Mohinder “Jimmy” Amarnath Bhardwaj About this soundpronunciation (help·info) (born 24 September 1950) is an Indian former cricketer and current cricket analyst. He is the son of Lala Amarnath, the first post-independence captain of India. His brother Surinder Amarnath was a Test player. Another brother Rajinder Amarnath is a former first class cricket and current cricket coach.
Mohinder was seen in the latter part of his career, as the finest Indian batsman against express pace
1950 సెప్టెంబర్ 24 న పాటియాలా లో జన్మించిన మోహిందర్ అమర్నాథ్ (Mohinder Amarnath) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. జిమ్మీ అనే ముద్దు పేరు కలిగిన ఇతని పూర్తి పేరు మోహిందర్ అమర్నాథ్ భరద్వాజ్ (Mohinder Amarnath Bhardwaj). మోహిందర్ అమర్నాథ్ తండ్రి లాలా అమర్నాథ్ స్వతంత్ర భారత క్రికెట్ జట్టు తొలి కెప్టెన్. ఇతని సోదరుడు సురీందర్ అమర్నాథ్ కూడా భారత్ తరఫున క్రికెట్ ఆడినాడు.
1969 లో ఆస్ట్రేలియా పై చెన్నై లో మోహిందర్ అమర్నాథ్ తన తొలి టెస్ట్ ఆడినాడు. తన టెస్ట్ క్రికెట్ ఆఖరు దశలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ గా పేరుపొందాడు. ఇమ్రాన్‌ఖాన్, మాల్కం మార్షల్ లాంటి మహా బౌలర్లచే పొగడబడ్డాడు. 1982-83 లో మోహిందర్ పాకిస్తాన్ పై 5, వెస్ట్ఇండీస్ పై 6 మ్యాచ్‌లు ఆడి మొత్తం 11 మ్యాచ్‌లలో 1000 పరుగులు సాధించాడు. సునీల్ గవాస్కర్ తను రచించిన "Idols" పుస్తకంలో ప్రపంచంలో ఉత్తమ బ్యాట్స్‌మెన్ గా మోహిందర్ అమర్నాథ్ ను కీర్తించాడు. తన తొలి శతకాన్ని పెర్త్ లో ఆస్ట్రేలియా పై సాధించాడు. జెఫ్ థాంప్సన్ లాంటి మేటి బౌలర్లను ఎదుర్కొని ఈ శతకం సాధించడం విశేషం. ఆ తర్వాత మరో 10 సెంచరీలు సాధించి మొత్తం 11 టెస్ట్ సెంచరీలు తన ఖాతాలో జమచేసుకున్నాడు. అవన్నీ ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కొని సాధించడం గమనార్హం. పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ "All Round View" పుస్తకంలో మోహిందర్ ను ఉత్తమ బ్యాట్స్‌మెన్ గా పొగిడినాడు. అతను మరో అడుగు ముందుకు వేసి మోహిందర్ నిలకడగా ఆడుతున్ననూ అతనిని తరచుగా జట్టు నుంచి తీసివేస్తున్నారని, అదే సమయంలో చెత్తగా ఆడే వారికి జట్టులోకి ఆహ్వానిస్తున్నారని పేర్కొన్నాడు. అతను భారత జట్టులో వచ్చీ పోయే బ్యాట్స్‌మెన్ గా పేరుగాంచాడు. ఎన్ని పర్యాయాలు జట్టు నుంచి ఉధ్వాసన పల్కిననూ మళ్ళీ తన ప్రతిభతో జట్టులో స్థానం పొందినాడు. అతను ఎక్కువగా 3 వ నెంబర్ లో బ్యాటింగ్ చేసేవాడు.
మోహిందర్ అమర్నాథ్ 69 టెస్టులు ఆడి 4378 పరుగులు సాధించాడు. ఇందులో 11 సెంచరీలు మరియు 24 అర్థ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 32 టెస్ట్ వికెట్లు పడగొట్టాడు. వన్డే క్రికెట్ లో 85 మ్యాచ్‌లు ఆడి 1924 పరుగులు చేశాడు. వన్డేలో అతని అత్యధిక స్కోరు 102 నాటౌట్.
