⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Friday, 27 September 2019

2017 లో శాస్త్ర వేత్తల చే కనుగొనబడిన.... *జిలాండియా ఖండం....* Scientists reveal secrets of lost continent Zealandia - పసిఫిక్‌ సముద్రంలో మునిగిపోయిన జిలాండియా ఖండం? జిలాండియా ఖండంలో ఏం దొరికాయో తెలుసా? (💥 *సముద్ర అంతర్భాగం లో ఉన్న ఓ ఖండం.....2017 లో కనుగొనబడింది...)*

New Zealand rises from the center of a previously unknown, largely submerged continent, scientists propose. They call it Zealandia. Lurking beneath New Zealand is a long-hidden continent, geologists now propose. They call it Zealandia.Mar 13, 2017
 

ఇప్పటి వరకు కళ్ళ బడని 8వ ఖండం ...జిలాండియా...

ఇప్పటి వరకు మనం భూమిపై ఏడు ఖండాలు ఉన్నాయని చదువుకున్నాం! ఇకపై ఆ సంఖ్య ఎనిమిది కాబోతోందంటున్నారు శాస్త్రవేత్తలు. పసిఫిక్‌ మహా సముద్రంలో న్యూజిలాండ్‌ కింది భాగంలో భారత ఉపఖండం పరిమాణంలో ఓ కొత్త ఖండాన్ని గుర్తించారు. 49 లక్షల కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ ఖండానికి ‘జీలాండియా’ అని పేరుపెట్టారు. న్యూజిలాండ్‌లోని విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్‌ వెల్లింగ్‌స్టన్‌, ఆస్టేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా దీనిని కనిపెట్టారు.

కొత్త ఖండం అవతరించబోతోందా?
ప్రపంచపటంపై మరో కొత్త ఖండం అవతరించబోతోందా?. న్యూజిల్యాండ్‌కు అనుకుని సముద్ర అంతర్భాగం నుంచి కొద్దిగా బయటకు కనిపిస్తున్న భూమే ఇందుకు నిదర్శనం. మనకు ప్రస్తుత ప్రపంచపటంపై కనిపిస్తున్న న్యూజిలాండ్‌ భూభాగం ఆ కొంచమే కాదు. దక్షిణ పసిఫిక్‌ మహా సముద్రంలో కలిసిపోయిన న్యూజిలాండ్‌ భూభాగం చాలానే ఉంది. ఆ భూభాగమే 'జిల్యాండియా'. ఐదు మిలియన్ల స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో జిల్యాండియా వ్యాపించి ఉంది. ఈ ప్రాంతంలో మిగిలిన ఖండాల్లానే మనిషి నివసించడానికి కావల్సిన అనుకూలతలన్నీ ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

జియోలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికా జర్నల్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి. అయితే, 94 శాతం జిల్యాండియా భూభాగం సముద్రంలో ఉంది. జిల్యాండియాను కొత్త ఖండంగా గుర్తించడం వల్ల దాని పుట్టుపూర్వోత్తరాలను కనుగొనేందుకు అవకాశం కలుగుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. సముద్ర గర్భంలో దాగివున్న భూభాగంపై పరిశోధనలు కష్ట సాధ్యమైనవని, సముద్ర అంతర్భాగం నుంచి జిల్యాండియా బయటపడితే అక్కడ ఎంత విశాలమైన ప్రకృతి దాగివుందో అందరికీ అర్ధమౌతుందని ఓ శాస్త్రవేత్త అన్నారు.

భూమిపై 8 ఖండాలు ఉండేవి..
ఆ ఖండం సముద్రంలో మునిగిపోయింది!
భూమి మీద ఎనిమిదో ఖండం జిలాండియా

100 మిలియన్‌ సంవత్సరాల కిందట కలిసి ఉన్న ఆస్ట్రేలియా, అంటార్కిటికా, జిలాండియా భూభాగాలు
సముద్రంలో సమాధైన జిలాండియా
సముద్ర మట్టానికి 3,280 అడుగుల లోతున జిలాండియా

