⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Wednesday, 16 October 2019

Yasaswi Jaiswal - దేశవాళీ క్రికెట్లో ముంబయి కుర్రాడు యశస్వి జైశ్వాల్‌ సంచలనాలు .... పానీపూరీ అమ్మినోడు....టీమిండియా కి ఆడాలన్న కల....


పానీపూరీ అమ్మినోడు.
ఉత్తరప్రదేశ్‌లోని భాడోహికి చెందిన పేద కుటుంబం నుంచి వచ్చాడు యశస్వి. ఊహ తెలిసే సమయానికి అతడికి క్రికెట్‌ పిచ్చి పట్టేసింది. వయసు పెరిగే కొద్దీ అదింకా పెరిగింది. కానీ క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునే స్థోమత అతడికి లేదు. దీంతో ఎదిగే వయసులో ఆట కోసమే ఊరు విడిచిపెట్టి ముంబయికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంటి పోషణ భారంగా మారడంతో యశస్వి తండ్రి కూడా అతడికి అడ్డు చెప్పలేదు. ముంబయి చేరుకున్న తర్వాత ఓ డైరీలో పనికి కుదిరి స్థానికంగా క్రికెట్‌ ఆడడం మొదలెట్టాడు. అయితే క్రికెట్‌ మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తూ పని సరిగా చేయడం లేదని అతణ్ని తప్పించారు. ఇలాంటి దిక్కుతోచని స్థితిలో కూడా యశస్వి ఊరికెళ్లిపోలేదు. అతడి బంధువొకరు కొన్ని రోజులు ఇంట్లో పెట్టుకున్నప్పటికీ, అది కూడా ఇరుకైందే కావడంవతో.. తర్వాత ఆజాద్‌ మైదానంలోని ముస్లిమ్‌ యునైటెడ్‌ క్లబ్‌కు చెందిన గుడారాల్లో ఉండే ఏర్పాటు చేశాడు. మూడేళ్ల పాటు యశస్వి అక్కడే ఉన్నాడు. అందులో కరెంటుండేది కాదు. మూత్రశాలా లేదు. అయినా అందులోనే సర్దుకున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రికెట్‌ ఆడటం.. సాయంత్రం పూట పానీపూరీ అమ్మడం, మరికొన్ని పనులు చేయడం ద్వారా జీవనం సాగించాడు. డబ్బులు సరిపోక కొన్ని కడుపు నిండకపోయినా ఓర్చుకున్నాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా క్రికెట్‌ను మాత్రం యశస్వి విడిచిపెట్టలేదు. అతడి ప్రతిభ గుర్తించి స్థానిక ఆటగాళ్లు, కోచ్‌లు ప్రోత్సహించారు.

యశస్వి నేపథ్యం గురించి తెలిస్తే అతను ఇప్పుడున్న స్థాయికి చేరుకోవడం అద్భుతం లాగే అనిపిస్తుంది. ఒకప్పుడు అతను కడుపు నిండా తినడానికి తిండి లేదు. ఉండటానికి గూడు లేక ఏ వసతీ లేని గుడారాల్లో నివసించాడు. తల్లిదండ్రుల అండ లేకుండానే ఓవైపు క్రికెట్‌ సాధన సాగిస్తూ.. ఇంకోవైపు ఖర్చుల కోసం పానీ పూరీలు అమ్మాడంటే ఆశ్చర్యపోవాల్సిందే.

అదే మలుపు..
యశస్వి గురించి జ్వాలా సింగ్‌ అనే కోచ్‌కు తెలియడం అతడి కెరీర్‌కు మలుపు. ఎ-డివిజన్‌ ఆటగాళ్ల బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు సాధిస్తున్న యశస్వి ప్రతిభను మెచ్చి అతడికి జ్వాలా సింగ్‌ శిక్షణ ఇచ్చాడు. త్వరగానే ముంబయి అండర్‌-19 జట్టుకు ఎంపికైన యశస్వి.. గత ఏడాది అతను శ్రీలంకలో పర్యటించే భారత అండర్‌-19 జట్టుకు ఎంపికయ్యాడు. మూడో వన్డేలో చక్కటి శతకం (114) బాది భారత్‌కు సిరీస్‌ అందించాడు. ఇంగ్లాండ్‌లో వరుసగా నాలుగు అర్ధశతకాలతో అండర్‌-19 జట్టు ముక్కోణపు సిరీస్‌ గెలవడంలో యశస్విది ముఖ్య పాత్ర. యశస్వి ఉపయుక్తమైన స్పిన్నర్‌ కూడా. ప్రతి మ్యాచ్‌లోనూ అతను బౌలింగ్‌ చేస్తాడు. విశాఖపట్నంలో జరిగిన విజ్జీ వన్డే ట్రోఫీలో 224 పరుగులు, 8 వికెట్లతో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలవడం విశేషం. యశస్వి ముంబయి తరఫున రంజీల్లోనూ అరంగేట్రం చేశాడు.