సెమీ ఫైనల్ లో ఇంగ్లాండు తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ చేసి డేవిడ్ గోవర్, మైక్ గాటింగ్ లను ఔట్ చేసి టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. ఈ మ్యాచ్ లో 12 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 2.25 సగటుతో 27 పరుగులను మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత బ్యాటింగ్ లో 46 విలువైన పరుగులు జోడించాడు. దాంతో సహజంగానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆవార్డుకు అర్హత పొందినాడు.
వెస్ట్ఇండీస్ తో జరిగిన ఫైనల్ పోరులోనూ తన ప్రతిభను కొనసాగించాడు. అప్పటి సమయంలో ప్రపంచంలోనే వారిది అత్యుత్తమ జట్టు. అరవీర భయంకర ఫాస్ట్ బౌలింగ్ ను ఎదుర్కొని 80 బంతులను ఎదుర్కొని 26 పరుగులు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో గణాంకాల ప్రకారం ఇది ఉత్తమ ఇన్నింగ్స్ కాకున్ననూ అప్పటి పరిస్థితి ప్రకారం అది సరైనదే. 60 ఓవర్ల మ్యాచ్ లో భారత్ 54.5 ఓవర్లు మాత్రమే ఆడి 183 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్సులో అత్యధిక బంతులను ఎదుర్కొన్న భారతీయుడు అమర్నాథే. చేసిన పరుగుల ప్రకారం చూస్తే ఇతనిది కృష్ణమాచారి శ్రీకాంత్ (38), సందీప్ పాటిల్ (27) ల తర్వాత మూడో స్థానం.184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్ట్ఇండీస్ కు ప్రారంభంలో ఇదేమీ కష్టసాధ్యం అనిపించలేదు. కాని మదన్‌లాల్, అమర్నాథ్ లు చెరో మూడు వికెట్లు పడగొట్టి 140 పరుగులకే కట్టడి చేసి వెస్ట్ఇండీస్ ఆశలపై నీళ్ళు చల్లారు. దీంతో భారత్ 43 పరుగులతో విజయం సాధించింది. అమర్నాథ్ 7 ఓవర్లలో 1.71 సగటుతో 12 పరుగులు మాత్రమే ఇచ్చి భారత విజయానికి దోహదపడ్డాడు. ఫైనల్ మ్యాచ్ లోనూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇతనికే వరించింది..
1983 వరల్డ్ కప్.. ఈయన మరోహీరో!
1983.. పసికూనలా అడుగుపెట్టిన భారత్ జగజ్జేతగా నిలిచింది. ప్రత్యర్థులపై సింహనాదాలు చేస్తూ తొలిసారిగా ప్రపంచకప్‌ను ముద్దాడింది. మెగాటోర్నీ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది కపిల్‌దేవ్ జింబాబ్వేపై చేసిన 175 పరుగులే. టీమ్ఇండియా విశ్వవిజేతగా నిలవడంలో ఆ ఇన్నింగ్సే ప్రధాన ఆయుధంగా మారిందని అందరూ వర్ణించారు. కానీ, భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఓ ఆటగాడి పోరాటంతో ప్రపంచ సమరంలో గెలిచామని అతి కొద్దిమందికే గుర్తుంది. అతడే ఆల్‌రౌండర్ మొహిందర్ అమర్నాథ్. నేడు ఆయన జన్మదినం.
1983 వరల్డ్ కప్.. ఈయన మరోహీరో!
