Search This Blog

⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Saturday, 14 September 2019

🏯Eiffel Tower - ఈఫిల్ టవర్ చరిత్ర - కట్టడం లో విశేషాలు..వాడిన మెటీరియల్స్.. టవర్ చివరన *ఈఫిల్ కోసం ఓ ప్రత్యేకమైన వ్యక్తిగత గది*...మరెన్నో విశేషాలు ... రేర్ ఫొటోస్... *ఈఫిల్ టవర్ డ్రోన్ వీడియో (ఏరియల్ వ్యూ).........*


ప్రపంచంలో నిర్మించబడిన అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణాల్లో ఒకటైన ఈఫిల్ టవర్.. ప్యారిస్’లోని సీన్ నది పక్కన వున్న చాంప్ డి మార్స్ పై ఎత్తైన ఇనుప గోపురం. ప్యారిస్’లో ఎంతో ఎత్తైన ఈ నిర్మాణాన్ని.. గుస్టావ్ ఈఫిల్ అనే ఇంజనీర్ రూపొందించాడు. 1889 నుంచి నానాటికి దీన్ని సందర్శించే సంఖ్య మరింతగా పెరుగుతుండటంతో.. ఇది ప్రపంచంలోకెల్లా ఎక్కువమంది డబ్బులిచ్చి సందర్శించే స్థలంగా ప్రఖ్యాతి గాంచింది.

ఈఫిల్ టవర్ చరిత్ర :
ఈ టవర్’ను గుస్టావ్ ఈఫిల్ అనే ఇంజనీర్ రూపొందించాడు. 1887 - 1889 మధ్యలో ఫ్రెంచి విప్లవం వంద సంవత్సరాల పండుగను పురస్కరించుకుని.. ఈ నిర్మాణ ఏర్పాటు కార్యక్రమాలను మొదలుపెట్టారు. నిజానికి ఈఫిల్ 1888వ సంవత్సరంలో బార్సిలోనాలో ఈ టవర్’ను నిర్మించాలనుకున్నాడు. కానీ అక్కడి అధికారులు ఈ నిర్మాణం కొత్తగానూ, ఖర్చుతో కూడుకొన్న పని అనీ భావించి.. తమ నగర డిజైన్’లో సరిపడదని చెప్పారు. దీంతో ఈఫిల్ ఆ నిర్మాణ పథకాన్ని ప్యారిస్’లోని ప్రపంచ ప్రదర్శన అధికారులకు సమర్పించాడు. వాళ్లు దీనిని పరిశీలించిన అనంతరం అక్కడే 1889లో దీన్ని నిర్మించడం జరిగింది.

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ టవర్’ను కేవలం 20 సంవత్సరాలవరకు మాత్రమే వుండేటట్లుగా ఒప్పందం కుదిరింది. అంటే.. టవర్’ను రూపొందించే పనిలో భాగంగా దాన్ని కూలగొట్టడం కూడా సులువుగా వుండాలని నియమం వుండేది. ఆ నియమం ప్రకారం దాన్ని 1909లోనే కూల్చివేయాలి. కానీ.. కాలక్రమంలో అది కమ్యూనికేషన్, మిలిటరీ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుండటంతో ఆ ఒప్పందం అయిపోయిన తర్వాత కూడా అలాగే వుంచేయడం జరిగింది. ప్రస్తుతం నేడు ప్రపంచంలోకెల్లా అత్యధిక పర్యాటకులు సందర్శించే టవర్’గా చరిత్ర రికార్డుల్లోకి ఎక్కిపోయింది.

ఈఫిల్ టవర్లో వ్యక్తిగత గదిటవర్ చివరి భాగాన ఈఫిల్ తన కోసం ప్రత్యేకంగా ఓ గదిని నిర్మించుకున్నాడట . ఆయనకు తప్ప ఆ గదిలోకి ఎవ్వరికీ ప్రవేశం లేదు . ఆయన బతికున్న రోజుల్లో అందులోకి ప్రవేశించిన అతి కొద్దిమంది వ్యక్తుల్లో థామస్ ఎడిసన్ ఒకరు . ఈఫిల్ కన్నుమూసిన తర్వాత కూడా అందులోకి ఎవ్వరినీ అనుమతించడం లేదు . కానీ ఆ గది కిటికీ నుంచి లోపలికి చూసే అవకాశం ఉంది . దీనికి కోసం ప్రత్యేక రుసుం వసూలు చేస్తున్నారు .

