Konda Laxman Bapuji (27 September 1915 – 21 September 2012) was an Indian freedom fighter who participated in the Telangana Rebellion and Telangana activist.He fought for the statehood of Telangana all his life.
అవిశ్రాంత పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ(27 సెప్టెంబర్ 1915-21 సెప్టెంబర్ 2012)
అవిశ్రాంత పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ
తన జీవితకాలమంతా ప్రజల కోసం తపించిన పోరాటయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. అనేకానేక ఉద్యమాల్లో క్రియాశీలక భాగస్వామిగా నిలిచారు. బడుగు, బలహీనవర్గాలు రాజ్యాధి కారంలోకి రావాలని ఆశించిన బాపూజీ శతజయంతి సందర్భమిది. ఆగ్రవర్ణాల ఆధిపత్యం అంతం కావాలని, శతాబ్దాలుగా అణచివేతకు గురైన దళిత బహుజనులు అధికారంలోకి రావాలని విభిన్న ఉద్యమాల్లో భాగస్వామి అయ్యారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ ఆదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో నిరుపేద కుటుంబంలో 27 సెప్టెంబర్ 1915న జన్మించారు. తల్లిదండ్రులది చేనేత వృత్తి. మూడేళ్ళ వయసులోనే తల్లి కన్నుమూసింది. ప్రాథమిక విద్య వాంకిడి, ఆసిఫాబాద్‌లో గడిచింది. హైదరాబాద్‌కు వచ్చి న్యాయశాస్త్ర విద్యను అభ్యసించారు. 1940ల నాటికే న్యాయవాద వృత్తిని చేపట్టారు. కేవలం వృత్తిగా చేయలేదు. ప్రజల కోసం అంకితమై పనిచేశారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిన వారికి అండగా నిలిచారు. వారి తరఫున కేసులు వాదిస్తూ న్యాయపోరాటం చేశారు. ఈవిధంగా నిజాం వ్యతిరేక పోరాటాలలో భాగస్వామి అయ్యారు. నాటి నిజాం ప్రభువులు ప్రోత్సహించిన రజాకార్ల దౌర్జన్యాల్ని బాహాటంగా నిరసించారు. వారికి వ్యతిరేకంగా ప్రజల వాణిని వినిపించడానికి చొరవ చూపారు. నిజాం పాలన కబంధహస్తాల నుంచి బయటపడినప్పుడే తెలంగాణ ప్రజలకు విముక్తి అని భావించారు. ఇందుకోసం క్రియాశీలకంగా, సాహసోపేతంగా పోరాడారు. తెలంగాణ పట్ల నికార్సయిన వారి అవగాహనకు ఇది తార్కాణం.
నిజానికి తొలి నుంచి ఉద్యమాల్లో ఆయనది చురుకైన పాత్ర. ఒక ఉద్యమాన్ని ఎలా నడపాలో, ఎక్కడ నడపాలో, ఎవరెవరిని కదిలించాలో బాగా తెలిసిన బాపూజీ ఆ మేరకు కృతార్థుడయ్యారు. 1938లో పౌరహక్కుల ఉద్యమం, 1940లో ఆంధ్రమహాసభ ఉద్యమం, భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా 1942లో క్విట్ ఇండియా ఉద్యమం, 1952లో నాన్‌ముల్కి ఉద్యమం, 1969లో తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం, 1996లో మలిదశ తెలంగాణ ఉద్యమం వంటి ఎన్నో పోరాటాలను సలిపిన ధీశాలి. 1947లో డిసెంబర్ 4న నిజాం కాన్వారుపై బాంబులు వేయడం, ఖాసీం రజ్వీ సాగిస్తున్న దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడడం ఆయన ఉద్యమ పంథాను తెలుపుతున్నది. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా అబిడ్స్‌లోని బ్రిటీష్ పోస్టాఫీస్, కోఠిలోని బ్రిటీష్ రెసిడెన్సీపై బాపూజీ జాతీయ జెండాను ఎగురవేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
