⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Thursday, 14 November 2019

ఆకలి చూపు ఫోటో....వైరల్ అయిన ఫోటో....పట్టెడన్నం కోసం పరుగులు తీసిన చిన్నారి నిజ జీవితం ఇది...ఆకలి చూపు ఫోటో తో అదే స్కూల్ లో చేర్చిన వైనం.....

‘ఆకలి ఊదే నాదస్వరానికి ఆడక తప్పదు మనిషి’ అని ఓ సినీ కవి ఆకలి బాధలను గురించి ఒక్క వాక్యంలో వర్ణించి చెప్పాడు. కానీ.. నిజ జీవితంలో కూడా ఇప్పటికీ ఆకలి కొందరిని దహించివేస్తోంది. అన్నం దొరికే వైపు ఆశగా పరుగులెత్తేలా చేస్తోంది. ఈ బతుకు పోరాటంలో ఓడిపోతే... ‘నాలుగు మెతుకులు కూడా దొరకలేదా.. అయ్యో పాపం’ అని కొందరి ఎండిన డొక్కలను చూసి వెక్కిరిస్తూ వెకిలిగా ఆ ఆకలి మొసలి కన్నీరు కారుస్తోంది. ఆ ఆకలిని తట్టుకోలేక పట్టెడన్నం కోసం పరుగులు తీసిన చిన్నారి నిజ జీవితం ఇది.

ఇటీవల సోషల్ మీడియాలో ఓ చిన్నారి ఖాళీ గిన్నె పట్టుకుని అతి దీనంగా ఓ క్లాస్ రూమ్ బయట నిలుచున్న ఫొటో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో... క్లాస్ రూమ్ లో తన ఈడు పిల్లలందరూ యూనిఫాం ధరించి చదువుకుంటూ ఉండగా, వారికి మధ్యాహ్న భోజనం పెట్టే వేళ తనకు కూడా ఇన్ని మెతుకులు వేయకపోతారా అని అత్యంత దయనీయ స్థితిలో ఆ బాలిక వేచిచూస్తుండడం చాలామందిని కలచివేసింది. 
ఇది ఓ జర్నలిస్ట్ తీసిన ఫొటో. 'ఆకలి చూపు' అనే టైటిల్ తో వచ్చిన ఈ ఫోటో చూసి వెంకట్ రెడ్డి అనే సామాజిక కార్యకర్త చలించిపోయారు. వెంటనే ఆ బాలిక అడ్రస్ కనుక్కుని వెళ్లి అక్కడి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. ఆ బాలిక పేరు మోతీ దివ్య. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ఓ మురికివాడలో ఉండే ఆ బాలిక తల్లిదండ్రులు చెత్త ఏరుకుని బతికే నిరుపేదలు.


బడికి వెళ్లి బలపం పట్టుకోవాల్సిన దివ్య.. అదే బడి తరగతి గది బయట మధ్యాహ్న భోజనం కోసం ఓ పాత గిన్నె చేతిలో పట్టుకుని ఆశగా ఎదురుచూసింది. ఈ దృశ్యం ఒక్క క్షణం అందరినీ ఆలోచింపజేసింది. ఈ ఛాయాచిత్రం ఆకలి బాధలకు అద్దం పట్టింది. ఇదెక్కడో మారుమూల పల్లెలోనో, ఏజెన్సీ గ్రామాల్లోనో కనిపించిన పరిస్థితి కాదు. భాగ్యనగరంలోని గుడిమల్కాపూర్ నవోదయ కాలనీలో అభాగ్య జీవనం సాగిస్తున్న ఓ కుటుంబం దుస్థితి.

దివ్య తల్లి మెహిదీపట్నంలోని మిలటరీ ఏరియాలో ఊడుస్తుంటుంది. పొద్దునే 6 గంటలకు పనికి పోతుంది. దివ్య తండ్రి జీహెచ్‌ఎంసీ బండితో దగ్గరలో ఉన్న కాలనీలో చెత్త సేకరిస్తూ బతుకు బండిని లాక్కొస్తున్నాడు. ఇంటి వాళ్ళు నెలకు ఇంత అని ఇస్తారట. ఉండటానికి సరైన ఇల్లు లేదు. రోడ్డు పక్కన ఎండకు ఎండి, వానకు తడిసే ఓ చిన్న కుటీరమే వారి నివాసం. రోజూ తల్లిదండ్రులిద్దరూ ఇలా చెరో పనికి వెళ్లగా మధ్యాహ్నం అన్నం కోసం దగ్గరలో ఉన్న బడి వద్దకు దివ్య వడివడిగా పరుగులు తీసేది. ‘లంచ్ గంట ఎప్పుడు కొడతారా’ అని దివ్య తరగతి గది గుమ్మం ముందు నిల్చుని చూస్తూ ఉండేది.

అలా నిల్చున్న దివ్యను నవంబర్ 7న ఓ తెలుగు దినపత్రిక ఫొటోగ్రాఫర్ చూశాడు. ఆ చిన్నారి ఆకలి చూపులను తన కెమెరాలో బంధించి సదరు దినపత్రికలో అచ్చు వేయించాడు. అంతే.. ఆ ఛాయాచిత్రం నెట్‌లో వైరల్‌గా మారింది. ఆ చిట్టి తల్లి దయనీయ స్థితికి చలించిపోయిన ఓ స్వచ్ఛంద సంస్థ ఆ చిన్నారికి ఆసరాగా నిలిచింది. ఆ చిన్నారికి స్కూల్ డ్రెస్ కుట్టించి, పలకబలపం పట్టించి ఆమె కళ్లలో.. ఆమెను కన్నవాళ్ల కళ్లలో వెలుగులు నింపింది. ఆకలితో ఎదురుచూసిన బడిలోనే ఇప్పుడు దివ్య ‘అ’, ‘ఆ’లు దిద్దుతోంది. ఆ చిన్నారి బడిబాటకు కారణమైన ఆ ఫొటోగ్రాఫర్‌ను, స్వచ్ఛంద సంస్థను నెటిజన్లు అభినందిస్తున్నారు.

2 comments:

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top