బీఈడీలో 3,412 సీట్లే భర్తీ
పూర్తయిన ఎడ్‌సెట్ కౌన్సెలింగ్
ప్రస్తుత విద్యా సంవత్సరానికి బీఈడీలో 31,433 సీట్లకుగానూ కేవలం 3,412 (10.85%) సీట్లే భర్తీ అయ్యాయి. విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో భారీగా 28,021 సీట్లు మిగిలిపోయాయి. బీఈడీలో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్ సీట్ల కేటాయింపు సోమవారం పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎడ్‌సెట్‌లో 11,419 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. వీరిలో కేవలం 4,206 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. ప్రవేశాలకు 3,436 మంది ఆప్షన్లు ఇవ్వగా 3,412 మందికి సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 14వ తేదీలోగా కళాశాలల్లో చేరాలని, తరగతులు 15 నుంచి ప్రారంభమవుతాయని కన్వీనర్ కుమారస్వామి తెలిపారు. విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కళాశాలల్లో 1,056 సీట్లుండగా 676 సీట్లే భర్తీ కావడం గమనార్హం.

0 comments:
Post a Comment