ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కార్మికులకు శుభవార్త. ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయసును పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు రవాణా ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పదవీ విరమణ వయసు పెంచాలని ఆర్టీసీ విలీన అధ్యయన కమిటీ చేసిన సిఫార్సు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు కార్మికుల పదవీ విరమణ వయసు పెంచడంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎంప్లాయిస్ యూనియన్ నేతలు, వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ సంఘం, పలు సంఘాల సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు.
0 comments:
Post a Comment