⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Friday, 20 September 2019

Grama sachivalaya qp-సచివాలయ ఉద్యోగార్థుల్లో ఆందోళన ఏపీపీఎస్సీలో పొరుగుసేవల ఉద్యోగులకు ఉత్తమ ర్యాంకులు రావడంపై అనుమానాలు

సచివాలయ ఉద్యోగార్థుల్లో ఆందోళన
ఏపీపీఎస్సీలో పొరుగుసేవల ఉద్యోగులకు ఉత్తమ ర్యాంకులు రావడంపై అనుమానాలు
ఈనాడు - అమరావతి
సచివాలయ ఉద్యోగార్థుల్లో ఆందోళన
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్ష ఫలితాలు అభ్యర్థుల్లో అనుమానాలు, ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. గ్రామ సచివాలయ పరీక్షలకు సంబంధించి నిపుణులు రూపొందించిన ప్రశ్నపత్రాలను ముద్రాపకులకు పంపడం వంటి బాధ్యతల్ని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నిర్వహించింది. ఈ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షల్లో ఏపీపీఎస్సీలోని పొరుగుసేవల (అవుట్‌సోర్సింగ్‌) ఉద్యోగిని అనితమ్మకు కేటగిరీ-1లో మొదటి ర్యాంకు రావడం, అదే సంస్థలో అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న మరికొందరికి ఉద్యోగాలు సాధించే స్థాయికి చేరువగా మార్కులు రావడం అభ్యర్థుల్లో సందేహాలకు తావిచ్చింది. అనితమ్మ గతంలో రాసిన పోటీపరీక్షల్లో పెద్దగా ప్రతిభ కనబరచకపోవడం, గ్రామ సచివాలయ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఆమె సెలవు కూడా పెట్టకుండానే మొదటి ర్యాంకు సాధించడంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీపీఎస్సీ రెగ్యులర్‌ ఉద్యోగుల్లో కొందరి బంధువులకూ అత్యధిక మార్కులు రావడంపైనా అభ్యర్థుల్లో సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
కాన్ఫిడెన్షియల్‌ విభాగంలోనూ పొరుగుసేవలేనా?
* ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం పొరుగుసేవల సిబ్బందిని కాన్ఫిడెన్షియల్‌ విభాగాల విధుల్లో నియమించకూడదు. కీలకమైన సమాచారం బయటకు పొక్కినా...జవాబుదారీ చేయలేమన్న ఉద్దేశంతో వారిని ఆ విధులకు దూరంగా ఉంచుతారు. గ్రామ సచివాలయ పరీక్షల్లో కేటగిరీ-1లో మొదటి ర్యాంకు దక్కించుకున్న  అనితమ్మ, ఉద్యోగం సాధించే స్థాయికి చేరువగా మార్కులు తెచ్చుకున్న మరో యువతి కాన్ఫిడెన్షియల్‌ విభాగంలోనే పనిచేస్తున్నారు. అయితే తాను గ్రామ సచివాలయ ప్రశ్నపత్రాల ‘కీ’పై వచ్చే అభ్యంతరాల్ని పరిష్కరించే సెక్షన్‌లో పనిచేస్తున్నట్లు అనితమ్మ చెబుతున్నారు.
* అనితమ్మ గతంలో పంచాయతీ కార్యదర్శి పోస్టు కోసం పరీక్ష రాసినా ఎంపికవలేదు. అలాంటిది గ్రామ సచివాలయ పరీక్షల్లో 112 మార్కులతో కేటగిరీ-1లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచారు. ఇందుకోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకోలేదు. గతంలో గ్రూప్‌-2 పరీక్షలకు హాజరైన తన బావ మార్గదర్శకత్వంలో ఈ పరీక్షలకు సిద్ధమై విజయం సాధించినట్లు అనితమ్మ చెబుతున్నారు. గ్రామ సచివాలయ పరీక్షల తేదీల ప్రకటనకు, నిర్వహణకు మధ్య వ్యవధి సుమారు నెల రోజులే ఉంది. గతంలో హాజరైన పరీక్షల్లో అంతగా ప్రతిభ చూపించని ఆమె, ఈ పరీక్షలకు స్వల్ప వ్యవధిలోనే సిద్ధమై ఏకంగా 112 మార్కులతో మొదటి ర్యాంకు ఎలా సాధించగలిగారన్న సందేహాలు అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో తనకు చిన్నపిల్లలు ఉండటం, కుటుంబబాధ్యతల వల్ల పరీక్ష సరిగా రాయలేకపోయానని, ఈసారి కష్టపడి చదవానని, గెస్సింగ్‌తో పెట్టిన కొన్ని జవాబులు కరెక్టవడంతో మొదటి ర్యాంకు వచ్చిందని అనిత చెబుతున్నారు.