భూమి ఏడు ఖండాలుగా విభజించబడిన సంగతి తెలిసిందే. అయితే భూమిపై ఎనిమిదో ఖండం కూడా ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అది సుమారు 60 లక్షల ఏళ్ల క్రిందట వచ్చిన వాతావరణ మార్పుల కారణంగా సముద్రంలో సమాధి అయిపోయిందని చెబుతున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్యలో సముద్రాన్ని శోధిస్తుండగా ఈ ఎనిమిదో ఖండాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిని జిలాండియా ఖండంగా వారు పేర్కొంటున్నారు. భౌగోళిక మార్పులు, సునామీలు, భూకంపాల మూలంగా ఈ ప్రాంతం సముద్రంలో మునిగి పోయి ఉండొచ్చని మహాసముద్రాలపై పరిశోధనలు చేస్తున్న డాక్టర్‌ జామీ అలెన్‌ చెబుతున్నారు.

సుమారు 100 మిలియన్‌ సంవత్సరాల కిందట ఆస్ట్రేలియా, అంటార్కిటికా, జిలాండియా భూభాగాలు కలిసి భూమి మీద అతి పెద్ద ఖండంగా ఉండేదని ఆయన వెల్లడించారు. ఈ జిలాండియా ఖండం ఆస్ట్రేలియాకు తూర్పుతీరంలో ప్రస్తుత న్యూజిలాండ్‌ తో కలిసి ఉండేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది సముద్ర మట్టానికి 3,280 అడుగుల లోతు నీళ్లలో సమాధై ఉందని ఆయన అన్నారు. దీనిపై మరిన్ని విస్తృత పరిశోధనలు చేస్తే మానవ మనుగడ, ఉన్నతికి సంబంధించిన అనేక విషయాలు, విశేషాలు వెలుగుచూసే అవకాశముందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ జిలాండియాలో సుమారు 8 వేల రకాల జాతుల శిలాజాలు, విభిన్నరకాల శిలాకృతులు ఉన్నాయని ఆయన తెలిపారు

పసిఫిక్‌ సముద్రంలో మునిగిపోయిన 8వ ఖండం?

పసిఫిక్‌ మహా సముద్రంలో మునిగిపోయిన ఎనిమిదవ ఖండం జిలాండియాపై శాస్త్రవేత్తలు తొలిసారి పరిశోధనకు వెళ్లారు. వేల అడుగుల లోతులో ఉన్న జిలాండియాపై పాదం మోపిన శాస్త్రవేత్తలు దాదాపు 8 వేల శిలాజాలను కనుగొన్నారు. జిలాండియా ఖండం కొద్ది రోజుల క్రితం పసిఫిక్‌ మహా సముద్రంలో మనిగిపోయిన విషయం తెలిసిందే.
దానిపై ఉన్న జీవరాశి గురించి అన్వేషించేందుకు నిర్ణయించుకున్న ఓ శాస్త్రవేత్తల బృందం సాగర గర్భంలో వేల మీటర్ల లోతుకు వెళ్లింది. అక్కడ శవాల దిబ్బగా మారిన జిలాండియా శాస్త్రవేత్తల బృందానికి దర్శనమిచ్చింది. శాస్త్రవేత్తలు కలియతిరిగిన కొద్ది ప్రాంతంలోనే వేల సంఖ్యలో జీవరాశులు ప్రాణాలు విడిచి కనిపించాయి.

జిలాండియా మొత్తం విస్తీర్ణం 5 లక్షల చదరపు కిలోమీటర్లు. జిలాండియా నుంచి జంతువులు, మొక్కలకు సంబంధించిన శాంపిల్స్‌ను తీసుకొచ్చిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. పూర్వం జిలాండియాలో భౌగోళికంగా, వాతావరణపరంగా పరిస్థితులు భిన్నంగా ఉండేవని చెప్పారు.

40 నుంచి 50 మిలియన్ల సంవత్సరాలకు పూర్వం పసిఫిక్‌ మహాసముద్ర గర్భంలో సంభవించిన ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’.. అగ్నిపర్వతాల క్రీయాశీలత్వాన్ని, సముద్ర లోతును, జిలాండియా విస్తీర్ణంలో మార్పులు వచ్చేలా చేసిందని వెల్లడించారు. అప్పుడే ఆస్ట్రేలియా, అంటార్కిటికాల నుంచి జిలాండియా విడిపోయి ఉంటుందని వెల్లింగ్‌టన్‌ యూనివర్శిటీ పరిశోధకులు ఒకరు చెప్పారు.