మొహిందర్ అమర్నాథ్ భరద్వాజ్ రక్తంలోనే క్రికెట్ ఉంది. అతడి తండ్రి లాలా అమర్నాథ్ భారత జట్టు సారథిగా బాధ్యతలు నిర్వర్తించాడు. స్వాతంత్ర్యం అనంతరం తొలి టీమ్ఇండియా కెప్టెన్‌గా లాలా రికార్డు నెలకొల్పాడు. తండ్రి అడుగుజాడల్లోనే మొహిందర్ కూడా నడిచాడు. చిన్ననాటి నుంచే క్రికెట్‌పై మమకారం పెంచుకున్నాడు. 19 ఏళ్లకే జట్టులో చోటు సంపాదించాడు. జట్టు ప్రయోజనాలే తప్ప సొంత రికార్డుల గురించి అతడెప్పుడూ ఆలోచించలేదు. ప్రపంచకప్‌లో అతడు పోరాడిన తీరే అందుకు నిదర్శనం. సెమీస్, ఫైనల్లో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. పేసర్‌గా, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా ఎన్నో మ్యాచుల్లో అద్భుతంగా రాణించాడు. తన కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశాడు. ఒకానొక సమయంలో పేలవ ప్రదర్శనతో జట్టులో చోటు కోల్పోయాడు. అయినా, అద్వితీయంగా పోరాడి తిరిగి జట్టులో చోటు సంపాదించి సంచలన ప్రదర్శనలు చేశాడు. అందుకే అతడిని ‘కమ్ బ్యాక్ మ్యాన్ ఆఫ్ ఇండియన్ క్రికెటర్’గా పిలుస్తారు.
1983 వరల్డ్ కప్.. ఈయన మరోహీరో!
‘అమర్’ విజయం
వీలైతే బ్యాటుతో కుదిరితే బంతితో అన్న రీతిలో మొహిందర్.. ప్రపంచకప్‌లో చెలరేగాడు. సెమీస్‌లో బలమైన ఇంగ్లాండ్‌ను వారి సొంతగడ్డపై ఓడించడమంటే ఆషామాషీ కాదు. పసికూనగా అడుగుపెట్టి సెమీ ఫైనల్‌కు చేరిన భారత్ కథ ముగిసినట్టేనని భావించారంతా. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ ఇంగ్లాండ్‌పై భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొహిందర్ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో కపిల్‌సేన తొలి సారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఆ మ్యాచ్‌లో అతడు 49 పరుగులతో పాటు రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఫైనల్లో విండీస్‌ను మట్టికరిపించడంలో అమర్నాథ్ కృషి ఎంతో ఉంది. తుదిపోరులో భారత ఆటగాళ్లు సమష్టి ప్రదర్శనతో ప్రత్యర్థిని 140 పరుగులకే పరిమితం చేశారు. నిర్ణయాత్మక పోరులో అమర్నాథ్ చేసిన 26 పరుగులు, తీసిన మూడు వికెట్లు విజయంలో ఎంతో కీలకం.
విండీస్ విలన్
అప్పటి కరీబియన్లను చూస్తే ప్రత్యర్థి జట్లన్నింటికీ వెన్నుల్లో వణుకే. అరవీర భయంకర బౌలర్లు విండీస్ సొంతం. అయితే, అమర్నాథ్ తెగువ మాత్రం ఎవరికీ ఉండదు. వెస్టిండీస్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో బంతి తగిలి అతడి దవడకు గాయమైంది. తెల్లటి అతడి జెర్సీ ఎరుపెక్కింది. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆస్పత్రికి వెళ్లి ఆరు కుట్లు వేయించుకొని మైదానంలోకి తిరిగి అడుగుపెట్టాడు. రాబర్ట్స్, మార్షల్, హోల్డింగ్, గార్నర్ వంటి టాప్ బౌలర్లను ఎదుర్కొనేందుకు వెళ్లాడు. దాదాపు మూడున్నర గంటలు క్రీజులో నిలిచాడు. 30 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో ఆయనదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.
అమర్నాథ్ 69 టెస్టుల్లో 4,378 పరుగులు సాధించాడు. దాదాపు 25% పరుగులు విండీస్‌పై చేసినవే. ఆ జట్టుపై 17 టెస్టుల్లో 38.42 సగటుతో 1,076 స్కోరు సాధించాడు. మూడు శతకాలు బాదాడు. ఇక 23 వన్డేల్లో 694 చేశాడు. పేలవ ప్రదర్శనతో మూడేళ్లు జట్టుకు దూరమైన మొహిందర్ 1982-83లో పునరాగమనం చేసి 1,182 రన్స్ కొట్టాడు. విండీస్, పాక్‌పైనే 11 టెస్టులు ఆడాడు. విదేశాల్లో 5 శతకాలు బాదాడు.