జాఫర్‌ను చూసి..
యశస్వి సత్తా చాటుతున్నా శుభారంభాల్ని పెద్ద స్కోర్లుగా మలచలేని బలహీనత ఉండేది. ముంబయి దిగ్గజం వసీమ్‌ జాఫర్‌ను చూసి ఈ బలహీనతను అతను అధిగమించాడు. ‘‘70, 80 స్కోర్లు చేస్తున్న నేను సెంచరీలు కొట్టలేకపోవడం నిరాశ కలిగించింది. అలాంటి సమయంలో విదర్భతో మ్యాచ్‌లో జాఫర్‌ బ్యాటింగ్‌ను సునిశితంగా గమనించాను. కేవలం జాఫర్‌ ఆట చూసే సుదీర్ఘ సమయం క్రీజులో ఎలా నిలదొక్కుకోవాలో నేర్చుకున్నా. ఇప్పుడు భారీ స్కోర్లు చేస్తున్నా’’ అని యశస్వి చెప్పాడు.

తలుపు తడతాడా?
టీనేజీలోనే దేశవాళీ క్రికెట్లో సంచలన ప్రదర్శన చేసి టీమ్‌ఇండియా తలుపులు తట్టిన ముంబయి ఆటగాళ్లు సచిన్‌, కాంబ్లి, పృథ్వీ షాల సరసన యశస్వి చేరుతాడన్నది అక్కడి క్రికెట్‌ పండితుల అంచనా. యశస్వి బ్యాటింగ్‌ శైలి, అతడి నైపుణ్యం, నిలకడ చూసి కచ్చితంగా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడే సత్తా ఉన్నవాడిగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఊపును కొనసాగిస్తే.. 
టీమిండియా కి ఆడాలన్న కలను యశస్వి నెరవేర్చుకోవడం కష్టమేమీ కాదు.

కుర్రాడి ఖలేజా
దేశవాళీ క్రికెట్లో ముంబయి కుర్రాడు యశస్వి జైశ్వాల్‌ సంచలనాలు కొనసాగుతున్నాయి. వివిధ వయసు విభాగాల మ్యాచ్‌ల్లో ఇప్పటికే చక్కటి ప్రదర్శన చేసిన యశస్వి.. ఇప్పుడు సీనియర్‌ స్థాయిలోనూ అదరగొడుతున్నాడు. 17 ఏళ్ల ఈ కుర్రాడు విజయ్‌ హజారె వన్డే ట్రోఫీ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ బాది ఔరా అనిపించాడు. లిస్ట్‌-ఎ క్రికెట్లో డబుల్‌ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా యశస్వి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఎడమ చేతి వాటం ఓపెనర్‌ అయిన అతను.. బుధవారం బెంగళూరులో ఝార్కండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 154 బంతులెదుర్కొని 17 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 203 పరుగులు చేశాడు. మరో ఓపెనర్‌ ఆదిత్య తారె (78) కూడా రాణించడంతో మొదట ముంబయి 3 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం ఝార్కండ్‌ 319 పరుగులకు ఆలౌటవడంతో ముంబయి 39 పరుగుల తేడాతో విజయం సాధించింది.
* ఈ మ్యాచ్‌ సమయానికి యశస్వి వయసు 17 ఏళ్ల 292 రోజులు. లిస్ట్‌-ఎ క్రికెట్లో డబుల్‌ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడు అతనే.
* వారం క్రితమే కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ సంజు శాంసన్‌ విజయ్‌ హజారె టోర్నీలోనే 212 పరుగులతో దేశవాళీ లిస్ట్‌-ఎ మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోరు సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. అతడి తర్వాత అత్యుత్తమ స్కోరు యశస్విదే.
* గత ఏడాదే వీర్‌ కౌశల్‌ 202 పరుగులతో భారత దేశవాళీ లిస్ట్‌-ఎ మ్యాచ్‌ల్లో తొలి డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు.
* ఈ మ్యాచ్‌లో యశస్వి సిక్సర్లు12. విజయ్‌ హజారె  మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు.
* 21వ  శతాబ్దంలో పుట్టి  లిస్ట్‌-ఎలో ద్విశతకం బాదిన తొలి ఆటగాడు  యశస్వినే

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top