In Hinduism and Tibetan Buddhist tradition, Shambhala is a mythical kingdom. The kingdom is said to be laid out in precisely the same form as an eight-petalled lotus blossom surrounded by a chain of snow mountains. At the centre is the palace of the King of Shambala who governed from the city called Kalapa
హిమాలయాలు భారతదేశానికి పెట్టనిగోడలా వుండి మన దేశాన్ని రక్షిస్తున్నాయ్. అదే హిమాలయాలలో ఎన్నో రహస్యాలు దాగివున్నాయ్.అవి అంతు చిక్కని రహస్యాలుగానే వుండిపోయాయ్.ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన నల్లమల అడవులు, ఇంతవరకూ ఏ వ్యక్తీ కూడా పూర్తిగా వాటిలోకి ప్రవేశించలేకపోయారు.వాటిలో ప్రతీపౌర్ణమికి చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతాయని పెద్దవాళ్ళు చెబుతారు.అటువంటి వాటిలో చాలా ప్రముఖమైనది శంభల నగరం. మన పురాణాలు తెలియచేస్తున్న హనుమంతుడు కూడా హిమాలయాలలో యతి రూపంలో ఉన్నట్టు తెలుస్తుంది.
ఇదంతా ఒక ఎత్తయితే కొన్ని పరిశోధనలు,కొన్ని భారతీయ గ్రంథాలు, బౌద్ధ గ్రంథాలలో దానిని బట్టి చూస్తే బాహ్యప్రపంచానికి తెలియని లోకం ఒకటి హిమాలయంలో వుంది దాని పేరే శంభాల. దీన్నే పాశ్చాత్యులు ‘హిడెన్ సిటీ’ అంటారు. ఎందుకంటే వందలు,వేళ్ళమైళ్ళ విస్తీర్ణంలో వున్న హిమాలయాలలో ఎక్కడో మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం వుంది. అది అందరికీ కనిపించదు. అది కనిపించాలన్నా, చేరుకోవాలన్నా,మనం ఎంతో శ్రమించాలి. మానసికంగా,శారీరకంగా కష్టపడాలి.
1. దేవతలు

అంతో ఇంతో యోగం కూడా వుండాలంట ఆ నగరాన్ని వీక్షించాలి అంటే. ఎందుకంటే అది అతి పవిత్రమైన ప్రదేశమని,ఎవరికిబడితే వారికి కనిపించదని అంటారు.అక్కడ దేవతలు సంచరిస్తారని,ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందని చెప్తారు. సంప్రదాయాలకు ఆలవాలమైన ఆ నగరం గురించి కొంతమంది పరిశోధకులు జీవితాన్ని ధారపోసి కొన్నివిషయాలు మాత్రమే సేకరించగలిగారు.
2. మౌంట్ కైలాష్

సాక్షాత్తూ శివుడు కొలువుండే మౌంట్ కైలాష్ పర్వతాలలో దగ్గరలో పుణ్యభూమి శంభాల వుంటుందని, ఆ ప్రదేశం అంతా అద్భుతమైన సువాసన అలుముకుని వుంటుందని అంటారు. పచ్చని ప్రకృతి నడుమన వుండే శంభాలను వీక్షించడం ఎంతో మధురానుభూతిని కలిగిస్తుందని చెప్తారు. బౌద్ధగ్రంథాలను బట్టి శంభాల చాలా ఆశ్చర్యకరమైన చోటు. ఇక్కడ నివశించే వారు నిరంతరం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వుంటారు.
3. పుణ్యపురుషులు

చైనీయులకు కూడా శంభాల గురించి తెలుసు. ఈ లోకంలో పాపం పెరిగిపోయి అంతా అరాచకత్వం తాండవిస్తున్న ఈ సమయంలో శంభాలలోని పుణ్యపురుషులు లోకాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు అని అప్పటినుండి ఈ పుడమి పైన కొత్తశకం ప్రారంభమవుతాయని కొన్ని గ్రంథాలు చేపుతున్నాయ్.ఆ కాలం 20424లో వస్తుందని కొన్ని గ్రంథాలు ఇప్పటికే తెలియజేసాయ్.
4. శంభాల రహస్యం

