుతుంది.
గ్రామాల వారీగా జాబితాలను ముద్రించి క్షేత్ర పరిశీలనకు పంపడం
7.ఆ విధంగా మండల విద్యాశాఖాధికారి వారికి రాష్ట్రంలోని వివిధ పాఠశాలల నుంచి ఆ మండలంలోని గ్రామాలకు సంబంధించిన విద్యార్థుల, తల్లి/ సంరక్షకుల వివరములు చేరుతాయి. మండల విద్యాశాఖాధికారి తమకు చేరిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారి సిబ్బంది ద్వారా గ్రామాల వార్డులు వారీగా జాబితాలను ముద్రించి సంబంధిత గ్రామ సచివాలయ విద్యా, సంక్షేమ సహాయకునికి అందజేయాలి. ఒకవేళ గ్రామ సచివాలయ విద్యా, సంక్షేమ సహాయకుడు అందుబాటులో లేని యెడల ఆ గ్రామ జాబితాలను సంబంధిత క్లస్టర్ రిసోర్సు పర్సను అందజేయాలి.
క్షేత్రస్థాయి పరిశీలన 
8. గ్రామ సచివాలయ విద్యా, సంక్షేమ సహాయకుడు/ క్లస్టర్ రిసోర్సు పర్సన్ మండల విద్యాశాఖాధికారి ద్వారా తనకందిన జాబితాలను సంబంధిత గ్రామ, వార్డు వాలంటీర్లకు అందచేయాలి. వారి ద్వారా ఆ సమాచారాన్ని ఆయా కుటుంబాలకు వివరించి తద్వారా ఆ సమాచారంలో లేని వివరాలు అనగా తల్లుల పేర్లు, తెల్ల రేషను కార్డు వివరాలు, ఆధార్ నెంబరు, బాంకు అకౌంటు నెంబరు, ఐఎఫ్ఎస్ సీ కోడు నెంబరు మొదలైన వివరాలను సేకరించాలి. ఆ సమాచారంలో తెల్ల రేషను కార్డు లేని కుటుంబాల విషయంలో వారు నిరుపేద అర్హత కలిగిన కుటుంబాలకు చెందిన వారు అవునో కాదో ఆరు అంచెల పరిశీలన (సెక్స్ స్టెప్ వాలిడేషన్) ద్వారా ధృవీకరించుకోవాలి. ఈ కార్యక్రమమంతా 30.11.2019 లోపు పూర్తి చేయాలి.
9. ఆ విధంగా గ్రామ/ వారు వాలంటీర్లు క్షేత్రస్థాయిలో నమోదు చేసిన/ ధృవీకరించిన సమాచారాన్ని అనగా  ఆ 'హార్డ్ కాపీ'లను సంబంధిత విద్యా, సంక్షేమ సహాయకుడు/ క్లస్టర్ రిసోర్సు పర్సన్ తమ మండల విద్యాశాఖాధికారికి నేరుగా అందచేయాలి.
10. తదుపరి కార్యాచరణ ప్రణాళికపై ఉత్తర్వులు తదుపరి కార్యావర్తనముల ద్వారా తెలియజేయబడతాయి.
11. రాష్ట్రంలోని అందరు జిల్లా విద్యాశాఖాధికారులు మరియు సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్లు, డివిజనల్, మండల విద్యాశాఖాధికార్లు, క్లస్టర్ రిసోర్సు పర్సన్లు మరియు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, రాష్ట్ర స్థాయి పరిశీలకులు పూర్తి శ్రద్ధతో పై విధి విధానాలను అత్యంత జాగరూకతతో అమలుచేయవలసినదిగా ఇందుమూలంగా ఆదేశించడమైనది.
User Guide


Then Please Fill all the details of the Student. And Please Click on the Submit Button.
After Click on the SUBMIT Button Details is Successfully Uploaded. And HERE STUDENT ID will be Generated.

Download The Steps PDF File below link
డౌన్లోడ్....అమ్మ ఒడి తాజా మార్గదర్శకాలు ,Rc.242,Dt.22/11/2019

1 comment:

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top