మొహిందర్ గురించి ఆసక్తికర విషయాలు:
> అమర్నాథ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎరుపు రంగు రుమాలు తన జేబులో ఉంచుకునేవాడు. దాని వల్ల కలిసొస్తుందని అతడి నమ్మకం.
> భారత్‌లో కంటే విదేశాల్లో అతడు బాగా రాణించేవాడు. స్వదేశంలో అతడు 30.44 సగటుతో పరుగులు చేస్తే విదేశాల్లో 51.80 సగటుతో చేశాడు.
> పేసర్లకు స్వర్గధామమైన పెర్త్ పిచ్‌లో ఆసీస్ బౌలర్లను అమర్నాథ్ దీటుగా ఎదుర్కొని 90 పరుగులు చేశాడు. అతడి గొప్ప ఇన్నింగ్స్‌ల్లో ఇది ఎంతో ప్రత్యేకం.
> 1983 ప్రపంచకప్‌లో కీలక పాత్ర పోషించిన అతడు తర్వాత జరిగిన విండీస్ సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేశాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒకే పరుగు తీశాడు.
> క్రికెట్ చరిత్రలో హ్యాండ్లింగ్ ది బాల్, అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్‌తో ఔటైన ఏకైక ఆటగాడు అమర్నాథ్.
> 1969 ఆసీస్ టెస్టుతో అరంగ్రేటం చేసిన అతడు మరో మ్యాచ్ కోసం ఏడేళ్లు ఎదురు చూశాడు. 1976 న్యూజిలాండ్ సిరీస్‌లో తిరిగి జట్టులో చోటు సంపాదించాడు.
Mohinder was seen in the latter part of his career, as the finest Indian batsman against express pace
1950 సెప్టెంబర్ 24 న పాటియాలా లో జన్మించిన మోహిందర్ అమర్నాథ్ (Mohinder Amarnath) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. జిమ్మీ అనే ముద్దు పేరు కలిగిన ఇతని పూర్తి పేరు మోహిందర్ అమర్నాథ్ భరద్వాజ్ (Mohinder Amarnath Bhardwaj). మోహిందర్ అమర్నాథ్ తండ్రి లాలా అమర్నాథ్ స్వతంత్ర భారత క్రికెట్ జట్టు తొలి కెప్టెన్. ఇతని సోదరుడు సురీందర్ అమర్నాథ్ కూడా భారత్ తరఫున క్రికెట్ ఆడినాడు.
1969 లో ఆస్ట్రేలియా పై చెన్నై లో మోహిందర్ అమర్నాథ్ తన తొలి టెస్ట్ ఆడినాడు. తన టెస్ట్ క్రికెట్ ఆఖరు దశలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ గా పేరుపొందాడు. ఇమ్రాన్‌ఖాన్, మాల్కం మార్షల్ లాంటి మహా బౌలర్లచే పొగడబడ్డాడు. 1982-83 లో మోహిందర్ పాకిస్తాన్ పై 5, వెస్ట్ఇండీస్ పై 6 మ్యాచ్‌లు ఆడి మొత్తం 11 మ్యాచ్‌లలో 1000 పరుగులు సాధించాడు. సునీల్ గవాస్కర్ తను రచించిన "Idols" పుస్తకంలో ప్రపంచంలో ఉత్తమ బ్యాట్స్‌మెన్ గా మోహిందర్ అమర్నాథ్ ను కీర్తించాడు. తన తొలి శతకాన్ని పెర్త్ లో ఆస్ట్రేలియా పై సాధించాడు. జెఫ్ థాంప్సన్ లాంటి మేటి బౌలర్లను ఎదుర్కొని ఈ శతకం సాధించడం విశేషం. ఆ తర్వాత మరో 10 సెంచరీలు సాధించి మొత్తం 11 టెస్ట్ సెంచరీలు తన ఖాతాలో జమచేసుకున్నాడు. అవన్నీ ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కొని సాధించడం గమనార్హం. పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ "All Round View" పుస్తకంలో మోహిందర్ ను ఉత్తమ బ్యాట్స్‌మెన్ గా పొగిడినాడు. అతను మరో అడుగు ముందుకు వేసి మోహిందర్ నిలకడగా ఆడుతున్ననూ అతనిని తరచుగా జట్టు నుంచి తీసివేస్తున్నారని, అదే సమయంలో చెత్తగా ఆడే వారికి జట్టులోకి ఆహ్వానిస్తున్నారని పేర్కొన్నాడు. అతను భారత జట్టులో వచ్చీ పోయే బ్యాట్స్‌మెన్ గా పేరుగాంచాడు. ఎన్ని పర్యాయాలు జట్టు నుంచి ఉధ్వాసన పల్కిననూ మళ్ళీ తన ప్రతిభతో జట్టులో స్థానం పొందినాడు. అతను ఎక్కువగా 3 వ నెంబర్ లో బ్యాటింగ్ చేసేవాడు.
