Search This Blog

Thursday, 15 August 2019

Vasireddy Venkatadri Naidu-రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయిడు

Vasireddy Venkatadri Nayudu was a hereditary zamindar of Chintapalli, later Amaravathi, in the Guntur district of India, under the Nizam of Hyderabad and the British East India Company. He had under his control 552 villages and towns located in Guntur and Krishna districts and their environs.  అమరావతిలో ఉన్న రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడి విగ్రహాన్ని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (దాచిన చిత్రం) అమరావతి, న్యూస్‌టుడే: అమరావతి చరిత్ర పుటల్లో ఆయనది సుస్థిర ప్రస్థానం. నాటి చరిత్ర వైభవానికి అంకురార్పణ చేసి వందలాది ఆలయాలను నిర్మించి ఆధ్యాత్మికతను ప్రజ్వలింపజేసిన ఘనత ఆయన సొంతం. ఆయనే అమరావతి జమీందార్‌ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. గుంటూరు, కృష్ణా జిల్లాలలోని 12 పరిగణాలను ఏక ఛత్రాధిపత్యంగా స్వతంత్రంగా పాలించిన ఘనత ఆయనది. ఆయన పాలనా తీరుతెన్నెలు నేటి పాలకులకు సైతం ఆదర్శవంతం. ఆయన చేసిన అభివృద్ధి నేటికీ ప్రస్ఫుటిస్తుంది. వెంకటాద్రి నాయుడు చేసిన విశేష సేవలను గుర్తించిన ప్రభుత్వం శనివారం ఆయన 259వ జయంతి వేడుకలను ఆధ్యాత్మిక నగరమైన అమరావతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ఆయన విధానాలు, పాలనపై కథనం..  రాజా వాసిరెడ్డి వైభవం ఇలా... రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 1761లో ఏప్రిల్‌ 27న జమీందారు జగ్గన్న, అచ్చమ్మ దంపతులకు జన్మించారు. అచ్చంపేట మండలంలోని చింతపల్లిని రాజధానిగా చేసుకొని పరిపాలన కొనసాగించారు. అనంతరం పరిపాలనా సౌలభ్యం, భద్రత దృష్ట్యా రాజధానిని ప్రముఖ పర్యాటక ప్రదేశంగా విరాజిల్లుతున్న జంట గ్రామాలైన అమరావతి, ధరణికోటకు మార్చారు. ఆనాడు అత్యంత ప్రమాదకరంగా గ్రామాలను దోచుకుంటున్న పిండారీ అనే దారి దోపిడీ దొంగలను తన ఫిరంగి దళంతో అంతమొందించి ప్రజలకు రక్షణ కల్పించారు. అనేక తటాకాలు, సత్రాలు, రహదారులను ఆయన నిర్మించారు. ప్రస్తుతం ఉన్న అమరావతి - క్రోసూరు ఆర్‌అండ్‌బీ రహదారిని ఆయనే అభివృద్ధి చేశారు. తన తండ్రి జగ్గన్న పేరుతో కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేటను, తన తండ్రి అచ్చమ్మ పేరుతో అచ్చంపేటను అభివృద్ధి చేశారు. తన పరిపాలనా కాలంలో