Search This Blog

⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Tuesday, 24 September 2019

Amazon Forest- అమెజాన్ అడవి గురించి మీకు తెలియని భయంకరమైన వాస్తవాలు....తప్పక చదవాల్సిన కథనం....


అమెజాన్ అడవి గురించి మీకు తెలియని భయంకరమైన వాస్తవాలు

  • # అమెజాన్ అడవులు సౌత్ అమెరికా లో విస్తరించి ఉన్నాయి. ఈ అమెజాన్ అడవులు దాదాపు 9 దేశాలలో విస్తరించి ఉంది.
  • దాదాపు 60 % అంటే ఈ అడవుల విస్తీర్ణం లో రెండవ వంతు బ్రెజిల్ లో విస్తరించి ఉంది. పెరూ, కొలంబియా, వెనిజులా, బొలివియా, ఈక్వడార్, గయానా, సురినామ్, ఫ్రెంచ్ గయానా లలో విస్తరించి ఉన్నాయి ఈ అడవులు.
  • # మన భూమి మీద ఉన్న మొత్తం ఆక్సిజన్ లో 20 % ఆక్సిజన్ అమెజాన్ అడవులలో నుండే ఉత్పత్తి అవుతుంది. అందుకే ఈ అడవులని The Lungs of the Earth అంటే భూమి యొక్క ఊపిరితిత్తులు అంటారు. అలాగే ఈ అడవులని విపరీతం గా కాల్చడం వల్ల దాదాపు 30 % కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతుంది.
  • # దట్టమైన చెట్ల ఆకుల వల్ల ఈ అడవి చాల చీకటి గా ఉంటుంది. ఈ అడవులలోని నేల మీద కేవలం 2% మాత్రమే సూర్యరశ్మి పడుతుంది. ఇంత దట్టం గా ఉండటం వల్ల వర్షం నేల మీద చేరడానికి దాదాపు 10 నిముషాలు పడుతుంది ,అంటే ఈ అడవులు ఎంత దట్టం గా ఉంటాయో మనకి అర్ధమౌతుంది కదా.
  • # ప్రపంచం లో ఉన్న మొత్తం వర్షాధార అడవులలో సగ భాగం అమెజాన్ అడవులే. ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉత్పత్తి చేసే మెడిసిన్స్ లో దాదాపు 25 %, ఈ అడవుల లో పెరిగే మొక్కల నుండే సేకరించి తయారు చేస్తున్నారు. అది కూడా ఇక్కడ ఉన్న చెట్ల లో కేవలం 1 % చెట్లని పరిశోధించి తయారు చేసినవి.
  • # మనం తినే ఆహార పదార్ధాలైన కాఫీ, చాక్లెట్, రైస్, టొమాటోస్, పొటాటోస్, అరటి, మిరియాలు, పైన్ ఆపిల్స్, కార్న్ లలో 80% కంటే ఎక్కువ గా ఈ అడవుల నుండే లభిస్తున్నాయి.
  • # ఈ అడవులలో దాదాపు 400 – 500 ఆటవిక జాతులు నివశిస్తున్నాయి. వీటిలో దాదాపు 50 జాతులకు ప్రపంచం తో ఎటువంటి సంబంధాలు లేవు. ఈ జాతులలో కొన్ని జాతులు కానిబాల్స్. అంటే మనుషులని తింటారు అన్నమాట.
  • # గత 40 సంవత్సరాలలో దాదాపు 20% అమెజాన్ అడవులు నరికివేయబడ్డాయి.
  • # అమెజాన్ అడవి మొత్తం విస్తీర్ణం 55,00,000 చదరపు కిలోమీటర్లు. ఇది దాదాపు ఆర్జెంటినా దేశానికి రెండింతలు. ఒకవేళ ఈ అడవులు ఒక దేశం అయితే కనుక, ప్రపంచం లోనే 9 వ అతి పెద్ద దేశం గా ఉండేది.