మోహిందర్ అమర్నాథ్ 69 టెస్టులు ఆడి 4378 పరుగులు సాధించాడు. ఇందులో 11 సెంచరీలు మరియు 24 అర్థ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 32 టెస్ట్ వికెట్లు పడగొట్టాడు. వన్డే క్రికెట్ లో 85 మ్యాచ్‌లు ఆడి 1924 పరుగులు చేశాడు. వన్డేలో అతని అత్యధిక స్కోరు 102 నాటౌట్.
మోహిందర్ అమర్నాథ్: 1983 ప్రపంచ కప్
భారత్ విజయం సాధించిన 1983 ప్రపంచ కప్ క్రికెట్ లో మోహిందర్ అమర్నాథ్ మంచి ప్రతిభ కనబర్చాడు. సెమీ-ఫైనల్ మరియు ఫైనల్ రెండింటిలోనూ అతడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందినాడు.సెమీ ఫైనల్ లో ఇంగ్లాండు తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ చేసి డేవిడ్ గోవర్, మైక్ గాటింగ్ లను ఔట్ చేసి టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. ఈ మ్యాచ్ లో 12 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 2.25 సగటుతో 27 పరుగులను మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత బ్యాటింగ్ లో 46 విలువైన పరుగులు జోడించాడు. దాంతో సహజంగానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆవార్డుకు అర్హత పొందినాడు.
వెస్ట్ఇండీస్ తో జరిగిన ఫైనల్ పోరులోనూ తన ప్రతిభను కొనసాగించాడు. అప్పటి సమయంలో ప్రపంచంలోనే వారిది అత్యుత్తమ జట్టు. అరవీర భయంకర ఫాస్ట్ బౌలింగ్ ను ఎదుర్కొని 80 బంతులను ఎదుర్కొని 26 పరుగులు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో గణాంకాల ప్రకారం ఇది ఉత్తమ ఇన్నింగ్స్ కాకున్ననూ అప్పటి పరిస్థితి ప్రకారం అది సరైనదే. 60 ఓవర్ల మ్యాచ్ లో భారత్ 54.5 ఓవర్లు మాత్రమే ఆడి 183 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్సులో అత్యధిక బంతులను ఎదుర్కొన్న భారతీయుడు అమర్నాథే. చేసిన పరుగుల ప్రకారం చూస్తే ఇతనిది కృష్ణమాచారి శ్రీకాంత్ (38), సందీప్ పాటిల్ (27) ల తర్వాత మూడో స్థానం.184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్ట్ఇండీస్ కు ప్రారంభంలో ఇదేమీ కష్టసాధ్యం అనిపించలేదు. కాని మదన్‌లాల్, అమర్నాథ్ లు చెరో మూడు వికెట్లు పడగొట్టి 140 పరుగులకే కట్టడి చేసి వెస్ట్ఇండీస్ ఆశలపై నీళ్ళు చల్లారు. దీంతో భారత్ 43 పరుగులతో విజయం సాధించింది. అమర్నాథ్ 7 ఓవర్లలో 1.71 సగటుతో 12 పరుగులు మాత్రమే ఇచ్చి భారత విజయానికి దోహదపడ్డాడు. ఫైనల్ మ్యాచ్ లోనూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇతనికే వరించింది..