సముద్ర గర్భంలోని జిలాండియాను సందర్శించడం వల్ల భూమి చరిత్ర, న్యూజిలాండ్‌ పరిసర ప్రాంతాల్లో పర్వతాల పుట్టుక, టెక్టోనిక్‌ ప్లేట్లలో మార్పులు, సముద్రాలలో సంభవించే మార్పులు, ప్రపంచ వాతావరణంలో మార్పులపై పరిశోధనలు చేసేందుకు అవకాశం ఏర్పడిందని యూఎస్‌ నేషనల్‌ సైన్స్‌ షౌండేషన్‌కు చెందిన మరో శాస్త్రవేత్త వివరించారు.

8వ ఖండంలో ఏం దొరికాయో తెలుసా?

పసిఫిక్‌ మహా సముద్రంలో మునిగిపోయిన ఎనిమిదవ ఖండం జిలాండియాపై శాస్త్రవేత్తలు తొలిసారి పరిశోధనకు వెళ్లారు. వేల అడుగుల లోతులో ఉన్న జిలాండియాపై పాదం మోపిన శాస్త్రవేత్తలు దాదాపు 8 వేల శిలాజాలను కనుగొన్నారు. జిలాండియా ఖండం కొద్ది రోజుల క్రితం పసిఫిక్‌ మహా సముద్రంలో మనిగిపోయిన విషయం తెలిసిందే.

దానిపై ఉన్న జీవరాశి గురించి అన్వేషించేందుకు నిర్ణయించుకున్న ఓ శాస్త్రవేత్తల బృందం సాగర గర్భంలో వేల మీటర్ల లోతుకు వెళ్లింది. అక్కడ శవాల దిబ్బగా మారిన జిలాండియా శాస్త్రవేత్తల బృందానికి దర్శనమిచ్చింది. శాస్త్రవేత్తలు కలియతిరిగిన కొద్ది ప్రాంతంలోనే వేల సంఖ్యలో జీవరాశులు ప్రాణాలు విడిచి కనిపించాయి.

జిలాండియా మొత్తం విస్తీర్ణం 5 లక్షల చదరపు కిలోమీటర్లు. జిలాండియా నుంచి జంతువులు, మొక్కలకు సంబంధించిన శాంపిల్స్‌ను తీసుకొచ్చిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. పూర్వం జిలాండియాలో భౌగోళికంగా, వాతావరణపరంగా పరిస్థితులు భిన్నంగా ఉండేవని చెప్పారు.

40 నుంచి 50 మిలియన్ల సంవత్సరాలకు పూర్వం పసిఫిక్‌ మహాసముద్ర గర్భంలో సంభవించిన 'రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌'.. అగ్నిపర్వతాల క్రీయాశీలత్వాన్ని, సముద్ర లోతును, జిలాండియా విస్తీర్ణంలో మార్పులు వచ్చేలా చేసిందని వెల్లడించారు. అప్పుడే ఆస్ట్రేలియా, అంటార్కిటికాల నుంచి జిలాండియా విడిపోయి ఉంటుందని వెల్లింగ్‌టన్‌ యూనివర్శిటీ పరిశోధకులు ఒకరు చెప్పారు.

సముద్ర గర్భంలోని జిలాండియాను సందర్శించడం వల్ల భూమి చరిత్ర, న్యూజిలాండ్‌ పరిసర ప్రాంతాల్లో పర్వతాల పుట్టుక, టెక్టోనిక్‌ ప్లేట్లలో మార్పులు, సముద్రాలలో సంభవించే మార్పులు, ప్రపంచ వాతావరణంలో మార్పులపై పరిశోధనలు చేసేందుకు అవకాశం ఏర్పడిందని యూఎస్‌ నేషనల్‌ సైన్స్‌ షౌండేషన్‌కు చెందిన మరో శాస్త్రవేత్త వివరించారు.

Also Read....

💥Mysterious lost continent 'Greater Adria' -ఇప్పటి వరకు కళ్లబడని 8వ ఖండం?.. పేరు *గ్రేటర్ ఆడ్రియా ఖండం*.... ఎక్కడుందో తెలుసా? 
(💥సముద్ర అంతర్భాగం లో ఉన్న ఓ ఖండం.....2019 సెప్టెంబర్  లో కనుగొనబడింది...)

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top