Search This Blog

Thursday, 1 August 2019

The Skull of Alum Bheg: The Life and Death of a Rebel of 1857 - సిపాయిల తిరుగుబాటు: పబ్‌లో ఉన్న పుర్రెలో 1857 నాటి చరిత్ర




"1858 ఆగష్టు సియోల్ కోట్  ఓ తెల్లవారు జామున
5.9 అడుగుల ఎత్తు, 28 సంవత్సరాలున్న ఒక యువకుడిని ఇనపసంకెళ్ళతో బంధించి రాచవీధిలోనికి తీసుకొచ్చారు ఆంగ్లేయపోలీసులు.
ఎటువంటి బెదురులేకుండా గంభీరంగా అడుగులేస్తూ వస్తున్నాడు ఆ యువకుడు,.అతని వెనుక ఇంకొంత మంది ఇనపసంకెళ్ళతో బందించి తీసుకొస్తున్నారు.

బ్రిటీష్ కెప్టన్  ఎ.ఆర్ కాస్టెల్లో క్రూరంగా నవ్వుతూ ఆ యువకుడి దగ్గరకు వచ్చాడు. వెకిలిగా నవ్వుతూ తుపాకి తీసి ఆ యువకుడి నోట్లో పెట్టి ఏదో అన్నాడు. అయినా ఆ యువకుడు బెదరలేదు. మరింత నిఠారుగా ధైర్యంగా నిలబడ్డాడు..నిర్లక్ష్యంగా చూసాడు కాస్టెల్లో వైపు.. అంతే కాస్టెల్లో చేతుల్లోని తుపాకీ భయంకరంగా గర్జించింది..బుల్లెట్ ఆ యువకుడి తలను చీల్చుకుంటూ వెళ్ళింపోయింది.
మృత్యువు కౌగిలి లోనికి జారుకుంటూ కూడా తలదించకుండూ మోకాళ్ళ మీదగా కుప్పకూలిపోయాడాయువకుడు. వెంటనే కెప్టన్ కాస్టెల్లో తన కత్తి తీసి ఆ యువకుడి తలను శరీరం నుండి వేరు చేసాడు. ఈ తల నాకు కావాలి..ఐ వాంట్ హీజ్ స్కల్ ..అంటూ బిగ్గరగా నవ్వుతూ దానిని తీసుకెళ్ళాడు...ఇంతలో వందల తుపాకీలు పేలాయి,.గొలుసులతో బంధించబడిన వ్యక్తులు కుప్పకూలారు..ఆ వీధి అంతా రక్తప్రవాహంతో ఎర్రబారింది...ఇది కళ్ళారా చూసిన ఒక బ్రిటీష్ యువ అధికారి భయంతో సృహకోల్పోయాడు,,,

 అంత క్రూరంగా చంపబడ్డ ఆ యువకుడు ఎవరు??? అతను చేసిన నేరం ఏమిటి?? బిట్రీష్ పాలకులు భారతసిపాయల పట్ల అనుసరించిన ఆర్థిక,రాజకీయ,సాంకృతిక వివక్షతో విసిగిపోయి ఈ బానిసత్వ సంకెళ్ళ నుండి విముక్తి పొందాలని తపించిన వీరులలో ఆ యువకుడూ ఒకడూ..
1857 మార్చి 29 న మంగళఫాండే ఆంగ్లేయఅధికారిపై పేల్చిన తొలి తూటాతో చైతన్యం చెందిన యువకులలో అతనూ ఒకడు...

"అతని పేరు ఆలమ్ బేగ్ ..బెంగాల్ 46 వ బెటాలియన్ లో హవల్ధార్ !,సియోల్ కోట్ కంటోన్మెంట్ లో ఉద్యోగి,, చాలీచాలని జీతాలు,కుక్కకన్నా హీనమైన బ్రతుకులు, ఆంగ్లేయ అధికారుల అవమానకరమైన తిట్లు,, గడ్డం పెంచిన ముస్లిమ్స్ ను, పిలక పెంచిన హిందువులను హేళనగా మాట్లాడుతున్న ఆంగ్లేయులను చూస్తుంటే అతని రక్తం సల సల మరిగిపోయేది. అందుకే ఈ బానిసత్వం ఇంకెన్నాళ్ళంటూ తోటి సిపాయలతో అంటుండే వాడు. మొదటిలో అతని మాటలను పట్టించుకోని సిపాయలు తొందరగానే ఆయన గొంతుకు జతకలిపారు.అదీ ఒక తూటా కారణంగా!!తుపాకీ తూటాలకు "పంది ఆవు కొవ్వు పూసారని,వాటిని నోటితో కొరికి ఉపయోగించాలని"వదంతులు ఏర్పడ్డాయి.
అవమానాలను భరించారు.శ్రమదోపిడీని భరించారు, వర్ణవివక్షతకుా తలవంచారు.కానీ నమ్మకాల దగ్గరకు వచ్చే సరికే సహనం నశించింది.ఆ గ్రహం కట్టలు తెంచుకుంది..హిందుముస్లిమ్ సిపాయాలలో ఐకమత్యం పెంపొందింది. జాతీయభావానికి నాంది పలికింది .చీమల దండులా కదిలారు.  సియోల్ కోట్ కంటోన్మెంట్ ను కొల్లకొట్టారు. కొందరు సిపాయులు యూరోపియన్ అధికారనివాసంపై దాడులు చేసారు. ఇళ్ళను తగలబెట్టారు...ఆలమ్ బేగ్ వారిస్తున్నా వాళ్ళు వినలేదు..ఒక క్ర్రెస్తవమతప్రచారకుడితో బాటు 9 మందిని చంపేసారు..