1983 వరల్డ్ కప్.. ఈయన మరోహీరో!
1983.. పసికూనలా అడుగుపెట్టిన భారత్ జగజ్జేతగా నిలిచింది. ప్రత్యర్థులపై సింహనాదాలు చేస్తూ తొలిసారిగా ప్రపంచకప్‌ను ముద్దాడింది. మెగాటోర్నీ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది కపిల్‌దేవ్ జింబాబ్వేపై చేసిన 175 పరుగులే. టీమ్ఇండియా విశ్వవిజేతగా నిలవడంలో ఆ ఇన్నింగ్సే ప్రధాన ఆయుధంగా మారిందని అందరూ వర్ణించారు. కానీ, భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఓ ఆటగాడి పోరాటంతో ప్రపంచ సమరంలో గెలిచామని అతి కొద్దిమందికే గుర్తుంది. అతడే ఆల్‌రౌండర్ మొహిందర్ అమర్నాథ్. నేడు ఆయన జన్మదినం.
1983 వరల్డ్ కప్.. ఈయన మరోహీరో!
మొహిందర్ అమర్నాథ్ భరద్వాజ్ రక్తంలోనే క్రికెట్ ఉంది. అతడి తండ్రి లాలా అమర్నాథ్ భారత జట్టు సారథిగా బాధ్యతలు నిర్వర్తించాడు. స్వాతంత్ర్యం అనంతరం తొలి టీమ్ఇండియా కెప్టెన్‌గా లాలా రికార్డు నెలకొల్పాడు. తండ్రి అడుగుజాడల్లోనే మొహిందర్ కూడా నడిచాడు. చిన్ననాటి నుంచే క్రికెట్‌పై మమకారం పెంచుకున్నాడు. 19 ఏళ్లకే జట్టులో చోటు సంపాదించాడు. జట్టు ప్రయోజనాలే తప్ప సొంత రికార్డుల గురించి అతడెప్పుడూ ఆలోచించలేదు. ప్రపంచకప్‌లో అతడు పోరాడిన తీరే అందుకు నిదర్శనం. సెమీస్, ఫైనల్లో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. పేసర్‌గా, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా ఎన్నో మ్యాచుల్లో అద్భుతంగా రాణించాడు. తన కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశాడు. ఒకానొక సమయంలో పేలవ ప్రదర్శనతో జట్టులో చోటు కోల్పోయాడు. అయినా, అద్వితీయంగా పోరాడి తిరిగి జట్టులో చోటు సంపాదించి సంచలన ప్రదర్శనలు చేశాడు. అందుకే అతడిని ‘కమ్ బ్యాక్ మ్యాన్ ఆఫ్ ఇండియన్ క్రికెటర్’గా పిలుస్తారు.
1983 వరల్డ్ కప్.. ఈయన మరోహీరో!
‘అమర్’ విజయం
వీలైతే బ్యాటుతో కుదిరితే బంతితో అన్న రీతిలో మొహిందర్.. ప్రపంచకప్‌లో చెలరేగాడు. సెమీస్‌లో బలమైన ఇంగ్లాండ్‌ను వారి సొంతగడ్డపై ఓడించడమంటే ఆషామాషీ కాదు. పసికూనగా అడుగుపెట్టి సెమీ ఫైనల్‌కు చేరిన భారత్ కథ ముగిసినట్టేనని భావించారంతా. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ ఇంగ్లాండ్‌పై భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొహిందర్ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో కపిల్‌సేన తొలి సారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఆ మ్యాచ్‌లో అతడు 49 పరుగులతో పాటు రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఫైనల్లో విండీస్‌ను మట్టికరిపించడంలో అమర్నాథ్ కృషి ఎంతో ఉంది. తుదిపోరులో భారత ఆటగాళ్లు సమష్టి ప్రదర్శనతో ప్రత్యర్థిని 140 పరుగులకే పరిమితం చేశారు. నిర్ణయాత్మక పోరులో అమర్నాథ్ చేసిన 26 పరుగులు, తీసిన మూడు వికెట్లు విజయంలో ఎంతో కీలకం.
