⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Tuesday, 22 October 2019

PRC Newsఅందని మూడు దఫాల కరువుభత్యం తేలని పీఆర్సీ, ఐఆర్‌ పండుగ వేళ ఉద్యోగుల్లో ఆందోళన

అందని మూడు దఫాల కరువుభత్యం
తేలని పీఆర్సీ, ఐఆర్‌
పండుగ వేళ ఉద్యోగుల్లో ఆందోళన
కార్యాచరణ దిశగా కదులుతున్న ఉద్యోగ సంఘాలు

🔹ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించే కరువుభత్యం విషయంలో ఎటువంటి ముందడుగు లేకపోవటంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి వారు ఆశించిన మేర నిర్ణయాలు లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఉద్యోగ సంఘాల నేతలు రాష్ట్ర ఖజానా పరిస్థితిని ఉద్యోగులకు వివరిస్తూ కొంతకాలం వేచిచూద్దామని సర్దిచెబుతూ వస్తున్నారు. అయితే నెలలు గడుస్తున్నా కరువుభత్యం విషయంలో ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఉద్యోగుల్లో అసహనం పెరిగింది. ఆందోళనబాట దిశగా కార్యాచరణకు సిద్ధమవ్వాలనే డిమాండ్‌ వారి నుంచి వినిపిస్తున్నది. ఇక వేతన సవరణ (పీఆర్సీ) విషయంలోను అదే పరిస్థితి. ఈ ఏడాది పెరిగిన వేతనాలు తమకు అందుతాయని ఆశించిన ఉద్యోగులకు, ప్రభుత్వం పీఆర్సీ గడువును నెలల పాటు పెంచుతూ పోతుండటంతో నిరాశ ఎదురవుతున్నది.

🔸అటు మధ్యంతర భృతి(ఐఆర్‌) విషయంలోను ఉద్యోగులలో ఆందోళన వ్యక్తం అవుతున్నది. 27శాతం ఐఆర్‌ ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దాని అమలు ఆగస్టు నుంచి అని ప్రకటించటంతో మూడు నెలల ప్రయోజనాన్ని కోల్పోతామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జూలై 2018 నుంచి పెండింగ్‌
🔹రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువుభత్యం గత సంవత్సరం జూలై ఒకటో తేదీ నుంచి అందలేదు. జూలై 1 నాటికి మొదటి దఫా, ఆ తర్వాత ఆరునెలలకు అంటే 2019 జనవరి 1కి రెండో దఫా డీఏ ఇవ్వాలి. ఇక ఈ సంవత్సరం జూలై 1కి మూడవ దఫా ఇవాల్సి ఉంది. అయితే ఇప్పటికీ ఈ మూడువిడతల డీఏ ప్రభుత్వం విడుదల చేయలేదు. మరో రెండు నెలల్లో అంటే 2020 జనవరి 1కి డీఏ ఇవ్వాల్సిన సమయం కూడా దగ్గరపడుతున్నప్పటికీ పాత బకాయిల విషయం ఇంతవరకు తేలకపోవటంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మూడు దఫాల డీఏ బకాయిలు గత నెలలో విడుదల అవుతాయని, దసరాను సరదాగా గడుపుదామనుకున్న ఉద్యోగులకు నిరాశే ఎదురయ్యింది. మరో నాలుగు రోజుల్లో రాబోతున్న దీపావళికైనా డీఏ బకాయి సొమ్ము చేతికంది వెలుగులు నిండుతాయనుకుంటే అటువంటి సూచనలేవి ప్రభుత్వం నుంచి రాని పరిస్థితి నెలకొంది.*

 పీఆర్సీ విషయంలోను కాలయాపనే..