  • # సహారా ఎడారి లో ఉండే ఇసుక గాలి వల్ల ఎగిరి, అమెజాన్ అడవులలో పడి, ఇక్కడి మట్టి తో కలిసి నేల సారవంతమౌతుంది. దీనివల్ల కొత్త కొత్త మొక్కలు పెరుగుతున్నాయి.
  • # 55 మిలియన్ సంవత్సరాల నుండి ఈ అమెజాన్ ఫారెస్ట్ ఉంది. 11,200 సంవత్సరాల క్రితమే ఇక్కడ ప్రజలు నివశించారు.
  • # ప్రపంచం లోనే రెండో అతి పెద్ద నది అమెజాన్ రివర్. ఈ అడవుల మధ్య నుండే ప్రవహిస్తుంది. ఈ నది ప్రపంచం లో ఉన్న మిగిలిన అన్ని నదుల కన్నా 5 ఇంతలు ఎక్కువ నీరు విడుదల చేస్తుంది. కానీ దీని మీద ఒక్క బ్రిడ్జి కూడా నిర్మించలేదు. బ్రెజిల్ లో ఈ నది ఒక 4 కిలోమీటర్లు underground లో ప్రవహిస్తుంది.
  • # ఈ అమెజాన్ రివర్ పశ్చిమ నుండి తూర్పు కి ప్రవహిస్తుంది. కానీ 1987 లో ఇది రివర్స్ లో అంటే తూర్పు నుండి పశ్చిమ కి ప్రవహించింది.
  • # ఈ అమెజాన్ అడవులలో దాదాపు 390 బిలియన్ చెట్లు అంటే 390 కోట్ల చెట్లు, అలాగే 40000 వృక్ష జాతులు, 2200 చేప జాతులు, 1200 పక్షి జాతులు, 420 క్షిరద జాతులు, 420 ఉభయచరాలు, 370 సరీసృపాలు నివశిస్తున్నాయి.
  • # ఈ అడవులలో మనకి తెలియని ఎన్నో వింతైన, క్రూరమైన, విషపూరితమైన జంతువులు ఉన్నాయి. మనకి తెలిసిన అనకొండ, జాగ్వర్, ప్యూమా, స్పైడర్ మంకీ, బ్లూ poison మంకీ, ఎంతో విషపూరితమైన బుల్లెట్ యాంట్స్ ఇక్కడే ఉన్నాయి.
  • # ఈ అడవులలో విషపూరితమైన పిరాన్హ చేపలు, ఎలక్ట్రిక్ ఈల్ చేపలు, పింక్ రివర్ డాల్ఫిన్స్ ఇంకా అనేక రకాలైన చేపలు ఉన్నాయి.
  • # ది రాయల్ విక్టోరియా వాటర్ లిల్లీ అనే ఈ ఆకు ప్రపంచం లోనే అతి పెద్ద ఆకు గా పేరు గాంచింది. ఇది కూడా ఈ అడవులలోనే పెరుగుతుంది. ఇవి 3 మీటర్ల వరకు ఉంటాయి. 40 కేజీల బరువు వరకు మోయగలవు.
  • # అమెజాన్ అడవులలో 2.5 మిలియన్ కీటకాలు నివశిస్తాయి. ఇక్కడ పెరిగే ఆమెజానియాన్ butterfiles తాబేళ్ల కన్నీళ్లు తాగి బ్రతుకుతాయి.
  • # ఈ అడవులలో దాదాపు 207 పక్షి రకాలు ఉండగా, వాటిలో ప్రపంచం లోనే అతి బిగ్గర గా అరిచే, టౌకెన్ అనే పక్షి ఈ అడవులలోనే ఉంది. దీని కూత దాదాపు అర మైలు దూరం వరకు వినిపిస్తుంది. అలాగే రంగు రంగుల చిలకలు, హొయజిం అనే పక్షి , కింగ్ ఫిషర్ అనే చిన్న పక్షి….దీనినే కింగ్ ఫిషర్ బీర్ కంపెనీ లోగో గా వాడుతున్నారు. ఇంకా అనేక రకాలైన పక్షులు ఇక్కడ ఉన్నాయి.
  • # ఈ అడవుల లోనే రోడ్డు ద్వారా చేరుకోలేని ప్రపంచంలోనే అతి పెద్ద నగరం ఉంది. ఇక్విటోస్ అనే ఈ నగరం, పెరూ దేశం లో ఉంది. ఇది అమెజాన్ డీప్ ఫారెస్ట్ లో ఉంది. ఇక్కడ సుమారు గా 400000 మంది నివశిస్తున్నారు.

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top