విండీస్ విలన్
అప్పటి కరీబియన్లను చూస్తే ప్రత్యర్థి జట్లన్నింటికీ వెన్నుల్లో వణుకే. అరవీర భయంకర బౌలర్లు విండీస్ సొంతం. అయితే, అమర్నాథ్ తెగువ మాత్రం ఎవరికీ ఉండదు. వెస్టిండీస్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో బంతి తగిలి అతడి దవడకు గాయమైంది. తెల్లటి అతడి జెర్సీ ఎరుపెక్కింది. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆస్పత్రికి వెళ్లి ఆరు కుట్లు వేయించుకొని మైదానంలోకి తిరిగి అడుగుపెట్టాడు. రాబర్ట్స్, మార్షల్, హోల్డింగ్, గార్నర్ వంటి టాప్ బౌలర్లను ఎదుర్కొనేందుకు వెళ్లాడు. దాదాపు మూడున్నర గంటలు క్రీజులో నిలిచాడు. 30 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో ఆయనదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.
అమర్నాథ్ 69 టెస్టుల్లో 4,378 పరుగులు సాధించాడు. దాదాపు 25% పరుగులు విండీస్‌పై చేసినవే. ఆ జట్టుపై 17 టెస్టుల్లో 38.42 సగటుతో 1,076 స్కోరు సాధించాడు. మూడు శతకాలు బాదాడు. ఇక 23 వన్డేల్లో 694 చేశాడు. పేలవ ప్రదర్శనతో మూడేళ్లు జట్టుకు దూరమైన మొహిందర్ 1982-83లో పునరాగమనం చేసి 1,182 రన్స్ కొట్టాడు. విండీస్, పాక్‌పైనే 11 టెస్టులు ఆడాడు. విదేశాల్లో 5 శతకాలు బాదాడు.
మొహిందర్ గురించి ఆసక్తికర విషయాలు:
> అమర్నాథ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎరుపు రంగు రుమాలు తన జేబులో ఉంచుకునేవాడు. దాని వల్ల కలిసొస్తుందని అతడి నమ్మకం.
> భారత్‌లో కంటే విదేశాల్లో అతడు బాగా రాణించేవాడు. స్వదేశంలో అతడు 30.44 సగటుతో పరుగులు చేస్తే విదేశాల్లో 51.80 సగటుతో చేశాడు.
> పేసర్లకు స్వర్గధామమైన పెర్త్ పిచ్‌లో ఆసీస్ బౌలర్లను అమర్నాథ్ దీటుగా ఎదుర్కొని 90 పరుగులు చేశాడు. అతడి గొప్ప ఇన్నింగ్స్‌ల్లో ఇది ఎంతో ప్రత్యేకం.
> 1983 ప్రపంచకప్‌లో కీలక పాత్ర పోషించిన అతడు తర్వాత జరిగిన విండీస్ సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేశాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒకే పరుగు తీశాడు.
> క్రికెట్ చరిత్రలో హ్యాండ్లింగ్ ది బాల్, అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్‌తో ఔటైన ఏకైక ఆటగాడు అమర్నాథ్.
> 1969 ఆసీస్ టెస్టుతో అరంగ్రేటం చేసిన అతడు మరో మ్యాచ్ కోసం ఏడేళ్లు ఎదురు చూశాడు. 1976 న్యూజిలాండ్ సిరీస్‌లో తిరిగి జట్టులో చోటు సంపాదించాడు.
0 comments:
Post a Comment