⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Saturday, 2 November 2019

A cop that Chinna jeeyar fetes annually -24 సంవత్సరాలుగా ఓ పోలీస్ అధికారికి చినజీయర్ స్వామి గారితో అరుదైన గౌరవం


24 సంవత్సరాలుగా ఓ పోలీస్ అధికారికి అరుదైన గౌరవం
హైదరాబాద్ : ఓ చోరీ కేసు చేధించిన పోలీసు అధికారికి 25 సంవత్సరాలుగా ప్రత్యేకమై ఆధ్యాత్మిక గౌరవం దక్కుతున్నది. ఈ జన్మకు దక్కిన అదృష్టంగా ఆ పోలీసు అధికారి ప్రతి ఏడాది గౌరవంతో ఉబ్బితబ్బిబైపోతారు. ఇలా ఓ పోలీసు అధికారిని ప్రతియేటా చినజీయర్ స్వామి పీఠ తిరు నక్షత్ర ఉత్సవాల సందర్భంగా సత్కరిస్తున్నారు. ఈ అరుదైన గౌరవాన్ని 25వ సారి ఆ పోలీసు అధికారి శుక్రవారం శంషాబాద్ ముచ్చింతల్‌లో ఉన్న చినజీయర్ స్వామి ఆశ్రమంలో అందుకోబోతున్నారు. ఈ గౌరవాన్ని అందుకునేందుకు ఏపీలోని విజయవాడ సిటీ డీసీపీగా బాధ్యతలను నిర్వహిస్తున్న కోటేశ్వరరావు గురువారం సాయంత్రం నగరానికి చేరుకున్నారు. సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నప్పుడు కేసును చేధించిన కోటేశ్వరరావు అంచెలంచెలుగా పదోన్నతులు పొందుతూ ప్రస్తుతం విజయవాడ సిటీ డీసీపీగా విధులు నిర్వహిస్తున్నారు.
1993లో పెరమాళ్ పీఠం విగ్రహాలు చోరీ
1993 సంవత్సరంలో గుంటూరు జిల్లా తాడేపల్లి గ్రామం సీతానగర్‌లో పెద్దజీయర్ స్వామి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఆశ్రమాన్ని చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. 1993 సంవత్సరం నవంబరు 14వ తేదీన తిరు నక్షత్ర వేడుకలు జరుగుతున్న సమయంలో ఆశ్రమంలోని పెరమాళ్ పీఠంకు చెందిన 11 విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ సంఘటన ఓ పెద్ద సంచలనం సృష్టించింది. ఆశ్రమం వద్దకు వేలాది భక్తులు, స్థానికులు చేరుకున్నారు. చోరీ సంఘటనతో చినజీయర్ స్వామి దిగ్భ్రాంతికి గురై మౌనం దాల్చారు. పోలీసు అధికారులు అందరూ హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తాడేపల్లి పీఎస్‌లో 1985 బ్యాచ్‌కు చెందిన సబ్‌ఇన్‌స్పెక్టర్ కోటేశ్వరరావు పనిచేస్తున్నారు. ఈ సంఘటనపై ఆయన కేసును నమోదు చేసుకున్నారు. అదే సమయంలో చినజీయర్ స్వామి మూడు రోజుల్లో పెరమాళ్ పీఠం విగ్రహాలు రాకపోతే తానే వారి దగ్గరకు వెళ్ళిపోతానని (ఆత్మార్పణం) ప్రకటించారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతగా మారింది. వీటిని పరిశీలించిన ఎస్‌ఐ కోటేశ్వరరావు కూడా అదే సమయంలో ఉపవాసానికి దిగి ఎట్టి పరిస్థితుల్లో విగ్రహాలను చోరీ చేసిన దొంగలను పట్టుకునే వరకు భోజనాలు లేవని సవాలు వేసుకుని దొంగలను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుని కోటేశ్వరరావు గాలింపును ముమ్మరం చేశారు.
చెట్ల పొదల్లో విగ్రహాలు
