⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Monday, 28 October 2019

English Medium -ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం-ఒకటో తరగతి నుంచి 8 వరకూ వర్తింపు-వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు సన్నాహాలు -రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం-ఒకటో తరగతి నుంచి 8 వరకూ వర్తింపు-వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు సన్నాహాలు -రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం

🔹ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీన్ని కార్యరూపంలో పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు విద్యాశాఖాధికారులకు సూచనలు ఇచ్చింది. గత ఏడాది ఆదర్శ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది నుంచి ప్రస్తుతం ఎనిమిదో తరగతి వరకూ చదువుతున్న వారందరికీ ఆంగ్ల మాధ్యమాన్ని వర్తింపజేయనుంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి సర్కారు కొత్త కార్యాచరణను సిద్ధం చేస్తోంది.

🔹ప్రధానంగా ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రణాళిక తయారు చేసింది. ఇప్పటికే అమ్మఒడిని అమలు చేయడానికి మార్గదర్శకాలు విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఆంగ్ల మాధ్యమం అమలు చేసేందుకు చర్యలు చేపడుతోంది. దీనిపై రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ(ఎన్‌సీఈఆర్‌టీ) కసరత్తు మొదలు పెట్టింది. 2020-21 సంవత్సరంలో ఒకటి నుంచి 8 తరగతుల వరకూ, 2021 -22 సంవత్సరంలో 9,10 తరగతుల విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియంలో బోధించేవిధంగా కార్యాచరణ తయారు చేస్తోంది.

🔸ఇప్పటివరకూ తెలుగు మీడియంలో భోదించే విద్యార్థులకు కూడా రానున్న విద్యాసంత్సరంలో ఇంగ్లీష్‌ మీడియంలో చెప్పాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆయా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వన్నారు.

🔹రానున్న విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి 8వ తరగతిలో వరకూ ఒక సబ్జెక్కు మాత్రమే తెలుగు ఉంటుంది. మిగిలినవన్నీ ఆంగ్లలోనే చదువుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది అమ్మఒడి కార్యక్రమం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో సర్కారు బడిలో విద్యా ర్థుల సంఖ్య పెరిగింది. రానున్న విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్‌ మీడియం అమలు చేస్తే ఇకపై తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపుతారని ప్రభుత్వం భావిస్తోంది.

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top