⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Sunday, 22 September 2019

Real Heroes - నిజమైన హీరోలు-గిరి పుత్రులు...... ఆపద్బాంధవులు.. అడవి బిడ్డలు....గోదావరి కచ్చులూరు మందంలో మునిగితే ఆచూకీ అసాధ్యమేనా?


Real Heroes - నిజమైన హీరోలు-
గిరిపుత్రులు..... ఆపద్బాంధవులు.. అడవి బిడ్డలు....


►అంతటి గోదావరి సుడిలో దిగితే ఏటికి ఎదురీదినట్టే!
అక్కడి లోతు 300 అడుగుల పైనే ఉంటుంది.
 ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎంతటి గజ ఈతగాడికైనా ప్రాణాలు నీట కలిసిపోతాయి.

కానీ ఆ ఆదివాసీలు  గోదావరి సుడిని, లోతును చూసుకోలేదు. కళ్లెదుట మునిగిపోతోన్న బోటు, అందులో ఆర్తనాదాలు చేస్తోన్న పర్యాటకులు మాత్రమే వారికి కనిపించారు.

►ఆ క్షణాన వారికి వేరే ఏమీ గుర్తుకు రాలేదు. అందరిదీ ఒకటే లక్ష్యం. బోటులో మునిగిపోతున్న వారిని రక్షించి ఒడ్డుకు చేర్చడం. అనుకున్నదే తడువుగా కచ్చులూరు గ్రామానికి చెందిన గిరిజన మత్స్యకారులు మూడు బోట్లలో ఒక్క ఉదుటున గోదావరి వడిని లెక్క చేయకుండా ముందుకు కదిలారు.

►మునిగిపోతున్న రాయల్‌ వశిష్ట పున్నమి బోటు వద్దకు చేరుకున్నారు. అప్పటికే నదిలో పడిపోయి కొట్టుకుపోతోన్న వారిని ఒడిసి పట్టుకుని బోట్లలో వేసుకుని ఒడ్డుకు చేర్చారు.

►ఒక్కో బోటులో ఆరుగురు వంతున మూడు బోట్లలో వెళ్లిన పద్దెనిమిది మంది గిరిజనులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, చేతికి అందినవారిని అందినట్లుగా బయటకు తీసుకువచ్చారు. అలా మొత్తం 24 మందిని ప్రాణాపాయం నుంచి కాపాడారు.

గోదావరి కచ్చులూరు మందంలో మునిగితే ఆచూకీ అసాధ్యమేనా?

- 1959లో మునిగిన లాంచీ ఇప్పటికీ చిక్కని వైనం
- 1969 ఘటనలో ఇసుకలో కూరుకుపోయిన లాంచీ
- ఆ ప్రమాదాల్లో గల్లంతైన వారి జాడ దొరికిన దాఖలాల్లేవు.. ..

బోటు దొరికేనా? 
రంపచోడవరం: కచ్చులూరు మందంలో బోటు మునిగితే ఆచూకీ దొరకదా? ఇంతవరకూ ఇక్కడ జరిగిన ప్రమాదాలు అవుననే సమాధానమిస్తున్నాయి. ఈ మందంలో 1959, జూలైలో ఉదయ భాస్కర్‌ లాంచీ, 1969, జూలైలో ఝాన్సీరాణి లాంచీ 60మంది చొప్పున ప్రయాణికులతో మునిగిపోయిన సంగతి తెలిసిందే! వీటిలో 1959లో మునిగిన ఉదయభాస్కర్‌ లాంచీ ఇప్పటివరకూ ఆచూకీ లేదు. అందులో గల్లంతైన వారిలో చాలామంది ఆచూకీ కూడా నేటికీ లేదు. ఇక 1969లో మునిగిన లాంచీ చాన్నాళ్లకు సంఘటన దిగువ ప్రాంతంలో ఇసుకలో కూరుకుని దొరికింది. అందులో గల్లంతైన వారిలో కూడా చాలామంది ఆచూకీ దొరికిన దాఖలాలు లేవు. సముద్రంలో అడుగభాగాన ఓడలు వంటివి మునిగిన సందర్భంలో టైటానిక్‌ ఓడ మాదిరిగా ఆచూకీని గుర్తించవచ్చు. అదే గోదావరి లాంటి నదీ ప్రవాహంలో ఇసుక కదలికలతో కూరుకుపోయే సందర్భాలే ఎక్కువ. సమాంతరంగా ఉండే ప్రాంతంలో అయితే దాన్ని గుర్తించడం కొంత సాధ్యమవుతుంది.

స్థిరంగా ఉంటుందా..?
ఉదాహరణకు గతేడాది మంటూరుకు అవతల వాడపల్లి సమీపంలో జరిగిన లాంచీ ప్రమాదంలో లాంచీని, మృతులను సులభంగానే గుర్తించేశారు. ఇపుడైతే ఆ పరిస్థితి లేదన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం. కచ్చులూరు మందంవద్ద గోదావరికి లోతు, వడి ఎక్కువే. దీంతో అక్కడ మునిగిన లాంచీ స్థిరంగా అక్కడే ఉండే అవకాశం లేదు. కొంత ముందుకు కదిలినా, ఇసుకలో కూరుకుని పోతుంటుంది. ఈ పరిస్థితుల్లో గోదావరి లోతులో సదరు లాంచీని గుర్తించడం కూడా కష్టతరమే. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో కష్టసాధ్యంగా లాంచీని గుర్తించే అవకాశాలున్నా రోజులు గడిచే కొద్దీ దాని గమనం కూడా మారిపోతుంది. ఈ పరిస్థితుల్లో మునిగిన లాంచీని గుర్తించడం అనేది ఎంతవరకూ సాధ్యమన్నది దానికోసం సాగించే ప్రయత్న ఫలితమే తేల్చాలి.

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top