శంభాలలో నివిశించేవారు ఎలాంటి రుగ్మతలు లేకుండా జీవిస్తారని,వారి ఆయువు మామూలు ప్రజల కంటే రెట్టింపు వుంటుందని వారు మహా మాన్వితులు విషయాలు అనే గ్రంథాలు,యోగులు,పుణ్యపురుషుల ద్వారా తెలుసుకున్న రష్యా 1920 లో శంభాల రహస్యాన్ని తెలుసుకోడానికి తన మిలిటరీ ఫోర్స్ ని పంపి పరిశోధనలు చేయించింది.
5. ఆశ్చర్యకరమైన విషయాలు

అప్పుడు శంభాలకు చేరుకున్న రష్యా మిలిటరీ అధికారులకు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. అక్కడ యోగులు,గురువులు దాని పవిత్రత గురించి తెలిపారు. ఈ విషయాన్ని గురించి తెలుసుకొనిన నాజీ నేత హిట్లర్ 1930లో శంభాల గురించి తెలుసుకొనడానికి పరిశోధించేందుకు ప్రత్యేక బృందాన్ని పంపించాడు.
6. గొప్పదనం

ఆ బృందానికి నాయకత్వం వహించిన హేన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పదనం తెలుసుకుని దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భువి పైన ఏర్పడ్డ స్వర్గమని నాజినేత హిట్లర్ కి చెప్పాడు .అంతే కాక హిమ్లర్ శంభలలో మరెన్నో వింతలు, విశేషాలు మనవ మాత్రులు కలలో కుడా అనుభవించని గొప్ప అనుభూతులని సొంతం చేసుకున్నాడు అని అంటారు.
7. పాశ్చాత్యులు

గోభి ఎడారికి దగ్గరిలోని ఉన్న శంభలనే రాబోయే రోజులలో ప్రపంచాన్ని పాలించే కేంద్ర స్థానం అవుతుందని బుద్ధుడు కాలచక్రాలో రాసాడు అంటారు. దీన్నే పాశ్చాత్యులు plaanets of head center అంటారు .
8. చారిత్రక పరిశోధకురాలు

శంభల గురించి ఫ్రాన్స్ కి సంబంధించిన చారిత్రక పరిశోధకురాలు, ఆధ్యాత్మిక వేత్త, బౌద్ధ మత అభిమాని, రచయత్రి alexandra devid neel పరిశోధించి గ్రంథాలు రచించింది.ఆమె తనకు 56 ఏళ్ళ వయస్సులో ఫ్రాన్సు నుంచి టిబెట్ వచ్చి లామాలను కలుసుకుంది.
9. తొలి యూరోపియన్ వనిత

వారి ద్వారా శంభల గురించి తెలుసుకుని అక్కడకి వెళ్లి మహిమాన్వితుల ఆశిస్సులు తీసుకొవడం వల్లనే ఆమె ఏకంగా 101 సంవత్సరాలు బ్రతికింది అని అంటారు.ఆమె అక్టోబరు 24, 1868 లో జన్మించి సెప్టెంబర్ 8, 1969 లో మరణించింది. అంతే కాకుండా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి టిబెట్ లో కాలుమోపిన తొలి యూరోపియన్ వనిత ఆమె .
10. పరిశోధన

అలాగే షాంగై నగరానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ లాయోసిన్ కుడా శంభలపై చాలా పరిశోధన చేసాడు. ఆయన తన పరిశోధన గురించి చెబుతూ శంభల అనేది భుమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అంటూ పేర్కొంటారు. ఆ ప్రాంతం ప్రపంచంలో ఏ ఇతర ఆధునిక ప్రాంతానికి తీసిపోదు అని తెలిపాడు.
11. కలువ

పువ్వు అక్కడి వారు టెలిపతితో ప్రపంచం లోని ఎక్కడి వారితొ నైనా సంభాషించ గలరు అని, ఎక్కడ జరుగుతున్న అభివృద్ధి అయినా, విధ్వంసం అయినా క్షణాలలో వారికి తెలిసిపోతుంది అని తెలిపారు. ఎనిమిది రేఖుల భారి కలువ పువ్వు ఎలా ఉంటుందో ఆ ఆకారంలో ఆ నగరం ఉంటుందని తెలిపాడు
0 comments:
Post a Comment