Today in History - important days in history - చరిత్ర లో ఈ రోజు..
Today in History -september 29 -చరిత్రలో ఈ రోజు -సెప్టెంబర్ 29
@మన్నంవెబ్ .కామ్ ( MANNAMweb.com )
సంఘటనలు
- 2002: 14వ ఆసియా క్రీడలు దక్షిణ కొరియా లోని బుసాన్ లో ప్రారంభమయ్యాయి.
జననాలు
- 1899: లాస్లో బైరొ, బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త. (మ.1985)
- 1901: ఎన్ రికో ఫెర్మి, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.1954).
- 1932: మెహమూద్, భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, హిందీ సినిమా హాస్య నటుడు (మ.2004).
- 1945: బాలి (చిత్రకారుడు), మంచి చిత్రకారులలో ఒకడు. ఈయన వేల సంఖ్యలో కథలకు, నవలలకు బొమ్మలు వేశాడు. ఈయన అసలు పేరు ఎం. శంకర రావు.
- 1947: మతుకుమల్లి విద్యాసాగర్, రాయల్ సొసైటీకి చెందిన ఫెలో మరియు కంట్రోల్ ధియరిస్టు. ఆయన భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త.
- 1947: సరోష్ హోమీ కపాడియా భారత సుప్రీం కోర్టు 38వ ప్రధానన్యాయమూర్తి. (మ.2016)
- 1985: అంజనా సౌమ్య, జానపద మరియు సినీ గాయని, మలేషియా, సింగపూర్, జపాన్, అమెరికా తదితర దేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చింది.
- 1970: కుష్బూ, ఒక ప్రముఖ భారతీయ చలనచిత్ర నటి. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది.
మరణాలు
- 1920: దీవి గోపాలాచార్యులు, వైద్య శాస్త్రవేత్త, హిందూ సంప్రదాయ వైద్య పరిశోధకుడు (జ.1872).
- 1977: కొలచల సీతారామయ్య, ఆయిల్ టెక్నాలజీ పరిశోధక నిపుణుడు (జ.1899).
- 2007: కట్సుకో సరుహషి జపాన్ దేశానికి చెందిన భూరసాయన శాస్త్రవేత్త. (జ.1920)
- 2008: జాగర్లమూడి వీరాస్వామి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా, కులనిర్మూలన సంఘ అధ్యక్షునిగా చేశాడు (జ.1919).
- 2008: పేర్వారం జగన్నాధం, ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు మరియు విద్యావేత్త (జ.1934).
- 2014: పైడి తెరేష్ బాబు, ప్రముఖ కవి (జ.1963).
పండుగలు మరియు జాతీయ దినాలు
- ప్రపంచ హృదయ దినోత్సవం
0 comments:
Post a Comment