Prahlad Jani also known as Mataji or Chunriwala Mataji, (born 13 August 1929) is an Indian breatharian monk who claims to have lived without food and water since 1940. He says that the goddess Amba sustains him.
70 ఏళ్లుగా అన్నపానీయాలు ముట్టుకోని యోగి!
ఆయన ఓ యోగి. పేరు ప్రహ్లాద్ జాని. వయసు 88 ఏళ్లు. గుజరాత్లోని మెహసానా జిల్లా చరోడ్ గ్రామంలో ఉంటారు. ఈయన ఎన్నాళ్లుగానో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. దీనికి కారణం 70 ఏళ్లుగా ఈయన తిండి తినకుండా, నీళ్లు తాగకుండానే బతుకుతున్నారు. అంబను కొలిచే ఈయనను భక్తులు మాతాజీ అని పిలుస్తారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రహ్లాద్ జాని సైంటిస్టుల ప్రయోగాలకు కూడా వేదికగా మారారు.
ఈయనపై పరీక్షలు జరిపిన వాళ్లలో మిస్సైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ కూడా ఉన్నారు. 70 ఏళ్లుగా ఏమీ తినకుండా ఎలా ఉండగలుగుతున్నారో అర్థం కాక చాలా మంది సైంటిస్టులు కూడా నోరెళ్లబెడుతున్నారు. ఆయనకు ఎన్నో వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. జాని ఆశ్రమంలోని మొక్కలను కూడా పరిశీలించారు. అయినా ఆయన జీవన విధానం ఎవరికీ అంతుబట్టలేదు. 2010లో ఒకసారి డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఓ అధ్యయనం కూడా నిర్వహించాయి.
ఆయనను 15 రోజుల పాటు ఒంటరిగా ఒక దగ్గర ఉంచి ఎప్పటికప్పుడు వీడియో మానిటరింగ్ కూడా చేశారు. ఆ తర్వాత ఆయనకు ఎమ్మారై, అల్ట్రాసౌండ్, ఎక్స్ రే తీశారు. ఎప్పటికప్పుడు అన్ని వైద్య పరీక్షలు చేశారు. ఆయనకు అసాధారణ రీతిలో ఆకలి, దాహాన్ని తట్టుకొనే లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. తాను కేవలం ధ్యానం మాత్రమే చేస్తానని, అదే తనకు శక్తినిస్తుందని ప్రహ్లాద్ జాని చెబుతున్నారు. దేశం నలుమూలల నుంచి ఆయన దగ్గరికి భక్తులు వస్తుంటారు. ఎలాంటి ఫీజు తీసుకోకుండా వాళ్ల సమస్యలకు పరిష్కారం సూచిస్తారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈయన ఆశ్రమాన్ని సందర్శించిన ప్రముఖుల్లో ఉన్నారు
0 comments:
Post a Comment