కంటోన్మెంట్ ను కొల్లగొట్టిన డబ్బును పంచుకోవాలని సిపాయిలు అన్నా ఆలమ్ బేగ్ ఒప్పుకోలేదు..జీతభత్యాలు తీసుకొని మిగతాది "భారతసార్వభౌముడు మొఘల్ చక్రవర్తి తేజ్ బహుదూర్ షా" కు అప్పగించాలన్నాడు. అందరూ ఒప్పుకున్నారు. ఢిల్లీ వెళ్ళి బహదూర్ షాను చక్రవర్తిగా ప్రకటించేందుకు బయలుదేరారు.
ఆలమ్ బేగ్ ఆంగ్లేయులను ముప్పతిప్పలు బెట్టాడు.
అతని మెరుపుదాడులకు వారు భీతిరెళ్ళేవారు. అయినా కెప్టన్ కాస్టెల్లో మాయోపాప కపట నాటకంతో ఆలమ్ బేగ్ బంధించబడ్డాడు.
సిపాయలను ప్రేరేపించి 9 మంది యూరోపియన్ చావుకు బాధ్యుడిగా అతనిని క్రూరంగా చంపి అతని తల తీసుకెళ్ళారు.
  "తలలెందుకు తీసుకెళ్ళారనుకుంటున్నారా?? అలా తీసుకెళ్ళడం వారికి విజయగర్వం సూచిక. ఇలా వందలాదిపుర్రెలు ఇంగ్లండ్ చేరాయి..వాటిని"ఫ్ర్రెనాలజీ (పుర్రెల శాస్త్రం) ఉపయోగించేవారు. ఆలమ్ బేగ్ పుర్రెను తీసుకెళ్ళిన కెప్టన్ కాస్టెల్లో దానిని ఒక పబ్ లో "యాష్ ట్రేగా "ఉపయోగించాడు... అది దశాబ్ధాలు అక్కడే వుండినది. ఇప్పుడు ఆ పుర్రెలో ఒక కాగితం లో ఇతను ఆలమ్ బేగ్ అనే సిపాయిదనీ,అతను యూరోపియన్ వ్యతిరేఖి అని,హంతకుడని రాసి వుంది. మరి యూరోపియన్స్ యే ప్రాణాలేమో ,వేలాదిమంది భారతీయులను చంపేటప్పుడు వారివీ ప్రాణాలని తెలియలేదేమో వారికి.

" పై చిత్రంలో ఉన్నది ఆలమ్ బేగ్ ది. చరిత్రలో అతని పేరు తప్ప అతని చిత్రాలుగానీ వివరాలు గానీ లేకుండా చేశారు...సియోల్ కోట్ రెజల్ మెంట్ లో అప్పటి సిపాయల పేర్లన్నీ వున్నాయి. అయితే వారందరూ ఆంగ్లేయ విధేయులు.. ఆలమ్ బేగ్ తదితర సిపాయల వివరాలు మాత్రం లేవు.

ఆలమ్ బేగ్ ను క్రూరంగా చంపి 160 సంవత్సరాలవుతుంది. ఆలమ్ బేగ్ ను చరిత్ర విస్మరించవుండివచ్చు, ఒక స్వాతంత్రపోరాట యోధుడిగా "అతని పుర్రె" సజీవసాక్షం!!
ఆంగ్లేయవీరవిధేయులకే చరిత్రలో స్థానం లభించినది అన్నది 80% వాస్తవం. ఆలమ్ బేగ్ లాంటి అజ్ఞాత వీరులెందరికో చరిత్రలో చోటు లభించలేదు.

కానీ ఈ భారతీయుల గుండెల్లో మాత్రం వారెప్పుడూ చిరంజీవులే... ఆలమ్ బేగ్ లాంటి వీరుడి పుర్రెను "యాష్ ట్రే గా వాడిన ఆంగ్లేయుల సంస్కారాన్ని ఏమనాలి??? ఆలమ్ బేగ్ ఉదంతమే కాదు దాదాపు 52 దేశాలలలో వీరు అలాగే ప్రవర్తించారు ..దాదాపు 400 సంవత్సరాలు ఆఫ్రికన్స్ ను వేలాదిమందిని బానిసలుగా యూరప్ తీసుకెళ్ళారు..

"ఆలమ్ బేగ్ మీరు ఈ దేశ యోధుడివి,, నీ త్యాగం,పోరాటం అనన్యసామాన్యమైనది.
🖊
రవీంద్ర వడిచెర్ల
ప్రభుత్వ ఉపాధ్యాయలు ,నెల్లూరు

0 comments:

Post a Comment

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top