పంచారామ ప్రథమ క్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంతోపాటు మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయం, వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానంతో పాటు 100కు పైగా దేవాలయాలను నిర్మించి ధూపదీప నైవేద్యాలకు వందలాది ఎకరాల భూములను విరాళంగా ఇచ్చి తన సేవా నిరతిని చాటుకున్నారు. ఆయన ఆగస్టు 17, 1817లో మరణించారు.  ఆయన గురుతులు ఇవే.. అమరావతి అమరేశ్వరాలయ నిర్మాణాన్ని స్వయంగా వెంకటాద్రి నాయుడు తన పర్యవేక్షణలో చేపట్టారని చరిత్రకారులు చెబుతున్నారు. శివునిపై ఉన్న పరమ భక్తితో ఆలయానికి ఎదురుగా తన కోటను నిర్మించుకొని రాజ్యాన్ని పరిపాలించారు. నేటికీ ఆలయంలో అమరేశ్వరునికి అభిముఖంగా రెండు చేతులు జోడించి సమస్కరిస్తున్న వెంకటాద్రి నాయుడి విగ్రహం ఉంది. వేలాది ఎకరాల పంట భూములను ఆలయ నిర్వహణకు రాసిచ్చారు. ఆయన పాలనకు అద్దం పట్టేలా వంశస్థులు నిర్మించిన కోట నేటికీ అమరావతిలో పదిలంగా ఉంది. విదేశీయులు సైతం ఇక్కడకు వచ్చి కోట చరిత్రను తెలుసుకుంటుంటారు. అమరావతిలో ఉన్న రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని ఆయన కాలంలోనే నిర్మించారు
వాసిరెడ్డి వెంకటాద్రినాయిడు కృష్ణా, గోదావరి మధ్యలో కాక ఆ నదులకు ఆవల విస్తరిం చిన ఐదువందల గ్రామాలమీద ఆధిపత్యం కలిగి, జనరంజకంగా పరిపాలించిన ఘనచరితుడు వాసి రెడ్డి వెంకటాద్రినాయుడు.
ఒకవైపు నిజామ్ పాలకులు, మరోవైపు బ్రిటీష్ వారి పాలనలో తనదైన ప్రత్యేక శైలిలో శక్తివంతుడయిన జమీందారుగా నిలిచినవాడు వెంక టాద్రినాయుడు.
వెంకటాద్రినాయిడు 1761, ఏప్రిల్ 20 న జగ్గన్న, అచ్చమ్మ దంపతులకు జన్మించాడు.
వీరిది కృష్ణాజిల్లాలోని చింతపల్లి సంస్థానం. 1783లో పట్టాభిషక్తుడయ్యాడు. వెంకటాద్రినాయుడు యుద్ధాలు చెయ్యలేదు. కాని ఆయన రాజ్యం విస్తరించి ధర్మప్రభువుగా పలు గ్రామాలవారు ఆహ్వానించారు. ప్రజలమీద పన్నుల భారం వేయటానికి ఆయన వ్యతిరేకి తాము ఎంచుకున్న వృత్తులను హాయిగా చేసుకునే అవకాశం, ప్రోత్సాహం అందించాడు. వైదిక ధర్మపక్షపాతి ఆయన దేవాలయాలను పునరుద్ధరించాడు. పొన్నూరు, మంగళగిరి, అమరావతి దేవాలయాల అభివృద్ధికి పాటుపడ్డాడు. తెలుగు, ఉర్ధూ, ఇంగ్లీషు, సంస్కృత భాషలలో ఆయనకు ప్రవేశం ఉంది.
1761 సంవత్సరంలో పానిపట్టు యుద్ధంలో గెలిచిన బ్రిటీష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ మచిలీ పట్నం, చెన్నపట్నంలో స్థావరాలు నెలకొల్పారు. క్రమంగా ఒక్కొక్కప్రాంతాన్ని ఆక్రమించసాగారు . ఇతర జమీందారులు,పాలకులు తమ చెప్పచేతుల్లో వుండేలా చేసుకుంటూవస్తున్నారు. ఎదురుతిరిగినవారిని యుద్ధంలో ఓడించి తమవైపు వుంటేనే రాజవైభోగం నిలిచేలా చేశారు. .
