Search This Blog

Sunday, 1 September 2019

VWST-కఠిన ‘పరీక్ష’ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల ప్రశ్నపత్రం సరళితో అభ్యర్థుల బెంబేలు-విశ్లేషణ

కఠిన ‘పరీక్ష’
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల ప్రశ్నపత్రం సరళితో అభ్యర్థుల బెంబేలు
గ్రూపు-1, 2 స్థాయిలో ప్రశ్నలు
దీర్ఘకాలంగా సన్నద్ధమవుతున్న వారికే మేలు: నిపుణుల విశ్లేషణ
కొన్ని జిల్లాల్లో అర్హత మార్కులను తగ్గించే అవకాశం!
ఈనాడు డిజిటల్‌ - అమరావతి

కఠిన ‘పరీక్ష’
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ నియామకాల రాత పరీక్షల ప్రశ్నపత్రాలు అభ్యర్థులను బెంబేలెత్తించాయి. ఉద్యోగాల స్థాయికి మించి వచ్చిన ప్రశ్నలు వారిని ముప్పుతిప్పలు పెట్టాయి. ప్రశ్నల సరళి గ్రూపు-1, 2 స్థాయిలో ఉంది. ఏపీపీఎస్సీ, ఇతర నియామక సంస్థల ఉద్యోగ ప్రకటనలకు తగ్గట్టు రెండు, మూడేళ్లనుంచి సిద్ధమవుతున్న వారే ముందుంటారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సచివాలయ ఉద్యోగాల ప్రకటన వెలువడ్డాక పరీక్షలకు ఉన్న స్వల్ప వ్యవధిలోనే నైపుణ్యాలను మెరుగుపర్చుకున్నవారు ఉద్యోగాలు పొందేందుకు అవకాశాలున్నాయి. ప్రశ్నల స్థాయి ఎక్కువగా ఉన్నందున ఉద్యోగ ఖాళీలకు తగ్గట్టు అభ్యర్థుల ఎంపికకు పలు జిల్లాల్లో ఆయా విభాగాల్లో కనీస అర్హత మార్కులను తగ్గించవచ్చనే అభిప్రాయాలు వస్తున్నాయి.

సచివాలయాల ప్రారంభమెప్పుడు?
జులై 26న ఉద్యోగ ప్రకటనలు వెలువడ్డాయి. ఆదివారంనుంచి ఈ నెల 8వ తేదీ వరకు రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-5, మహిళా పోలీసు, వార్డు సంక్షేమ విద్య కార్యదర్శి (గ్రామీణ), వార్డు పరిపాలన కార్యదర్శి, మధ్యాహ్నం పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌ 6, డిజిటల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు జరిగాయి.
* ప్రభుత్వ ప్రాధాన్యాలైన నవరత్నాలు, ఆర్థిక సర్వే, రాష్ట్ర విభజన, ఇతర అంశాలపై అభ్యర్థులు సన్నద్ధమయ్యారు. దీనికి భిన్నంగా ఉన్న పరీక్ష పత్రాలను చూసి కంగుతిన్నారు. సాధారణంగా పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపే ఇంజినీరింగ్‌ పట్టభద్రుల్లో కొందరు ప్రశ్నలస్థాయిని చూసి హతాశులయ్యారు. గ్రామ సచివాలయాలు ఎప్పటినుంచి ప్రారంభమవుతాయన్న ప్రశ్నకు అభ్యర్థులు జవాబును వెంటనే గుర్తించారు. ఇంకొన్ని సాఫీగానే కనిపించినా, అధిక శాతం ప్రశ్నలకు జవాబుల గుర్తింపులో హైరానా పడ్డారు. రుణాత్మక మార్కులు, పరోక్ష ప్రశ్నలు వారిని భయపెట్టించాయి. జతపరచడం విభాగాలు దాదాపు సమానార్థాలను స్ఫురింపజేసి గందరగోళపర్చాయి. లోతుగా అధ్యయనం చేసినవారే వాటిని సరిగా గుర్తించగలిగారు.

ప్రశ్నల సరళి ఇలా..
భూతలం నుంచి చంద్రుడు ఎంత శాతం కనిపిస్తాడు? ప్రింటర్‌ నాణ్యతను ఎలా  కొలుస్తారు? సాగరతీరంలో చమురు, సహజవాయువుకు చెల్లించాల్సిన రాయల్టీని సంబంధిత రాష్ట్రానికే చెల్లించాలని ఏ షెడ్యూల్‌ కింద రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారు? ఇలా ప్రశ్నలున్నాయి. మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలతోపాటు రాష్ట్రంలోని ప్రధాన సంఘటనలపై ప్రశ్నించారు.