అటు రాజకీయాల్లోనూ, ఇటు ప్రజా ఉద్యమాల్లోనూ తనదైన ప్రత్యేక ముద్రను చూపారు బాపూజీ. 1952లో తొలిసారిగా ఎం.ఎల్.ఏ గా ఎన్నికైన ఆయన దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాలలోనూ పని చేసారు. రెండు సార్లు మంత్రిగా, ఒక సారి డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశాడు. 17 సంవత్సరాలపాటు ఎం.ఎల్.ఏగా బాపూజీ కొనసాగడం విశేషం. 1969లో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా దీక్షచేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. నాడు తన మంత్రి పదవికిసైతం రాజీనామా చేశారు. తెలంగాణ ఉద్యమం తెరపైకి వచ్చినప్పుడల్లా ఆయన తనవంతుగా ప్రతిస్పందించారు. పదవుల కన్నా ఆశయసాధన ముఖ్యంగా తలపోశారు. అధికారాన్ని అంటిపెట్టుకొని ఉండాలని ఎప్పుడూ పాకులాడలేదు. స్వాతంత్య్ర సమరయోధునిగా, సీనియర్ నేతగా కాంగ్రెస్ పార్టీలో తన ప్రాబల్యాన్ని, ప్రభావాన్ని చూపగలిగిన శక్తివంతుడు. అయినప్పటికీ వాటిని సొంత ప్రయోజనాల కోసం వాడుకోలేదని ఆయన సమకాలికులు చెబుతారు.
కనుకనే రాజకీయాల్లో నీతి నిజాయితీలకీ, నిబద్ధతకీ మారుపేరుగా నిలిచారు కొండా లక్ష్మణ్ బాపూజీ. ప్రజల సమస్యల్ని దగ్గరగా చూసి పట్టించుకుని, పరిష్కారం కోసం పోరాడిన నేతగా పేరొందారు. చేనేత రంగం మీద ఆధారపడి జీవించేవారి బతుకుల్లో వెలుగు తీసుకురావాలని శ్రమించారు బాపూజీ. అంతేకాదు రాష్ట్రంలో చేనేత సహకార సంఘాల స్థాపనకు విశేషంగా కృషి చేశారు. అనేక చేనేత కార్మిక ఉద్యమాలకు సారథ్యం వహించారు. రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలన్నింటిని కలిపి హైదరాబాద్ చేనేత సహకార సంఘం లిమిటెడ్ (హైకో)ను స్థాపించారు. ఈ హైకో ద్వారా తెలంగాణ చేనేత కార్మికులకు చేతినిండా పని కల్పించారు. బాపూజీ ఈ సంఘానికి చాలాకాలంపాటు చైర్మన్‌గా వ్యవహరించారు. అయితే ఇదే ప్రస్తుతం ఆప్కోగా రూపాంతరం చెందింది. చేనేత రంగంలో గణనీయమైన మార్పుల కోసం ఆయన చేసిన కృషి ఎంతో విలువైంది.
నిజాం నిరంకుశత్వంపై కన్నెర్ర చేసినా, తెలంగాణ ఉద్యమ అడుగుల్లో తొలిపాదం మోపినా, నేతన్నల కోసం జెండా పట్టినా, అవన్నీ ఒక్క కొండా లక్ష్మణ్ బాపూజీకే దక్కాయి. నిర్విరామంగా ఒక ఉద్యమం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగే కాలాన 21 సెప్టెంబర్ 2012లో బాపూజీ మరణించారుఆయన కోరుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ ఆయన ఆశించిన ప్రజాస్వామ్య తెలంగాణ సాకారం కావడం కోసం కృషి చేయడమే ఆయనకు మనం అందించే సముచిత నివాళి
(కొండా లక్ష్మణ్ బాపూజీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా)
- డా|| భీంపల్లి శ్రీకాంత్

0 comments:
Post a Comment