వారసులు లేని జమీలు తమ సొంతమయ్యే చట్టాలు తెచ్చారు. ఇవన్నీ అభిమానధనుడయిన వెంకటాద్రినాయిడుకు నచ్చకపోయినా ఎదురుతిరగటానికి తగిన బలం లేనందును మిన్నకున్నాడు. .
ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఉత్తర్వులకు లొంగక, లౌక్యంగా వ్యవహరిస్తూన్న ప్రజల సంక్షేమం చూసుకుంటూ పాలనసాగిస్త్ను వెంకటాద్రినాయుడిని ప్రమాదకర ప్రత్యర్థిగా బ్రిటీష్ వారు భావించారు. .
ఏదో ఒక వంకతో తెల్లసైనికులు 1795 జూన్ 30న చింతపల్లికోటలోకి అడుగుపెట్టారు. ఆ సైనికులను ఆ ప్రాంత రాజు పోషించాలి. తనకు అవసరంలేని సైన్యాన్ని అప్పగించి ఖర్చు తగ్గించుకునేందుకు సాంత సైన్యం తగ్గించుకుని జమీందారులను దెబ్బతీయాలనేది వారి ఎత్తుగడ. .
చింతపల్లిలో తెల్లవారిని భరించలేక తన రాజదానిని కృష్ణానదికి ఆవల వున్న ధరణికోటకు వెళ్ళి కొత్తకోటను నిర్మించుకుని, దానిని తనరాజధానిగా చేసుకుని పాలన సాగించాడు వెంకటాద్రినాడు. .
కృష్ణా డెల్టా ప్రాంతమందు వందకుపైగా దేవాలయములు కట్టించాడు. వీటిలో అమరావతి, చేబ్రోలు, పొన్నూరు, మంగళగిరి ముఖ్యమైనవి. వేంకటాద్రి నాయుని సైన్యములో వేలమంది సైనికులు, 300 గుర్రాలు, 80 ఏనుగులు, 50 ఒంటెలు, లెక్కలేనని ఎడ్లబండ్లు ఉండేవి. .
అమరావతి, చేబ్రోలు, చింతపల్లిలలో నాయుని భవనములు సంపదతో తులతూగేవి. పండుగలనాడు పండితులకు, గ్రామపెద్దల కుటుంబాలకు పట్టువస్త్రములు, బంగారు ఆభరణములు బహూకరించబడుతుండేవి. నిరతాన్నదానములు జరుగుతుండేవి.
నాయుడు ప్రభావం తగ్గించేందుకు తెల్లదొరల ఎత్తుగడలు వేస్తూనే వున్నారు. వాటిని వెంకటాద్రి నాయుడు ఛేదించుకుంటూ తన ఆత్మగౌరవం కాపాడుకుంటూనే వున్నాడు. అయినా ఆయన మీద తెల్లదొరలు రకరకాలుగా ఒత్తిడితెచ్చారు తనమిత్రులకు ఆశ్రయం ఇవ్వలేని పరిస్థితి. .
నైజాం నవాబు ఒక బిరుదు ఇస్తానంటే అది స్వీకరించేందుకు బ్రిటీష్ పాలకుల అనుమతి అడగాల్సిన దౌర్భాగ్యస్థితి. ఆ తర్వాత ఆయన తన 37వ ఏట ఒక మగ పిల్లవాడిని దత్తత తీసుకున్నాడు. ఇతని భార్య వెర్రెమాంబ. కూతురు ప్రమాదవశాత్తూ కోటగోడమీదనుండి పడి మరణించింది. .
46వ ఏట మళ్లీ పెళ్ళి చేసుకున్నాడు. మరో మగపిల్లవాడిని దత్తత తీసుకున్నాడు. ఇది మొదటి భార్యకు నచ్చలేదు. దాదాపుగా నాటినుండి ఆమె వెంకటాద్రినాయుడుకి దూరంగానే వుంది. పెద్దభార్య దగ్గర ఒక కొడుకు, రెండవ భార్యదగ్గర మరో కొడుకు పెరగసాగారు. .