వెబ్‌సైట్‌లో ‘కీ’లు
ఆదివారం జరిగిన రాత పరీక్షల ప్రశ్నపత్రాల ప్రాథమిక ‘కీ’ని గ్రామసచివాలయం వెబ్‌సైట్‌లో పెట్టినట్లు పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ వెల్లడించారు. ఈ ‘కీ’లపై 3రోజులపాటు అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. ప్రశ్నపత్రాల్లో తప్పులు కానీ అనువాదంలో దోషాలు దొర్లినట్లు తమ దృష్టికి రాలేదని పేర్కొన్నారు. నిర్దేశిత మార్గదర్శకాల మేరకు (సులువుగా, కాస్త కఠినంగా, కఠినంగా) ప్రశ్నపత్రాలను రూపొందించామని తెలిపారు. పాఠ్యప్రణాళికలోని అధ్యాయాలకు అనుగుణంగా సన్నద్ధమైన వారికి ఇబ్బందులు ఉండబోవని వివరించారు. శిక్షణ సంస్థలు ఇచ్చే తర్ఫీదు ముఖ్యమని పేర్కొన్నారు.
ఇంత కఠినమా?
‘పంచాయతీ కార్యదర్శి ప్రశ్నపత్రం ఇంత కఠినంగా ఉంటుందని ఊహించలేదు. పాఠ్య ప్రణాళికకు తగ్గట్టు సిద్ధమైనా లోతైన విశ్లేషణతో ప్రశ్నలొచ్చాయి. ప్రభుత్వ పథకాలు, నవరత్నాలు, విభజన చట్టం ప్రస్తావనే లేదు.’ - రమణకుమారి, మైలవరం
సమయం సరిపోలేదు
‘ప్రశ్నలు సులువుగా ఉన్నా జవాబులు గుర్తించేందుకు ఎక్కువ సమయం పట్టింది. నోటిఫికేషన్‌ జారీ, పరీక్షల మధ్య వ్యవధి తక్కువగా ఉండడం ఇబ్బందికరంగా మారింది. వేగంగా జవాబులు గుర్తించడంలో వెనకబడ్డా. సమయం సరిపోలేదు’ - కె.కిరణ్‌కుమార్‌, నూజివీడు
వర్తమానాంశాలూ కఠినమే
చరిత్ర, అర్థశాస్త్రాలకు సంబంధించి ప్రశ్నలు తక్కువగా వచ్చాయి. జీవ, రసాయన శాస్త్రాల ప్రశ్నలు ఐదుకు మించి రాలేదు. వర్తమాన అంశాలపై ఇచ్చినవీ కఠినమే.  పంచాయతీ కార్యదర్శి స్థాయికి మించినవి ఉన్నాయి’ - తిరుపతయ్య, విజయవాడ
కంప్యూటర్‌ కోర్సు చేసిన వారికి అవకాశం
మధ్యాహ్నం జరిగిన డిజిటల్‌ సహాయకుడి ఉద్యోగ నియామక రాత పరీక్ష ప్రశ్నపత్రం  కఠినంగానే ఉంది. సీప్లస్‌ప్లస్‌, జావా వంటి కంప్యూటర్‌ భాషలపై ప్రశ్నలు వచ్చాయి. కంప్యూటర్‌ విద్య చదివినవారికే అవకాశాలున్నాయి. - అభ్యర్థులు రామకుమార్‌, శ్రావణ్‌
గ్రూపు పరీక్షల స్థాయిలో..
సచివాలయ ఉద్యోగాల స్థాయిలో ఇచ్చినవి తక్కువే. గ్రూప్స్‌, సివిల్స్‌ పరీక్షల స్థాయిలో ప్రశ్నలున్నాయి. అలాంటి అత్యున్నత ఉద్యోగాలకు సన్నద్ధమైన వారే ఈ ఉద్యోగాలను సాధించగలుగుతారు. - హరిబాబు (తిరుపతి), జేవీఎస్‌రావు (విజయనగరం), పోటీరంగ నిపుణులు

మండలానికి ఇద్దరు ఆర్‌ఐలు-ప్రతీ శనివారం రెవెన్యూ కోర్టు  ఆ రోజు వేరే బాధ్యతలు వద్దు 

0 comments:

Post a Comment

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top