⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Sunday, 20 October 2019

Aghoreshwara Temple in Ikkeri -అఘోరశ్వర దేవాలయ విశేషాలు తెలుసా!!



అఘోరశ్వర దేవాలయ విశేషాలు తెలుసా!!
అఘోరలు.. వీరికొక ప్రత్యేకత. వీరంటే దేశంలోనే అందరీకి అదొక రకమైన అభిమానం, భయం, గౌరవం, భక్తి. అయితే వారికి ఆరాధ్యదైవం శివుడే. ఆయన్ను అఘోరేశ్వరుడుగా పూజిస్తారు. అఘోరేశ్వరుడి ఆలయాలు అతి అరుదుగా ఉంటాయి. అటువంటి దేవాలయం గురించి తెలుసుకుందాం… మన పక్కనే ఉన్న కర్ణాటకలో ఈ దేవాలయం ఉంది. పూర్వం రాజులు నిర్మించిన ఈ దేవాలయ విశేషాలు…

కన్నడ భాషలో ఇక్కేరి అంటే రెండు వీధులు అని అర్థం. షిమోగా జిల్లా సాగర అనే పట్టణం వద్ద ఇక్కేరి ఒక చిన్న ఊరు. షిమోగా వచ్చే పర్యాటకులు ఈ పట్టణాన్ని తప్పక చూడాలి. ఇక్కేరి క్రీ.శ.1560 నుండి క్రీ.శ 1640 వరకు కెలాడి పాలకులకు రాజధానిగా ఉండేది. ఈ ప్రాంతంలో గ్రానైట్‌ చే నిర్మించబడిన అఘోరేశ్వర దేవాలయం ప్రసిద్ధి. ఈ దేవాలయ శిల్ప నైపుణ్యతలో చాళుక్యుల, ద్రవిడుల, హొయసలుల, దక్కన్‌ సుల్తానుల మరియు విజయనగర పాలకుల శిల్ప కళా నైపుణ్యాలు కనపడతాయి.
ముఖద్వారం విశేషం
ఈ దేవాలయంలో ద్వారాలకు ప్రత్యేకత ఉంది. భారతదేశంలో దేవాలయాలన్నీనూ తూర్పు దిక్కుకు ముఖ ద్వారం వుండేలా నిర్మిస్తారు. కాని ఈ ఇక్కేరి దేవాలయం మాత్రం ఉత్తరదిక్కు ముఖ ద్వారం వుంటుంది.
ఇది పూర్తిగా నాలుగు రకాల శైలితో నిర్మించారు. ద్రవిడ శైలి, హోయసల శైలి, చాళుక్య శైలితో పాటు గుడి పైన వుండే గోడలు ‘ఇస్లామిక్‌” శైలితో వుంటాయి. అదే ఇక్కడి ప్రాముఖ్యత.
కెలడీ రాజ్యంలొ బంగారు విరివిగా దొరుకుతుంది. విజయనగర రాజులకు సామంతులుగా కెలడీని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించేవారు. వీరి పాలన దాదాపుగా 250 సంవత్సరాల పైన సాగింది. ఈ ఇక్కేరిని రాజధానిగా చేసుకొన్నాక ఈ అఘోరేశ్వర దేవాలయం నిర్మించారు. దేవాలయ నిర్మాణం పచ్చని ప్రదేశం మధ్యలో కొత్త రకమైన రూపురేఖలతో కనపడుతుంది. దేవాలయం లోపల ఆశ్చర్యం కలిగించే శిల్ప శైలి కనపడుతుంది. ఇస్లామిక్‌ ఆర్కిటెక్చర్‌ అని చెప్పవచ్చును. కేవలం పాదాలు మాత్రమే మిగిలి వున్న శిల్పం గుడికి దూరంగా అదే ప్రహరి మద్యలో ఒక మండపం మీద వున్నది దాని చుట్టు మరి కొన్ని ద్వంసమైన కళారూపాలు వున్నాయి.

ప్రస్తుతం ఈ అఘోరేశ్వర దేవాలయ నిర్వహాణా భాధ్యత భారత దేశ పురావస్తు శాఖ పర్యవేక్షిస్తుంది. ఇక్కేరి సాగర తాలూకాకి దక్షిణాన సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. కన్నడ పదం ఇక్కేరి అర్థం ‘రెండు‘ వీధులు.
దేవాలయ ద్వారాలు దేవాలయానికి పడమటి, తూర్పు మరియు ఉత్తర భాగాలలో చక్కటి మార్గాలుంటాయి. ఉత్తర ద్వారం వద్ద రెండు ఏనుగులుంటాయి. ఈ దేవాలయాన్ని దర్శించే పర్యాటకులు భైరవ, మహిషాసురమర్దిని, సుబ్రమణ్య, గణేష బొమ్మలను కూడా చూడవచ్చు.అఘోరేశ్వర దేవాలయ శిల్ప కళ ఈ దేవాలయ రాతి గోడలు వివిధ రకాల బొమ్మలు కలిగి ఉంటాయి. గుడులు, ఏనుగులు, పురాతన కన్నడ లిపి వంటివాటితో ఈ దేవాలయం అలరారుతున్నది

Aghora Life History Real Facts about Aghories  _ కుంభమేళా లో మాత్రమే కనిపించే అఘోరాలు....: అఘోరాలు ఎవరు? ఎందుకలా శవాల మధ్య గడుపుతారు? మహిళ అఘోరాలు వారి జీవనవిధానం.... 

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top