Search This Blog

Monday, 2 September 2019

Sri Mahadevar Athisaya Vinayakar Temple-Keralapuram - Temple Stories-రంగులు మారే కేరళపురం వినాయగర్ ఆలయం !- ఆరు నెలలకు ఒక సారి రంగులు మారే అతిశయ వినాయకుడు....వివరాలు...

Sri Mahadevar Athisaya Vinayakar Temple-Keralapuram - Temple Stories-రంగులు మారే కేరళపురం వినాయగర్ ఆలయం !- ఆరు నెలలకు ఒక సారి రంగులు మారే అతిశయ వినాయకుడు....వివరాలు...

ఏనుగు తొండం.. లంబోదరం.. ఎలుక వాహనంతో వింతగా కనిపించే వినాయకుడు.. ఒక ఆలయంలో రంగులు కూడా మారుస్తాడు. వినాయకుడు రంగులు మార్చడమేంటి? అనుకుంటున్నారా? అవును.. ఆర్నెళ్లు తెల్ల రంగులో.. ఆర్నెళ్లు నల్లటి రంగులో దర్శనమిస్తూ.. భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఆ వింత వినాయకుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా?

తమిళనాడులోని నాగర్‌కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయం ఉంది. అదే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం. ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు, ఈ ఆలయం ఘనత మాత్రం చాలా గొప్పది. అందుకు కారణం


 ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన వినాయకుడు ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం. ఉత్తరాయణ కాలం (మార్చి నుంచి జూన్) వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. దక్షిణాయన కాలం (జూలై నుంచి ఫిబ్రవరి) వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మహత్యం అని భక్తుల విశ్వాసం. ఇక్కడ మరో విచిత్రం కూడా ఉంది. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి ఉంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. కానీ అది మిగతా చోట్ల మాటేమోగానీ.. నా దగ్గర మాత్రం అది చెల్లదు అంటుంది ఇక్కడున్న ఈ బావి. ఇక్కడ ఉన్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే.. ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది. వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో, ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి.. వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో, ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి.

 ఇంత కన్నా మరో విచిత్రం కూడా ఉంది. సాధారణంగా శిశిర ఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ, దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతతహరితాలే.
కానీ, ఈ ఆలయంలో ఉన్న మర్రిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకర్ అని కూడా పిలుస్తారు. నిజానికిది శివాలయం. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించారు. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అని అంటారు. ఆ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఆ కారణంగా, ఈ ఆలయాన్ని ఎన్నోసార్లు పునర్నిర్మించారు. ఆ కాలంలో ఈ ఆలయం మీద కేరళ ప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది. తర్వాతి కాలంలో రాష్ర్టాలు విడిపోయాక, ఈ ఆలయం తమిళనాడుకు చెందడంతో, కేరళ ప్రభుత్వం ఆధిపత్యం తగ్గింది.
మహిమే కారణం
ఆ రోజులలో కేరళ పురం రాజు తీర్థయాత్రలకని రామేశ్వరం వెళ్లాడు. అక్కడ తన పరివారంతో కలసి దక్షిణ సముద్రంలో స్నానం చేస్తున్న సమయంలో, ఆయనకు ఒక వినాయక విగ్రహం, సముద్ర కెరటాలలో తడుస్తూ కనిపించింది. రాజుగారు ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజుగారికి అప్పగించబోతే.. దొరికిన వారికే ఆ విగ్రహం చెందడం ధర్మం అని భావించి, రామేశ్వరం రాజు ఆ విగ్రహాన్ని కేరళ పురం రాజుకే ఇస్తూ, మరొక మరకత(పచ్చల) గణపతిని కూడా బహూకరించాడు. కేరళపురం రాజుగారు ఆ రెండు విగ్రహాలనూ తన రాజ్యం తీసుకుని వచ్చి ప్రతిష్ఠించాడు. అయితే తురుష్కుల దండయాత్రలో ఆ మరకత గణపతి కొల్లగొట్టబడి, ఈ గణపతి మాత్రం మన అదృష్టం కొద్దీ ఇక్కడ మిగిలిపోయాడు. ఈ ఆలయం ప్రతిష్టాపన కూడా ఆగమ శాస్ర్తానుసారం జరుగలేదు. ఒక రాతిపీఠం మీద అతి సాధారణంగా ఈ వినాయక విగ్రహాన్ని స్థాపించారు. అయినా ఈ ఆలయం ఇంత ప్రఖ్యాతి చెందడానికి ఈ వినాయకుని మహిమే కారణం అంటారు భక్తులు. ఈ ఆలయ ప్రాకార గోడల మీద అతి పురాతరమైన వర్ణచిత్రాలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ వినాయకునికి ఉదయం, సాయంకాలం కూడా అభిషేకాలు జరుగుతుండడం విశేషం. ఏ కోరికతోనైనా భక్తులు ఈ స్వామికి కొబ్బరికాయ గానీ, బియ్యపు మూట గానీ ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెబుతుంటారు.

ఈ ఆలయం 1317 సంవత్సరంలో నిర్మించారు. ఈ ఆలయానికి 2300 సంవత్సరాల చరిత్ర ఉన్నదని చరిత్రకారుల అంచనా. నిజానికిది శివాలయమట. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉండేది. ఆ తరువాతనే ఈ వినాయకుని ఆలయాన్ని నిర్మించారు. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవల్ అతిశయ వినాయగర్ ఆలయమని అంటారు.

ఆ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఆ కారణంగా ఈ ఆలయాన్ని ఎన్నోమార్లు పునర్నిర్మించడం జరిగింది. ఆ కాలంలో ఈ ఆలయం మీద కేరళ ప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది. తరువాతి కాలంలో రాష్ట్రాలు విడిపోయాక ఈ ఆలయం తమిళనాడుకు చెందడంతో కేరళ ప్రభుత్వం ఆధిపత్యం తగ్గింది.

0 comments:

Post a Comment

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top