పోలీసుల హడావిడి, సైరన్ మోతలతో పోలీసు వాహనాలు చక్కర్లు కొడుతుండడంతో దొంగలు భయపడి సమీపంలోని ఓ చెట్ల పొదల్లో విగ్రహాలను పడేశారు. గాలింపులో భాగంగా చెట్ల పొదల్లో ఉన్న పెరమాళ్ పీఠానికి సంబంధించిన 11 విగ్రహాలు దొరికాయి. ఆనందంలో మునిగిపోయిన కోటేశ్వరరావు బృందం ఆ విగ్రహాలను తీసుకుని నేరుగా తాడేపల్లి పోలీసు స్టేషన్‌కు తీసకువెళ్ళారు. అక్కడ పూజలు నిర్వహించి చినజీయర్ స్వామి ఆశ్రమానికి తరలించేందుకు సిద్ధం చేశారు. అయితే ఈ విగ్రహాలను చోరీ చేసిన ముఠా స్టూవర్టుపురం, బిట్రగుంట ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించి ఇద్దర్నీ అరెస్టు చేశారు. విచారణలో ఈ విగ్రహాలను తాడేపల్లి, విజయవాడ, ముంబాయి మీదుగా విదేశాలకు తరలించాలని ముఠా ప్లాన్‌గా తేలింది.
ప్రెస్‌మీట్‌లో ఉండగానే దొరికినట్లు సమాచారం
మూడో రోజు పత్రిక విలేకరుల సమావేశంలో పెరమాళ్‌లు తిరిగిరాకపోతే ఇక ఆత్మార్పణం తప్పదని చినజీయర్ స్వామి గట్టిగా చెబుతున్న సమయంలోనే కోటేశ్వరరావు వెళ్లి విగ్రహాలు దొరికాయని చెప్పారు. అంతే అక్కడ పరిస్థితి ఉద్వేగ భరితమైన వాతావరణం నుంచి ఆనందాయక వాతారణంలోకి మారి భక్తులు నామ స్తోత్రాలతో ఊగిపోయారు. అలా కోటేశ్వరరావు బృందం 36 గంటల్లో విగ్రహాలను దొరకబట్టీ తీసుకువచ్చినందుకు చినజీయర్ స్వామి అభినందించారు.
సహస్ర కలశాభిషేకం కోటేశ్వరరావుతోనే..
విగ్రహాలను తీసుకువచ్చిన కోటేశ్వరరావుకు చినజీయర్ స్వామి అదే సమయంలో ఓ అరుదైన గౌరవాన్ని ప్రకటించారు. 36 గంటల్లో చోరీకి గురైన విగ్రహాలను తిరిగి తీసుకువచ్చిన కోటేశ్వరరావు సేవ మరువలేనిదన్నారు. అందుకే దీని కోసం ప్రతి యేటా జరిగే తిరునక్షత్ర ఉత్సవాల్లో భాగంగా పెరమాళ్ పీఠం విగ్రహాలకు జరిగే సహస్ర కలశాభిషేకం(1008 కలసాలతో) ఆ సమయంలో 1008 కలశాలను మొదటగా కోటేశ్వరరావు ముట్టుకున్న తర్వాతనే వాటిని చినజీయర్ స్వామితో పాటు వేద పండితులు వాటితో దేవుళ్లకు అభిషేకం చేస్తారు. ఈ విధంగా కోటేశ్వరరావుకు 1994 నుంచి వరుసగా గౌరవం అందుతున్నది. ఇప్పటి వరకు 24 సార్లు పూర్తి చేసుకుని ఈ రోజు శంషాబాద్ ముచ్చింతల్‌లో జరుగుతున్న సహస్ర కలశాభిషేకాన్ని కోటేశ్వరరావు 25వ సారి అందుకోబోతున్నారు. ఈ అభిషేకం ప్రతియేటా ఒక్కో ప్రాంతంలో జరుగుతున్నది. 2010 సంవత్సరంలో అమెరికాలో జరిగినప్పుడు కూడా కోటేశ్వరరావును అమెరికాకు తీసుకువెళ్ళారు.
ఈ జన్మకు ఇదే నా అదృష్టం
చినజీయర్ స్వామి వారు ఇస్తున్న ఈ ఆధ్యాత్మిక గౌరవంతో నా జన్మ ధన్యమై పోయింది. ఈ జన్మకు ఇదే నాకు అతి పెద్ద అదృష్టం. నిత్యం స్వామి వారిని స్మరించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తున్నా.
-కోటేశ్వరరావు, డీసీపీ విజయవాడ సిటీ, ఆంధ్రప్రదేశ్

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top