పెద్ద దత్తత కొడుకు రెండవ దత్తత కొడుకుకు సయోధ్య ఉండేదికాదు. బ్రిటీష్ పాలకుల ఒత్తిడిల మధ్యపాలనను ఎలాగో నెట్టుకొస్తున్న వెంకటాద్రినాయుడిని అవసరం అయినపుడు తెల్లదొరలు బుజ్జగించేవారు. పిండారీలనే దోపిడీదొంగలను అణచవలసి వచ్చినప్పడు, నేరస్తులను హింసించాల్సివచ్చినప్పడు వెంకటాద్రినాయుడినే ఆశ్రయించేవారు. .
వేంకటాద్రి పాలనలో చెంచులు దారిదోపిడులు చేయుచూ సామాన్య ప్రజలను బాధించుచుండేవారు. మంత్రి ములుగు పాపయారాధ్యుల సలహా పాటించి చెంచులను విందునకు అహ్వానించాడు. భోజనమైన పిమ్మట 150 మంది చెంచు నాయకులను వరుసగా నిలబెట్టి అందరిని వధింపచేశాడు. ఈ వధ జరిగిన ఊరి పేరు నరుకుళ్ళపాడుగా మారింది. .
బలహీనపడుతున్న జమీందారీ వ్యవస్థ, పరాయిపాలకుల పెత్తనం, పెంపుడు కొడుకుల మధ్య లోపించిన సఖ్యత నేపథ్యంలో తాను బతికివుండగానే అన్ని వ్యవహారాలు చక్కబెట్టాలని భావించినవెంకటాద్రినాయుడు ఆస్తుల పంపకం ఆలోచన చేశాడు. వీలైనంతవరకు ఇద్దరికీ సమంగా ఆస్తులు దక్కేలా యత్నం చేశాడు. కొడుకులిద్దరు ఆస్తులకోసం తగాదాలు పడకుండా చూడాలన్నది ఆయన ఆశయం.
ఆయన చివరిదశలో తీర్థయాత్రలు చేసేందుకు పరివారంతో బయలుదేరి భారతదేశంలోని ఎన్నో తీర్థాలను, క్షేత్రాలను దర్శించారు. వెళ్లిన చోట్లన్నిటా అన్నదాన సత్రాలు స్థాపించారు.
కొప్పరాజు సుబ్బరాయకవి కాంచీమహాత్మ్యంలో నాయుడి యాత్రల గురించి పద్యరచన చేశారు. వేంకటాద్రి నాయుడితో పాటుగా ఆయన మంత్రి పొత్తూరి కాళిదాసు కూడా యాత్రలు చేసినట్టు పాపయారాధ్యులు రచించిన సరస హృదయానురంజనములో తెలుస్తోంది. .
కొన్ని యాత్రలు క్రీ.శ.1802, మరికొన్ని క్రీ.శ.1812-13 సంవత్సరాల్లో చేసినట్టు తెలుస్తోంది. శేషజీవితమును అమరేశ్వరుని పాదాలకడ గడిపినాడు. దేవాలయానికి పెక్కు హంగులు చేసి తొమ్మిదిమంది అర్చకులను నియమించి ఒక్కొక్కరికి 12 ఎకరాలు భూమి ఇచ్చాడు. 1807-09లో మంగళగిరి నరసింహ స్వామి దేవాలయానికి 11 అంతస్తుల గాలి గోపురాన్ని నిర్మింపజేశాడు. .
ఆయన తండ్రి జగ్గన్న పేరు మీదనే బేతవోలు అనే గ్రామం పేరును జగ్గయ్యపేటగా మార్చాడు. ఆయన తల్లి అచ్చమ పేరు మీదనె అచ్చమ్మపెటగా మారినది. .
చివరిదశలో పెద్దగా అనారోగ్యం పొడసూపినట్టు లేదు. కానీ మానసిక అనారోగ్యమే ఆయనప్రాణాలను బలితీసుకుంది ఆగష్టు 18, 1816న.
ఒకనాడు ఎంతో గొప్పగా మిగిలిన ఆంధ్రుల చరిత్రలో మరో మహత్తర అధ్యాయంనాటితో ముగిసి తెల్లవారి పాలన సుగమమైంది.