🔸ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వేతన సవరణపైనా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పెరిగే వేతనాలు ఈ సంవత్సరం నుంచే అందుకుంటామని వారు కొద్ది నెలల కిందట ఆశించారు. అయితే అక్టోబరు మాసం సగం పూర్తయినా వేతన సవరణ విషయంలో ఎటువంటి కదలిక లేకపోవటంతో వారు నిరుత్సాహపడుతున్నారు. ఉద్యోగుల వేతన సవరణ కోసం 11వ పే రివిజన్‌ కమిటీ (పీఆర్సీ)ని గత ప్రభుత్వం నియమించింది. 2018 జూలై 1న నాటి ప్రభుత్వం నియమించిన ఈ కమిటీ ఏడాదిలోపు అంటే ఈ సంవత్సరం జూలై 1లోపు నివేదికను ప్రభుత్వానికి అందజేయాలి. ఆ నివేదిక ప్రకారం ప్రభుత్వం ఉద్యోగుల వేతన సవరణ చేసి అందుకు అనుగుణంగా వేతనాలు చెల్లిస్తుంది. వేతన సవరణ అమలు తేదీ నుంచి అరియర్స్‌ కూడా ఉద్యోగులకు అందుతాయి.
 🔸వేతన సవరణ కమిటీ నియమించిన మూడు నెలల కాలంలోనే ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, ఐక్య కార్యాచరణ కమిటీలతో చర్చించి వారి అభిప్రాయాలు, ప్రతిపాదనలను స్వీకరించింది. అయితే రాష్ట్రంలో ఆరు నెలల కిందట ఏర్పడిన ప్రభుత్వం పీఆర్సీ గడువును మొదట సెప్టెంబరు వరకు పొడిగించింది. ఆ తర్వాత మరలా నవంబరు వరకు గడువు పెంచింది. ఈ విధంగా గడువును పెంచుకుంటూ పోతుండటంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
 అదేబాటలో..ఐఆర్‌
కేవలం డీఏ బకాయిలు, పీఆర్సీ అమలు విషయంలోనే కాకుండా ఇంటరిమ్‌ రిలీఫ్‌ (ఐఆర్‌) విషయంలోను ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం వీరికి 20 శాతం ఐఆర్‌ను పెంచి ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు కలిపి జూలై 1న తీసుకుంటారని ప్రకటించింది. అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అంతకు ముందు ప్రకటించిన 20శాతానికి అదనంగా 7 శాతం అంటే 27శాతం ఐఆర్‌ ఇస్తామని ప్రకటించింది. ఇలా ప్రకటిస్తూనే అంతకుముందు ప్రభుత్వం చెప్పిన దానితో సంబంధం లేకుండా ఆగస్టు నుంచి తీసుకోవచ్చని చెప్పటంతో ఐఆర్‌ పెరిగినా, మూడు నెలలు కోల్పోవాల్సిన పరిస్థితి ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది.
 🔹2019 ఏప్రిల్‌ నుంచి మూడు నెలలు 20 శాతం చొప్పున 60 శాతం ఐఆర్‌ను వారు కోల్పోయినట్లువుతుంది. ఈ విషయం సర్వీసులో ఉన్న ఉద్యోగులనే కాకుండా పెన్షనర్లను కూడా కలవరపెడుతున్నది. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో ఉద్యోగ విరమణ చేసిన వారు ఈ ఐఆర్‌ ప్రయోజనాలను అందుకోలేని పరిస్థితి ఎదురవుతున్నది. ఇక ప్రభుత్వం ప్రకటించిన ఐఆర్‌ను గురుకుల పాఠశాలలు ఇతర విద్యాసంస్థలు, కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగులకు వర్తింపచేయకపోవడం వల్ల వేలాదిమంది నష్టపోయే ప్రమాదం ఉంది.

ఉద్యోగులు ఎదురుచూపులు

🔹ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే డీఏ బకాయిల విడుదల, పీఆర్సీ అమలు, ఐఆర్‌ వర్తింపు కాలాన్ని ఏప్రిల్‌గా నిర్ణయించటం చేయాలని, ఇందుకోసమై ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇటీవలే కొన్ని సంఘాల నాయకులు ఈ విషయమై పత్రికా సమావేశాలు నిర్వహించి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయటం, అవసరమైతే ఇందుకోసం ప్రత్యక్ష కార్యాచరణకు సైతం దిగుతామని ప్రకటించటం కూడా జరిగింది. ఏది ఏమైనప్పటికీ కనీసం ఈ నెలలోనైనా ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వస్తుందని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top