మరిన్ని విశేషాలు :
- ఈ టవర్ మొత్తం బరువు 10,000 టన్నులు వుండగా.. అందులోని లోహపు బరువు 7,300 టన్నులు. ఇందులో వాడిన లోహాలు తప్పుపట్టకుండా వుండేందుకు 7 ఏళ్లకోసారి 50 నుంచి 60 టన్నుల పెయింట్’ను వాడుతారు.
- దీన్ని నిర్మించేటప్పుడు ఈఫిల్ 72 మంది ఫ్రెంచి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఇతర ప్రముఖుల పేర్లు రాయించాడు. ఈ పేర్లన్నింటినీ 20వ శతాబ్దపు మొదట్లో తుడిచివేశారు. కానీ.. టవర్’కు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చూసుకునే సంస్థ చొరవతో మళ్లీ ఆ పేర్లను 1986-87లో పునర్ముద్రించడం జరిగింది.
- 1889 సెప్టెంబర్ 10న థామస్ అల్వా ఎడిసన్ దీన్ని సందర్శించి.. అతి పెద్దదైన ఇంజనీరింగ్ అద్భుతాన్ని సృష్టించినందుకు ఈఫిల్’కు అభినందనలు తెలియజేస్తూ గెస్ట్ బుక్’లో సంతకం చేశాడు.
- 1902లో మెరుపుల ప్రభావంతో 100 మీటర్ల పైభాగం దెబ్బతింది. అప్పుడు టవర్’ని కాంతితో నింపే కొన్ని దీపాలను మార్చాల్సి వచ్చింది.
- 1910లో థియోడర్ ఉల్ఫ్ దీన్ని సందర్శించి.. టవర్ ఆడుగున, పైభాగాన విడుదలయ్యే ఉష్ణశక్తిని అంచనా వేశాడు. దాని మూలంగానే ఆయన కాస్మిక్ కిరణాలను కనుగొన్నాడు.
- 1956 జనవరి 3న అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో టవర్ పైభాగం దెబ్బతింది.
- 1957లో టవర్ పైభాగాన ప్రస్తుతమున్న రేడియో యాంటెన్నాను అమర్చారు.
The Photos Of Eiffel Tower Under Construction In 1887



ఈఫిల్ టవర్ సంగతేమిటి , Efil Tower History

  • 1052 అడుగుల ఎత్తు దాదాపు 7000 టన్నుల బరువు , 2.5 ఎకరాల విస్తీర్ణము , ఉన్నా ఈఫిల్ టవర్ ప్రపంచం లోనే అత్యున్నత కట్టడాలలో ఒకటి గా పేరుతెచ్చుకున్న ఈఫిల్ టవర్ ఇప్పుడు మరో ఘనతను కుడా పొందింది . తాజమహల్ , చైనాగోడ , స్తాత్యు అఫ్ లిబర్టి , ఇలా పపంచం లో ఉన్న అద్భుత కట్టడాలలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే , అభిమానించే కట్టడం గా పేరుతెచ్చుకుంది .
  • ప్రపంచం మొత్తం మీద పర్యాటకులు టిక్కెట్టు కొనుక్కొని సందర్శించే కట్టడాలలో ఈఫిల్ టవర్ దే మొదటి స్థానము . ప్రారంభమైన 1889 నుంచి ఇంతవరకు మొత్తం 20 కోట్ల మంది సందర్శించారు .
  • ఫ్రాన్సు లోని పారిస్ లో ఉన్న దీన్ని " గుస్తావా ఈఫిల్ " అనే ఇంజినీర్ ఇంర్మించాడు . నిర్మాణానికి రెండు ఏళ్ళ రెండు నెలలు పట్టింది . 1889 మార్చి 31 న పూర్తీ చేసారు .
  • 1930 వరకు ఇదే ప్రపంచం లో ఎత్తైన కట్టడం ,
  • దీని నమూనా కోసం 50 మంది ఇంజినీర్లు 5,300 బొమ్మలు వేశారు .
  • 18,000 విడిభాగాలను ముందుగా రూపొందించి వాటిని కలిపి దీనిని నిర్మించారు .
  • ప్రతి ఏడు ఏళ్లకొకసారి రంగులు వేస్తారు . పూర్తిచేయడానికి సుమారు 18 నెలలు పడుతుంది , 50 టన్నుల రంగు అవసరమవుతుంది .
  • దీనిపై మొత్తం 20,000 విద్యుత్ బుల్బులు అమర్చారు .
  • మూడు అంతస్తులుగా నిర్మించిన దీనిలో రెండు రెస్టారెంట్లు , ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉన్నాయి .
  • దీన్ని పేల్చివేయడానికి 1986 లో ఉగ్రవాదులు బాంబ్ పెట్టేరు ... అదృష్టవశాత్తు అది పేలలేదు .
  • దీంట్లో సందర్శకులకు పైకి తీసుకువెళ్ళే లిప్టులు తిరిగే దురాన్ని లెక్క కడితే ఏటా పది లక్షల కిలోమీటర్లు అవుతుంది .
  • ఈఫిల్ టవర్ చివరి నిల్చుని 42 మైళ్ళ దూరం వరకు చుడొచ్చును .
  • దీనిలో మొత్తం 1710 మెట్లు ఉన్నాయి .
  • బలం గా గాలులు వీచితే టవర్ కాస్త ఊగుతుంది . 1999 లో ఒకసారి వీచిన గాలులకు 13 సెంటీమీటర్లు మేర ఊగింది .
  • ఈ టవర్ ను శుబ్రం చేయడానికి 4 టన్నుల సామగ్రి కావాలి . డిటార్జంటలు 400 లీటర్లు అవసరమవుతాయి ,
  • దీని పొడవు వేసవి లో కొలిస్తే 3.25 అంగుళాలు ఎక్కువగా ఉంటుంది , శీతాకాలం లో 6 అంగుళాలు తక్కువవుతుంది ... ఇనుము వ్యాకోచ , సంకోచాలే ఇందుకు కారణము .
  • దీని నిర్మాణము లో 25, ౦౦,౦౦౦ రివట్లను (Rivits) ఉపయోగించారు .
EIFFEL TOWER - EIFFEL TOUR - DRONE VIDEO

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top