అమరావతిలో ఉన్న రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడి విగ్రహాన్ని ప్రారంభిస్తున్న
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

 అమరావతి చరిత్ర పుటల్లో ఆయనది సుస్థిర ప్రస్థానం. నాటి చరిత్ర వైభవానికి అంకురార్పణ చేసి వందలాది ఆలయాలను నిర్మించి ఆధ్యాత్మికతను ప్రజ్వలింపజేసిన ఘనత ఆయన సొంతం. ఆయనే అమరావతి జమీందార్‌ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. గుంటూరు, కృష్ణా జిల్లాలలోని 12 పరిగణాలను ఏక ఛత్రాధిపత్యంగా స్వతంత్రంగా పాలించిన ఘనత ఆయనది. ఆయన పాలనా తీరుతెన్నెలు నేటి పాలకులకు సైతం ఆదర్శవంతం. ఆయన చేసిన అభివృద్ధి నేటికీ ప్రస్ఫుటిస్తుంది. వెంకటాద్రి నాయుడు చేసిన విశేష సేవలను గుర్తించిన ప్రభుత్వం శనివారం ఆయన 259వ జయంతి వేడుకలను ఆధ్యాత్మిక నగరమైన అమరావతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ఆయన విధానాలు, పాలనపై కథనం..

రాజా వాసిరెడ్డి వైభవం ఇలా... రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 1761లో ఏప్రిల్‌ 27న జమీందారు జగ్గన్న, అచ్చమ్మ దంపతులకు జన్మించారు. అచ్చంపేట మండలంలోని చింతపల్లిని రాజధానిగా చేసుకొని పరిపాలన కొనసాగించారు. అనంతరం పరిపాలనా సౌలభ్యం, భద్రత దృష్ట్యా రాజధానిని ప్రముఖ పర్యాటక ప్రదేశంగా విరాజిల్లుతున్న జంట గ్రామాలైన అమరావతి, ధరణికోటకు మార్చారు. ఆనాడు అత్యంత ప్రమాదకరంగా గ్రామాలను దోచుకుంటున్న పిండారీ అనే దారి దోపిడీ దొంగలను తన ఫిరంగి దళంతో అంతమొందించి ప్రజలకు రక్షణ కల్పించారు. అనేక తటాకాలు, సత్రాలు, రహదారులను ఆయన నిర్మించారు. ప్రస్తుతం ఉన్న అమరావతి - క్రోసూరు ఆర్‌అండ్‌బీ రహదారిని ఆయనే అభివృద్ధి చేశారు. తన తండ్రి జగ్గన్న పేరుతో కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేటను, తన తండ్రి అచ్చమ్మ పేరుతో అచ్చంపేటను అభివృద్ధి చేశారు. తన పరిపాలనా కాలంలో పంచారామ ప్రథమ క్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంతోపాటు మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయం, వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానంతో పాటు 100కు పైగా దేవాలయాలను నిర్మించి ధూపదీప నైవేద్యాలకు వందలాది ఎకరాల భూములను విరాళంగా ఇచ్చి తన సేవా నిరతిని చాటుకున్నారు. ఆయన ఆగస్టు 17, 1817లో మరణించారు.

ఆయన గురుతులు ఇవే.. అమరావతి అమరేశ్వరాలయ నిర్మాణాన్ని స్వయంగా వెంకటాద్రి నాయుడు తన పర్యవేక్షణలో చేపట్టారని చరిత్రకారులు చెబుతున్నారు. శివునిపై ఉన్న పరమ భక్తితో ఆలయానికి ఎదురుగా తన కోటను నిర్మించుకొని రాజ్యాన్ని పరిపాలించారు. నేటికీ ఆలయంలో అమరేశ్వరునికి అభిముఖంగా రెండు చేతులు జోడించి సమస్కరిస్తున్న వెంకటాద్రి నాయుడి విగ్రహం ఉంది. వేలాది ఎకరాల పంట భూములను ఆలయ నిర్వహణకు రాసిచ్చారు. ఆయన పాలనకు అద్దం పట్టేలా వంశస్థులు నిర్మించిన కోట నేటికీ అమరావతిలో పదిలంగా ఉంది. విదేశీయులు సైతం ఇక్కడకు వచ్చి కోట చరిత్రను తెలుసుకుంటుంటారు. అమరావతిలో ఉన్న రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని ఆయన కాలంలోనే నిర్మించారు.
మంగళగిరి మంగళగిరి అంటే అందరికి గుర్తుకువచ్చేది .ఏమిటి 157 అడుగుల మహా రాజ గోపురం (గాలి గోపురం )
1807-09 కాలంలో నాటి ధరణికోట జమిందారు శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు నిర్మించారు. ఈ గోపుర పీఠభాగం పూర్తిగా రాతిచే నిర్మితమైంది. ఈ రాతి కట్టడానికి అన్నీ వైపులా పగుళ్లు వచ్చాయి.గోపుర పీఠభాగం త్రీడీ లేజర్ స్కానర్‌ తో పునాదుల అంతర్భాగాన్ని స్కానింగ్ చేయించాలని భక్తులు కోరుతున్నారు.మంగళగిరి గోపురాన్ని ఈ ప్రాంత ప్రజలు వారసత్వ సంపదగా భావిస్తుంటారు.

0 comments:

Post a Comment

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top