* సచివాలయ ఉద్యోగ పరీక్ష ప్రశ్నపత్రం చాలా కష్టంగా ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. అలాంటి పరీక్షలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 స్థాయి పోటీ పరీక్షలకు కొన్నేళ్లుగా సిద్ధమవుతున్నవారికీ సాధ్యం కాని విధంగా అనితమ్మ మొదటి ర్యాంకు సాధించారు. ఈ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అనితమ్మ ఏపీపీఎస్సీలో చేస్తున్న ఉద్యోగానికి సెలవు కూడా పెట్టలేదని అధికార వర్గాల సమాచారం. కనీసం సెలవైనా పెట్టకుండా ఏకంగా ఆమె మొదటి ర్యాంకు ఎలా సాధించగలిగారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
* ఏపీపీఎస్సీలో పనిచేస్తున్న మరో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి, వేరే ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న భార్యకు కూడా ఉద్యోగం సాధించే స్థాయికి చేరువగా మార్కులు వచ్చాయి.
సమగ్ర విచారణ జరపాలి: డీవైఎఫ్‌ఐ
గ్రామ సచివాలయ పరీక్ష నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ప్రచారంపై సమగ్ర విచారణ జరిపి, అభ్యర్థుల సందేహాల్ని తక్షణం నివృత్తి చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామన్న, సూర్యారావు డిమాండ్‌ చేశారు.
వెయ్యి మందికే వంద మార్కులు
ఈనాడు, అమరావతి: గ్రామ, సచివాలయాల్లో 14 కేటగిరీ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలకు 19.50 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో వందకుపైగా మార్కులు సాధించిన వారు 1,005 (0.05%) మంది మాత్రమే. ప్రతి పరీక్షను 150 మార్కులకు నిర్వహించారు. కేటగిరి-1 కింద పంచాయతీ కార్యదర్శి, మహిళ పోలీస్‌, సంక్షేమ, విద్య కార్యదర్శి (గ్రామీణ), వార్డు పరిపాలన కార్యదర్శి పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పరీక్షను 11,63,922 మంది రాశారు. వీరిలో కేవలం 63 మంది (0.005%)కి మాత్రమే వంద, ఆపైన మార్కులు రావడం గమనార్హం. వీరిలో ఏపీపీఎస్సీలో పొరుగుసేవల కింద పనిచేస్తోన్న అనితమ్మ ఒకరు. ఈమె 112.25 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. కేటగిరీ 2ఏ లోని ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, వార్డు సౌకర్యాల కార్యదర్శి పరీక్షను 1,16,188 మంది అభ్యర్థులు రాయగా 314 (0.27%) మంది మాత్రమే వంద, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించారు. కేటగిరీ 2బీలో వీఆర్వో, సర్వే అసిస్టెంట్‌ పోస్టులకు 1,20,740 మంది పరీక్ష రాశారు. వీరిలో 488 మంది (0.40%) మాత్రమే వంద, ఆ పైగా మార్కులు తెచ్చుకోగలిగారు.

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top